మంగళసూత్ర క్షేత్రం ~ దైవదర్శనం

మంగళసూత్ర క్షేత్రం


భారతీయ సంస్కృతిలో మంగళసూత్రాలకు ఇచ్చిన విలువ అతి విశిష్టమైనది. స్త్రీల సౌభాగ్య చిహ్నంగా పూజింపబడేవి మంగళసూత్రాలు. మదురై నుండి విరుదునగర్ వెళ్ళే మార్గంలో వున్నది తిరుమంగళం. ఆక్కడ నుండి సుమారు 1 కి.మీ దూరంలో  ఉసిలంపట్టి వెళ్ళే మార్గంలో   మిక్కిలి ప్రసిధ్ధిచెందిన  దేవాలయం శ్రీ మీనాక్షి చొక్కనాదర్ ఆలయం. మదురై శ్రీమీనాక్షి దేవి కళ్యాణసమయంలో వరుని తరఫున అంటే శివుని తరఫున శ్రీ అగస్త్య మహర్షి  ఈ తిరుమంగళ ఆలయానికి మంగళసూత్రాలను తీసుకుని వచ్చి , శివలింగం ప్రతిష్టించి  పూజలు చేసినట్లు స్ధలపురాణం వివరించింది.


ఆ సమయంలోఈ ఆలయంలో  అమ్మవారు మీనాక్షి దేవిని అగస్థ్యమహర్షి మంగళసూత్రాలు సమర్పించి పూజించినందున ఈ ఊరుకి తిరుమాంగల్యం అనే పేరు వచ్చింది. అదే కాలక్రమేణా తిరుమంగళంగా మారింది.

మూలవిరాట్ చొక్కనాదరు సుందరమైన లింగ రూపంలో దర్శనమిస్తాడు. మీనాక్షి దేవి సర్వాలంకారశోభలతోఅత్యంత సౌందర్యంతో దక్షిణముఖంగా దర్శనమిస్తున్నది. 


శ్రీ మంగళ దక్షిణామూర్తి వినాయకుడు, బాల మురుగన్, శ్రీ యోగ శనీశ్వరుడు , కాలభైరవుడు మొ. దేవతామూర్తులు

ప్రత్యేక సన్నిధులలో అనుగ్రహిస్తున్నారు. ఈ ఆలయ స్ధలవృక్షం బిల్వ వృక్షం. పుష్కరిణి..ఆకాశ గంగ ఈ ఆలయంలో  భగవంతునికి నూతనవస్త్రాలు సమర్పించి  వేడుకుంటే మాంగల్య దోషాలు తొలగిపోయి వివాహయోగం లభిస్తుంది.


ఈ ఆలయంలో  అభిషేక దర్శనం చేసినవారికి 100 రుద్ర హోమాలు చేసిన ఫలితం లభిస్తుంది అని భక్తులు ధృఢంగా నమ్ముతారు. జ్యేష్టాభిషేకం  రోజున సాయంకాలం శివకామి సమేత నటరాజస్వామి కి విశేష అభిషేక ఆరాధనలు వైభవంగా జరుపుతారు. వివిధరకాల పళ్ళతో జరిపే అభిషేకం దర్శిస్తే పేదరికం తొలగి సంపదలు లభిస్తాయని

భక్తులు ధృఢంగా నమ్ముతారు.

Share:

Related Posts:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive