కోటగిరి..దండాయుధ పాణి..!! ~ దైవదర్శనం

కోటగిరి..దండాయుధ పాణి..!!



 దేవతల సైన్యానికి అధిపతియైన  కుమారస్వామి నివాస స్ధలాలన్నీ దాదాపు గిరులమీదనే. నేలగిరి జిల్లాలో

కొండ మీద అనేక కుమారస్వామి ఆలయాలు వున్నాయి. వాటిలో కోటగిరి కొండమీద  కాత్తుకుళి దండాయుధపాణి స్వామివారి ఆలయం చాలా విశిష్టమైనది. ఇక్కడ ఆలయం నిర్మించబడడం వెనుక ఒక గాధ వున్నది. 

ఉదకమండలం లో కోడమలై అనే చిన్న గ్రామంలో మణ్డోదయ్యా అనే వ్యవసాయదారుడు నివసించేవాడు. అతను కుమారస్వామి పరమ భక్తుడు.  అతను దేహారోగ్యం సరిలేక మంచంపట్టాడు. ఒక రోజు తన దీనస్ధితిని తలుచుకుంటూ  బాధపడుతూ నిద్ర పోయాడు. 


తెల్లవారుజామున కలలో కాషాయ వస్త్రాలు ధరించిన  ఒక వృధ్ధుడు కనిపించి , సమీపమున కాత్తుకుళి అనే ఊరిలో, ఒక పెద్ద మైదానం, ఒక వృక్షం  ప్రక్కనే ముళ్ళచెట్ల పొదలు కనిపిస్తాయి. ఆ చోటున త్రవ్వి చూస్తే  గంట, పళ్ళెం, శంఖం, శూలం, కత్తి, అనే ఐదు వస్తువులు కనిపిస్తాయి.  అక్కడే నా నివాసం. అక్కడికి నీవు వచ్చి దర్శనం చేసుకుంటే, నీకు ఆరోగ్యం చేకూరుతుంది. అని అంతర్ధానమైనాడు. తను పూజించే కుమారస్వామియే,  తనకి ఉపదేశించినట్లయి వెలుపలికి  వచ్చి అరుగు మీద కూర్చున్నాడు. అది చూసిన అతని కుటుంబీకులు ఆశ్చర్యపోయారు. 


ఆరోగ్యం సరిగా లేని సమయంలో లేచి ఎలా బయటికి రాగలిగారు..? అని అడిగారు. తన స్వప్న వృత్తాంతం  అంతా చెప్పాడు. తను కాత్తుకుళికి వెళ్ళాలని చెప్పాడు.  బంధువులు అతనిని  కాత్తుకుళికి  తీసుకువెళ్ళారు. 

ఆ ఊరి పెద్దలను కలుసుకుని తాను వచ్చిన పని చెప్పి ఆ ప్రదేశాన్ని తవ్వించమని కోరాడు. వీరు ఆ ప్రాంతంలో త్రవ్వించారు.  అతనికి స్వప్నంలో కాషాయాంబరధారి చెప్పిన  ఐదు వస్తువులు కనిపించాయి. వాటిని చూసిన అందరూ ఆశ్చర్య పోయారు. అప్పుడు వ్యవసాయదారుడు మండోదయా  తన స్వప్నంలో కనిపించిన కాషాయాంబరధారి సాక్షాత్తు కుమారస్వామి అని ఉద్వేగంతో చెప్పాడు. 


ఊరి పెద్దల సలహాలతో, ఐదు రాళ్ళను నాటి నిత్య పూజలు చేశారు.  అందరూ ఆశ్చర్యం పొందేలా మండోదయా ఆరోగ్యవంతుడయ్యాడు. కుమారస్వామి లీలలకి అంతు ఏది.  ఆ ఊరులో  దైవవాక్కు చెప్పే ఒకాయన వున్నాడు. ఆయన , " గంట, పళ్ళెం, శూలం, కత్తి  ,శంఖు యీ ఐదూ వున్నచోట , కలంగై మూలిక, ముళ్ళి మూలిక, జక్కలా మూలిక, నాసర్ (లత) , మాసింగొ మూలిక యీ ఐదు రకాల చెట్లు ఒకే చోట  పెరిగాయి.


ఇవన్నీ కుమారస్వామి చిహ్నాలయినందున అక్కడ కుమారస్వామి కి ఆలయం నిర్మించడం శుభప్రదమని  చెప్పాడు. ఆయన ఉపదేశం ప్రకారం మండోదయా ఒక చిన్న ఆలయాన్ని కుమారస్వామికి నిర్మించాడు. 


చుట్టు ప్రక్కల గ్రామాల నుండి భక్తుల రాక ఎక్కువైనది.  తరువాత కాలంలో, కుమారస్వామి దయవలన గ్రామస్థులందరూ శ్రమించి పెద్ద ఆలయంగా అభివృద్ది చేశారు. దేవాలయ నిర్మాణం ప్రారంభించగానే  ఒక శిల్పిని పిలిపించి, దండాయుధపాణి స్వామివారి విగ్రహాన్ని చెక్కించి , నూతన ఆలయంలో ప్రతిష్టించారు. నిత్యం పూజలు జరుగుతున్నాయి. 


పుష్యమాసంలో ఉత్సవాలు ధ్వజారోహణం తో మొదలయి,  ఏడు రోజులు ఘనవైభవంగా జరుపుతారు. భక్తులు పాలకావిడులు, పుష్పకావిడులతో మ్రొక్కులు చెల్లించడం  , సాయంకాలం రధయాత్ర , మొదలైనవి అత్యంత వైభవంగా జరుపుతారు. కేత్తుకుళి గ్రామ ప్రజల కి వ్యవసాయం, పాల వ్యుత్పత్తి ప్రధాన వృత్తులు. ఈ  ప్రాంతంలో పశువులకి ఏ వ్యాధులు వచ్చినా,  ఆవులు పాలు యివ్వడం తగ్గిస్తేనో ఆపద్బాంధవుడిగా వచ్చి కాపాడేది యీ దండాయుధపాణి స్వామియే.


ఆలయంలోని మూలికా చెట్ల ఆకులను కోసి, రాత్రి నీటి లో నాన వేసి ,ఆ నీటితో గోవులకి రాసి ప్రార్ధించి , కుమారస్వామి విభూది గోవులకి  పెడతారు. రెండు మూడు రోజులలోనే అవి  ఆరోగ్యం పొంది సహజంగా ఇవ్వవలసిన పాలు యిస్తాయి. భక్తులకు ఏర్పడే , కంటి దిష్టి వంటి సమస్యలనుండి కాపాడేది  యీ మూలికాఆకులూ, స్కందుని కరుణే అని ఆ ఊరి పెద్దలు చెపుతారు. సంతానం  లేని వారు అనేకమంది , కొన్ని ప్రత్యేక రోజులలో దండాయుధపాణి కి నేతి దీపం వెలిగించి, అభిషేక ఆరాధనలు చేసి సంతాన భాగ్యం  పొందేరు. 


ఆలయం చుట్టూ తొమ్మిది మంది దేవతలు  రక్షణగా వున్నారని చెప్తారు. ఐదు మూలికల చెట్ల వద్ద వినాయకునికి  ప్రత్యేక సన్నిధి వున్నది.  ఆలయానికి ముందు పడుగర్ అనే కోయ జాతివారి కులదైవం  హెత్తై అమ్మకు ప్రత్యేక సన్నిధి వున్నది. పచ్చని ప్రకృతి ఒడిలోని దండాయుధపాణి దర్శనం ఆనందాన్ని  ఆరోగ్యాన్ని కలిగిస్తుంది.


నేలగిరి జిల్లాలో, కోటగిరి...ఊటీ మార్గంలో ఒకటిన్నర కి.మీ దూరంలో యీ ఆలయం వున్నది. ఆటోలు, టాక్సీ లు దొరకుతాయి..

 

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List