దత్త క్షేత్రములు - దత్తావతారాలు.. ~ దైవదర్శనం

దత్త క్షేత్రములు - దత్తావతారాలు..






1. శ్రీపాద శ్రీ వల్లభ స్వామి - పిఠాపురం

దత్తుని ప్రథమ దత్తావతారం శ్రీపాద శ్రీ వల్లభుడు జన్మించిన ప్రదేశం. ఆంద్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలో ఉన్నది..                 


2. కురువపురం..

ప్రథమ దత్తావతారులైన శ్రీపాదవల్లభులు తపసు చేసిన స్థలం.. ఇది హైదరాబాదు, కర్నూలు రూటులో దేవరకొండ స్టేషను నుండి బస్ లో వెళ్ళవచ్చు.


3. గోకర్ణము..

ప్రథమ దత్తావతారులైన శ్రీపాదవల్లభులు తపసు చేసిన స్థలం.. ఇది కర్నాటక రాష్ట్రము హుబ్లి నుండి బస్ లో వెళ్ళవచ్చు.


4. కరంజా

దత్తావతారం..నృశింహ సరస్వతి.


రెండవ దత్త అవతారం, నృశింహ సరస్వతి (శ్రీ గురుడు) జన్మస్థలం. ఇది మహరాష్ట్ర అమరావతి జిల్లాలో ఉన్నది.


5. నర్సో బావాడిన..


శ్రీ గురుడు 12 సం॥తపసుచేసిన స్థలం,... ఇది కొల్హా పూర్ మీరజ్ రూటులో ఉన్నది.


6. గాణగా పూర్..


శ్రీ గురుడు 23 సం నివసించినస్థలం, ఇది కర్నాటక గుల్బర్గ వద్ద కలదు. ఇచ్చట శ్రీగురుని నిజపాదుకలు కలవు,

చూడవలసి స్థలం, బీమా-అమరజా సంగమ స్నానం పరమ పవిత్రం


7. ఔదుంబర్‌..


శ్రీ గురుడు చాతుర్మాసం చేసిన స్థలం. ఇది కూడ మహరాష్ట్రలో ఉన్నది.                                   


8. మీరజ్..


ఇచట శ్రీ గురుడు తపసు చేసిన స్థలం. కొల్హాపూరు రూటులో జైసింగ్ పూరు వద్ద నుండి వెళ్ళవచ్చు.


9. శ్రీశైలం..


శ్రీ గురుడు అంతర్దానమైన ప్రదేశం. ఈ స్థల దర్శనం చాలా దుర్లభం అంటారు. దత్తాత్రేయ స్వామి అనుగ్రము ఉంటే చేరుకోగలరు. ఇది ఆంద్రప్రదేశ్ కర్నూలు జిల్లా లో ఉంది. .


10. అక్కల్ కోట..

దత్తావతారం - అక్కల కోటస్వామి.


నాలుగవ దత్తావతారం, స్వామిసమర్థ (అక్కల్ కోటస్వామి ) సమాదధి మందిరం ఇది చెన్నై - ముంబాయి రూటులో అక్కల్ కోట స్టేషనులో దిగి బస్ లేదా ఆటో పై వెళ్ళవచ్చు. తప్పక చూడవలసిన దత్త క్షేత్రము.


11. షిరిడి..

దత్తావతారం. షిరిడి సాయిబాబా


అయిదవ దత్తావతారం, సంపూర్ణ దత్త భగవానుని పూర్ణావతారం. సద్గురు షిరిడి సాయిబాబా సమాధి మందిరం.

కోట్లాది భక్తులకు ఆరాధ్యుడు సద్గురువు బాబా.. షిరిడి మహరాష్ట్రలో ఉంది. అన్నీ ప్రాంతాల నుండి నాగర్ సోల్, మన్మాడు సాయినగర్ స్టేషన్ల నుండి మందిరానికి చేరవచ్చు అందరు తప్పక చూడవలసిన క్షేత్రము.


12. సాకోరి.. 


ఏక ముఖ దత్తుని ఆలయం కలదు. ఇక్కడ సాయి సేవ చేసుకున్న ఉపాసిని బాబావారి సమాది మందిరం దర్శించవచ్చు. ఇది షిరిడికి దగ్గరలో ఉన్నది ఆటోలో వెళ్ళి రావచ్చు..


13. నాశిక్..


ఇచట ఏకముఖ దత్త విగ్రహం ఉంది. ఇది కూడా షిరిడి నుండి వెళ్ళవచ్చు.


ప్రముఖ దత్త క్షేత్రములు.


14. గిరి నార్* 


ఇచ్చట దత్తపాదుకలు కలవు. ఇది గుజరాత్ రాష్ట్రంలో ఉంది. ఇది చాలా మహిమగల 10,000 మెట్లు కలిగిన కొండపై ఉన్నది, ఈ కొండపై దత్తపాదుకలు దర్శిస్తే దత్త అనుగ్రహం తప్పక లభిస్తుందని భక్తుల నమ్మకం


15. షేగాం..


ఇచ్చట మరో దత్త రూపుడు గజానన మహరాజ్ సమాధి మందిరం కలదు. ఇది నాగపూర్ పట్టణంనకు దగ్గరలో కలదు

ఇది కూడ చూడదగ్గ క్షేత్రం.


16. ఖేడ్గావ్..


సమర్దనారాయణమహరాజ్ వారి సమాధి కలదు. ఇది పూనా వద్ద కలదు.


17. ఖాoడ్వా..


శ్రీ దున వాలా దాదా వారి సమాధిమందిరం ఉంది. ఇది మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో కలదు.


18. మాణ్ గావ్..


శ్రీ వాసుదేవానంద సరస్వతిస్వామి వారి జన్మస్థలం, గురు చరిత్రను అందించిన మహనీయుడు. మహారాష్ట్రలో ఉంది

ఇది చూడదగ్గ క్షేత్రం.


19. గరుడేశ్వర్... 


శ్రీ వాసుదేవానంద సరస్వతిస్వామి వారి సమాధి మందిరం కలదు. గుజరాత్ రాష్ట్రంలో బరోడా జిల్లాలో ఉంది

ఇది తప్పక చూడవలసిన క్షేత్రం.


20. మౌంటు అబూ..


ఇచట దత్త శిఖరము కలదు. రాజస్తాన్ రాష్ట్రములో కలదు...


21. మాణిక్య నగర్..

దత్తావతారం.. మాణిక్య ప్రభువులు.

మూడవ దత్తావతారం, శ్రీమాణిక్య ప్రభువుల వారి సమాధి, ప్రభువుల వారి సంస్ధానం, కర్నాటక గుల్బర్గా - హైదరాబాదు రూటులో హుమ్నాబాదుకు దగ్గరలో ఉన్నది.తప్పక చూడవలసిన క్షేత్రము.



*🙏దగంబరా దిగంబరా సద్గురు దత్తా దిగంబరా🙏* 🔥

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List