శ్రీ రఘునాయక స్వామి ఆలయo. ~ దైవదర్శనం

శ్రీ రఘునాయక స్వామి ఆలయo.


ఆలయాల్లో ఉన్న దేవుళ్ళు వలన ఆలయాలు పవిత్రమైన మహత్తు కలిగి ఉంటాయి అందుకే ఆలయాలు దర్శనీయ స్థలాలు  అవుతాయి. ఆ పవిత్రత ఉండబట్టే ఆలయానికి వెళ్తే మానసిక ప్రశాంతత దొరుకుతుంది అంటారు పెద్దలు.  మన దేశంలో సుప్రసిద్ధ వైష్ణవ క్షెత్రాలుగా పెరు పొందిన వాటిలో ప్రకాశం జిల్లా, నాగులుప్పలపాడు డలo, చదలవాడ గ్రామంలోని శ్రీ రఘు నాయకస్వామి దేవస్థానం ఒకటి. 


పవిత్రమగు గుండ్లకమ్మనది గ్రామమునకు దక్షిణముగా 4 ఫర్లాంగుల దూరములో ప్రవహించుచున్నది. ఇది ప్రసిద్ధ వైష్ణవక్షేత్రము. శ్రీస్వామి వారిని త్రేతాయుగమున అగస్త్య మహర్షి ప్రతిష్ఠ చేసినట్లు జనశ్రుతి. శ్రీ స్వామివారి దక్షిణాభీముఖముగ ప్రతిష్ఠ కావింపబడియున్నారు. అమ్మవారు స్వామివారి దక్షిణ భాగమున ప్రతిష్ట చేయబడియున్నారు. 


🔅 స్థల పురాణం


త్రేతయుగంలో సీతాదేవిని రావణుడు అపహరించిన నేపథ్యంలో ఆమెను వెదుకుతూ ఈ ప్రాంతానికి వచ్చి శ్వేతగిరి అని పిలవబడే ప్రస్తుతం ఆలయం నిర్మింపబడిన స్ధలంలో తపస్సు చేసుకోవడానికి కూర్చొన్నారని అప్పుడు వామభాగాన (ఎడమవైపు)లక్ష్మణుడు వున్నాడని పురాణోక్తి. అందుకే అగస్త్యముని అమ్మవారిని కుడివైపున వుండేలా తరువాత విగ్రహ ప్రతిష్ఠ చేసారని ఆర్యోక్తి. 


మనదేశంలో దక్షిణ భాగాన వున్న హిందూ ఆలయాల్లోని శ్రీరామునికి కుడివైపున సీతాదేవి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడంతో శ్రీ రఘునాయక స్వామి ఆలయం ప్రాచుర్యం పొందింది. సహంజాగా స్వామి వారికి ఎడమవైపున సీతాదేవి వుండటం చూస్తుంటాం. కానీ అందుకు విరుద్దంగా ఈ చతుర్వాటికలో అగస్త్య ముని విగ్రహాలను ప్రతిష్ఠించారు.


సతాన్వేషణ నిమిత్తము శ్రీరామ చంద్రమూర్తి వానర సైన్యమును 4 భాగములుగ విభజించి నలుదిక్కులకు పంపినందున దీనిని చతుర్వాటిక యనిరి...అదే నేడు “చదలవాడ” అనే దివ్య వ్యవహార నామము వచ్చినది. 


ఈ ఆలయానికి ఐదు ప్రాంతాలను శ్రీకృష్ణదేవరాయల కాలంలోనే నిర్మించేందుకు సంకల్పించారని,తరువాతి కాలంలో ఇక్కడ గోల్కొండ నవాబుల కాలంలో వారి మంత్రులు అక్కన్న,మాదన్నల పర్యవేక్షణలో ఉత్సవాలు జరిగినట్లు శాసనాలద్వారా తెలుస్తుంది. అద్దంకి సీమ నేలిన రెడ్డిరాజులు కూడా ఈ ఆలయ నిర్వహణలో భాగం పంచుకున్నట్లు తెలుస్తోంది. కవిత్రయంలోని ఎర్రన కూడా తన భారత అరణ్యపర్వ శేష భాగాన్ని ఇక్కడే తెనుగించాడని చారిత్రక ఆధారాలున్నాయి.

 

ఇంతటి మహత్తరమైన ఆలయ ప్రతిష్ఠకోసం అగస్త్యముని నారదుని ప్రేరణచే బ్రహ్మక మండలం లోని జలాన్ని తెచ్చాడని అది బ్రహ్మకుండిగా నదిగా ప్రసిద్ధి చెంది తదుపరి గుండ్లకమ్మ నదిగా మారిందని , తొలుత ఇది ఆలయ ప్రదక్షిణలా ఉత్తరం వైపు నుండి దక్షిణం వైపుకు తర్వాత తూర్పునకు ప్రవహించినట్లు ఆ తర్వాత ఎడంగా ప్రవహిస్తున్నట్లు ఆర్యోక్తి. 

 

ఇంతటి ప్రాశస్త్యం కలిగిన ఈ ఆలయంలోని స్వామివారికి తిరునాళ్ళు త్రేతాయుగం నుండి శ్రీరామనవమి నుండి తొమ్మిదిరోజులపాటు జరిగి చివరిరోజున స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది. స్వామివారికి తలంబ్రాలు భద్రాచలం నుండి ఇక్కడికి వస్తాయి. ఈ కళ్యాణానికి భక్తులు చుట్టుప్రక్క గ్రామాలనుంచే గాక సుదూర ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చి స్వామివారి కళ్యాణాన్ని తిలకిస్తారు. 


ఇంకొక విశేషం ఏమిటంటే తలంబ్రాలు పోయడానికి ముందు ఆకాశ మార్గంలో గరుడపక్షి వచ్చి మూడుసార్లు స్వామివారి కళ్యాణ మండపంపై ప్రదక్షిణ చేసిన అనంతరం తలంబ్రాలను పోస్తారు. దీంతో వేలాది మంది భక్తులు అనాది నుండి గరుడపక్షి ఎప్పుడు వస్తుందా అని ఆకాశ మార్గం వైపు ఎదురుచూస్తూ వుంటారు. అందుకే దీనిని " నిదర్శనవాడ " అనే పేరు కూడా కలదు.


అనంతరం సాయంత్రం 4గంటలకు రథోత్సవ కార్యక్రమాన్ని భక్తులు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. 

రథాన్ని లాగడానికి భక్తులు,యువత ఎక్కువ సంఖ్యలో పాల్గొని గ్రామంలో ఊరేగింపుగా తీసుకెళ్ళి మళ్ళీ యధాస్ధానానికి చేరుకొంటారు. చదలవాడ గ్రామంలో తొమ్మిదిరోజులపాటు పండుగ వాతావరణంలా వుంటుంది. ప్రతి ఇంటిలో తమ తమ బంధువులతో ఇళ్లని కళకళలాడుతూ కనిపిస్తాయి. సంతతి లేని వారు శ్రీ స్వామి వారి బ్రహ్మోత్సవమూల సందర్భంగా గరుడ ప్రసాదం స్వీకరించినచో తప్పక సంతానo పొందుదురు. రాష్ట్ర నలుమూలల నుండి నిస్సoతవులు వచ్చి ఈ గరుడ ప్రసాదం స్వీకరించి సంతానo పొందుచున్నారు.

 

ఒంగోలు చీరాల బస్సు మార్గములో ఒంగోలు నుండి 15 కి.మీ. దూరములో చదలవాడ గ్రామమున్నది.

 

Share:

Related Posts:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive