-
శ్రీ మల్లెంకోండేశ్వర స్వామి ఆలయం.. మల్లెంకొండ..
సేతుబంధనం చేసేముందు శివలింగాన్ని శ్రీరాముడు ప్రతిష్టించినట్లు శివపురాణం వర్ణిస్తోంది. ఇతర పురాణాల్లో కూడా రాముడు శివలింగాన్ని ఆరాధించిన విషయం కనిపిస్తుంది. కొన్ని చోట్ల హత్యాపాతక నివారణార్థం శివలింగ ప్రతిష్ఠలు చేసిన గాథలున్నాయి వీటిని కాదనలేము..!
-
పంచలింగాల కోన..
అది శేషాచల అటవీ ప్రాంతం.. దట్టమైనఅడవులు.. రాళ్లూ రప్పలతో కూడిన గుట్టలు... చిన్న చిన్న బాటలు.. ఎటు చూసినా ఎత్తైన చెట్లు.. పక్షుల కిలకిలలారావాలు... వన్యప్రాణులు.. ప్రకృతి అందాలతో అలరారే ఆ క్షేత్రంలో.. సాక్షాత్తూ శివుడు కైలాసం విడిచి ఇక్కడ కొలువైనాడు. లోతైన లోయలో కొలువుదీరిన శివుడిని చేరుకోవడానికి కాలినడకన 9 కిలోమీటర్లు ప్రయాణించాల్సిందే..! ఆ ఆద్భుత స్థలమే పంచలింగాల కోన..!!.
-
ఉల్లెడ ఉమామహేశ్వర స్వామి
నల్లమల ఆడవి లోని ఉల్లెడ ఉమామహేశ్వర స్వామి కొండ గుహ లెదా వజ్రాల కొండ గుహ ఆని అంటారు. ఈవజ్రాల కొండ గుహలో ఉల్లెడ నరసంహాస్వామి గుహ, ఆశ్వథ్దామ గుహ, వున్నఉల్లెడ ఉమామహేశ్వర స్వామి గుహ అను మూడు గుహలు కలవు. ఉల్లెడ ఉమామహేశ్వర స్వామి గుహ లో ఒక శివలింగం, మూడు పడగల నాగుపాము, శంఖం, మరియు వీణ స్వయంబుగా వెలిచినాయి.
-
కాలి నడకన అధ్భుతమైన యాత్ర...
ఈ ప్రపంచంలో ప్రకృతిని ఆరాధించనివారుండరు. ప్రకృతి అందాలను చూస్తూ తమను తాము మరిచిపోతుంటారు. అలాంటి ప్రకృతి అందాలను చూసేందుకు ఎంత దూరమైనా వెళ్తారు, కొత్త కొత్త ప్రదేశాల కోసం అన్వేషిస్తారు. అలాంటి వారి కోసం నా వంతు సహాయాన్ని అందించడానికే ఈ ప్రయత్నం. .
-
జ్యోతి శ్రీ సిద్దేశ్వరస్వామి ఆలయం...
కొన్ని శతాబ్దాలుగా పెన్నానది గర్భంలో దాగి ఉన్న మహిమాన్వితమైన 108 లింగాల శివాలయాల దివ్య క్షేత్రం. రావణ సంహారం అనంతరం బ్రహ్మహత్య దోశ నివారణలో భాగంగా శ్రీ రాముడు దేశవ్యాప్తంగా శివలింగ ప్రతిష్టాపన జరుపుతూ ఇక్కడ శివలింగాలకు పూజలు నిర్వహించి పాప విమోచనం పోందాడని ప్రతీతి. కాలక్రమంలో ఆలయం పెన్నమ్మ కడుపులో కలిసిపోయి, ఇసుకదిబ్బగా మారిపోయింది.
తిరువల్లిక్కేణి క్షేత్రం.
ఓం.. ఓంకారం...
స్వచ్చమైన గాలి, పచ్చని ప్రకృతి, మొక్కిన వారిని దరి చేర్చుకొనే పరమేశ్వరుని సన్నిధి, అందరికి అన్నం అన్న అవధూత శ్రీ కాశి నాయన మాటను నిజం చేస్తున్న ఆయన భక్త బృందం, ఇలా ఎన్నో ప్రత్యేకతల నిలయం ఓంకారం.
రాతి మండపాలను దాటిన తరువాత ప్రధాన ఆలయానికి ఉత్తరాన నవగ్రహ మండపం కనిపిస్తుంది. ఈశాన్యంలో పుష్కరణి ఉంటుంది. గర్భాలయంలో చందన, విభూతి కుంకుమ లెపనాలతొ సదాశివుడు లింగరూపంలో భక్తులను అనుగ్రహిస్తుంటారు.
పెళ్లి నిశ్చయమయ్యాక అమ్మవారి ఆశీర్వాదం పోందిన కలియుగ శ్రీనివాసుడు, పద్మావతమ్మ.
ఆమ్నాం అంటే వేదమనీ, అక్షి అంటే కన్నులు అనీ అర్థం. వేదాలను కన్నులుగా ఉన్న అమ్మవారు కాబట్టి... ఆ తల్లికి ఆమ్నాయాక్షి అనే పేరువచ్చింది. ఆ పేరే కాలక్రమంలో అవనాక్షమ్మగా మారింది. ఆ అమ్మ ఆలయం చిత్తూరు జిల్లా నారాయణవనం(వరం) గ్రామానికి కిలోమీటరు దూరంలో అరుణానది సమీపంలో ఉంది.
అవనాక్షమ్మ ఆలయ సమీపంలోనే అగస్త్యీశ్వరాలయం ఉంది. దీన్ని అగస్త్య మహర్షి ప్రతిష్ఠించారట. ఆలయాన్ని ఆకాశరాజు అభివృద్ధి చేశాడు. ఈ గుడిలోని అమ్మవారిని మరకతవల్లి అంటారు. సాధారణంగా శివాలయాల్లో ముందు శివలింగం, దానికి ఎడమవైపు అమ్మవారు ఉంటారు. కానీ, ఆలయంలో మొదట అమ్మవారి విగ్రహం ఉండి, ఆ తరువాత స్వామి విగ్రహం ఉండటం విశేషం. పద్మావతీ దేవికి ఒకానొక సమయంలో జబ్బుచేసిందట. అప్పుడు అగస్త్య మహర్షి సూచన మేరకు ఆమె ఇక్కడ రుద్రాభిషేకం చేయించగా వ్యాధి నయమైనట్లు 'వేంకటాచల మహత్యం'లో ఉంది.
ఈ ఆలయానికి దాదాపు మూడువేల సంవత్సరాల చరిత్ర ఉంది. మొదట ఆకాశరాజు, తరువాత కార్వేటి వంశస్థులు, అనంతరం తిరుత్తణి రాజులు దీని అభివృద్ధికి కృషిచేశారు. 1967లో ఈ ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోకి వచ్చింది. అప్పట్నుంచీ పూజాద్రవ్యాలూ వసతులూ అన్నీ వారే సమకూరుస్తున్నారు. ఆలయానికి వచ్చే భక్తుల కోసం రాష్ట్రపర్యాటక అభివృద్ధి సంస్థ వసతులు సమకూర్చింది. భక్తులు పొంగళ్లు పెట్టుకునేందుకు వీలుగా షెడ్డు, ఇతర సౌకర్యాల్లో భాగంగా మరుగుదొడ్లు నిర్మించారు.
ఆత్మీయ మిత్రులకు, ఆత్మ బంధువులకు, శ్రేయోభిలాషులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు.!!
.
.
శ్రీ రాఘవం దశరథాత్మజ మప్రేమయం...
సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపమ్...
ఆజానుబాహుమరవింద దళాయతాక్షం...
రామం నిశాచర వినాశకరం నమామి...
అంటూ శ్రీరాముడిని స్తుతించడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పురాణాలు చెబుతున్నాయి.
.
తాను చేస్తున్న యాగాల రక్షణ కొరకై శ్రీరామ లక్ష్మణులను తీసుకెళ్లిన విశ్వామిత్రుడు, ఆ కార్యక్రమం విజయవంతంగా ముగిసిన తరువాత వారిద్దరినీ మిథిలకు తీసుకుపోతాడు. అక్కడ జనకుడు యజ్ఞాన్ని చేస్తుంటాడప్పుడు. విశ్వామిత్రుడొచ్చాడని తెలుసుకున్న జనక మహారాజు తన పురోహితుడైన శతానందుడుతో కలిసి వారున్న ప్రదేశానికి వచ్చాడు. మునీశ్వరుడిని సేవించాడు. ఆయన వెంటే వున్న రామ లక్ష్మణులెవరని ప్రశ్నించాడు జనకుడు. వారు దశరథ మహారాజు కొడుకులని, తన యజ్ఞాన్ని రక్షించేందుకు క్రూరులైన రాక్షసులను చంపారని, వారిద్దరూ ఆయన దగ్గరున్న శివ ధనుస్సును చూసేందుకొచ్చారని అంటాడు విశ్వామిత్రుడు. మర్నాడు ఉదయం జనక మహారాజు ఆహ్వానం మేరకు శివ ధనస్సును చూసేందుకు వెళ్లారు రామలక్ష్మణులు. తన దగ్గరున్న ధనుస్సు విషయం చెప్పి, దానిని ఎక్కుపెట్టగల వాడికే తన కూతురు సీతను ఇస్తానని చెప్పాడు. దానిని శ్రీరామ లక్ష్మణులకు చూపిస్తానని, శ్రీరామచంద్రమూర్తి విల్లెక్కుపెట్టగలిగితే తాను అదృష్టవంతుడిని, అయోనిజైన సీతను ఆయన కిస్తాను అని అంటాడు.
.
జనకుడి ఆదేశం ప్రకారం, ఐదువేల మంది బలశాలులు ఇనుప పెట్టెతో సహా దాంట్లో వున్న పెద్దవింటిని తెచ్చారు వారున్న చోటికి. విశ్వామిత్రుడి ఆదేశం ప్రకారం శ్రీరాముడు, ధనుస్సుండే పెట్టె దగ్గరికిపోయి, దాని మూత తెరిచి, తాను వింటిని చూసానని-తాకానని చెప్పి, ఆయన ఆజ్ఞాపిస్తే బయటకు తీస్తానని అంటాడు. విశ్వామిత్రుడు, జనకుడు అంగీకరించగానే, రాముడు, అవలీలగా వింటిని అరచేత్తో పట్టుకొని, బయటకు తీసి, రాజులందరూ చూస్తుండగా అల్లెతాటిని బిగువుగా లాగుతుంటేనే, విల్లు ఫెల్లుమని రెండుగా విరిగిపోయింది. ఆ వెం టనే నేనన్న మాట ప్రకారం, నా ప్రాణంకంటే ప్రియమైన భూపుత్రి సీతను గొప్పగుణాలున్న శ్రీరామచంద్రమూర్తికిచ్చి వివాహం చేస్తాను’’ అని జనకుడు సీతను రాముడికి ధారాదత్తం చేసే ప్రయత్నం చేశాడు కాని, రాముడందుకు అంగీకరించలేదు. తనను విశ్వామిత్రుడు చెప్పిన పని చేయాల్సిందిగా తన తండ్రి ఆజ్ఞాపించాడని, ఆయన వింటిని చూడమంటే చూసానని, ఎక్కుపెట్టమంటే పెట్టానని, అంటూ, వివాహమాడడానికి తనకు తండ్రి ఆజ్ఞ లేదని జనకుడికి చెప్పాడు. జనకుడు దశరథ మహారాజుకు కబురు పంపి ఆయన్ను పిలిపించాడు.
.
మిథిలా నగరం చేరుకున్న దశరథుడు ఋషులతో బంధువులతో కలిసి జనకుడున్న చోటికి పోయి, ఆయనకు వశిష్టుడిని చూపించి, ఇక్ష్వాక వంశానికి ఆయన కులగురువనీ, తమ గురించి చెప్పాల్సిన విషయాలన్ని ఆయన చెప్తాడనీ అంటాడు. కన్యను ఇచ్చుకొనేటప్పుడు, పుచ్చుకొనేటప్పుడు, అధమ పక్షం మూడు తరాల వంశ జ్ఞానం ప్రధానంగా తెలుసుకోవాలి. ఇది సాంప్రదాయ బద్ధంగా వచ్చే ఆచారం. తదనుగుణంగానే, వశిష్ఠుడు సూర్యవంశక్రమాన్ని వివరించాడు వెంటనే. ఆ తరువాత ఇక్ష్వాకు వంశ క్రమం వివరించిన వశిష్టుడితో జనక మహారాజు తనవంశక్రమాన్ని వినిపించాడు. శ్రీరామ లక్ష్మణులకు తన ఇద్దరు కూతుళ్లు సీత-ఊర్మిళలను సంపూర్ణ ప్రీతితో, దశరథుడి ఆజ్ఞ ప్రకారం ఇచ్చి వివాహం జరిపిస్తానని అంటాడు. జనకుడి తమ్ముడైన కుశధ్వజుడి ఇరువురు పుత్రికలను, దశరథుడి కుమారులైన భరత శత్రుఘ్నులకిచ్చి వివాహం చేయమని విశ్వామిత్రుడు సూచించగా దానినీ అంగీకరించాడు జనకుడు. రెండు రోజుల తరువాత వచ్చే ఉత్తర ఫల్గుని నక్షత్రం రోజున వివాహంచేద్దాం అని అంగీకారం కుదిరింది. ఉత్తర ఫల్గుని నక్షత్రానికి అధిపతి భగుడనే ప్రజాపతి అనీ, ఆయన శుభకరుడు కాబట్టి, ఉత్తర ఫల్గుని ఉత్తమమని అందరు ప్రశంసించారు.
.
ముహూర్తం రోజు ఉదయం తూర్పు తెల్లవారుతుండగానే, కాల కృత్యాలు తీర్చుకొని యజ్ఞ భూమికి చేరుకున్నాడు దశరథుడు. చక్కటి ఆభరణాలను ధరించి, కంకణం కట్టుకొని, రామచంద్రమూర్తి మంచి ముహూర్తంలో తమ్ములతో కలిసి వచ్చాడక్కడకు. వశిష్ఠుడు-ఇతర మునీంద్రులు ముందుండి తమ వెంట వస్తుంటే యజ్ఞ భూమి (యజ్ఞ భూమి అంటే, సమీపంలో పెళ్లిజరిపించేందుకై ఏర్పాటుచేసిన ఉత్సవశాల అని అర్థం) ప్రవేశించారు. వశిష్టుడితో జనకుడు, త్రిలోకాభిరాముడైన రామచంద్రమూర్తికి శీఘ్రంగా-సంతోషంగా వివాహ సంబంధమైన కార్యాలన్నీ జరిపించమని అన్నాడు. వశిష్ఠుడు, తనకు సహాయంగా విశ్వామిత్రుడు, శతానందుడు తోడుండగా వివాహ సంబంధమైన కార్యక్రమం చేపట్టాడు. చలువ పందిరిలో శాస్త్ర ప్రకారం వేదిని తీర్చి, పూలతో-పరిమళ ద్రవ్యాలతో దానిని అలంకరించి, మెరుస్తున్న బంగారు పాలికలతో-మొలకలెత్తిన శుభకరమైన అడుగులేని పాత్రలతో-జిగుళ్లుగల మూకుళ్లతో-ధూపమున్న ధూప పాత్రలతో-స్రుక్కులు, స్రువాలు, అర్ఘ్యం పేలాలతో నిండిన స్వచ్ఛ పాత్రలతో-పచ్చని అక్షతలతో వేదిని నింపాడు వశిష్ఠుడు. మంత్రాలు పఠిస్తూ, పరిశుద్ధమైన దర్భలను పరిచి, శాస్ర్తోక్తంగా వేదిలో అగ్నిని వుంచి, వశిష్ఠుడు హోమం చేశాడు.
.
‘‘సీతను సర్వాభరణో, పేతను దా నిలిపి నగ్ని కెదురుగ గౌస/ ల్యా తనయున కభిముఖముగ, క్ష్మాతలనాథుండు రామచంద్రున కనియెన్’’.
అన్ని విధాలైన అలంకారాలతో ప్రకాశిస్తున్న సీతను, అగ్నికి ఎదురుగా-శ్రీరామచంద్రమూర్తికి అభిముఖంగా, నిలువబెట్టి, జనక మహారాజు శ్రీరామచంద్రమూర్తితో:
‘‘ఈ సీత నాదుకూతురు, నీ సహధర్మచరి దీని నిం గై కొనుమా / కౌసల్యాసుత, నీకును భాసురశుభ మగు గ్రహింపు పాణిం బాణిన్’’.
‘‘కౌసల్యా కుమారా, ఈ సీత నా కూతురు. నీ సహధర్మచారిణి. ఈమెను పాణి గ్రహణం చేసుకో. నీకు జగత్ ప్రసిద్ధమైన మేలు కలుగుతుంది. నీకు శుభం కలుగుతుంది. మంత్రపూర్వకంగా ఈమె చేతిని నీ చేత్తో పట్టుకో. రామచంద్రా, పతివ్రత-మహా భాగ్యవతి అయిన నీ సీత, నీ నీడలా ఒక్కసారైనా నిన్ను విడిచి వుండదు’’ అని అంటూ, మంత్రోచ్ఛారణతో పవిత్రవంతములైన జలధారలను రామచంద్రమూర్తి చేతుల్లో జనక మహారాజు ధారపోశాడు. దేవతలు, ఋషులు మేలు-మేలనీ, భళీ అనీ శ్లాఘించారు.
.
సంతోషాతిషయంతో దేవతలు పూల వాన కురిపించారు. దేవదుందుభులను చాలాసేపు మోగించారు. వాసవుడు మొదలైన పలువురు, తమ శోకత్వాన్ని-దీనత్వాన్ని తమ మనస్సుల నుండి తొలగించుకున్నారు. ఈవిధంగా మంత్రించిన జలాలను ధారపోసి భూపుత్రి సీతను శ్రీరామచంద్రమూర్తికిచ్చి వివాహం చేసానని జనక మహారాజు సంతోషిస్తూ లక్ష్మణుడివైపు చూసి, ‘‘లక్ష్మణా ఇటు రా. దానంగా ఊర్మిళను స్వీకరించు. ప్రీతిపూర్వకంగా ఇస్తున్నాను. ఈమె చేతిని ప్రేమతో గ్రహించు’’ మని కోరాడు. ఊర్మిళను లక్ష్మణుడికిచ్చిన తర్వాత, భరతుడిని మాండవి చేతిని, శత్రుఘ్నుడిని శ్రుతకీర్తి చేతిని గ్రహించమని ప్రేమతో పలికాడు జనకుడు. వివాహం శాస్త్ర ప్రకారం ప్రసిద్ధంగా జరిగింది. మంగళ వాద్యాలు మోగుతుంటే, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అగ్నికి మూడుసార్లు ప్రదక్షిణ చేయడంతో పెళ్లి తంతు ముగిసింది.
.
సీతా కల్యాణ ఘట్టం చదివిన వారికి శ్రీ సీతా వివాహ విషయ చర్చకు సంబంధించి ఆసక్తి కలగడం సహజం. కన్యాదానం చేస్తూ జనకుడు రాముడిని ‘‘కౌసల్యా సుత’’ అని సంబోధించాడు. ఎందుకు జనకుడు కౌసల్యా కుమారా అని పిలవాలి? సీ్త్ర పేరుతో పిలవకుండా, వాడుక పేరైన ‘‘రామా’’ అని పిలవచ్చు కదా. దశరథ కుమారా అనకూడదా? ఆ రెండూ ఇప్పుడు సరిపోవని అర్థం చేసుకోవాలి. కేవలం రామా అని పిలిస్తే ఆ పేరుకలవారు మరొకరుండవచ్చు కదా. దశరథ కుమారా అని పిలవడానికి ఆయనకు నలుగురు కొడుకుల్లో వేరొకరు కావచ్చు కదా. కౌసల్యా కుమార అంటే ఏవిధమైన సందేహానికి తావుండదు. ‘‘ఈ సీత’’ అంటాడు రాముడితో. సీత, సిగ్గుతో తన చేయి పట్టుకొమ్మని, తనంతట తానే రాముడిని అడగదు. రామచంద్రమూర్తి తనకు తానే సీత చేయి పట్టుకుంటే, పెళ్లికాక ముందే ఎందుకలా స్వతంత్రించి కాముకుడిలా ప్రవర్తించాడని సీత అనుకోవచ్చు-లోకులూ భావించవచ్చు. అందుకే జనకుడు తానే సీతచేతిని రామచంద్రమూర్తికి చూపి ‘‘ఈ సీత’’ అని చెప్పాడు. అలంకరించబడిన కల్యాణ మంటపంలో, నలు వైపులా నిలువుటద్దాలు వేసి వుండడంతో, అన్నిటిలోనూ సీత రూపమే కనిపించసాగింది. అద్దంలో సీతేదో-నిజమైన సీతేదో తెలుసుకోలేక నలుదిక్కులు చూస్తున్న రాముడి భ్రమపోయేట్లు, చేయి చూపి ‘‘ఈ సీత’’ అని చెప్పాడు జనకుడు.
జ్ఞానామృతాన్ని కురిపించిన ‘శ్రీ పిచ్చమాంబ’.
* కడప జిల్లా చరిత్రలో విశిష్టమైన ‘శ్రీ పిచ్చమాంబ మఠం’
* మైదుకూరులో వెలసిన శ్రీ సదానంద ఆశ్రమానికి ఆధ్యాత్మిక చరిత్రలో విశిష్టమైన స్థానం.
.
Sri Pichamamba Matam, Mydukur Mandal, Kadapa District, AP
ఆధ్యాత్మిక జీవితాన్ని గడపాలని, భగవంతునితో తనకు గల అనుబంధాన్ని తెలుసుకోవాలనే శ్రద్ధగల వారికే ‘గురువు’ అత్యంతావశ్యకం. అందుచేత ప్రామాణికులైన గురువును శరణువేడితే, భగవంతుని శరణు వేడినట్లే. శిష్యుడు గురువుకు చేసిన శరణాగతిని భగవంతుడు తనకు చేసిన శరణాగతిగా స్వీకరిస్తాడు.
.
గురువు, దేవుడు వేర్వేరు కాదు ఒక్కడే. వేదవ్యాసుడు సాక్షాత్ విష్ణుస్వరూపుడు. భగవంతుని అవతారాల్లో ప్రతిద్వాపరంలోనూ విష్ణువు వ్యాసుడై ఆవతరించి కర్మ, భక్తి, జ్ఞానాలను ప్రబోధం చేసి సమాజాన్ని ధార్మిక నిష్ఠతో నడిపిస్తాడని విష్ణుపురాణాది గ్రంథాలు పేర్కొన్నాయి. ద్వాపరయుగంలో విష్ణువు వ్యాసరూప జ్ఞానావతారుడై సమాజసేవ చేశాడు. వేదవ్యాసులవారు మన భారతీయ సంస్కృతి మహాపురాణాలను, మహాభారత ఇతిహాసాన్ని రచించి, మహాభాగవతాన్ని, బ్రహ్మసూత్రాలను అందించి మనలో కర్మ, జ్ఞాన, భక్తి మార్గాలను పటిష్టం చేసాడు. భారతీయులందరూ జ్ఞానవిజ్ఞాన సంపన్నతకై వ్యాసభగవానుని స్మరించుకుని, తమ జీవిత రూపురేఖలు ధార్మిక, ఆధ్యాత్మిక మార్గంలో పయనించేటట్లుగా చేసుకుంటున్నారు. బ్రహ్మ, వశిష్ఠ, శక్తి పరాశర, వ్యాస, శుక, గౌడపాద, గోవింద భగవత్పాద, శంకరాచార్యులను స్మరించుకుని, గురుపరంపరని పూజించాలి. వ్యాసమహర్షి గురుపరంపరకు ఆద్యుడు. మన భారతీయ సంస్కృతిలో గురువుకు ముందు ప్రథమ గురువులైన తల్లిదండ్రులను సైతం పూజించడం ఓ సంప్రదాయంగా వస్తోంది.
.
శ్రీశ్రీశ్రీ ఛత్రపతి శివాజీ వంశం నందు శ్రీ సిందే పెద్ద వేంకట రాంజీ శ్రీమతి వెంకమాంబ లకు కొత్తబ్బి అనే పెద్ద మారుడు జన్నించినాడు. శ్రీ పిచ్చమాంబ ప్రేమతో నాన్నను పెద్దయార్యులు (పెద్దయ్య) అని పిలిచేది. పెద్దయ్య గారు 12 సంవత్సరాల ప్రాయం నుండే శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మనువరాలు శ్రీ ఈశ్వరమ్మ గారి ప్రియ శిష్యప్రశిష్యులలో బజ్బిగారి వెంకటమ్మకు ప్రియ శిష్యుడుగా పెద్దయార్యులు సేవ చేసేవారు. శ్రీ ఈశ్వరమ్మ గారి ప్రియ శిష్యప్రశిష్యులలో ఒక్కరైన జడల రామయ్య. వీరి ప్రియ శిష్యుడు సద్విద్వాంసుడైన మోరె జోగయ్య భోధనలు చేస్తుండేవాడు. శ్రీ జోగయ్య - లక్ష్మాంబ పుణ్యదంపతుల ఏకైక కూమార్తె ఈశ్వరాంబ ను పెద్దయార్యులకు ఇచ్చి వీరి స్వగ్రాం నరసాపురం నందు వివాహం జరిపించినారు. ఈశ్వరాంబ కు పెద్దయార్యులకు పెద్ద కూమార్తెగా పిచ్చమాంబ జన్మించింది. పెద్దయార్యుల సోదరి కుమారునికి 5 సంవత్సరాలు నిండకముందే పిచ్చమాంబకు వివాహం జరిపించినారు.
.
పిచ్చమాంబ తండ్రిగారైన పెద్దయార్యులు నరసాపురం వదలి మైదుకూరు మండలంలోని వనిపెంట గ్రామం చేరి అక్కడి పిల్లలకు ఉపాధ్యాయుడై విద్యను భోదించేవాడు. చుండుపల్లె వెంకయ్య సహసేవకుడిగా పని చేసినాడు. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి గారి మఠంకు పోయి అక్కడ పూర్ణబ్రహ్మవిచారులైన సాధుపుంగవులకు మరియు భక్తులకు అన్న ప్రాసాదులను తమ శక్తి కొలది సమర్పించుచు, వారి సువిచారమువల్ల సత్యమును గ్రహించుచు పెద్దలయందు నిరహంకార బుద్ధితో మెలంగుచు నిజమేరింగి ప్రభుసత్తముడు.
.
పిచ్చిమాంబ యుక్త వయస్సు రాగానే తల్లి తండ్రులు అత్తరింటికి పంపించడం జరిగింది. కొద్ది సంవత్సరాల తరువాత పూర్వజన్మపుణ్య ఫలంగా పిచ్చమాంబకు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మనువరాలు శ్రీ ఈశ్వరమ్మ దర్శనంతో దైవాంతసంభూతరాలైంది. అత్తరిల్లు వదిలి తండ్రిగారి వద్దకు వచ్చింది. పెద్దయార్యులు పిచ్చమాంబ పరిస్థతిని గమనించి దైవమార్గమును పరిపూర్ణతో భోధించి, అమ్మా నీవింక జ్ఞానోపదేశము చేయమని తండ్రిగారు ఆజ్ఞాపించినారు. తండ్రిగారి అజ్ఞానుసారం పిచ్చమాంబ భక్త జనులకు జ్ఞాన అమృతాన్ని పంచిపెట్టుతుండేది. కొంత కాలానికి అచలబోధయందు కొంత సందేహము రావడంతో పోకల వేంకట నరసింహా రావు గారిని దర్శంచి అప్పుడు పరిపూర్ణ వాత్సత్యంతో అమ్మా నీవుఇప్పుడు చెప్పిన మీ తండ్రిడారి భావము సత్యమైనది. అంత కంటే మరేమిలేదని ద్వాదశి, షోడశి, పంచదశి మహా మంత్రములను వివరించి, భోధించి ఇదియే నీకు శ్రీ శివరామదీక్షితుల పరంపర యగుటవలన పిచ్చమాంబ శ్రీవారిని రెండవదైవముగా పూజించి జ్ఞానఅమృతాన్ని భోధిస్తుఉండేది.
.
శ్రీ పిచ్చిమాంబ ఉపదేశం...
”గురుచరణాంబుజ నిర్భర భక్త: సంసారా దచిరాద్భవముక్త:
సేంద్రియ మానస నియమాదవం ద్రక్ష్యసి నిజ హృదయస్థం దేవమ్”
అన్నారు శ్రీపిచ్చిమాంబ గారు.. గురుపాద పద్మముల యందు తొణకని బెణకని నిండైన భక్తి కలవాడై సంసారము నుండి విముక్తుడివికా, ఇంద్రియములతో కూడిన మనస్సును నియమించినందువల్లనే హృదయంలో ఉన్న ఆత్మతేజాన్ని చూడగలుగుతావు. పారమార్థిక విషయాల్లో గురుభక్తి లేనివాడు ఎంత కృషి చేసినా నిష్ప్రయోజనమే. దైవం పట్ల గురువు పట్ల నిరతిశయ దృఢభక్తి గలవానికే పరమార్థసిద్ధి కలుగుతుంది. గురువు అనుగ్రహ పాత్రుడైనవాడు సంసార సాగరం నుండి విముక్తి పొందగలడు. పరమార్థ సాధనకు ఇంతకంటే స్పష్టమైన ఉపదేశం ఏముంటుంది.
.
కడప జిల్లా, మైదుకూరులో వెలసిన శ్రీ సదానంద ఆశ్రమానికి ఆధ్యాత్మిక చరిత్రలో విశిష్టమైన స్థానం కలదు. శ్రీశ్రీ పిచ్చిమాంబ ప్రియ శిష్యుల అభ్యర్థన మేరకు మైదుకూరు మండలం పోరుమామిళ్ళ పోవు రహదారి ప్రక్కన శ్రీ సదానంద ఆశ్రమాన్ని స్థాపించి ప్రజల్లో దాత్వక చింత, ఆధ్యత్మిక భావాలను పెంపొందించి ఈ ఆశ్రమంను మరింతగా అభివృద్ధి చెందడానికి విశేష కృషి చేసింది. మద్రాసులోని శ్రీ పోకల శేషాచార్యుల మార్గదర్శకత్వంలో శ్రీ పిచ్చమాంబ తారక యోగిగా మారి బృహద్వాశిష్ట సిద్ధాంతాన్ని ప్రతిపదికగా చేసుకొని ఆ సిద్ధాంత భావనలను విస్తృత ప్రచారం కల్పించేందుకు 1931 జూన్ నెలలో సదానంద ఆశ్రమ ట్రస్టును శ్రీ పిచ్చమాంబ ఏర్పాటు చేశారు. సదానంద ఆశ్రమంలో పూజా మందిరం, భజన మందిరాలను ఏర్పాటుచేసి ఆశ్రమంలో అహర్నిశలూ ఆధ్యాత్మిక, తాత్విక కార్యక్రమాలనూ, ధ్యాన పూజూ కార్యక్రమాలనూ నిర్వహించేవారు.
.
కడప జిల్లాలోని పులివెందుల, చవ్వారి పల్లె, పెద్ద అక్కులవారి పల్లె, సున్నపూరాళ్ళ పల్లె, అనంతపురం జిల్లాలోని తాడిపత్రి, యాడికి మరియు మైదుకూరు ప్రాంతంలోని భూమాయ పల్లె, పెద్దపసువుల, స్వరాయ పల్లె కొత్తపల్లె, శేట్టవారి పల్లె నుండి గురుశిష్య పరంపర శ్రీ సదానంద అశ్రమానికి తరలివచ్చి ఇక్కడ కార్యక్రమాలలో రోజుల తరబడి పాల్గోనేవారు. రాష్ట్రం నలుమూలలనుండి గురు భోధకులు తరలివచ్చి ఆశ్రమంలో శిష్యులకు భోధనలు చేసేవారు. శ్రీ పిచ్చమాంబ స్వయంగా తమ శిష్యులకు, జిజ్ఞాసులకూ భోధనలు చేస్తూ, వారి తాత్విక సందేహాలను తీరుస్తూ ఉండేవారు.
.
శ్రీ పిచ్చమాంబ జ్ఞానామృత భోధన కేవలం ఉపన్యాసాలకు పరిమితం కాలేదు. శ్రీ పిచ్చమాంబ రచించిన శ్రీ ప్రబోధచంద్రోదయం, శ్రీ వీరగురురాజ శతకం, తత్వరామాయణం, తత్వ ప్రబోధిని, అచల శతకం గ్రంధాలనే కాకుండా తాత్విక, శతక, పురాణాలను శ్రీ పిచ్చమాంబ రిచించినారు. శ్రీ వీరగురురాజ శతకం ఆధ్యాత్మిక, విద్యా పరమార్ధాలను గొప్ప వివరణాత్మక గ్రంథంగా పేరుగాంచింది తత్వ రామాయణం అనే గ్రంధాన్ని పోరుమామిళ్ళ మండలంలోని చల్లగిరి గ్రామం లో వెలసిన శ్రీరామచంద్రుని దేవాలయంలో శ్రీ రామ చంద్రుని సన్నిధిలో శ్రీ పిచ్చమాంబ రచించినారు. శ్రీ ప్రబోధ చంద్రోదయం గ్రంథం, శ్రీ కృష్ణుశ్రీయం అనే హిందీ గ్రంధాలన్ని అనువాద గ్రంథంగా శ్రీ పిచ్చమాంబ వెలువరించారు. అలాగే తత్వ ప్రబోధిన లో కందార్థ తత్వాలను శ్రీ పిచ్చమాంబ హలిద్యమైన రీతిలో రూపోందించారు. మానవ దేహ తత్వానికి రామాయణం గాథను అనవయించి రచించిన తత్వరామాయణం తాత్విక సాహిత్యంలో ఒక గొప్ప ప్రయోగంగా శిష్యపరంపరలో శిశేష ప్రాచుర్యాన్ని సంతరించుకున్నది. అంతే కాకుండా శ్రీ పిచ్చమాంబ రచించిన చాల గ్రంధాలు వెలుగోనిరాలేదు. చాల బాధకరానికి గురిచేస్తుంది.
.
శ్రీ పిచ్చమాంబ ఆశ్రమంలో మరో ప్రత్యేకమైన చెక్రాంతి చెట్టు (కొండగోయ్యి) చెట్టు కలదు ఎన్నో ఒౌషద గుణాలు ఉన్నట్టు విజ్ఞాన పూర్వకంగా నిరూపించ బడింది. అంతేకాకుండ దీర్ఘ కాలిక రోగాలు నయమవడంతో పాటు, మరేన్నో వ్యాధులను నయం చేయగల శక్తి ఈ చెట్టుకు కలదు. ఇక్కడ తప్ప మరెక్కడ ఈ చెట్టు కనపడదు.
.
సదానందాశ్రమ నిర్వహణలో శ్రీ పిచ్చమాంబ ఆమే శిష్యులు విశేష సహాకరాన్ని, సేవలను అందించినారు. సదానందశ్రామంలో శ్రీ పిచ్చమాంబ ఆధ్వర్యంలో విశేష కార్యక్రమాలు జరగడం వలన కాలక్రమంలో సదానంద ఆశ్రమానికి బదులుగా శ్రీ పిచ్చమాంబ మఠంగా పేరువచ్చింది. తన ప్రబోధ చంద్రోదయ గ్రంధానికి తాను రాసున్న భరతవాక్యంలోని మన దేశంపట్ల, దేశంలోని ప్రజల సుఖ శాంతులపట్ల అపారమైన ఆకాంక్షను శ్రీ పిచ్చమాంబ వ్యక్తంచేశారు. శ్రీ పిచ్చమాంబ మఠంలో అందమైన పూలతోట, పండ్లతోట, మంచినీటి బావి ఉండేవి. 1957 హేవిళంబి నామ సంవత్సరం చైత్రమాసం బహుళ ద్వాదశి శుక్రవారం నాడు శ్రీ పిచ్చమాంబ బ్రహ్మాండయిక్యం అయినారు.
.
భారతవని పరమపారకమైనది. మహామహులైన మహాతత్వవేత్తలు నడయాడిన పుణ్యభూమి. మూర్తిభవించిన మాతృతత్వం మన్నుగా రూపుదాల్చి కొంగుపరిచి తనబిడ్డలకు నివాస క్షేత్రంగా ఏర్పరచిన ఆధారం. జీవితానికీ జీవనానికీ, జాతిమనుగడకూ మూలాధారమైన ఏకైక ఆలంబనం. అదే పుడమితల్లి భారతమాత! భారతభూమి! పరమపావనమైన భారతీయ సంసృతికీ, దైవీభావనలనూ అణువణువునా జీర్ణింపచేసిన మహర్షులు నడచిననేల!భారతదేశం పుణ్యభూమిగా, పేదభూమిగా, ప్రపంచ దేశాలలో తనకంటూ విశిష్టస్థానాన్నీ, విలక్షణ వారసత్వాన్నీ సంతరించుకున్న భారతదేశంలో ఎందరో సాధుపుంగవులు, సాధ్వీమాతాలు, సిద్దులు, అవధూతలు, అవతరించి, భారతదేశంలో ఆధ్యాత్మిక జ్ఞానామృతానికి తమ భోధనలనూ, రచనలనూ అందించినారు శ్రీ పిచ్చమాంబ అలాంటి మహానీయుల కోవకు చెందిన అమృత మూర్తిగా చరిత్రకు ఎక్కినారు. తెలియని వారికి జ్ఞాని, తెలిసిన వారికి అవ ధూత, భక్తుకు క్పవల్లి, ఆర్తుకు వరదాయిని, జిజ్ఞాసువుకు మహిమ పుట్ట, మహాయోగి శ్రీ పిచ్చమాంబ గారు.
గురు సాంప్రదాయంలో ఉన్నవారంతా తమతమ గురువుల్ని దర్శించి సేవించేరోజున గురువు యొక్క గత కీర్తిని చాటినట్లు అవుతుంది.
అపార కారుణ్య సుధాతరంగై:
అపాంగ పాతైరవలోకయంతమ్
కఠోర సంసార నిధాఘతప్తాన్
మునీనహం నేమి గురుం గురూణామ్..
తస్మై: శ్రీ గురవే నమ:
.........
సేకరణ…
రచన...
మీ..
ఆర్.బి. వెంకటరెడ్డి
భారతీయ సనాతన హిందూ ధర్మ సంరక్షణ సమితి
reddemb@gmail.com
https://www.facebook.com/rb.venkatareddy
* ఓం శివోహం ... రుద్రరూపం భజేహం ... * శివునికి అర్చన ఎలా చేస్తే ఏమి జరుగుతుంది…? * శివలింగార్చన సర్వ పాపాలను హరిస్తుంది...
జన్మజ దుఃఖ వినాశక లింగం
తత్ర్పణమామి సదాశివలింగం..
.
అంటూ..ఆ శివుని స్మరిస్తే సర్వపాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. శివుడు నిరాకారుడు. భోళా శంకరుడు. కోరిన కోరికలు తీర్చేవాడు. ఆదుకో శివయ్యా..అని శరణు వేడుకోగానే భక్తులను రక్షించేవాడు.శివుడు హిందువులు పూజించే దేవుళ్లలో ప్రథముడు. ఆయన పశుపతిగాను, లింగరూపములోననూ సింధు నాగరితక కాలం నుంచే పూజలందుకొంటున్నాడు. శివుడు అనార్యదేవుడు. కాని తర్వాత వైదిక మతంలో లయకారునిగా స్థానం సంపాదించుకున్నాడు. నేటికి దేశమంతా శివాలయాలే అధిక సంఖ్యలో ఉన్నాయి.
.
విశ్వమహారూపం శివం, భూకక్ష్య ఎలా ఉంటుందో విశ్వరహస్య మూలాలు ఎలా మొదలయ్యాయో ఆ లయకారక రూపమైన శివలింగం లోనే ఉన్నాయని చెప్తారు పెద్దలు. నిజానికి శివలింగ రూపం అటు స్పేస్ సైన్స్ నీ, ఇటు తాత్విక విశయాలనీ ఒకే విధంగా తనలో ఇముడ్చ్గుకున్న అద్బుత ఆకారం. విశ్వం లో ఆకర్షణ, వికర్షణ బలాల ని వివరించే విధంగా అండాకారం లో శివలింగం ఉంటుంది. నిరాకారాన్ని చెబుతూనే తనే ఆకారమంటూ చెప్పే శివతత్వం ఒక మహాద్బుత మోక్ష మార్గం.
.
అయితే ప్రతీ దైవాన్ని పూజించటానికి భిన్న పద్దతులున్నాయి. ఆకలేస్తుందనీ, నీళ్ళు కావాలనీ, కడుపులో నొప్పిగా ఉందనీ చెప్పటానికి అమ్మకైనా ఒకే సైగతో ఎలా అయితే చెప్పలేమో అదే విధంగా దేవుడికీ అంతే ఒక్కో కోరికకీ ఒక్కో రకమైన ఆరాధనా పద్దతి ఉంది మరి.. అదేమిటో తెలుసుకోండి….
.
శివార్చన ఎలా చేస్తే ఏమి జరుగుతుంది…?
.
శివలింగార్చన సర్వ పాపాలను హరిస్తుంది. శివలింగాన్ని వజ్రం నుంచి మట్టి వరకు అనేక అనేక పదార్థాలతో తయారుచేసుకుని పూజించవచ్చు. స్టీలు, ఇనుముతో మాత్రం చేయకూడదని పండితులు చెబుతారు. లింగం చేసిన పదార్థాన్ని బట్టి వచ్చే ఫలితాలు కూడా అద్భుతంగా ఉంటాయి.
.
* వజ్రంతో చేసిన శివలింగానికి పూజ చేస్తే ఆయువు వృద్ధి చెందుతుంది.
నీటిపైనే కొలువు దీరిన స్వామి వారిని దర్శించుకోవాలంటే, నడుము లోతు నీటి ధారలో నడుస్తూ, తడుస్తూ సొరంగ మార్గంలో చాల దూరం ప్రయాణించేస్తేగాని చూడలేము.
విడియోని చూడండి.. https://www.youtube.com/watch?v=XHDAAbN9aQE
ఎనిమిది వందల ఏళ్లనాటి పురాతన మహిమానిత క్షేత్రం.
సలేశ్వరం
కుమారస్వామికి శివపార్వతులిచ్చిన సుందర మహిత పుణ్య క్షేత్రం.
"శ్రీ బాల రెడ్డెమ్మ తల్లి" పుణ్య క్షేత్రం.
పార్వతిదేవి చౌడేశ్వరి మాతగా పూజలందుకుంటున్న పుణ్యక్షేత్రం.
* అన్నదానికి సంకేతమా అన్నట్లు అమ్మవారి ఒక చేతిలో ఖడ్గం, మరొక చేతిలో కుంకుమ భరణె కలిగి వుంటాయి...
.
ఈ సృష్టికి మూలం శక్తి. ప్రథమ వేదమైన ఋగ్వేదంలో శక్తి సర్వమహాశక్తుల సమాహారమూర్తిగా అభివర్ణించబడింది. ఆ శక్తిని ఎవరు ఆరాధించినా స్ర్తిమూర్తిగానే ఆరాధిస్తారు. దీనినే ఈ శక్త్యారాధన శాక్తాయంగా చెప్పబడింది. జగదాంబగా పేరుపొందిన ఆదిపరాశక్తి పలు నామాలతో పూజలందుకుంటూ వుంది. ఆ పేర్లలో చాముండి, చాముండేశ్వరి, చౌడేశ్వరి పేర్లు లోకప్రసిద్ధి పొందాయి. పార్వతిమాత చౌడేశ్వరి మాతగా పూజలందుకుంటున్న పుణ్యక్షేత్రం ‘నందవరం’. రాజుల, నవాబుల ఏలుబడిలో ఒకప్పుడు ఉన్న ఈ దివ్యక్షేత్రంలోని చౌడేశ్వరి మాత ఆలయం అతి పురాతనమైన ఆలయంగా ప్రసిద్ధిగాంచింది. చారిత్రక, మరియు పౌరాణిక విశేషాలతో పుణికిపుచ్చుకున్న ఈ ఆలయంలో కొలువుదీరిన చౌడేశ్వరీమాత దర్శనం సర్వపాప హరణంగా, సర్వఐశ్వర్య ప్రదాయకంగా భక్తులు భావిస్తారు. కాశీ పుణ్యక్షేత్రంలో జ్యోతి స్వరూపంగా భాసించే కాశీ విశాలాక్షియే ఒకానొక సందర్భంలో ఆంధ్ర దేశానికి జ్యోతి స్వరూపంగా తరలివచ్చి నందవర పుణ్యక్షేత్రంలో సువర్ణ రూపంలో స్వయంభువుగా వెలిసిందని ఇక్కడి స్థల పురాణాల ద్వారా అవగతమవుతోంది.
.
భక్తుల మనసులో పిరికితనాన్ని పోగొట్టి ధైర్య సాహసాలిచ్చే వీర చౌడేశ్వరీదేవి విన్నారా? తనను కొలిచే కొందరు బ్రాహ్మణుల కోసం సాక్ష్యం చెప్పటానికి ఈ దేవి కాశీనుంచి సొరంగమార్గాన కదిలివచ్చి ఇక్కడ కొలువైనదంటారు. ఆ ప్రదేశమే కర్నూలు జిల్లాలోని నందవరం. ఈ ఊరు కర్నూలు జిల్లాలోని నంద్యాల పట్టణానికి 20 కి.మీ. ల దూరంలో, పాణ్యం – బనగానపల్లె రోడ్డులో వున్నది. అతి పురాతనమైన ఈ ఆలయం నిర్మాణకాలం తెలియదని కొందరంటే 4 వేల సంవత్సరాల క్రితం నిర్మింపబడిందని కొందరంటారు. సమయం ఎప్పుడైనా, ఈ దేవి కాశీనుంచి సాక్ష్యం చెప్పటానికి వచ్చి ఇక్కడ వెలసిందని అందరూ అంటారు. ఆ కధేమిటంటే….
.
పూర్వం చంద్రవంశీయ రాజైన నంద భూపాలుడు ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తూవుండేవాడు. ఆయన పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో వుండేవాళ్ళు. నందభూపాలుడికి దైవభక్తి కూడా మెండు. ఆయన భక్తికి మెచ్చిన శ్రీ దత్తాత్రేయస్వామి రోజూ కాశీవెళ్ళి గంగలో స్నానం చెయ్యాలనే ఆయన కోర్కెను తీర్చటానికి పావుకోళ్ళను ప్రసాదించాడు. అయితే ఆ విషయం ఎవరికీ చెప్పకుండా రహస్యంగా వుంచమంటాడు. ఆ రాజు, రోజూ తెల్లవారుఝామునే ఆ పావుకోళ్ళు ధరించి మనోవేగంతో కాశీచేరి గంగలో స్నానమాచరించి, విశ్వనాధుణ్ణి, విశాలాక్షిని, అన్నపూర్ణని దర్శించి తిరిగి తెల్లవారేసరికి తన రాజ్యం చేరుకునేవాడు.
.
కొంతకాలం ఇలా గడిచాక, నందభూపాలుడి భార్య శశిరేఖ తన భర్త రోజూ తెల్లవారుఝామునే ఎక్కడికో వెళ్ళివస్తూండటం గమనించి భర్తను అడుగుతుంది. తప్పనిసరి పరిస్ధితుల్లో శశిరేఖకు విషయం చెప్తాడు నందభూపాలుడు. ఆవిడ తనని కూడా కాశీ తీసుకువెళ్ళమని కోరుతుంది. ఆవిడ మాట కాదనలేక రాజు ఆ రోజు ఆవిడనికూడా కాశీ తీసుకువెళ్తాడు. తిరిగివచ్చు సమయానికి పావుకోళ్ళు పనిచేయవు. కారణం రాణీ శశిరేఖ బహిష్టుకావటం. తన రాజ్యానికి సత్వరం చేరకపోతే రాజ్యం అల్లకల్లోలమవుతుందనే భయంతో దిక్కుతోచని రాజు ఆ సమీపంలోనేవున్న ఆలయందగ్గరవున్న బ్రాహ్మణులనుచూసి వారిని తరుణోపాయం చూపించమని వేడుకుంటాడు.
.
అందులో ఋగ్వేద పండితుడయిన ఒక బ్రాహ్మణుడు రాజుకి సహాయంచెయ్యటానికి సంసిధ్ధతను తెలియజేస్తాడు. ఆయన తనతోటి వారిని ఇంకో 500 మంది పండితులనుకలుపుకుని, దోషనివారణార్ధం జపతపాలుచేసి, తమ తపోశక్తి వారికి ధారపోసి వారిని వారి రాజ్యానికి చేరుస్తారు. ప్రత్యుపకారంగా రాజు వారికేసహాయంకావాల్సివచ్చినా తప్పక చేస్తానని, వారు నిస్సంకోచంగా కోరవచ్చునని అనగా, ఆ బ్రాహ్మణులు భవిష్యత్ లో అవసరమైనప్పుడు తప్పక కోరుతామంటారు. రాజూ, రాణీ తమ రాజ్యానికి చేరుకున్నారు. ఆ పాదుకలను, మంత్ర శక్తిని తిరిగి వాడకుండా దత్తాత్రేయ మందిరంలో వుంచి, తమ రాజ్యంలో సుఖంగా వుండసాగారు.
.
కొంతకాలం తర్వాత కాశీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కరువురాగా, నందభూపాలుని సహాయమర్ధించటానికి ఆ బ్రాహ్మణులలో కొందరు బయల్దేరుతారు. వారు నందవరంచేరి, రాజసభకువచ్చి తమరాకకి కారణం చెబుతారు. రాజుకి అంతా తెలిసినా, తన తోటివారికి తెలియదుకనుక, వారికికూడా తెలియజేసే ఉద్దేశ్యంతో తానిచ్చిన వాగ్దానానికి ఋజువేమిటని అడుగుతాడు. బ్రాహ్మణులు రాజు వాగ్దానము చేసింది నిత్యం తాము కొలిచే చాముండేశ్వరీదేవి గుడి ముందు, ఆవిడ తప్ప వేరే సాక్ష్యంలేదనీ, ఆవిడనే నమ్ముకున్న తాము సాక్ష్యమిమ్మని ఆవిడని బతిమాలుతామంటారు. రాజు ఆ దేవదేవి తన రాజ్యానికి వస్తుందని లోలోన సంతోషించి అంగీకరిస్తాడు.
.
వచ్చిన బ్రాహ్మణులలో కొందరు తిరిగి కాశీ వెళ్ళి తమ ఇష్టదైవం చాముండేశ్వరీదేవిని పరిపరివిధాల ప్రార్ధించి, సాక్ష్యం చెప్పటానికి రావలసినదిగా కోరుతారు. ఆ దేవి అలాగే వస్తానని, వారిని ముందు బయల్దేరమని, తేజోరూపంలో తను వారి వెనుకనే వస్తానని, అయితే దోవలో ఎక్కడా వెనుదిరిగి చూడవద్దని చెబుతుంది. మునుపు రాజుకి సహాయంచేసిన మిగతా 500మంది బ్రాహ్మణులనికూడా నందవరం రమ్మని చెబుతుంది. అందరూ సొరంగ మార్గాన నందవరానికి బయల్దేరుతారు. నందవరం చేరుతుండగా అందులో ఒక బ్రాహ్మణునికి అనుమానం వస్తుంది. తమ వెనుక ఏమీ అలికిడి కావటంలేదు, అమ్మవారు తమతో వస్తోందో రావటంలేదోనని సందేహంతో వెనుదిరిగి చూస్తాడు. అక్కడదాకా వచ్చిన అమ్మవారు వెంటనే శిలారూపందాలుస్తుంది. చింతిల్లితున్న బ్రాహ్మణులతో ఆమె చౌడేశ్వరీదేవిగా తానక్కడే కొలువైవుండి భక్తులను సంరక్షిస్తూ వుంటానని తెలుపుతుంది.
.
నందభూపాలుడు కాశీనుంచి వచ్చిన ఆ దేవత తమ రాజ్యంలో వెలిసినదని సంతోషంతో గుడి కట్టించి, పూజలుసల్పసాగాడు. అమ్మవారితో కాశీనుంచి కదిలివచ్చిన 500మంది బ్రాహ్మణులు, అమ్మవారి ఆజ్ఞమేరకు అక్కడే వుండి తమ కులదైవమైన ఆ దేవిని పూజించుకోసాగారు. ఆ బ్రాహ్మణ కుటుంబాలను నందవరీకులంటారు. వారు ఇప్పటికీ చౌడేశ్వరీదేవిని తమ కులదేవతగా పూజిస్తారు. ఆ కుటుంబీకులు గర్భగుడిలోకెళ్ళి స్వయంగా దేవిని పూజించుకోవచ్చు. కాశీనుంచి బ్రాహ్మణులు, అమ్మవారు వచ్చిన సొరంగమార్గం ఇంకా వుందంటారు. కానీ అందులోకి ప్రవేశం లేదు. నందవరీక బ్రాహ్మణులకేకాక తొగట వీర క్షత్రియలకుకూడా చౌడేశ్వరీదేవి కులదేవత.
.
అమ్మవారు ముందు చాలా ఉగ్రరూపంలో వుండేది. ఆ రూపాన్ని ప్రజలు చూడలేకపోయేవారు. భక్తుల సౌకర్యార్ధం, వారా తల్లి ఉగ్రరూపంచూడలేరని ఆ దేవి విగ్రహంలాంటిదే ఇంకొకటి తయారుచేయించి ప్రతిష్టించారు. అయితే ఈ విగ్రహం అసలు విగ్రహమంత భయంకరంగా వుండదు. అసలు విగ్రహం ఇప్పుడు అమ్మవారువున్న స్ధానానికి సరిగ్గా దిగువ భూగర్భంలో వున్నది. అక్కడికి వెళ్ళే మార్గం వున్నదికానీ ఎవరికీ ప్రవేశంలేదు.
.
ఆలయం ముందు సొరంగ మార్గం వున్నది. పది మెట్లు దిగి వెళ్తే అక్కడ అమ్మవారి పాదాలు వున్నాయి. ఆ మార్గంనుంచే అమ్మవారు, మిగతా బ్రాహ్మణులు, కాశీనుంచి ఇక్కడికి వచ్చారంటారు.
.
అమ్మవారు వీర చౌడేశ్వరీదేవి. వీరత్వానికి తగ్గట్లే రూపం వుంటుంది. ఈ తల్లిని సేవించినవారికి అన్నిరకాల భయాందోళనలు దూరమయి ధైర్యసాహసాలతో విలసిల్లుతారని ప్రతీతి. ధైర్యసాహసాలకు ప్రతీకగా నిలచిన ఆ దేవి తోజోవంతమైన రూపం చూసినవారి మనసులోని అన్ని భయాందోళనలూ పటాపంచలవుతాయి. ధైర్యసాహసాలేకాదు సకల సౌభాగ్యాలూ ప్రసాదించే తల్లి అన్నదానికి సంకేతమా అన్నట్లు అమ్మవారి ఒక చేతిలో ఖడ్గం, మరొక చేతిలో కుంకుమ భరణె వుంటాయి.
.
ఆలయం ప్రక్కనే ఒక చెట్టు వున్నది. విశాలంగా విస్తరించిన ఈ వృక్షం ఆకులు మన గోరింట చెట్టు ఆకులులాగా ఇంకా చిన్నగా వుంటాయి. చిన్న చిన్న తెల్ల పూలతో ఆకర్షణీయంగా వుండే ఈ చెట్టు కరివె. ఈ వృక్షం కూడా అమ్మవారితోబాటు కాశీనుంచి తరలివచ్చిందని భక్తుల విశ్వాసం. అందుకే అచంచల భక్తితో భక్తులు ఈ వృక్షనికి కూడా పూజలు చేస్తారు.
.
అమ్మవారిముందు శ్రీ చక్రం వున్నది. భక్తులు అక్కడ కుంకుమ పూజ చేయవచ్చు.
తెలుగువారి ప్రత్యేకమైన శ్రీవికారి నామ సంవత్సర ఉగాది పండగ..
ఉగాది, తెలుగువారు జరుపుకునే పండుగ లలో ముఖ్యమయినది. ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. ఉగాది రోజున కొత్తగా పనులు ప్రారంభించుట పరిపాటి. ఉదయాన లేచి తలంటి స్నానం చేసి, కొత్త బట్టలు ధరించి, ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు. దేవాలయములకు వెళ్ళి పూజలు చేయిస్తారు. కొత్త సంవత్సరంలో రాశిఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలసుకొని గ్రహశాంతుల వంటివి జరిపించుకొని సుఖంగా ఉండటానికి పంచాగశ్రవణాన్ని చేస్తారు.
ఈ పండుగ ఒక్క తెలుగు సాంప్రదాయంలోనే కాక మరాఠీలు గుడి పడ్వాగా నూ, తమిళులు పుత్తాండు అనే పేరుతో, మలయాళీలు విషు అనే పేరుతోను, సిక్కులు వైశాఖీ గానూ, బెంగాలీలు పొయ్‌లా బైశాఖ్ గానూ జరుపుకుంటారు.
"ఉగాది" అన్న తెలుగు మాట "యుగాది" అన్న సంస్కృతపద వికృతి రూపం. బ్రహ్మ దేముడు ఒక కల్పం ప్రళయంతో అంతమై తిరిగి కొత్త బ్రహ్మ కల్పంలో సృష్టిని ఆరంబించిన రోజు. దీనికి ఆధారం వేదాలను అధారం చేసుకొని వ్రాయబడిన "సూర్య సిద్ధాంతం" అనే ఖగోళ జ్యోతిష గ్రంథంలోని శ్లోకం
"'చైత్రమాసి జగద్బ్రహ్మ సపర్ణ పధమే అహని,
వత్సరాదౌ వసంతాదౌ రసరాద్యే తధై వచ'"
అనగా బ్రహ్మ కల్పం ఆరంభమయే మొదటి యుగాది అంటే మొదటి సంవత్సరం (ప్రభవ) లో మొదటి ఋతువు వసంత ఋతువు లో మొదటి మాసం ( చైత్ర మాసం) లో మొదటి తిథి అయిన పాడ్యమి నాడు, మొదటి రోజైన ఆదివారం నాడు యావత్తు సృష్టిని ప్రభవింపజేసాడని అర్ధం. అందుకే మొదటి సంవత్సరానికి "ప్రభవ" అని పేరు. చివరి అరవైయ్యొవ సంవత్సరం పేరు "క్షయ" అనగా నాశనం అని అర్ధం. కల్పాంతం లో సృష్టి నాశనమయ్యేది కూడ "క్షయ" సంవత్సరంలోనే. అందుచేతనే చైత్రమాసం లో శుక్లపక్షం లో సూర్యోదయ సమయానికి పాడ్యమి తిథి ఉన్న రోజును యుగాది అదే ఉగాదిగా నిర్ణయించబడింది.
చైత్ర శుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మ సృష్టిని నిర్మించడం ప్రారంభించాడని నమ్ముతారు. మత్స్యావతారము ధరించిన విష్ణువు సోమకుని సంహరించి వేదాలను బ్రహ్మకప్పగించిన సందర్భంగా 'ఉగాది' ఆచరణలోకి వచ్చెనని పురాణప్రతీతి. బ్రహ్మదేవుడు ఈ జగత్తును చైత్ర మాస శుక్లపక్ష ప్రథమ దినాన సూర్యోదయ వేళ సమగ్రంగా సృష్టించాడంటారు. అంటే కాలగణనాన్ని గ్రహ, నక్షత్ర, ఋతు, మాస, వర్ష, వర్షాధికులను బ్రహ్మదేవుడు ఈనాడు ప్రవర్తింప చేసాడన్నది పెద్దల భావన. అంతే కాదు వసంత ఋతువు కూడా అప్పుడే మొదలవుతుంది. అందుకే కొత్త జీవితానికి నాందికి గుర్తుగా ఉగాది పండుగను జరుపుకుంటారు. శాలివాహనుడు పట్టాభిషిక్తుడైన దినం కారణంగా ఈ పండుగ ప్రాశస్త్యంలోకి వచ్చిందని మరొక గాధ.
"ఉగాది", మరియు "యుగాది" అనే రెండు పదాలు వాడుకలో ఉన్నాయి. "ఉగ" అనగా నక్షత్ర గమనం. నక్షత్రగమనానికి 'ఆది' 'ఉగాది'.అంటే సృష్టి ఆరంభమైనదినమే "ఉగాది". 'యుగము' అనగా ద్వయము లేక జంట అని కూడా అర్ధము. ఉత్తరాయణ, దక్షిణాయనములనబడే అయన ద్వయ సంయుతం 'యుగం' (సంవత్సరం) కాగా, ఆ యుగానికి ఆది (సంవత్సరాది) యుగాది అయింది. యుగాది శబ్దానికి ప్రతిరూపమైన ఉగాదిగా వ్యవహృతమైనది. "తత్రచైత్రశుక్ల ప్రతిపదిసంవత్సరారంభ:" - చైత్రశుద్ధ పాడ్యమి నాడు సంవత్సరాది 'ఉగాది'గా ఆచరణీయమని నిర్ణయసింధుకారుడు పేర్కొనియున్నాడు.
ప్రతి సంవత్సరం చైత్రమాసంలో శుక్లపక్షంలో పాడ్యమి తిథినాడు ఈ ఉగాది పండుగను జరుపుకుంటారు. నిర్ణయ సింధు, ధర్మ సింధులలో దీనికి సంబంధించిన ప్రమాణాలు కనిపిస్తున్నాయి. ఉగాదిరోజు
తైలాభ్యంగనం
నూతన సంవత్సరాది స్తోత్రం
నింబకుసుమ భక్షణం (ఉగాది పచ్చడి సేవనం)
ధ్వజారోహణం (పూర్ణకుంభదానం)
పంచాంగ శ్రవణం
మున్నగు 'పంచకృత్య నిర్వహణ' గావించవలెనని వ్రతగ్రంథ నిర్దేశితం. మామిడాకుల తోరణాలు కట్టడం, తలస్నానం చెయ్యడం, కొత్తబట్టలు ధరించడం, పిండి వంటలు చేయడం పూర్వం నుంచీ వస్తున్న ఆచారం. ఆదాయ వ్యయాలు, రాజ పూజ్య అవమానాలు, కందాయ ఫలాలు, రాశి ఫలాలు తెలియజెప్పే పంచాంగం వినటం ఆనవాయితి. పల్లెల్లో రైతులు ఉగాది రోజున అక్కడి దేవాలయం వద్ద అంతా చేరి, పురోహితుడిని రప్పించి, తమ వ్యవసాయానికి ఏ కార్తెలో వర్షం పడుతుంది? గ్రహణాలు ఏమైనా ఉన్నాయా? ఏరువాక ఎప్పుడు సాగాలి? వంటివన్నీ అడిగి తెలుసుకుంటారు. మనకు తెలుగు సంవత్సరాలు 'ప్రభవ'తో మొదలుపెట్టి 'అక్షయ'నామ సంవత్సరము వరకు గల 60సంవత్సరములలో మానవులు తాము జన్మించిన నామ సంవత్సరాన్ని వారి జన్మాంతర సుకృతాలనుబట్టి జీవితంలో ఒక్కసారో, రెండుసార్లో చూస్తూంటారు! అందువల్లనే వారు జన్మించిన 60 సంవత్సరములకు తిరిగి ఆ నామ సంవత్సరం వచ్చినపుడు, అది ఒక పర్వదినంగా భావించి 'షష్టిపూర్తి' ఉత్సవాన్ని వైభవంగా చేసుకుంటూ ఉంటారు.
అన్ని పండుగలలాగానే ఉగాది పండుగనాడు ఉదయానే తలస్నానం చేసి క్రొత్త బట్టలు ధరించి పూజ చేసుకొంటారు. అయితే ప్రత్యేకంగా ఫలాని దేవుడి పూజ అని ఏమీ చెప్పబడలేదు గనుక ఈ రోజు ఇష్ట దేవతాపూజ చేసుకొంటారు. ఆ తర్వాత ఏమీ తినకముందే ఉగాది పచ్చడిని తింటారు.
"ఉగాది పచ్చడి" ఈ పండుగకు మాత్రమే ప్రత్యేకమైన ఒక తినే పదార్ధం.షడ్రుచుల సమ్మేళనం - తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తింటారు. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి ఇస్తుంది. ఈ పచ్చడి కొరకు చెరకు, అరటి పళ్ళు, మామిడి కాయలు, వేప పువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం మొదలగునవి వాడుతుంటారు.
ఉగాది పచ్చడికి మనశాస్త్రాలలో "నింబ కుసుమ భక్షణం" మరియు "అశోకకళికా ప్రాశనం " అని వ్యవహరించే వారు. ఋతు మార్పు కారణంగా వచ్చే వాత, కఫ, పిత్త దోషాలను హరించే ఔషధంగా ఉగాది పచ్చడి తినే ఆచారం ఆరంభమైంది అంటారు. ఉగాది పచ్చడిని శాస్త్రీయంగా తయారు చేసే పద్దతిలో ఉప్పు, వేపపువ్వు, చింతపండు, బెల్లం, పచ్చిమిరప కాయలు, మామిడి చిగుళ్ళు మరియు అశోక చిగుళ్ళు వేసి చేసేవాళ్ళు. ఈ పచ్చడిని శ్రీరామ నవమి వరకు తినాలని శాస్త్రాలు చెబుతున్నాయి.
త్వామష్ఠ శోక నరాభీష్ట
మధుమాస సముద్భవ
నిబామి శోక సంతప్తాం
మమ శోకం సదా కురు
ఈ మంత్రం చదువుతూ ఉగాది పచ్చడి తినాలని శాస్త్రాలు చెప్తున్నాయి. ఉగాది పచ్చడి ఆహారంలో ఉండే ఔషధ గుణాన్ని, వృక్షసంరక్షణ అవసరాన్ని, ఆయుర్వేదానికి ఆహారానికి గల సంబంధాన్ని చెప్పడమే కాక పండుగలకు, ఆచారాలకు, సముచిత ఆహారానికి గల సంబంధాన్ని చాటిచెప్తుంది.
ఉగాది రోజున తినే పచ్చడిలో కొత్త చింతపండు, లేత మామిడి చిగుళ్ళు, అశోక వృక్షం చిగుళ్ళు, కొత్తబెల్లం, వేపపూత, మామిడి కాయముక్కలు, చెరుకు ముక్కలు, జీలకర్రలాంటివి ఉపయోగించాలి. ఈ పచ్చడి శారీరక ఆరోగ్యానికి కూడా ఎంతో శ్రేష్ఠమని ఆయుర్వేదశాస్త్రం పేర్కొంటోంది. ఈ పచ్చడిని ఖాళీ పొట్టతో తీసుకున్నప్పుడు ఆరోగ్యానికి మంచిదంటారు. వేపపూత పచ్చడికి శాస్త్రంలో నింబకుసుమ భక్షణం అని పేరుంది. సంవత్సరమంతా అనారోగ్యం లేకుండా హాయిగా ఉండేందుకు ఈ పచ్చడి ఉపకరిస్తుందని వైద్యులు చెప్పేమాట అయితే ఒక్కపూట తింటేనే అంతఫలితం వస్తుందా అని కొందరంటారు. కానీ ఈ వేపపూత పచ్చడిని సేవించటం చైత్రశుక్ల పాడ్యమి నుండి పూర్ణిమ వరకు కానీ లేదా కనీసం ఉగాది పండుగ నుండి తొమ్మిది రోజుల పాటైనా వసంత నవరాత్రుల వరకూ అయినా సేవించాలి. అలా సేవిస్తే వాత, పిత్త, శ్లేష్మాలవల్ల ఏర్పడే దోషాలు హరిస్తాయి. కాలక్రమంలో ఉగాది పచ్చడిలో లేత మామిడి చిగుళ్ళు అనేక చిగుళ్లు, ఇలాంటివన్నీ మానేసి కేవలం వేపపూత, బెల్లం ముక్కలను మాత్రమే ఉపయోగించటం కనిపిస్తుంది. పూర్వం లేతవేప చిగుళ్ళు ఇంగువ పొంగించి బెల్లం, సైంధవల వణం కలిపి కొద్దిగా నూరి చింతపండు, తాటిబెల్లంకానీ, పటికబెల్లంకానీ, వాము, జీలకర్ర మంచిపసుపు కలిపి నూరేవారు. ఈ మిశ్రమాన్ని అరతులం వంతున ప్రతిరోజు ఖాళీ కడుపుతో ఉగాది నుండి తొమ్మిది రోజులుకానీ, పదిహేను రోజులుకానీ వీలును బట్టి సేవించేవారు. ఈ పద్ధతంతా చాలామంది మరచిపోయారు. ఉగాది పచ్చడితిన్న తరువాత శాస్త్ర విధిగా ఉగాది పండుగను జరుపుకునేవారు పూర్ణకుంభ లేక ధర్మ కుంభ దానాన్ని చేస్తుంటారు. ఈ ధర్మ కుంభ దానంవల్ల సంవత్సరం మంతా కోరిన కోరికలు తీరుతాయన్నది నమ్మకం.
ఉగాది భావాన్ని తెలిపేది ఉగాది పచ్చడి. షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలకు ప్రతీక. జీవితం అన్ని అనుభవములు కలిగినదైతేనే అర్ధవంతం అని చెప్పే భావం ఇమిడి ఉంది. పచ్చడిలో ఉండే ఒక్కొక్క పదార్ధం ఒక్కొక భావానికి, అనుభవానికి ప్రతీక -
బెల్లం - తీపి - ఆనందానికి సంకేతం
ఉప్పు - జీవితంలో ఉత్సాహమ, రుచికి సంకేతం
వేప పువ్వు – చేదు -బాధకలిగించే అనుభవాలు
చింతపండు - పులుపు - నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులు
పచ్చి మామిడి ముక్కలు - వగరు - కొత్త సవాళ్లు
మిరపపొడి – కారం - సహనం కోల్పోయేట్టు చేసే పరిస్థితులు.
https://www.facebook.com/rb.venkatareddy
శ్రీ వికారి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
* ఉగాది వెనుక అసలు కథ ఏమిటి...?
* ఉగాది పచ్చడిని తింటూ పఠించాల్సిన శ్లోకం...?
* ఉగాది రోజున పంచాంగం ఎందుకు వినాలి...?
* ఉగాదిపచ్చడి ప్రాముఖ్యత ...
.
.
వసంత ఋతువు వచ్చేసింది. చెట్లు కొత్త సోయగాలతో ప్రకృతిని హరితవర్ణం చేస్తాయి. కోయిలలు కుహు... కుహు రాగాలు పాడుతుంటాయి. ఇటువంటి వసంత ఋతువు ప్రారంభమయ్యేది చైత్ర శుద్ధ పాడ్యమి నాడు. ఆ రోజున అశ్వినీ నక్షత్రం ఉంటుంది.
.
మాసాల్లో చైత్రం, తిథుల్లో పాడ్యమి, నక్షత్రాల్లో అశ్విని మొదటిది. అంటే ఉగాది ...కాలచక్రం ఒక ఆవృతం పూర్తిచేసి మళ్లీ మొదలయ్యే రోజన్నమాట. అందుకే, ఇది కాలానికి సంబంధించిన అతిముఖ్యమైన పండుగ తెలుగువారు జరుపుకునే పండుగ లలో ముఖ్యమయినది. ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. తెలుగు వారు నూతన సంవత్సరం జరుపుకుంటారు. ఉగాది రోజున క్రొత్తగా పనులు ప్రారంభించుట పరిపాటి.
.
ఉగాది అంటే తెలుగు నూతన సంవత్సరంగా మాత్రమే తెలిసిన నేటి తరానికి ఆ పండుగ వెనుక ఉన్న అసలు కథను తెలుసుకోవలసిన అవసరం ఎంతో ఉంది. హిందూ పురాణాల ప్రకారం చైత్ర శుద్ధ పాడ్యమి రోజు బ్రహ్మ సృష్టిని నిర్మించడం ప్రారంభించాడు. అలాగే మత్స్య అవతారం ధరించిన విష్ణువు వేదాలను తస్కరించిన సోమకుడు అనే రాక్షసుడిని సంహరించి వేదాలను తిరిగి బ్రహ్మకు అప్పగించిన సందర్భంగా 'ఉగాది' ఆచరణలోకి వచ్చింది అని కూడా అంటారు. అన్ని ఋతువుల్లో ఎంతో ఆహ్లాదకరమైన వసంత ఋతువు మొదలయ్యే రోజు కనుక, కొత్త జీవితం నాందికి గుర్తుగా ఉగాది పండుగను చేసుకుంటారు.
ఉగాదినే కొన్ని ప్రాంతాల్లో యుగాది అని కూడా అంటారు. కొందరు తెలుగువారే యుగ+ఆది (అంటే యుగం యొక్క ప్రారంభం) అని దాన్నే యుగాది లేదా ఉగాది అని అంటారు.
.
చైత్ర శుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మ సృష్టిని నిర్మించడం ప్రారంభించాడని నమ్ముతారు. మత్స్యావతారము ధరించిన విష్ణువు సోమకుని సంహరించి వేదాలను బ్రహ్మకప్పగించిన సందర్భంగా 'ఉగాది' ఆచరణలోకి వచ్చెనని పురాణప్రతీతి. బ్రహ్మదేవుడు ఈ జగత్తును చైత్ర మాస శుక్లపక్ష ప్రథమ దినాన సూర్యోదయ వేళ సమగ్రంగా సృష్టించాడంటారు. అంటే కాలగణనాన్ని గ్రహ, నక్షత్ర, ఋతు, మాస, వర్ష, వర్షాధికులను బ్రహ్మదేవుడు ఈనాడు ప్రవర్తింప చేసాడన్నది పెద్దల భావన. అంతే కాదు వసంత ఋతువు కూడా అప్పుడే మొదలవుతుంది. అందుకే కొత్త జీవితానికి నాందికి గుర్తుగా ఉగాది పండుగను జరుపుకుంటారు. శాలివాహనుడు పట్టాభిషిక్తుడైన దినం కారణంగా ఈ పండుగ ప్రాశస్త్యంలోకి వచ్చిందని మరొక గాథ.
.
"ఉగాది", మరియు "యుగాది" అనే రెండు పదాలు వాడుకలో ఉన్నాయి. "ఉగ" అనగా నక్షత్ర గమనం. నక్షత్రగమనానికి 'ఆది' 'ఉగాది'.అంటే సృష్టి ఆరంభమైనదినమే "ఉగాది". 'యుగము' అనగా ద్వయము లేక జంట అని కూడా అర్ధము. ఉత్తరాయణ, దక్షిణాయనములనబడే అయన ద్వయ సంయుతం 'యుగం' (సంవత్సరం) కాగా, ఆ యుగానికి ఆది (సంవత్సరాది) యుగాది అయింది. యుగాది శబ్దానికి ప్రతిరూపమైన ఉగాదిగా వ్యవహృతమైనది. "తత్రచైత్రశుక్ల ప్రతిపదిసంవత్సరారంభ:" - చైత్రశుద్ధ పాడ్యమి నాడు సంవత్సరాది 'ఉగాది'గా ఆచరణీయమని నిర్ణయసింధుకారుడు పేర్కొనియున్నాడు.
.
ఉగాది పచ్చడి:...
"ఉగాది పచ్చడి" ఈ పండుగకు మాత్రమే ప్రత్యేకమైన ఒక తినే పదార్థం.షడ్రుచుల సమ్మేళనం - తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తింటారు. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి ఇస్తుంది. ఈ పచ్చడి కొరకు చెరకు, అరటి పళ్ళు, మామిడి కాయలు, వేప పువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం మొదలగునవి వాడుతుంటారు.
.
ఉగాది పచ్చడికి మనశాస్త్రాలలో "నింబ కుసుమ భక్షణం" మరియు "అశోకకళికా ప్రాశనం " అని వ్యవహరించే వారు. ఋతు మార్పు కారణంగా వచ్చే వాత, కఫ, పిత్త దోషాలను హరించే ఔషధంగా ఉగాది పచ్చడి తినే ఆచారం ఆరంభమైంది అంటారు. ఉగాది పచ్చడిని శాస్త్రీయంగా తయారు చేసే పద్ధతిలో ఉప్పు, వేపపువ్వు, చింతపండు, బెల్లం, పచ్చిమిరప కాయలు, మామిడి చిగుళ్ళు మరియు అశోక చిగుళ్ళు వేసి చేసేవాళ్ళు. ఈ పచ్చడిని శ్రీరామ నవమి వరకు తినాలని శాస్త్రాలు చెబుతున్నాయి.
.
త్వామష్ఠ శోక నరాభీష్ట
మధుమాస సముద్భవ
నిబామి శోక సంతప్తాం
మమ శోకం సదా కురు
.
ఈ మంత్రం చదువుతూ ఉగాది పచ్చడి తినాలని శాస్త్రాలు చెప్తున్నాయి. ఉగాది పచ్చడి ఆహారంలో ఉండే ఔషధ గుణాన్ని, వృక్షసంరక్షణ అవసరాన్ని, ఆయుర్వేదానికి ఆహారానికి గల సంబంధాన్ని చెప్పడమే కాక పండుగలకు, ఆచారాలకు, సముచిత ఆహారానికి గల సంబంధాన్ని చాటిచెప్తుంది.
.
ఉగాది రోజున తినే పచ్చడిలో కొత్త చింతపండు, లేత మామిడి చిగుళ్ళు, అశోక వృక్షం చిగుళ్ళు, కొత్తబెల్లం, వేపపూత, మామిడి కాయముక్కలు, చెరుకు ముక్కలు, జీలకర్రలాంటివి ఉపయోగించాలి. ఈ పచ్చడి శారీరక ఆరోగ్యానికి కూడా ఎంతో శ్రేష్ఠమని ఆయుర్వేదశాస్త్రం పేర్కొంటోంది. ఈ పచ్చడిని ఖాళీ పొట్టతో తీసుకున్నప్పుడు ఆరోగ్యానికి మంచిదంటారు. వేపపూత పచ్చడికి శాస్త్రంలో నింబకుసుమ భక్షణం అని పేరుంది. సంవత్సరమంతా అనారోగ్యం లేకుండా హాయిగా ఉండేందుకు ఈ పచ్చడి ఉపకరిస్తుందని వైద్యులు చెప్పేమాట అయితే ఒక్కపూట తింటేనే అంతఫలితం వస్తుందా అని కొందరంటారు. కానీ ఈ వేపపూత పచ్చడిని సేవించటం చైత్రశుక్ల పాడ్యమి నుండి పూర్ణిమ వరకు కానీ లేదా కనీసం ఉగాది పండుగ నుండి తొమ్మిది రోజుల పాటైనా వసంత నవరాత్రుల వరకూ అయినా సేవించాలి. అలా సేవిస్తే వాత, పిత్త, శ్లేష్మాలవల్ల ఏర్పడే దోషాలు హరిస్తాయి. కాలక్రమంలో ఉగాది పచ్చడిలో లేత మామిడి చిగుళ్ళు అనేక చిగుళ్లు, ఇలాంటివన్నీ మానేసి కేవలం వేపపూత, బెల్లం ముక్కలను మాత్రమే ఉపయోగించటం కనిపిస్తుంది. పూర్వం లేతవేప చిగుళ్ళు ఇంగువ పొంగించి బెల్లం, సైంధవల వణం కలిపి కొద్దిగా నూరి చింతపండు, తాటిబెల్లంకానీ, పటికబెల్లంకానీ, వాము, జీలకర్ర మంచిపసుపు కలిపి నూరేవారు. ఈ మిశ్రమాన్ని అరతులం వంతున ప్రతిరోజు ఖాళీ కడుపుతో ఉగాది నుండి తొమ్మిది రోజులుకానీ, పదిహేను రోజులుకానీ వీలును బట్టి సేవించేవారు. ఈ పద్ధతంతా చాలామంది మరచిపోయారు. ఉగాది పచ్చడితిన్న తరువాత శాస్త్ర విధిగా ఉగాది పండుగను జరుపుకునేవారు పూర్ణకుంభ లేక ధర్మ కుంభ దానాన్ని చేస్తుంటారు. ఈ ధర్మ కుంభ దానంవల్ల సంవత్సరం మంతా కోరిన కోరికలు తీరుతాయన్నది నమ్మకం.
.
ఉగాదిపచ్చడి ప్రాముఖ్యత :...
ఉగాది భావాన్ని తెలిపేది ఉగాది పచ్చడి. షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలకు ప్రతీక. జీవితం అన్ని అనుభవములు కలిగినదైతేనే అర్ధవంతం అని చెప్పే భావం ఇమిడి ఉంది. పచ్చడిలో ఉండే ఒక్కొక్క పదార్థం ఒక్కొక భావానికి, అనుభవానికి ప్రతీక -
బెల్లం - తీపి - ఆనందానికి సంకేతం
ఉప్పు - జీవితంలో ఉత్సాహమ, రుచికి సంకేతం
వేప పువ్వు – చేదు -బాధకలిగించే అనుభవాలు
చింతపండు - పులుపు - నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులు
పచ్చి మామిడి ముక్కలు - వగరు - కొత్త సవాళ్లు
మిరపపొడి – కారం - సహనం కోల్పోయేట్టు చేసే పరిస్థితులు
.
ఉగాది రోజున పంచాంగం ఎందుకు వినాలి...?
.
ఉగాది రోజున వేపపచ్చడి ఎంత ముఖ్యమో పంచాంగశ్రవణం కూడా అంతే ముఖ్యం అంటారు పెద్దలు. ఏడాదిలో ఎప్పుడో జరగబోయే విషయాల గురించి పనిగట్టుకుని వినడం ఎందుకు? అందరూ ఒకచోట కూడి పంచాంగాన్ని వినాల్సిన అవసరం ఏమిటి? అంటే జవాబులు ఇవిగో...
.
ప్రాచీన భారతీయుల ఖగోళ విజ్ఞానమే నేటి పంచాంగానికి పునాది అని చరిత్రకారుల విశ్లేషణ. మనకి తెలిసిన ఖగోళ శాస్త్రం ఆధారంగా ఏ గ్రహాలు ఏ రాశిలో సంచరిస్తున్నయో లెక్క వేసి, వాటి ప్రకారం ఫలితాలను అంచనా వేయడమే పంచాంగం. పంచాంగంలో తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణములనే అయిదు భాగాలు ఉంటాయి. అందుకనే దీనికి పంచాంగం అని పేరు. తిథి విషయంలో జాగ్రత్త పడితే సంపద, వారం వల్ల ఆయుష్షు, నక్షత్రం వల్ల పాప పరిహారం, యోగం వల్ల ఆరోగ్యం, కరణం వల్ల విజయం ప్రాప్తిస్తాయని అంటారు.
.
పంచాంగం ప్రకారం వ్యవసాయానికీ, వర్షానికీ, రాజ్యానికీ... ఇలా ప్రతి విభాగానికీ ఓ అధిపతి ఉంటాడు. ఇలా తొమ్మిదిమంది నాయకులను నవనాయకులు అని పిలుస్తారు. వీరి సంచారం వల్ల రాబోయే రోజులలో వ్యవసాయం ఎలా ఉంటుంది, దేశంలో పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహిస్తారు. నవనాయకుల సంగతి అలా ఉంచితే... ఒకో మాసానికీ అధిపతిగా ఉండే గ్రహం వల్ల కూడా అనూహ్య ఫలితాలు ఉండవచ్చు.
.
ఇక పంచాంగంలో వ్యక్తిగత రాశిఫలాలు ప్రత్యేకత చెప్పేదేముంది. ఒకో మనిషి నక్షత్రం ప్రకారం అతని ఆదాయవ్యయాలు, రాజపూజ్య అవమానాలూ లెక్క కడతారు. దీని వల్ల మనుషులలో ఆదాయాన్ని మించి ఖర్చు చేయకూడదనీ, అనువు కానీ చోట అధికులమని అవమానం పాలు కాకూడదనీ జాగ్రత్త ఏర్పడుతుంది. ధార్మికులకు పంచాంగం ఇంత ఉపయుక్తం కాబట్టే... సంవత్సరపు తొలిరోజున పంచాంగ శ్రవణం చేసి తీరాలంటారు పెద్దలు.
.
ఇప్పుడంటే పంచాంగాలు ఇంటింటా కనిపిస్తున్నాయి. కానీ ఒకప్పుడు కేవలం కొద్దిమంది పురోహితులకే ఇవి అందుబాటులో ఉండేవి. కాబట్టి ఉగాది రోజున వారి నుంచి రాబోయే సంవత్సరపు విశేషాలు తెలుసుకునేందుకు అంతా ఒకచోటకి చేరేవారు. దీని వల్ల పంచాంగ శ్రవణం నలుగురూ కలుసుకుని కష్టసుఖాలను కలబోసుకునే సందర్భంగా కూడా మారుతుంది. పైగా పంచాంగంలో సామాన్యులకి అర్థం కాని విషయాలు అనేకం ఉండవచ్చు. వాటన్నింటినీ నివృత్తి చేసుకునేందుకు ఈ పంచాంగ శ్రవణం ఉపయోగపడుతుంది. ధార్మికపరమైన సందేహాలను తీర్చుకునేందుకు కూడా పంచాంగ శ్రవణం అవసరం. అధికమాసంలో శుభకార్యాలు చేసుకోవచ్చా? గ్రహస్థితి బాగోలేకపోతే ఏం చేయాలి? నోములు ఎప్పుడు జరుపుకోవాలి? వ్రతం ఎలా చేసుకోవాలి?... వంటి సవాలక్ష సందేహాలన్నింటికీ ఊరూరా పంచాంగ శ్రవణం వేదికగా మారుతుంది. అందుకనే పంచాంగ శ్రవణ చేసినవారికీ, విన్నవారికీ కూడా నవగ్రహాల ఆశీస్సులు లభిస్తాయని ఫలశ్రుతిగా చెబుతారు.
https://www.facebook.com/rb.venkatareddy
మహా శక్తి వంతుడైన దశభుజ హనుమంతుడు.
* బ్రహ్మదేవుడు కమండలాన్ని, శివుడు మూడో కన్ను, విష్ణు మూర్తి శంకు, చక్రాలను హనుమంతుడికి ఎందుకు ప్రసాదించారు..?
.
.
యుద్ధంలో సహాయంగా ఉండేందుకు విష్ణు మూర్తి తన శంకు, చక్రాలను హనుమంతుడికి ప్రసాదించారు. బ్రహ్మదేవుడు తన కమండలాన్ని, పరమ శివుడు తన మూడో కంటిని ఆంజనేయుడికి ప్రసాదించారు. ఇలా వివిధ దేవతల నుంచి పది ఆయుధాలు పొందిన అంజనీపుత్రుడు దశభుజుడయ్యాడు.
.
హనుమాన్... ఈ పేరు వినగానే మనకు వానర రూపంలో ఉండే ఆంజనేయుడు గుర్తుకు వస్తాడు. అంతే కాదు భక్తికి మారుపేరుగా, బ్రహ్మచర్యానికి ప్రతీకగా కూడా ఆంజనేయుడు కీర్తికెక్కాడు. హనుమంతుడు సాధారణంగా చేతిలో సంజీవని పర్వతంతోనో, లేదా రాముని పాదాల వద్దో మనకు కనిపిస్తాడు. అయితే పదిభుజాలు, మూడు కళ్లు కలిగిన ఆంజనేయుడిని ఎప్పుడైనా చూశారా?
.
అయితే ఆ రూపాన్ని చూసేందుకు తమిళనాడు రాష్ట్రం, నాగపట్నం జిల్లాలోని ఆనందమంగళంలో ఉన్న త్రినేత్ర దశభుజ వీరాంజనేయ ఆలయానికి వెళ్లాల్సిందే. ఈ ఆలయంలో పది భుజాలు, నుదురుపై మూడో కన్ను కలిగిన ఆంజనేయుడు భక్తుల పూజలందుకుంటున్నాడు. త్రేతాయుగంలో విష్ణుమూర్తి రామావతారమెత్తి రావణుడిని సంహరించిన పిమ్మట నారదుడు ఆయనను కలుసుకున్నాడు.
.
"స్వామి లంక నాశనముతో మీ యుద్ధము పూర్తికాలేదు. రావణుని వారసులు ఉన్నారు. తండ్రి మృతిపై ప్రతీకారం తీర్చుకునేందుకు వారు తప్పకుండా మీపై యుద్ధానికి వస్తారు. వారు ప్రస్తుతం సముద్ర అడుగు భాగంలో తపస్సు చేస్తున్నారు. వారి తపస్సు పూర్తి కాకముందే మీరు వారిని సంహరించాల"ని వేడుకున్నాడు.
.
అప్పుడు రాముడు "నారదమహర్షి రామావతారంలో నా కర్తవ్యం పూర్తయినది. మరికొన్ని రోజుల్లో ఈ అవతారాన్ని చాలించనున్నాను. ఇందుకు ఇంకెవరినైనా ఎంపిక చేయుమ"ని అన్నాడు. కాగా, రాక్షస వధకు హనుమంతుడిని పంపించాలని అందరూ నిర్ణయించారు.
.
యుద్ధంలో సహాయంగా ఉండేందుకు విష్ణు మూర్తి తన శంకు, చక్రాలను హనుమంతుడికి ప్రసాదించారు. బ్రహ్మదేవుడు తన కమండలాన్ని, పరమ శివుడు తన మూడో కంటిని ఆంజనేయుడికి ప్రసాదించారు. ఇలా వివిధ దేవతల నుంచి పది ఆయుధాలు పొందిన అంజనీపుత్రుడు దశభుజుడయ్యాడు. కైలాసనాధుని నుంచి మూడో కన్ను పొందడంతో ముక్కంటిగా మారాడు.
.
వానర శ్రేష్టుడు రాక్షస వధ పూర్తిచేసి విజయంతో తిరిగి వచ్చాడు. ఈ రూపంలో ఆయన రాక్షసులను అంతమొందించి అక్కడ వెలిసినందున ఆ ప్రాంతంలో ఆలయాన్ని నిర్మించి భక్తులు పూజిస్తున్నారు. రాక్షస వధతో హనుమంతుడు ఆనందంగా ఉన్నందున ఆ ప్రాంతానికి ఆనందమంగళమ్ అనే పేరు స్థిరపడిందని భక్తులు చెబుతుంటారు.






















