ప్రకాశంజిల్లా, రాచర్ల మండలం, జల్లివాని పుల్లల చెరువుకు పడమటి దిక్కున ఆరు కిలోమీటర్ల దూరంలో వున్న నల్లమల అటవీ ప్రాంతంలో.. నెమిలి గుండ్ల రంగనాయకస్వామి దేవాలయం ఉంది. గుండ్లకమ్మ నది గుండ్ల బ్రహ్మేశ్వరం వద్ద ఆవిర్బవించి నల్లమల్ల గిరులలో సుడులు తిరిగి ఉత్తర దిక్కున రెండు కొండలు మధ్య జాలు వారి నెమిలిగుండంలోకి చేరుతుంది.
క్షేత్ర ప్రాముఖ్యత..
నల్లమల్ల అటవీ ప్రాంతంలో మయూర మహర్షి ఆశ్రమాన్ని ఏర్పరుచుకొని, మహావిష్ణువును ప్రసన్నం చేసుకొడానికి తపస్సు చేస్తూ.. తదేక దీక్షతో తన ముక్కుపుటమతో ఒక గుండమును తవ్వి, మట్టిని బయటకు తీయడంతొ మరుసటి సూర్యోదయానికి గుండం జలయంగా మారిందని ప్రతీతి. నెమలి ముఖ ఆకారంతో వున్న మహర్షిచే నిర్మితమైనందున.. "నెమిలిగుండం" అనే పేరు సార్థకమైనది. దీని చెంతనే మహా విష్ణువు రంగనాయకస్వామిగా వెలయడంతో నెమెలిగుండ్ల రంగనాయకస్వామి క్షేత్రంగా వాసికెక్కింది.
రంగనాయకస్వామి చరిత్ర..
నల్లమల్ల కొండలలో ఇసుకగుండమనే చోట చెంచు జాతికి చెందిన భయన్న, బయ్యక్క దంపతులుండేవారు. వారి ఏకైక కుమార్తె పేరు రంగ. పెళ్లీడు కొచ్చిన రంగ తన కులాచారాన్ని దిక్కరించి, కులపెద్దలతో విభేదించి మహావిష్ణువును పెళ్ళాడాలనే తలంపుతో చెంచుగూడెం వదలి, నెమిలిగుండం చేరుకొని తపమాచరిస్తున్న మయార మహర్షికి తన మనోగతాన్ని వెల్లడి చేసింది. మనోభీష్ట సిద్ధికోసం మహర్షితో కలసి తపమాచరించిది. ఎట్టకేలకు వారి తపస్సుకు చలించిన విష్ణువు ప్రసన్నుడై రంగను భార్యగా స్వీకరించెను.
మయూర మహర్షి కోరిక మేరకు నెమలిగుండం ప్రక్కనే పడమటి కొండపైన స్వయంభుగా వెలసి భక్తుల పాలిట ఆరాధ్యదైవంగా వేలాది కుటుంబాల ఇలవేలుపుగా పూజలందుకుంటున్నాడు. భూలోకం చేరిన విష్ణువును వెతుక్కుంటూ వైకుంఠం నుంచి వచ్చిన లక్ష్మిదేవి రంగ సమేతుడైన స్వామిపై కనుక వహంచ పూజలు చేయడం ఆనవాయతి. ఈ ప్రదేశాన్ని లక్ష్మణ వనంగా పిలుస్తారు. ఏ క్షేత్రంలో కనిపించని అరుదయిన పవిత్రత, గొప్పదనం నెమిలిగుండ్ల రంగనాయక స్వామికి ఉంది. అంటు, ముట్టులు వున్నవారు ఆలయం వద్దకు వస్తే తేనెటీగలు దాడి చేస్తాయి. గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి ఏటా ఛైత్ర మాసంలో బహుళ పాడ్యమి, విదియ, తదియలో మూడు రోజుల పాటు ఉపవాసాలు నిర్వహిస్తారు..
No comments:
Post a Comment