నేడు పరశురాముడు జయంతి. ~ దైవదర్శనం

నేడు పరశురాముడు జయంతి.


గాధిరాజు కుమార్తె సత్యవతి. ఆమెను భృగు పుత్రుడు ఋచికుడు పెళ్ళి చేసుకోవాలనుకున్నాడు. గాధిరాజుని కలిశాడతను. తన కోరికను తెలియజేశాడు. గాధికి అది ఇష్టం లేకపోయింది. కష్టం కూడా కలిగించింది. తన కుమార్తె సుకుమారి. సౌందర్యరాశి. ఋచికుడు అరణ్యాలలో నివసించే ముని. అతనికి తన కూమార్తెను కట్టబె డితే సుఖపడదని అభిప్రాయపడ్డాడతను. అయితే ఆ మాట చెప్పే ధైర్యం లేకపోయిందతనికి. ఋచికుడు గొప్ప తపస్సంపన్నుడు. కోపం వస్తే శపిస్తాడని భయపడ్డాడతను. తెలివిగా ఒక ఉపాయాన్ని ఆలోచించాడు. దానిని ఇలా తెలియజేశాడు.‘‘చెవి మాత్రమే నలుపురంగులో ఉండి, మిగిలిన శరీరం అంతా తెల్లని తెలుపులో ఉన్న వేయి గుర్రాలను తెచ్చి ఇవ్వగలిగితే నా కుమార్తెను ఇచ్చి నీకు తప్పకుండా పెళ్ళి చేస్తాను.’’‘‘ఆజ్ఞ’’ అన్నాడు ఋచికుడు. నిష్క్రమించాడు అక్కణ్ణుంచి. వెళ్ళి వరుణదేవుణ్ణి ప్రార్థించాడతను. కరుణించాడు వరుణదేవుడు. గాధిరాజు చె ప్పినటువంటి చెవి మాత్రమే నలుపురంగులో ఉండి, మిగిలిన శరీరం అంతా తెలుపురంగులో ఉన్న వేయి గుర్రాలను ప్రసాదించాడు. వాటిని గాధిరాజుకి సమర్పించాడు ఋచికుడు.‘‘సత్యవతిని నా అర్థాంగిని చేస్తావా?’’ అడిగాడు. తప్పదిక. చేస్తానన్నాడు గాధిరాజు.సత్యవతి, ఋచికుల వివాహం జరిగిపోయింది.


భర్తను సత్యవతి ప్రేమతోనూ, భక్తితోనూ సేవించసాగింది. ఆమె పతిభక్తికి మెచ్చుకున్నాడు ఋచికుడు. వరం కోరుకోమన్నాడు. తనకీ, తన తల్లికీ పుత్రసంతానాన్ని కలుగజేయమని ప్రార్థించింది సత్యవతి. సరేనన్నాడు ఋచికుడు. అప్పటి వరకు గాధిరాజుకి పుత్రసంతతి లేదు. సత్యవతి కోరిక మేరకు ఒక యజ్ఞాన్ని తలపెట్టాడు ఋచికుడు. అందులో భాగంగా రెండు మంత్రపూరిత జలకలశాలనూ, విడివిడిగా రెండు చరువు(హవ్యము వండేందుకు ఉపయోగించే కుండ)లనూ ఏర్పరిచాడు. ఒక కలశంలోని జలాన్ని సత్యవతీ, వేరొక కలశంలోని జలాన్ని ఆమె తల్లీ స్వీకరించాల్సిందిగా చె ప్పాడు. అలాగే ఎవరు ఏ చరువుని భక్షించాలో కూడా తెలియజేశాడు ఋచికుడు. తర్వాత సత్యవతిని మేడిమ్రానునీ, ఆమె తల్లిని రావిమ్రానునీ కౌగిలించుకోమని చెప్పాడు. అన్నీ వివరించి అతను స్నానానికి న దీతీరానికి వెళ్ళాడు. అతను అటు వెళ్ళగానే ఇటు అంతా తారుమారయింది. తాను తాగాల్సిన మంత్రపూరిత జలాన్ని తల్లికి ఇచ్చింది సత్యవతి. తానేమో తల్లి తాగాల్సిన జలాన్ని తాగింది. అలాగే తల్లి తినాల్సిన చరువుని తాను స్వీకరించి, తన చరువుని తల్లికి అందజేసింది. రావిమ్రానుని తను కౌగిలించుకుని, మేడిమ్రానుని తల్లి కౌగిలించుకునేలా చేసింది. స్నానం చేసి తిరిగి వచ్చిన ఋచికుడు తాను చెప్పిన దానికి భిన్నంగా జరిగినందుకు ఎంతగానో విచారించాడు. భార్యతో ఇలా అన్నాడు.


‘‘నేను చెప్పిందొకటి, మీరు చేసిందొకటి. ఫలితంగా జరగబోయేదేమిటో తెలుసా? నీకు పుట్టే కుమారుడు బ్రాహ్మణుడు అయినప్పటికీ క్షత్రియస్వభావంతో దారుణాలకి ఒడిగడతాడు. నీ తల్లికి జన్మించే పుత్రుడు బ్రహ్మజ్ఞాని అవుతాడు. ఇది దైవసంకల్పం.’’అయ్యయ్యో అనుకుంది సత్యవతి. బాధపడింది.‘‘వద్దు ప్రాణేశ్వరా, నాకు అలాంటి పుత్రుడు వద్దు. దయచేసి మార్చండి. మీరు తపోధనులు. మీరు తలచుకుంటే ఏమయినా చేయగలరు.’’ ప్రార్థించింది. అప్పుడు ఋచికుడు ఇలా అనుగ్రహించాడు, సత్యవతి కుమారుడుగాక, ఆమె మనమడు అటువంటి దారుణస్వభావాన్ని కలిగి ఉంటాడన్నాడు. ఋచికునికీ సత్యవతికీ జమదగ్ని జన్మించాడు. ఋషిసత్తముడతను. జమదగ్ని కుమారుడే పరశురాముడు. అతను బ్రహ్మవంశసంజాతుడై కూడా క్షాత్రం కలవాడయినాడు. దారుణస్వభావాన్ని పుణికిపుచ్చుకున్నాడు. గాధిరాజుకు విశ్వామిత్రుడు జన్మించాడు. అతను క్షత్రియవంశంలో జన్మించినప్పటికీ బ్రహ్మవేత్త అయినాడు. మహర్షి అయినాడు. జమదగ్నికి విశ్వామిత్రుడు మేనమామ కావడంతో ఈ రెండు వంశాలకూ బాంధవ్యం ఏర్పడింది. ఇక్కడ బ్రాహ్మణ క్షత్రియవంశాలు కలవడం విశేషం. సత్యవతి తన పాతివ్రత్య మహిమతో కౌశికీనదిగా మారింది. లోకపావని అయింది. జమదగ్ని రేణుపుత్రిక రేణుకను వివాహమాడాడు. వారికి అయిదుగురు కుమారులు జన్మించారు. అందులో ఆఖరివాడు పరశురాముడు. హిమవత్పర్వతం మీద అనేక సంవత్సరాలు పరశురాముడు, శివుని గురించి తపస్సు చేశాడు. అతని తపస్సుకి మెచ్చి ప్రత్యక్షమయ్యాడు శివుడు. ప్రత్యక్షమయ్యి పరశువు అనే ఆయుధాన్నేగాక, ఇంకా అనేక దివ్యాస్త్రాలను బహూకరించాడు. పరశురాముడంతటి పరాక్రమవంతుడూ, తేజశ్శాలీ మరొకడు లేడు. లోకంలో క్షత్రియుడు అనేవాడు లేకుండా చేస్తానన్నది పరశురాముని ప్రతిజ్ఞ. అందుకు ఓ కారణం ఉంది.

Share:

Related Posts:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive