శివ శైలం. ~ దైవదర్శనం

శివ శైలం.





  శివ శైలం..

మన దేశంలో ఉత్సవాలు, పండుగల సందర్భంగా, ఆలయంలోని అమ్మవారిని రకరకాల ఆభరణాలతో అలంకరిస్తారు. అది అన్నిచోట్లా జరిగేదే. కeని ఒక ఆలయంలో మాత్రం కొంచెం వ్యత్యాసంగా అమ్మవారి హస్తానికి బంగారు గడియారాన్ని అలంకరిస్తారు. ఆశ్చర్యంగావుంది కదా..
ఆ స్థలమే శివ శైలం. అక్కడ దేవలోక శిల్పి అయిన మయుడు మలచిన దైవీక నంది శిల్పం అత్యంత సుందరంగా దర్శనమిస్తుంది. ఒకానొక సమయంలో పరమశివుని శాపానికి గురి అయిన దేవేంద్రుడు , శాపవిముక్తి కోసం ప్రార్ధించాడు. అప్పుడు పరమ శివుడు తను పడమటి ముఖంగా దర్శనమిస్తున్న ఆలయంలో, ఒక నంది విగ్రహాన్ని ప్రతిష్టిస్తే శాప విమోచనం అవుతుంది అని చెప్పాడు.
వెంటనే దేవ శిల్పి మయునిచేత యీ ఆలయంలో నంది విగ్రహం చెక్కించాడు. శిల్ప శాస్త్రానుసారం అన్ని నియమాలతో ఒక శిలను మలచుతే దానికి జీవం వస్తుంది అని అంటారు. ఆ విధంగా ఈ నంది విగ్రహం జీవం పొంది దేవలోకానికి బయలుదేరగా, ఆ నంది విగ్రహానికి మయుడు ఉలితో చిన్న గీటు పెట్టాడు, శిల కి ఛిద్రం ఏర్పడింది. నంది జీవంలేని నందిగా అక్కడే వుండి పోయింది. ఆ నందియే శివశైల నంది.
ఈ ఆలయంలోని మూలవిరాట్ శివశైల నాధుడు. శైలనాధ స్వామి, అత్రీశ్వరుడు అనే పేర్లతో కూడా పిలువబడుతున్నాడు. అత్రి మహర్షి ఆశ్రమము ఏర్పరుచుకుని తపస్సు చేసిన యీ స్ధలంలో, పరమశివుడు ఆయనికి పడమటి ముఖంగా దర్శనమిచ్చాడు.
అమ్మవారైన పరమకళ్యాణి సమేతంగా మిమ్మల్ని పూజించాలని నా కోరిక అని అత్రిమహర్షి వేడుకొనగా, పరమేశ్వరుడు అత్రి మహర్షి కోరిన వరాన్ని ప్రసాదించాడు.
8 వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని సుదర్శన పాండ్యన్ అనే రాజు పాలించేవాడు. చాలా కాలమైనా ఆయనకు సంతాన భాగ్యం కలుగలేదు. అప్పుడు శివ శైలనాధుని పరమకళ్యాణిని పూజించి పుత్ర భాగ్యం పొందాడు.
కృతజ్ఞతగా ఆ రాజు యీ ఆలయాన్ని నిర్మించాడు. మూల విగ్రహానికి జడలు కనిపిస్తాయి. యీ జడలను గర్భగుడి వెనుక నున్న గవాక్షం ద్వారా దర్శించవచ్చును. శివ శైలనాధుడు జడలతో కనిపించడానికి ఒక సంభవం చెప్తారు. సుదర్శన పాండ్య మహారాజు ఆ ప్రాంతాన్ని పాలించినప్పుడు , నిత్యం స్వామిని అమ్మవారిని అర్ధజాము పూజ చేయడం నియమంగా పెట్టుకున్నాడు.
ఒకనాడు సమయం మించిపోతున్నా మహారాజు ఆలయానికి రాలేదు. మహారాజు ఇంక రాడు అనుకున్న ఆలయ అర్చకుడు , మహారాజుకి మర్యాద చేయడానికి వుంచిన మాలని, ఆలయంలో నృత్యం చేసే నర్తకి కి యిచ్చి వేశాడు. నర్తకి ప్రియంగా ఆ మాలని ధరించినది. కొంతసేపటి తర్వాత రాజుగారు వచ్చేఅశ్వ శబ్దం వినబడినది.
దినితో భయంతో అర్చకుడు నర్తకి వద్దనుండి గబ గబా మాలని తిరిగి తీసుకుని ఆలయం లోపలికి వచ్చిన మహారాజు మెడలో వేసి మర్యాద చేశాడు. అప్పుడు ఆ మాలలో ఒక పొడవాటి శిరోజం వుండడం గమనించాడు రాజు. అది అపశకునంగా భావించాడు మహారాజు, " మాలలో శిరోజం ఎలా వచ్చిందని అని అడిగాడు.
రాజు తన తల ఎక్కడ తీసేస్తాడో అని భయపడిన అర్చకుడు సమయోచితంగా , స్వామికి జడలు వున్నందున జడలనుండి వచ్చి వుండవచ్చని బదులు యిచ్చాడు. "ఏమిటి.. వాగుతున్నావు.. స్వామికి జడలా ? ఎక్కడ చూపించు " అన్నాడు రాజు. గర్భగుడి వెనుక గోడకి రంధ్రం చేయమన్నాడు. అర్చకుడు పాము కాటేసినట్టు
భయపడ్డాడు.
సేవకుడు రంధ్రం చేయగా, దాని గుండా చూసిన మహరాజు ఆశ్చర్య పోయాడు. ఆ పేద అర్చకుని కాపాడడానికై పరమశివుడు జడలతో దర్శనమిచ్చాడు. ఈనాటికీ ఆ రంధ్రం గుండా గర్భగుడిలోని స్వామిని దర్శించ వచ్చును. ఈ పుణ్యస్ధలం పరమశివుని పేరిటనున్న శివశైలమైనా, పరమ కళ్యాణి అమ్మవారి స్వస్థానం.
సమీపాన వున్న ' కీళ్ ఆంబూర్ ' లోని నూతి అడుగు భాగంలో నుండి కనుగొనబడి తీయబడిన విగ్రహం .శివశైలంలో ప్రతిష్టించబడిన పరమ కళ్యాణి అమ్మవారి విగ్రహం. శివశైలంలో, పరమశివుని కి అమ్మవారికి కళ్యాణం ఘన వైభవంగా జరుపుతారు. కళ్యాణానంతరం కీళ్ ఆంబూర్ వాస్తవ్యులు అమ్మవారిని , పరమశివుని తీసుకువచ్చి, మర్యాదలు జరిపే ఉత్సవం చేస్తారు. మూడు రోజులు అక్కడ వుండి తరువాత చీర సారెలతో శివ శైలానికి తీసుకువస్తారు. ఆలయానికి ఉత్తర దిశగా కరుణానది అనే కడనా నది ప్రవహిస్తున్నది.
అత్రి మహర్షి చే సృజించబడిన నది కడనా నది. కడనా నదిలో స్నానం చేసి, శివశైలనాధుని దర్శిస్తే , గంగానదిలో స్నానంచేసి కాశీ విశ్వనాధుని దర్శించినంత పుణ్యం లభిస్తుంది అని భక్తులు ధృఢంగా నమ్ముతారు.
పశ్చిమ ముఖం ఆలయం, శిల్పకళా నైపుణ్యంతో దేదీప్యమానంగా, ఆలయం ప్రకాశిస్తూ వుంటుంది. స్ధల వృక్షమైన కదంబ వృక్షం ఆలయం ముందు గోచరిస్తుంది .
ఐదు అంతస్తుల గోపురం, శిలపై చెక్కిన వినాయకుడు. అధికార నందిని దర్శించి లోపలికి రాగానే, దక్షిణ నైరుతి గణేశుడు. నెల్లైప్పర్, కాంతిమతి, శాల్వాడీశ్వరుడు, మీనాక్షి సుందరేశ్వరులు, వళ్ళీ దేవసేనా సుబ్రహ్మణ్యేశ్వరుడు, శనీశ్వరుడు అన్నపూర్ణాదేవి, మహాలక్ష్మి మొదలైనవారు ప్రాంగణంలో దర్శనమిస్తారు.
మహామండపంలో బలిపీఠం, నంది, ధ్వజస్తంభం, తరువాత మణిమండపంలో , ద్వారపాలకులు, పైన అత్రిమహర్షి , పరమశివుని , అమ్మవారిని దర్శించేృశ్య శిల్పాలను కన్నులారా దర్శనం చేసుకుంటాము.
అర్ధమండపానికి రాగానే పరమశివుని, అమ్మవారి ఉత్సవ విగ్రహాలు మనని పరవశపరుస్తాయి. గర్భగుడిలో శివశైల నాధుడు ఎడమ ప్రక్కన ప్రత్యేక సన్నిధిలో పరమకళ్యాణి అమ్మవారు తమను నమ్మి వచ్చిన వారిని కాపాడే దైవాలుగా కృపాకటాక్షాన్ని ప్రసాదిస్తున్నారు.
ఇక్కడ అమ్మవారు నాలుగు హస్తాలతో దర్శనమిస్తుంది. గర్భగుడికి సమీపమున రోలు రోకలి పెట్టె వున్నాయి. వయసు మీరుతున్నా వివాహం జరగక ఏవో అడ్డంకులు కలిగేవారు
అక్కడ వున్న పసుపు కొమ్ములు రోటిలో పోసి రోకలితో దంచి ఆ పసుపుని కొంచెము ముఖానికి రాసుకుంటే వారికి తొందరలోనే వివాహం జరుగుతుంది అని భక్తుల ధృఢవిశ్వాసం.
తమిళనాడు తెన్కాశి జిల్లాలోని ఆళ్వారుకురిచ్చి నుండి పడమట దిశగా 6 కి.మీ దూరంలో శివశైలం క్షేత్రం వున్నది..
Share:

Related Posts:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive