-
శ్రీ మల్లెంకోండేశ్వర స్వామి ఆలయం.. మల్లెంకొండ..
సేతుబంధనం చేసేముందు శివలింగాన్ని శ్రీరాముడు ప్రతిష్టించినట్లు శివపురాణం వర్ణిస్తోంది. ఇతర పురాణాల్లో కూడా రాముడు శివలింగాన్ని ఆరాధించిన విషయం కనిపిస్తుంది. కొన్ని చోట్ల హత్యాపాతక నివారణార్థం శివలింగ ప్రతిష్ఠలు చేసిన గాథలున్నాయి వీటిని కాదనలేము..!
-
పంచలింగాల కోన..
అది శేషాచల అటవీ ప్రాంతం.. దట్టమైనఅడవులు.. రాళ్లూ రప్పలతో కూడిన గుట్టలు... చిన్న చిన్న బాటలు.. ఎటు చూసినా ఎత్తైన చెట్లు.. పక్షుల కిలకిలలారావాలు... వన్యప్రాణులు.. ప్రకృతి అందాలతో అలరారే ఆ క్షేత్రంలో.. సాక్షాత్తూ శివుడు కైలాసం విడిచి ఇక్కడ కొలువైనాడు. లోతైన లోయలో కొలువుదీరిన శివుడిని చేరుకోవడానికి కాలినడకన 9 కిలోమీటర్లు ప్రయాణించాల్సిందే..! ఆ ఆద్భుత స్థలమే పంచలింగాల కోన..!!.
-
ఉల్లెడ ఉమామహేశ్వర స్వామి
నల్లమల ఆడవి లోని ఉల్లెడ ఉమామహేశ్వర స్వామి కొండ గుహ లెదా వజ్రాల కొండ గుహ ఆని అంటారు. ఈవజ్రాల కొండ గుహలో ఉల్లెడ నరసంహాస్వామి గుహ, ఆశ్వథ్దామ గుహ, వున్నఉల్లెడ ఉమామహేశ్వర స్వామి గుహ అను మూడు గుహలు కలవు. ఉల్లెడ ఉమామహేశ్వర స్వామి గుహ లో ఒక శివలింగం, మూడు పడగల నాగుపాము, శంఖం, మరియు వీణ స్వయంబుగా వెలిచినాయి.
-
కాలి నడకన అధ్భుతమైన యాత్ర...
ఈ ప్రపంచంలో ప్రకృతిని ఆరాధించనివారుండరు. ప్రకృతి అందాలను చూస్తూ తమను తాము మరిచిపోతుంటారు. అలాంటి ప్రకృతి అందాలను చూసేందుకు ఎంత దూరమైనా వెళ్తారు, కొత్త కొత్త ప్రదేశాల కోసం అన్వేషిస్తారు. అలాంటి వారి కోసం నా వంతు సహాయాన్ని అందించడానికే ఈ ప్రయత్నం. .
-
జ్యోతి శ్రీ సిద్దేశ్వరస్వామి ఆలయం...
కొన్ని శతాబ్దాలుగా పెన్నానది గర్భంలో దాగి ఉన్న మహిమాన్వితమైన 108 లింగాల శివాలయాల దివ్య క్షేత్రం. రావణ సంహారం అనంతరం బ్రహ్మహత్య దోశ నివారణలో భాగంగా శ్రీ రాముడు దేశవ్యాప్తంగా శివలింగ ప్రతిష్టాపన జరుపుతూ ఇక్కడ శివలింగాలకు పూజలు నిర్వహించి పాప విమోచనం పోందాడని ప్రతీతి. కాలక్రమంలో ఆలయం పెన్నమ్మ కడుపులో కలిసిపోయి, ఇసుకదిబ్బగా మారిపోయింది.
మగవాళ్ళు మాత్రమే తాకే నాగేశం శివలింగం.
మాహిమాన్వితమై పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి రవ్వలకొండ గుహ..
* ప్రపంచానికి కాలజ్ఞానం ద్వార జ్ఞానామృతాన్ని పంచిన రవ్వలకొండ..
* బ్రహ్మం గారు కాలజ్ఞానం రచన రవ్వలకొండ ఇక కనుమరుగు అవుతుందా..!!
* నాడు ఆనందాశ్రమం నేడు రవ్వలకొండ..
.
బ్రహ్మం గారు సాక్షాత్ దైవ స్వరూపులు.. రాబోయే కాలంలో జరగబోయే విపత్తుల గురించి తన కాలజ్ఞానం లో సుస్పష్టంగా వివరించి, జనులన్దరిని సన్మార్గం లో నడువమని బోధించిన మహిమాన్వితుడు., చరితకారుల కాలజ్ఞాన పరిశోధన పలితంగా, బ్రహ్మం గారు చిన్నతనములోనే తల్లిదండ్రులను కోల్పోయి అత్రి మహాముని ఆశ్రమం లో చేరుకున్నారు. కర్ణాటక లోని పాపాగ్ని మఠాధిపతి యనమదల వీరభోజయచార్యులు, సతీ సమేతంగా సంతాన భాగ్యం కోసం పుణ్యక్షేత్రాలు సందర్శిస్తూ అత్రి మహాముని ఆశ్రమం చేరుకుంటారు. సంతాన ప్రాప్తి కై పరితపుస్తున్న ఆ పుణ్య దంపతుల చెంతకు, దైవ స్వరూపులు అయిన బ్రహ్మం గారిని అత్రి మహాముని అందజేస్తారు.
.
వీరభోజయాచార్య, ఈ బాలుడు, మహిమాన్వితుడు, మునుముందు, ఈ బాలుడు ఎన్నో వింతలు చూపించబోతున్నాడు అంటూ ఆ బాలుడుని వీరభోజయాచార్య దంపతులకు అందజేస్తారు. ఆ విధంగా బ్రహ్మం గారు పాపాగ్ని మఠాధిపతి గారింట సనాతన సంప్రదాయాల నడుమ పెరుగుతూ వస్తారు. (ఈనాడు కర్ణాటక లోని పాపాగ్ని మఠం బ్రహ్మం గారి ప్రథమ మఠం గా పేరు గాంచి దివ్య క్షేత్రం గ వెలుగొందుతున్నది.) అతి చిన్న వయసులోనే, బ్రహ్మం గారు కాళికాంబ పై సప్తశతి రచించి అందరిని అబ్బురపరుస్తారు. బ్రహ్మం గారి పదవ ఏట వీరభోజయచార్యులు స్వర్గాస్తులవుతారు. అటు పిమ్మట దేశాటన నిమిత్తమై బయలుదేరబోతు తన తల్లి ఆశీర్వాదాలు కోరతారు. అందుకు, వారి తల్లి, నాయన, వీరంభోట్లయ్య (బ్రహ్మం గారు చిన్న నాడు వీరంభోట్లయ్య గా పిలువబడ్డారు, పాపాగ్ని ప్రస్తుత మఠాదిపతుల వద్ద దీనికి సంబంధించి శాసనాలు వున్నాయి), మఠాధిపత్యం స్వీకరించవలసిన నీవు ఇలా తల్లిని వదిలి పెట్టి దేశాటనకు బయల్దేరితే ఎలాగంటూ శోక సంద్రం లో మునిగి పోతుంది. అప్పుడు బ్రహ్మం గారు, తన తల్లి గారికి సృష్టి క్రమాన్ని వివరించారు. స్త్రీ పురుషుల సంభోగం పవిత్ర కార్యమని, శుక్లాశోనితం తో స్త్రీ గర్భ ధారణ గావిన్చాక, గర్భం ధరించిన ప్రతి నెలలో, కడుపులో శిశువు ప్రాణం పోసే విధానాన్ని కళ్ళకు కట్టినట్టుగా వివరిస్తారు బ్రహ్మం గారు. ఆగామి, ప్రారబ్ద, సంచిత కర్మ సిద్దాంత గురించి వివరించి ఆమెకు మాయ తెరను తొలగించి, లోక కళ్యాణ నిమిత్తమై దేశాటనకు బయల్దేరతారు బ్రహ్మం గారు.
.
కర్నూలు జిల్లాలొని బనగానపల్లె మండలం లోని అచ్చమ్మ ఇంటి దగ్గర ఉదయాన్నే ఇంటి అరుగు మీద నిద్రిస్తున్న బ్రహ్మంగారిని చూసి, ఆయన వివరాలను అడిగి తెలుసుకుంది. తాను బతుకుతెరువు కోసం వచ్చానని, తనకేదైనా పనప్పజెప్పమని కోరగా ... తన దగ్గర ఉన్న పశువులను తోలుకెళ్ళమని చెప్పింది అచ్చమ్మ. అలా పశువుల కాపరిగా మారిన బ్రహ్మంగారు రోజూ రవ్వలకొండపైకి పశువులను తోలుకెళ్లేవారు. ఆ ప్రదేశం ఎంతో ప్రశాంతంగా ఉండటంతో ఇక్కడే కాలజ్ఞానం వ్రాయాలని నిశ్చయించుకొన్నారు. అక్కడే ఒక తాటిచెట్టు ఆకులను తెంచుకొని కాలజ్ఞానం వ్రాసినట్లు చెబుతారు. తాను వెళ్ళి కాలజ్ఞానం రాసుకుంటూ కూర్చుంటే పశువుల సంగతి ఏంకాను? అని గ్రహించిన బ్రహ్మగారు ... వాటిని ఒక మైదానంలో వదిలేసి వాటి చుట్టూ గీత గీశారు. గోవులు ఆ గీతను దాటకుండా మేతమేసేవి.
.
ఒకరోజు మిగతా గోపాలకులు ఈ విషయాన్నీ చూచి భయపడి పరుగు పరుగున, అచ్చమ్మ గారికి ఈ విషయాని చేరవేస్తారు. మరుసటి రోజుగా యథావిధిగా ఆవులను తీసుకుని వెళ్లి చుట్టూ గిరి గీసి రవ్వలకొండ లో కాలజ్ఞాన రచన గావిస్తూ వున్న బ్రహ్మం గారిని చూసి ఆశ్చర్య పోతుంది అచ్చమ్మ. (ఆచమ్మ బ్రహ్మం గారిని దర్శించుకున్న రవ్వలకొండ లో ఈనాడు సుందరమైన బ్రహ్మం గారి దేవాలయం వున్నది). బ్రహ్మం గారి మహిమ తెలుసుకున్న అచ్చమ్మ ప్రుట్టు గుడ్డి వాడిన తన కొడుకు బ్రహ్మానంద రెడ్డి కి చూపు ప్రసాదించమని ప్రార్తిస్తుంది. బ్రహ్మం గారు తన దివ్య దృష్టితో, బ్రహ్మానంద రెడ్డి గత జన్మ పాపాలను దర్శించి, అతనికి చూపు ప్రసాదించి, పాప నివృత్తి గావించారు.
తనకు జ్ఞాన బోధ చేయమని కోరింది. పోతులూరి కాలజ్ఞానాన్ని ఒకేసారి చెప్పలేదు. అనేక సందర్భాల్లో వేర్వేరు వ్యక్తులకు తెలియజెప్పారు. అంతేకాకుండా చాలా భాగాన్ని ఒకచోట పాతిపెట్టారు. ఆ తర్వాత దానిపైన చింతచెట్టు మొలిచింది. ఆయన కాలజ్ఞానాన్ని ఎందుకు పాతిపెట్టారు? ఇలా ఎందుకు చేశారు? అనే దానికి మాత్రం ఇప్పటివరకు జవాబు దొరకలేదు. గుహలోనుంచి శ్రీశైలం, మహనంది, యాగంటి వెళ్ళటానికి దారులు ఉన్నాయి. ఈ దారి వెంబడి స్వామి వారు ఆ ప్రాంతాలకి వెళ్ళేవారు. బ్రహ్మంగారు ఎందరికో వివిధ సందర్భాలలో జ్ఞాన బోధ చేశారు. వారిలో అచ్చమ్మ, బనగానపల్లె నవాబు, హైదరాబాద్ నవాబు ముఖ్యలు. నవాబులకు వారి దివానాల్లో, అచ్చమాంబకు యాగంటి క్షేత్రంలోని ముచ్చట్ల గుట్ట వద్ద జ్ఞానబోధ చేశారు. కాలజ్ఞానం వ్రాసిన తర్వాత బ్రహ్మంగారు కందిమల్లాయపల్లె చేరి వడ్రంగి వృత్తిచేస్తూ గడిపారు. తనవద్దకు వచ్చినవారికి వేదాంతం వినిపిస్తూ కులమతాలకు అతీతంగా అంతా సమసమాజం బాటన నడవాలని బోధించారు.
.
రవ్వలకొండ చుట్టు మైనింగ్ దందా జోరుగా సాగుతోంది నిబంధనలకు విరుద్ధంగా కంకర క్వారీలు మరియు క్రేషర్లను ఏర్పాటు చేసి కొండ తవ్వుకుపోతున్నా అధికారులకు పట్టడంలేదు. బ్లాస్టింగ్లతో రవ్వలకొండ గుహ దెబ్బతింటున్నా.. గుహలొ బీటలు వారుతున్నా. గుట్టపై నిబంధనలకు విరుద్ధంగా క్వారీని ఏర్పాటు చేశారు. లెక్కకు మించి తవ్వకాలు చేపడుతున్నా పట్టించుకునే వారేలేరు. బ్లాస్టింగ్లతో గుహలోపల స్వయంభు వినాకుడు కూడ రెండుగా పగలడం కూడ జరిగింది. అంతే కాకుండా గుహలోపల బ్రహ్మగారు తవ్విన బావిలో ప్రతి నిత్యము మంచి నీరు ఉబికి బయటకు వస్తువుండేది. కాని ఇప్పుడు బావిలోని నీరు ఇంకి పోతుంది. ఇక కొద్ది నేలలలోనే ప్రపంచానికి కాలజ్ఞానం ద్వార జ్ఞానామృతాన్ని పంచిన రవ్వలకొండ గుహ కనపడకుండ పూర్తిగా శిధిలం కావటమే కాకుండా అలనాటి మాహిమాన్వితమై రవ్వలకొండ గుహ సంభందించిన అనావాళ్ళ మనకు కనపడదు.
.
రవ్వలకొండ చేరుకోవటానికి:..
రవ్వలకొండ చేరుకోవటానికి ముందుగా బనగానపల్లె చేరుకోవాలి. బనగానపల్లె నుండి రవ్వలకొండ కు 1.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. వీలైతే లోకల్ గా తిరిగే ఆటోలలో లేదా కాలినడకన కొండ పైకి చేరుకోవచ్చు. బనగానపల్లె కు హైదరాబాద్, కర్నూలు, డోన్, నంద్యాల, బెంగళూరు, ప్రొద్దుటూరు, తాడిపత్రి తదితర ప్రాంతాల నుండి ప్రభుత్వ బస్సులలో ఎక్కి చేరుకోవచ్చు.
.
సేకరణ…
మీ..
ఆర్.బి. వెంకటరెడ్డి
భారతీయ సనాతన హిందూ ధర్మ సంరక్షణ సమితి
reddemb@gmail.com
https://www.facebook.com/rb.venkatareddy
మహిమాన్వితమైన శ్రీహనుమాన్ మందిరం.
* దయ్యాలను వదిలించే కస్త్ భంజన్ దేవ్ ....
.
.
గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్ నుండి భావనగర్ వెళ్లే దారిలో, సాలంగ్ పూర్ (సారంగ్ పూర్) అనే ప్రాంతంలో ప్రసిద్ధిచెందిన శ్రీ హనుమాన్ మందిరం కలదు. ఈ హిందూ దేవాలయం స్వామినారాయణ ఆలయంగా ప్రసిద్ధి చెందినప్పటికీ ... హనుమాన్ కు అంకితం చేశారు. ఈయనను ఇక్కడ కస్త్ భంజన్ దేవ్ గా పూజిస్తారు.
.
దేశంలో ప్రసిద్ధిచెందిన స్వామినారాయణ ఆలయాలలో ఇది కూడా ఒకటి. ఇక్కడ అప్పుడప్పుడు ఎన్నో వింతలు, విశేషాలు చోటుచేసుకుంటాయి. దేవాలయంలో విగ్రహాన్ని సద్గురు గోపాలనంద్ స్వామి ప్రతిష్టించినారు. గోపాలనంద్ స్వామి విగ్రహాన్ని ప్రతిష్టించే సమయంలో హనుమంతుడు విగ్రహంలోకి ఆవహించి చాలాసేపు ఊగిపోయాడని, ఇదొక అద్భుత దృశ్యం అని చెబుతారు.
.
.
శనివారం, ఆదివారాలలో ఒక్కోసారి భక్తులు ఆలయం గేట్ బయటే వేచి ఉన్న సందర్భాలు ఉన్నాయి. ఆలయ ప్రాంగణం చాలా పెద్దది, విశాలంగా ఉంటుంది. ప్రాంగణంలోని బావిలో దొరికే నీరు పవిత్రమైనదిగా భావిస్తారు. సమీపంలోనే కౌంటర్ లు ఉంటాయి డబ్బులు చెల్లించి నీటిని ఇంటికి తీసుకెళ్లవచ్చు. ప్రసాదంగా 'సుఖ్ దిస్' అనే గుజరాతి స్వీట్ ను ఇస్తారు.
.
నిత్యాన్నదానాన్ని ఆలయ డైనింగ్ హాల్ లో వడ్డిస్తారు. ఆలయానికి ఎంతమందైతే దర్శిస్తారో అంతమందీ వెళ్లి తినవచ్చు. మీకు ఇష్టమైతే విరాళాలు ఇవ్వండి బలవంతం ఏమీ లేదు. ఎవ్వరూ అడగరు. ఈ అన్నదాన భాద్యత ఆలయ కాంప్లెక్స్ లోని స్వామినారాయణ ఆలయం మరియు ఆలయాల ట్రస్ట్ చూసుకుంటుంది. సుమారు ఐదు వేల మందికి ప్రతిరోజూ అన్నదానం కార్యక్రమంలో భాగంగా ప్రసాదాన్ని ఇస్తారు. ఇది శనివారాలలో రెట్టింపు సంఖ్యలో ఉంటుంది (దాదాపు పది వేలు). హనుమాన్ చాలిసా పుస్తకాలు తక్కువ ధరకే లభ్యమవుతాయి.
కేర శివాలయం.
కోడి పుంజు పై బహుచరాజి దేవి ఆలయం.
సింధు నాగరికత కాలంలో శివలింగానికి పూజలు.
* శివుని జటాఝాటంలో గంగమ్మను భరించడంలో అంతరార్థం ...?
* ఈశ్వరుడు సూర్య, చంద్రులను పొందడంలో అంతర్యం...?
.
.
ఈశ్వరుడే సత్యము సత్యమే శివుడు శివుడే సుందరుడు సత్యం శివం సుందరమంటే ఇదే...
హిందూ మతంలోని ప్రధాన దేవతలలో ఒకరు. శివ అనగా సంస్కృతంలో శుభం, సౌమ్యం అని అర్థాలున్నాయి. ఈయన త్రిమూర్తులలో చివరివాడైన లయకారుడు. శివుడు హిందువులు పూజించే దేవుళ్లలో ప్రథముడు.
పశుపతిగాను, లింగం రూపములోను సింధు నాగరికత కాలానికే పూజలందుకున్నాడు. శివుడు అనార్య దేవుడు. కానీ తరువాత వైదిక మతంలో లయకారునిగా స్థానం పొందాడు. నేటికీ దేశమంతటా శివాలయాలే అధిక సంఖ్యలో ఉన్నాయి. వేదాలలో శివుడు రుద్రునిగా పేర్కొనబడినాడు.
.
గంగను భరించడంలో అంతరార్థం ...?
ఈ భూమండలంలో గంగానదికి ఎంతో ప్రత్యేకత ఉంది. పలు కార్యాలు దిగ్విజయం చేసిన గంగానది యుగాలందు కలిగిన మార్పులలో ఒకసారి గౌతమమహర్షి పాపనివృత్తికై గోభస్మం నుండి ప్రవహించి గోదావరిగా మానవాళికి ఉపయోగకారిగా, వునీతులను చేస్తోంది. ఇలా గోదావరిగా భూలోకానికి వచ్చింది. ఆ సమయంలోనే ఆమె ప్రవాహం ఆపడానికి తన జటాఝాటంలో ముడివేసాడు గౌరీశుడు. అనేకానేక కార్యాలను నిర్వ హించిన ఘనత నదులలో గంగానదికి తప్ప మరే ఇతర నదులకు లేదు. అనేక అంశరూపాంశాలను పొంది ఒకదానికొకటి పొంతన లేని అనేక కార్యాలను సాగించిన గంగ, సరాసరి మానవాళి విషయంలో చంచలమైన మనసు వంటిది. మనస్సు అడ్డూ ఆపు మరచి నియమం హద్దు దాటి ప్రవహించే గంగా ప్రవాహంతో పోల్చుకుంటే, వేగాన్ని కట్టడి చేసేందుకే పరమేశుడు తన జటాఝాటంలో బంధించి వేగాన్ని నియంత్రించి లోకాలను హద్దులేని గంగా ప్రవాహం నుండి సంరక్షించాడు.అంటే మనస్సు వేగాన్ని మనం కూడా సరైన రీతిలో సంరక్షించకపోతే అదుపు లేక గతి తప్పి మనస్సు మనలను ముంచేస్తుందన్న నిగూడార్థం.
.
.
చంద్రుని పొందడంలో అంతర్యం?
ఈశ్వరుడు చంద్రశేఖరుడుగా మారిన కారణం మనకు విదితమే. తనకు కలిగిన పాప ప్రక్షాళన నిమిత్తం చంద్రుడు చేసిన తప: ప్రభావాన పరమేశుడు చంద్రుడిని ధరించి చంధ్రశేఖరుడయ్యాడు. పార్వతీశుని త్రినేత్రం అగ్నితో సమానం. సూర్య తేజస్సు కంటే అమిత తేజోమయం. సూర్యచంద్రులే ప్రపంచ ఉనికికి మూలం. మానవ జీవనాధారం. అలా ప్రగతికి, మనుగడకు, విశ్వానికి మూలాధారమైన సూర్య చంద్రులను తాను పొందడం ద్వారా ఈ సృష్టి తనలోనే నిక్షిప్తమై ఉన్నదనీ, ఈ సృష్టికి తానే మూలమనీ, అద్యంతాలు, మూలాధారం తానే అనీ సుస్పష్టం చేస్తున్నాడు.
https://www.facebook.com/rb.venkatareddy
నల్లమల, ఎర్రమల అడవుల మధ్య వెలసిన మహా పుణ్యక్షేత్రం యాగంటి.
* మృత్యుదోషాలన్నీ తొలగించే అగస్త్య పుష్కరిణి...
* నాడు “నేకంటి” నేడు యాగంటి..
.
https://www.facebook.com/media/set/…
మానవ జీవితానికి ఊతం కోసం భక్తి ఉల్లాసం కోసం ప్రకృతి ఈ రెంటి అనుసంధానంగా భారతదేశమంతటా ఆలయాలు ఏర్పడ్డాయి. పార్వతితో కలిసి మహేశ్వరుడు కొలువైన యాగంటి తెలుగువారికి సొంతమైన ఆధ్యాత్మిక సంపద. నల్లమల, ఎర్రమల సౌందర్యానికి ప్రతీక. తెలుగువారి శైవక్షేత్రాల్లో యాగంటి నాగరిక ఛాయలు సోకని ప్రత్యేక క్షేత్రం. ఎర్రమల కొండల్లో ఏకాంతంగా స్వచ్ఛంగా ఉండే ఈ క్షేత్రం నిరాడంబరంగా తన ఆధ్యాత్మిక కిరణాలను వెదజల్లుతూ ఉంటుంది. ఏకశిలపై నందిని అధిరోహించిన ఉమా మహేశ్వరులు వెలసిన క్షేత్రం దేశంలో ఇది ఒక్కటే. అందుకే భృగు, అగస్త్య వంటి మహా రుషులు అక్కడ సంచరించారని అంటారు. చుట్టూ అడవి... ఎర్రటి కొండలు... పచ్చటి పరిసరాలు... రణగొణులు లేని ఏకాంతం... స్వచ్ఛమెన కొండధార ఉన్న ఈ క్షేత్రం చూసినంతనే ఆహ్లాదం కలిగించే క్షేత్రం. దీని ఉనికి పురాణ కాలం నుంచి ఉందని భక్తుల నమ్మకం. అపర శివభక్తుడైన భృగుమహర్షి ఇక్కడ శివ సాక్షాత్కారం కోసం తపస్సు చేశాడని దాని ఫలితంగా భార్యా సమేతంగా ఇక్కడ శివుడు కొలువయ్యాడని ఒక కథనం. మరో జానపద కథ కూడా ఉంది. ఇక్కడ పూర్వం చిట్టెప్ప అనే శివభక్తుడు శివుడి కోసం తపస్సు చేశాడట. కొన్ని రోజులకు అతడికి పెద్ద పులి కనిపించిందట. ఆ పెద్దపులినే శివుడని భావించిన చిట్టెప్ప సంతోషంతో ‘నేకంటి నేకంటి’ అని కేరింతలు కొట్టడంతో అదే కాలక్రమంలో యాగంటి అయ్యిందని అంటారు.
.
కర్నూలు జిల్లాలో బ్రహ్మం గారు నివసించిన బనగానపల్లి గ్రామానికి సమీపంలో ఉన్న పుణ్యక్షేత్రమే యాగంటి. ఆహ్లాదకరమైన ప్రకృతి సౌందర్యంతో పరవశింపచేసే పుణ్యక్షేత్రాలలో యాగంటి ఒకటి. నల్లమల, ఎర్రమల అడవుల మధ్య వెలసిన ఈ పుణ్యక్షేత్రాల్లో ఒక్కో క్షేత్రానికి ఎంతో విశిష్టతలు వున్నాయి. ఈ మూడు శైవ క్షేత్రాలు ఇక్కడ కొండల నుండి నిరంతర జలధారలుప్రవహించటం చాలా ప్రత్యేకం. బనగానపల్లి మండలానికి దగ్గరలో యాగంటి అనే దివ్యక్షేత్రం వుంది. అద్భుతమైన శైవ క్షేత్రం. ఇక్కడ స్వామి వారు పరమశివుడు విగ్రహరూపంలో దర్శనమిస్తారు. బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో కలియుగాంతంలో ఆలయం ముందున్న నందీశ్వరుడు కాలు దువ్వి రంకె వేస్తాడని అది భూమండలం దద్దరిల్లేలా ఆ రంకె వుంటుందని పేర్కొనటం జరిగింది. అంతేకాకుండా ఆ నందీశ్వరుని విగ్రహం సైజు అనేది పెరుగుతూవుండటం ఇక్కడ మరో విశేషం. దీనిని అర్కియాలజీవారు కూడా అంగీకరించటం జరిగింది.
.
శ్రీ వెంకటేశ్వరస్వామి ఒక గుహలో శ్రీ వెంకటేశ్వరస్వామి వారి యొక్క విగ్రహం వుంటుంది. వెంకటేశ్వరస్వామి విగ్రహాన్ని మలుస్తూ వుండగా చేతి బొటనవేలుకి గాయమైందట. తన సంకల్పములో లోపమేమో అనే సందేహం తలెత్తడంతో వెంకటేశ్వరస్వామి గురించి తపస్సు చేశాడు. ఆ సమయంలో కాకులు ఆయన తపస్సుకు భంగం కలిగించడంతో, అవి ఆ ప్రాంతంలో సంచరించకుండా నిషేధాన్ని విధిస్తూ శపించాడట. అందువల్లనే ఇక్కడ కాకులు కన్పించవని చెబుతుంటారు. రెండవ గుహలో శివలింగాన్ని ప్రతిష్టించి అగస్త్యమహర్షి తపస్సు చేసాడంట. మరి మూడవగుహను శంకరగుహ అంటారు దీన్ని. శ్రీ పోతులూరివీరబ్రహ్మం గారు కాలజ్ఞానం రాశాడని తన శిష్యులకు కాలజ్ఞానం భోదించటం జరిగిందనిచెప్పుకుంటారు. అయితే అడవి మధ్యలో ప్రకృతిఒడిలో మనస్సుకు ఎంతో సంతోషాన్ని ఆహ్లాదకరమైన భావనను కల్గిస్తుంది. ఇక్కడ వున్న కోనేరులోని నీరు అనేది నిరంతరం వస్తూనే వుంటుంది. ఇందులోని నీటికి ఔషధ గుణాలున్నాయని, ఇందులో స్నానమాచరిస్తే సర్వ రోగాలు నయమౌతాయని నమ్మకం. పుష్కరిణి నుండి ఆలయానికి వెళ్ళడానికి సోపాన మార్గం ఉంది. ప్రధాన గోపురం ఐదు అంతస్తులు కలిగి ఉంది. దీన్ని దాటగానె రంగ మంటపం, ముఖ మంటపం, అంతరాళం, ఉన్నాయి. ఇక్కడ స్వామివారికి పాలాభిషేకం చేయిస్తే ఆయుష్ వృద్ధి కలుగుతుందని నమ్ముతారు. ఎవరికైతే జాతకంలో మృత్యుగండాలు వుంటాయోవారు స్వామికి పాలాభిషేకం చేయిస్తే వారి మృత్యుదోషాలన్నీ తొలగిపోతాయంట. అగస్త్యమహర్షి స్నానమాచరించటంతో దీనిని అగస్త్య పుష్కరిణి అంటారు. ఈ ఆలయం యొక్క పరిసరప్రాంతాలలో ఒక్క కాకి కూడా కనిపించదు. దీనికి సంబంధించి ఒక చారిత్రాత్మక కథనం వుంది.
.
యాగంటి బసవయ్య:..
యాగంటి క్షేత్రంలో బసవయ్య పేరుతో ఉన్న నందీశ్వరుడి విగ్రహం విశేషమైనది. సాధారణంగా నంది కొమ్ముల నుంచి చూస్తే శివాలయాల్లో శివలింగ దర్శనం అవుతుంది. అయితే ఈ క్షేత్రంలో అయ్యవారు అమ్మవారితో కొలువై ఉన్నారు కాబట్టి వారికి కాస్త చాటు కల్పించడానికి నందీశ్వరుణ్ణి ఈశాన్యంలో ప్రతిష్ఠించారని అంటారు. ఈ నంది రోజు రోజుకూ పెరుగుతోందని భావిస్తున్నారు. తొంభై ఏళ్ల క్రితం ఈ నంది చుట్టూ ప్రదక్షిణలు చేసే వీలు ఉండేదనీ, ఇప్పుడు నంది పెరగడంతో మంటపం స్తంభాలకూ నందికీ మధ్య ఉన్న స్థలం పూర్తిగా తగ్గిపోవడం గమనించవచ్చు. పురావస్తుశాఖ అంచనా ప్రకారం ఈ నంది ప్రతి 20 సంవత్సరాలకు అంగుళం మేర పెరుగుతోంది. కలియుగాంతానికి ఇది లేని రంకె వేస్తుందని బ్రహ్మంగారు చెప్పారు.
.
అగస్త్య పుష్కరిణి:...
ప్రకృతి ఒడిలో పుట్టిన జలధార పర్వత సానువుల్లో ప్రవహించి ఆలయ ప్రాంగణంలోని కోనేరులో చేరుతుంది. ఈ కోనేరులో అగస్త్యుడు స్నానమాచరించిన కారణంగా దీనిని అగస్త్య పుష్కరిణి అని అంటారు. ఏ కాలంలో నైనా పుష్కరణి లోని నీరు ఒకె మట్టంలో వుండడం విశేషం. ఇందులోని నీటికి ఔషధ గుణాలున్నాయని, ఇందులో స్నానమాచరిస్తే సర్వ రోగాలు నయమౌతాయని నమ్మకం. పుష్కరిణి నుండి ఆలయానికి వెళ్ళడానికి సోపాన మార్గం ఉంది. ప్రధాన గోపురం ఐదు అంతస్తులు కలిగి ఉంది. దీన్ని దాటగానె రంగ మంటపం, ముఖ మంటపం, అంతరాళం, ఉన్నాయి. గర్బాలయంలో లింగ రూపం పై ఉమా మహేశ్వరుల రూపాలు కూడా ఉన్నాయి. శ్రీ పోతులూరి వీర బ్రంహం గారు రచించిన కాలగ్నానంలో యాగంటి బసవన్న రోజు రోజుకి పెరుగు తున్నాడని అన్నాడు.
.
సహజసిద్ధమైన గుహలు:..
యాగంటిలో సహజ సిద్ధంగా ఏర్పడిన కొండగుహలు ఆశ్చర్య చకితులను చేస్తాయి. వెంకటేశ్వరస్వామి గుహలో అగస్త్య మహర్షి శ్రీ వేంకటేశ్వరుని విగ్రహం ప్రతిష్ఠించాడు. ఇక్కడున్న వేంకటేశ్వరుడు భక్తుల పూజలనందు కొంటున్నాడు. ఆ ప్రక్కనె ఇంకో గుహలో బ్రంహం గారు కొంత కాలం నివసించారని, శిష్యులకు ఙానోపదేశం చేసాడని భక్తులు నమ్ముతారు. దీనిని శంకరగుహ, రోకళ్ళగుహ అనికూడా అంటారు.
.
శనిగ్రహ బాధలు:..
అప్పుడు అక్కడ కాకులు ఋషి యొక్క తపస్సుకి భంగం కల్గించటంతో కోపోద్రిక్తుడైన అగస్త్యమహర్షి ఆ ప్రాంతంలో ఇకపై కాకులు ఉండరాదని శపించాడట. అందుకే ఇక్కడ కాకులు అనేవి కనిపించవు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే శనిగ్రహ బాధలతో బాధపడే వారు ఈ ఆలయంలో దీపం వెలిగిస్తే శనిగ్రహ బాధలు తొలిగిపోతాయని గట్టి నమ్మకం.
.
దర్శన వేళలు:..
ప్రతిరోజు ఉదయం 6 గం. నుంచి మధ్యాహ్నం 1 గం. వరకు, మధ్యాహ్నం 3 గం. నుంచి రాత్రి 8 గం. వరకు. శని, ఆదివారాల్లో మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు కూడా భక్తులకు దర్శనం ఉంటుంది.
.
వసతి సౌకర్యాలు:..
ఇక్కడ బస చేసేందుకు ఏపీ టూరిజం, శ్రీ ఉమామహేశ్వర సేవాసదన్, బ్రహ్మణి రెసిడెన్సీ తదితర వసతి గృహాలు ఉన్నాయి. వారు గదుల సౌకర్యాన్ని ఏర్పాటుచేశారు. ఇంకా అన్నదాన సత్రాల్లో కూడా వసతి సౌకర్యాలు ఉన్నాయి. ఇక్కడ ఏర్పాటుచేసిన శ్రీ ఉమామహేశ్వర నిత్యాన్నదాన, ఉమామహేశ్వర రెడ్ల, వేదగాయత్రి బ్రాహ్మణ, వాసవి ఆర్యవైశ్య సత్రాల ద్వారా నిత్యాన్నదాన భోజన సౌకర్యాలు ఉన్నాయి.
.
రవాణా సౌకర్యం:..
యాగంటి క్షేత్రం బనగానపల్లె నుంచి 13 కి.మీల దూరంలో ఉంది. ఇక్కడ నుంచి ఆర్టీసి బస్సులు ఉంటాయి. కర్నూలు నుంచి బనగానపల్లె-76 కి.మీలు, అనంతపురం నుంచి బనగానపల్లె - 120 కి.మీ. నంద్యాల నుంచి బనగానపల్లె - 45 కి.మీ, హైదరాబాద్ నుంచి బనగానపల్లె - 228 కి.మీ, శ్రీశైలం నుంచి బనగానపల్లె - 223 కి. మీ. మహానంది నుంచి బనగానపల్లె - 60 కి.మీ
.
సేకరణ…
మీ..
ఆర్.బి. వెంకటరెడ్డి
భారతీయ సనాతన హిందూ ధర్మ సంరక్షణ సమితి
reddemb@gmail.com
https://www.facebook.com/rb.venkatareddy
సర్వం శివోహం.
హరహర మహాదేవ శంభో శంకర.. దుఃఖ హర.. భయ హర.. దారిద్ర హర.. అనారోగ్య హర.. ఐశ్వర్య కర.. ఆనందకర..
.
“దివ్యచక్షువుకు పూర్వం ‘జీవుడు’ .. దివ్యచక్షువు ఉత్తేజితం తర్వాత ‘శివుడు’”
“మంగళకరం” అనే మరో అర్థం కూడా ఉంది కనుక
“శివుడు” అంటే “ఆనందమయుడు” అని అర్థం.
“శివుడు” అంటే “మంగళకర జీవితం జీవిస్తున్నవాడు” అని అర్థం.
అయితే, ఈ “శివ పదవి” ఎలా సాధ్యం?
శివుడికి “మూడవ కన్ను” ఉంటుందట
ఎవరెవరయితే తమ తమ “మూడవకన్ను” ను
అంటే, ” ఆత్మచక్షువు “ను అంటే, “అతీంద్రియ శక్తులను”
ఉత్తేజపరచుకుంటారో వారందరూ “శివుళ్ళే” అవుతారు.
దివ్యచక్షువుకు పూర్వం “జీవుడు” .. దివ్యచక్షు ఉత్తేజితం తర్వాత “శివుడు”
“మూడవకన్ను” ఉన్న ప్రతి మనిషీ “శివుడు” అనబడతాడు.
“మూడవ కన్ను” తెరిస్తే మరి అంతా భస్మమవుతుందట .. నిజమే !
ఎప్పుడైతే మన “దివ్యచక్షువు” సంపూర్ణంగా విచ్చుకుంటుందో
అప్పుడే మన ప్రాపంచికపరమైన అజ్ఞానం భస్మమవుతుంది.
అప్పుడే, మన వికృతీ వికారాలు అన్నీ శాశ్వతంగా అంతమవుతాయి.
.
శివలింగం:...
"లింగం" అనే మాటలో "లిం" అంటే ఈ ప్రపంచంలోని సకల చరాచర వస్తువులు లయమయ్యే స్థలం. "గం" అంటె, అలా లయమైన సకలజీవకోటి తిరిగి దాని నుండి ఉద్భవించడం.
మహా పతివ్రత సీతాదేవి.
* నేటి మహిళలకు ఆదర్శం సీతాదేవి ...
* సీతమ్మ గుణగుణాలు, వ్యక్తిత్వం ...
.
.
హిందూ మతంలోని విశ్వాసాల ప్రకారం సీత శ్రీమహాలక్ష్మి అవతారం. విష్ణువు అవతారమైన శ్రీరాముని ధర్మపత్ని. రామాయణము సీతాయాశ్చరితం మహత్ అని చెప్పబడింది. జానకి, మైధిలి, వైదేహి, రమ కూడా సీత పేర్లు. సీతను తరచు సీతమ్మ తల్లి, చల్లని తల్లి అని వివిధ రచనలలోను, కీర్తనలలోను ప్రస్తావిస్తారు.
.
క్షమ..దయ...ధైర్యం...వివేకం...ఆత్మాభిమానం కలబోసిన ఉదాత్తమైన స్త్రీ పాత్ర ‘సీత'. సతీ లేనిదే రామాయణం లేదు. సీత లేకుండా రాముని జీవితాన్ని అసలు ఊహించలేము. కాబట్టే రామాయణ ఇతిహాసంలో ఆమె పాత్రపై ఎందరో మహానుభావాలు మరియు మేథావులు పరిశోధనలు కూడా చేశారు. సీతలోని సుగుణాలు నేటి మగువలకు ఎంతో ఆదర్శం. ఆమె చరితం ఓ స్ఫూర్తిదాయకమైన కథాసాగరం. రామాయణంలో ఏ ఘట్టం తీసుకున్నా సీత గుణగుణాలు ప్రతి ఒక్కరికీ ఎంతో ఆదర్శప్రాయంగా నిలుస్తాయి... ధర్మమూర్తి: సీత ఒక ఇల్లాలిగా తన భర్త బాధ్యతలో, కర్తవ్య దీక్షలో తను కూడా పాలుపంచుకొని ఆదర్శ గృహిణిగా మారిన మహాసాధ్వి ‘సీతాదేవీ'. రాముడు తండ్రికి ఇచ్చిన మాటకు కట్టుబడి అరణ్యవాసానికి వెళ్లినప్పడు తన భర్త అడుగుజాడల్లో తనూ నడిచి, అతని కష్టసుఖాల్లో పాలు పంచుకోవడానికి సిద్దమైన ధర్మపత్నిగా తన ధర్మాన్ని నిర్వర్తించింది.
.
దయాశీలి:...
పేదవారిని ఆదరించి అన్నం పెట్టాలన్న దయాగుణం గల స్త్రీమూర్తి సీత. అదే భావనతో తనింటికి మారువేషంలో బిక్షాటన వచ్చిన రావణుడికి లక్ష్మణరేఖ దాటి మరీ భిక్షం వేసిన దయామూర్తి ఆమె. తన రక్షణ కోసం పెట్టుకున్న నియమం కన్నా దానమే గొప్పదన్న నీతిని ఆమె ఈ సందర్భంలో వెల్లడిస్తున్నది.
.
ధైర్యశాలి:..
పాతివ్రత్య నిరూపణ కోసం సీతను అగ్నిప్రవేశం చేయమని రాముడు అడిగినప్పుడు ధీరత్వంతో ఆ పనికి సిద్ధమైన ధైర్యశాలి సీత. రాముని మాటలు ఆమె గుండెను గాయపరిచినా సహనంతో భరించింది. తానే తప్పు చేయలేదన్న ఆమె ఆత్మవిశ్వాసం చివరికి నిందారోపణ చేసిన వారిని సైతం తలదించుకునేలా చేసింది.
.
అభిమానవతి:...
సీతకు ఆత్మాభిమానం ఎక్కువ. చిత్రకూటానికి సీతారాములు వచ్చారని తెలిసి, ఆమె తండ్రి జనకుడు వారిని కలిసి వనవాసం పూర్తయ్యేదాకా మిథిలా నగరానికి వచ్చి తనతో పాటు ఉండమని కోరినప్పుడు, ఆ మాటలను సున్నితంగా తిరస్కరించిన ఆత్మాభిమాని సీత. మెట్టినింటి కొచ్చాక ఎన్ని విషమ పరిస్థితులు
ఎదురైనప్పటికీ తమే పరిష్కరించు కోవాలి గానీ, పుట్టింటి వారిని ఇబ్బంది పెట్టకూడన్న అభిమానవతి సీత.
.
జంతు ప్రేమికురాలు:...
ప్రకృతి మీద, పశుపక్ష్యాదుల మీద ఎనలేని ప్రేమ కలిగిన స్త్రీమూర్తి సీత. అదే ప్రేమతో అందమైన జింకను తన కోసం తీసుకురమ్మని భర్తను అభ్యర్థిస్తుంది సీత.
రావణాసురుడు తనను అపహరించి తీసుకెళ్లిపోతున్నప్పుడు, రాముడికి తన ఆనవాళ్లు చిక్కడం కోసం బంగారునగలను నేల మీద జారవిడిచిన వివేకవంతురాలు సీత.
.
ప్రేమమూర్తి:...
సీతకు రామునిపై ఎంతటి ప్రేమానురాగాలంటే..ఆ ప్రేమలో తనను తానే మైమరిచిపోయేది. రావణుడి చెరలో బందీగా ఉండి కూడా నిత్యం శ్రీరామనామస్మరణ చేస్తూ అనుక్షణం పతి క్షేమాన్ని కోరేది.
సీత ఎంత చైతన్యశీలి అంటే అపాయంలో కూడా భయంతో ఆమె శత్రువులకు లొంగలేదు. రావణడు సీతను బెదిరించి, తన వశం కావాలని ఆదేశించినప్పుడు, ఒక గడ్డిపరకను అడ్డంగా పెట్టుకొని నువ్వు నాకు దీనితో సమానం అని చెప్పకనే చెప్పి అతని ధర్మహీనతను ప్రశ్నించిన ప్రజ్ఝావంతురాలామె.
.
క్షమాగుణం:...
రాక్షస సంహారం తర్వాత సీతను అవోకవనం నుంచి విడిపించి తీసుకువెళ్తున్న సమయంలో, తను బందీగా ఉన్నప్పుడు ఆ వనంలో తనను మాటలతో హింసించిన రాక్షసులకు ఏ కీడు తలపెట్టవద్దని, వారు స్వామిభక్తితో తమ బాధ్యతను మాత్రమే నిర్వర్తించారని హనుమంతునితో చెప్పిన క్షమాగుణం సీత సొంతం.
.
ఆదర్శమూర్తి:...
అడవిలో ఆశ్రమవాసిగా కాలం గడుపుతూ కూడా తన కుమారులను ప్రయోజకుల్ని చేయాలని ఎల్లవేళలా తపిస్తూ, వారిని కార్యసాధకులుగా తీర్చిదిద్దడం ఆమె ఉత్తమ పెంపకానికి నిదర్శనం.
.
సీతమ్మ వారి పూర్వీకులు ఎవరు ?
నిమి సీతాదేవి వంశ మునకు మూల పురుషుడు. ఈయన కొడుకు "మిధి",
మిధి కుమారుడు జనకుడు.
ఈ వంశము నందే కీర్తి రాతుడు, మహారోముడు ప్రభవించారు .
మహా రామునికి స్వర్ణ రోముడు.
స్వర్ణ రోము నికి హ్రస్వ రోముడు
హ్రస్వ రోముని సన్తామే జనకుడు.
జనకుని అసలు పేరు " సీరధ్వ జుడు" ,
జనకుని తమ్ముడు " కుశె ధ్వజుడు "
హ్రశ్వరోముడు జనకునికి పట్టాభిషేకము చేసి అడవులకు వెళ్ళిపొయినాడు.
జనకునికి సీతమ్మ వారితో పాటు "ఊర్మిళ " కూడా ఉన్నది .
జనకుని తమ్ముడు "కుశె ధ్వజుడు" కి మాండవి, శ్రుత కీర్తి అను కుమార్తెలు ఉన్నారు .
యూరోపియన్ అమ్మాయి నిర్మించిన కురింజి అండవర్ ఆలయం.
శ్రీవేంకటేశ్వరుని వైభవం.
* భోగ శ్రీనివాసమూర్తి వెండి విగ్రహాన్ని తిరుమల ఆలయానికి సమర్పించిన
పల్లవ మహారాణి సామవాయి పేరిందేవి ....
.
.
.
.
మూలమూర్తి (ధ్రువబేరం) :...
నిత్యం లక్షలాదిమంది భక్తిప్రపత్తులతో దర్శించుకునే మూలవిరాట్టును ధ్రువబేరం అంటారు. ధ్రువ అంటే స్థిరంగా ఉండేది అని అర్ధం. ధృవబేరం అంటే నేలలో స్తంభం పాతుకున్నట్లు స్థిరంగా ఉండే విగ్రహమూర్తి. మూలవిరాట్టు అయిన ధ్రువబేరానికి తెల్లవారుజామున సుప్రభాతసేవ మొదలు, అర్ధరాత్రి ఏకాంతసేవ వరకూ రోజంతా ఆరాధనలు జరుగుతాయి. ఈ మూలవిరాట్టు సాలగ్రామమూర్తి. మూలమూర్తి శిరస్సు నుండి పాదం వరకూ ఎనిమిది అడుగుల ఎత్తులో ఉంటుంది. ''వీరస్థానక'' పద్ధతిలో నిలబడి ఉన్న మూలవిరాట్టు పక్కన శ్రీదేవి, భూదేవి విగ్రహాలు ఉండవు. నిత్యం లక్షలాదిమంది భక్తులు తిరుమలేశుని దివ్య మంగళ దర్శనం కోసం ఎదురుచూస్తారు కనుక ఈ మూలవిరాట్టును (ధృవబేరం) దర్శించుకోడానికి రెండు క్షణాల కంటే సమయాన్ని కేటాయించలేరు.
.
భోగ శ్రీనివాసమూర్తి (కౌతుక బేరం) :...
ఒక అడుగు ఎత్తులో ఉండే భోగ శ్రీనివాసమూర్తిని వ్యవహారంలో భోగ శ్రీనివాసుడు అంటారు. ఇంకోరకంగా కౌతుక బేరం లేదా పురుష బేరం అంటారు. నిత్యం జరిపే దీపారాధన, నైవేద్యం, అభిషేకం, ఏకాంత సేవలు భోగ శ్రీనివాస మూర్తికి జరిపిస్తారు. ఈ వెండి శ్రీనివాసుని విగ్రహాన్నిక్రీస్తుశకం 614లో పల్లవ మహారాణి సామవాయి పేరిందేవి ఆలయానికి సమర్పించినట్లు శాసనాల్లో ఆధారాలు లభించాయి. మహారాణి ఈ శ్రీనివాసమూర్తిని సమర్పించిన నాటి నుండి నేటివరకూ ఎన్నడూ ఆలయం నుండి విగ్రహాన్ని ఆలయం నుండి తొలగించలేదు. ఆగమ శాస్త్రాన్ని అనుసరించి మూలవిరాట్టుకు చేసే సేవలు భోగ శ్రీనివాస మూర్తికి అందుతాయి.
.
ఉగ్ర శ్రీనివాసమూర్తి (స్నపన బేరం) :...
ఉగ్ర శ్రీనివాసమూర్తిని స్నపన బేరం అంటారు. ఈ మూర్తి శ్రీదేవి, భూదేవి సమేతంగా ఉంటుంది. నిజానికి శ్రీనివాసమూర్తి రూపం 11వ శతాబ్దం వరకూ ఉత్సవ విగ్రహంగా ఉండేది. క్రీస్తుశకం 1330లో ఒకసారి ఉత్సవ విగ్రహంగా ఊరేగింపు జరుపుతుండగా అగ్నిప్రమాదం సంభవించింది. దాంతో, అది ఉగ్ర శ్రీనివాసుని రూపానికి సంకేతంగా భావించారు. అప్పటినుంచి శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప రూపాన్ని ఉత్సవ విగ్రహంగా రూపొందించారు. ఆవిధంగా అగ్ని ప్రమాదం జరిగినప్పటినుంచి ఉగ్ర శ్రీనివాస మూర్తిని సంవత్సరానికి ఒకసారి సూర్యోదయానికి ముందు సర్వ అలంకారాలతో సుందరంగా తీర్చిదిద్ది ఊరేగింపుకు తీసుకెళ్ళి, తిరిగి అంతరాలయానికి తీసుకొస్తారు.
.
శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి (ఉత్సవబేరం) :...
13వ శతాబ్దంలో ఉగ్ర శ్రీనివాసమూర్తిని ఊరేగింపుకు తీసికెళ్ళడం మానేసిన తర్వాత శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామిని ఉత్సవ వేడుకల్లో ఊరేగిస్తున్నారు. ఈ శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామిని ఉత్సవబేరం అంటారు. ఈ మూర్తి మూడు అడుగుల ఎత్తు ఉంటుంది. బ్రహ్మోత్సవాలతో సహా ప్రతి ఉత్సవంలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామినే ఊరేగిస్తారు.
.
కొలువు శ్రీనివాసమూర్తి (బలిబేరం) :...
గర్భగుడిలో మూలవిరాట్టు పక్కన ఉండే మరొక చిన్న విగ్రహాన్ని కొలువు శ్రీనివాసమూర్తి అంటారు. ఆగమ పరిభాషలో బలిబేరం అంటారు. మూలవిరాట్టుకు తోమాలసేవ నిర్వహించిన తర్వాత కొలువు శ్రీనివాసుని బంగారు సింహాసనంపై ఉంచి పంచాంగ శ్రవణం చేస్తారు. తిరుమలలో ఆవేళ జరిగే ఉత్సవ వేడుకలు ఏమైనా ఉంటే వాటి వివరాలను తెలియజేస్తారు. శ్రీవారి హుండీలో గతరోజు వచ్చిన కానుకల వివరాలను, ఆదాయ, వ్యయాలను తెలియజేస్తారు.
చింతమన్ గణేష్ ఆలయం.
బైజ్నాథ్ ఆలయం.
స్వయంభుగా వెలసిన శ్రీ నెమలి వేణుగోపాలస్వామి.
* తెలుగు రాష్ట్రలలో ఉన్న ఏకైక కృష్ణాలయం ...
* భూగర్భమునుండి సాక్షాత్కరించిన కృష్ణ పరమాత్ముడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు...
.
.
.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఏకైక కృష్ణాలయం, పేరెన్నికగన్న పుణ్యక్షేత్రం, నిత్యం భక్తుల రాకతో పులకించే గ్రామం, సందర్శకులతో సందడిగా ఉండే ప్రదేశం, భక్తుల విరాళాలతో దినదినాభివృద్ది చెందుతున్న దేవస్థానం, లక్షలాది మంది భక్తులు ఇలవేల్పుగా కొలిచే కృష్ణాజిల్లా గంపలగూడెం మండలంలోని ‘నెమలి’ గ్రామంలోని వేంచేసి ఉన్న శ్రీవేణుగోపాలస్వామివారి ఆలయం.
.
నెమలి వేణుగోపాలస్వామిని కొలిచే భక్తులు నవ్యాంద్రప్రదేశ్ ,తెలంగాణా రాష్ట్రాలలో లక్షలాది మంది ఉన్నారు. తాము కోరిన కోరికలు తీర్చే ఇలవేల్పుగా స్వామివారిని ఆరాదించే భక్తజనం నెమలి ఆలయాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ఎప్పటి నుంచో అభిలాషిస్తున్నారు. పాలక ప్రభుత్వాలు నెమలి పుణ్యక్షేత్రం స్వామి వారి దర్శనం ‘సర్వైశ్వర దాయకం సర్వరోగ నివారిణి’ అనే భావంతో వస్తున్నా భక్తులకు ఆలయ అధికారులు వసతి కలిపిస్తున్నా, రాకపోకలకు నానా ఇక్కట్లు పడుతున్నారు. మానసిక ప్రశాంతత లేనివారు, అంతుచిక్కని వ్యాధుల బారిన పడినవారు, సంతానలేమితో బాధపడేవారు స్వామిని దర్శించి తమ మొక్కుబడులను తీర్చుకుంటారు.సోమవారం, శుక్రవారంల్లో ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. భక్తుల భూరి విరాళాలుతో ఆలయ ప్రాంగణంలో ఎన్నో కట్టడాలు నిర్మించారు. పర్యాటకులను ఆకర్షిస్తున్నారు.
.
“కృష్ణ పరమాత్ముడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి అవతారం. ద్వాపరయుగంలో రాక్షస సంహారానికి, రాక్షసత్వం భరతం పట్టడానికి అవతరించిన శ్రీ మహావిష్ణువు. దశావతారాల్లో కృష్ణావతారం బహుళ ప్రచారమైంది. అటు శృంగారంతో పాటు అఖండ చతురతతో రాజనీతి యోగనిష్టగా భారత యుద్ధంలో పాల్గొన్న అవతారమూర్తి గీతాగోవిందుడు.”
.
*స్వయంభువుగా స్వామివారు ఎలా వెలిశారు :..
1953 మార్చి 23 న (శ్రీరామనవమి నాడు) వేణుగోపాలస్వామి నెమలిలో స్వయంభుగా వెలిశారు. స్వామివారి విగ్రహం నెమలి గ్రామానికి చెందిన వనమా సీతారామయ్య అనే షావుకారు తన పొలంలోని సారవంతమైన మట్టి కోసం తవ్వుతుండగా మొదటిసారి గడ్డపలుగు ఉపయోగించగా వెంటనే ఖంగుమని శబ్దం వచ్చింది. ఆ వింత ధ్వని అర్ధం కాక కొంచెం పక్కగానే గడ్డపలుగు వేయగా అదే శబ్దం వచ్చింది. ఆ ధ్వని ఆలోచించుతూనే అతడు ఆ రెండు ఘతాముల మధ్య మరల పలుగు ప్రయోగించగా ఆ చోట బ్రహ్మాండమైన మిరుమిట్లుతో ఒక మెరుపు వెలువడింది. ఆ కాంతి తీవ్రతకు అతను మూర్చ పోయాడు అది చూసిన మిగిలిన వారు ఆందోళనతో అతని ముఖం పై చల్లని నీళ్ళు చల్లి కొద్ది సేపు సపర్యలు చేసారు. ఆతను కొంచెం తేరుకొని తనకు ఏమి కనిపించడంలేదని అన్నాడు. అపుడు మిగిలినవారంతా ఆప్రాంతంలో త్రవ్వి చూడగా ఒక విగ్రహం దానిచెంతనే ప్రాచీన శంఖము, పాచిక లభ్యమయినది. ఆరోజు పరమ పవిత్రమైన శ్రీరామనవమి (23-3-1953) ఆవిషయం తెలిసిన షావుకారు నవమి వేడుకల నిర్వహణలో ఉన్న ఆతను ఆ బాధ్యతలు వేరేవారికి అప్పగించి హుటాహుటీన తన అనుచరులతో కలిసి విగ్రహం లభ్యమైన దివ్యస్తలానికి చేరుకున్నాడు. ఆ విగ్రహమును పరిశీలించి శ్రీ వేణుగోపాల స్వామివారి దివ్య మంగళమూర్తి అని గ్రహించారు.
.
కటారు వెంకటేశ్వర్లు ఉపయోగించిన గునపము వలన శ్రీస్వామివారి వేణువుకు కుడి, ఎడమలవైపుల తగిలి చిటికిన వ్రేలు భిన్నమయింది. గ్రామ పెద్దలు పెనుగొలను చెందిన అర్చకుడు నందలి క్రిష్ణమచార్యులుని వెంటనే రప్పించి స్వామివారి విగ్రహం చూపించగా మూడు అడుగుల ఎత్తు, ఉత్తరాభి ముఖముగా వ్యత్యస్థ పదముల నడుము, శిరస్సులు చక్కని ఓంపులతో మురళిని మ్రోగించుచూ, త్రిభంగిమతో దివ్య సుందరమైన చక్రములతో పాదముల కడ ఇరువైపులా విన్ద్యమారాలు వీచు గోపికా స్త్రీలు గోవులతో కూడి అలరారుచు ఉన్న ఆ ఏక శీల విగ్రహమును చూసి శ్రీ వేణుగోపాలస్వామివారి విగ్రహంగా గ్రహించారు.
.
స్వామివారు భూగర్భమునుండి సాక్షాత్కరించిన తీరుకు గ్రామ ప్రజలు భక్తీ పారవశ్యంతో ఆశ్చర్యపోయారు. ఈసందర్భంగా భక్తులు స్వామివారిని ప్రతిస్థదలచి ఉరేగించ బయలుదేరగా స్వామివారు భక్తునికి ఆవహించి “నేను దర్శనమిచ్చిన చోటనే తనను ప్రతిష్టించాలని ఆదేశించారు” . స్వామి ఆదేశమును వెంటనే అమలుచేయదలచాగా ఉత్తరాభి ముఖమున వెలసిన స్వామివారిని తూర్పు ముఖముగా ఉంచడంతో ఆకస్మికంగా గాలివానతో కూడిన పెను తుఫాను విరుచుకుపడింది. వేసిన పందిళ్ళు చిన్నభిన్నమయ్యాయి. పొరపాటును గ్రహించిన వారు స్వామివారిని యధావిధిగా ఉత్తరాభి ముఖముచేయగా కొద్ది క్షణములలొనే తుఫాను శాంతించింది. వెంటనే గ్రామ పురోహితులతో పూజలు నిర్వహించారు.
.
1957 ఫిబ్రవరి 6న శాస్రోక్తంగా నల్లనయ్య విగ్రహాన్ని వేదపండితుల ఆద్వర్యంలో ప్రతిష్టించారు. అప్పటి నుంచి స్వామివారి ఆలయం దినదిన ప్రవర్ధమానం చెందుతూ భక్తులు కోరిన కోరికలు తీర్చే ఇష్టదైవంగా వేణుగోపాలస్వామి నిలిసారు. నెమలి వేణుగోపాలస్వామి ఆలయానికి భక్తులు సమర్పించే కానుకలు వేలంపాటలు ద్వారా ఏటా రూ.కోటి వరకు ఆదాయం లభిస్తుంది. ఆ మొత్తం దేవస్థానం నిర్వహణకే సరిపోతుంది. ఉత్సవాలు, వేడుకలు ప్రసాదాలు సిబ్బంది జీతభత్యాలు తదితర వ్యయాలు ఆలయానికి వచ్చే ఆదాయం ద్వారా ఖర్చు చేస్తున్నారు.
.
నెమలి పుణ్యక్షేత్రం పర్యటక కేంద్రంగా రూపాంతరం చేసేందుకు రవాణా వసతి ప్రదాన అడ్డంకిగా మారింది. వేలల్లో భక్తులు ఇక్కడికి వస్తుంటారు. తెలంగాణా సరిహద్దున ఉన్న నెమలికి ఆ రాష్ట్రంలోనే భక్తులు అధికం. ప్యాకేజి టూర్ కు జిల్లాలో ఇతర దేవాలయల నుంచి నెమలి గ్రామం దూరంగా వుండడం కూడా సమస్యగా ఉంది. పుణ్యక్షేత్రాల సందర్శనకు రెండేళ్ళ క్రితం ఆర్టీసీ ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల ద్వారా దూరప్రాంతాలకు చెందిన భక్తులు ఇక్కడకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని తరించారు. ఇదే తరహాలో జిల్లాలో విజయవాడ కనకదుర్గ, వేదాద్రిలోని నరసింహ స్వామి, పెనుగంచిప్రోలులోని శ్రీతిరుపతమ్మ ఆలయాల మీదుగా నెమలికి వచ్చేందుకు రవాణా సౌకర్యం ఉంటే ఉపయుక్తంగా ఉంటుంది.
.
నెమలి వేణుగోపాలస్వామి ఆలయానికి ప్రముఖుల సందర్శన కొదవలేదు. రాష్ట్ర స్థాయి ప్రజాప్రతినిదులు అధికారులు ప్రముఖులు తరచూ స్వామివారి సేవకు వస్తుంటారు. స్థానిక నాయకులు అధికారులు వారందరికీ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దలని తద్వారా ప్రభుత్వానికి ఆదాయ వనరులు పెరుగుతాయని వినతులు అందజేస్తున్నారు. హామీలు ఇస్తున్నారే తప్ప అవి అమలుకు చర్యలు తీసుకున్న దాఖాలాలు లేవు ఆలయాన్ని సందర్శించిన మంత్రులు, ఎంపిలు ఎమ్మెల్యేలు వివిధ శాఖల రాష్ట్ర స్థాయి అధికారులు పర్యటక కేంద్రం చేయలన్నారే తప్ప చేయలేదు.
.
కన్నుల పండువగా స్వామివారి తిరుకళ్యాణం:...
ఏటా ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి నాడు స్వామివారి తిరు కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆరు రోజులపాటు నిర్వహించే స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో లక్షల మంది భక్తులు పాల్గొంటారు. ప్రతి నెలా పూర్ణిమ నాడు మాస కళ్యాణం, గోశాలలో నిత్యం గోపూజలు జరుగుతూ ఉంటాయి. ఆలయంలో ప్రతి ఆది, సోమ, శుక్రవారాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. వైఖాసన ఆగమనం పద్దతిలో స్వామివారు పూజలందుకునే ఈ ఆలయంలో భక్తుల అన్నప్రాసనలు, వాహన పూజలు, వివాహాలు తదితర శుభకార్యాలు స్వామివారి సన్నిధిలో అధికంగా నిర్వహిస్తారు. శ్రీ కృష్ణాష్టమి, భీష్మ ఏకాదశి, ముక్కోటి, ధనుర్మాసోత్సవం, ఉగాది, శ్రీరామనవమి విశేషంగా నిర్వహిస్తారు.
.
నెమలి పుణ్యక్షేత్రానికి ఇలా చేరుకోవాలి:...
నెమలి పుణ్యక్షేత్రానికి తెలంగాణా రాష్ట్రంలోని మధిర నుంచి నెమలి గ్రామానికి చేరుకోవాలి. ఇతర ప్రదేశాల నుంచి వచ్చేవారు రైలు లేదా బస్సు మర్గాన మధిర చేరుకొని అక్కడినుంచి నెమలి పోవు బస్సు ఎక్కాలి. సాధారణ రోజుల్లో కుడా తిరువూరు, మధిర డిపోల నుంచి నుంచి నెమలికి బస్సులు తిరుగుతాయి. స్వామివారి తిరుకళ్యాణం రోజున మధిర, తిరువూరు డిపోల నుంచి బస్సులు ఉచితంగా తిరుగుతాయి.
పట్టీశ్వరర్ టెంపుల్.
తీర్థ మలై.
ముండేశ్వరి మాత ఆలయం.
ముండేశ్వరి ఆలయంలోని రామనవమి, శివరాత్రి పండుగలు ఎంతో ప్రభావితం చేస్తాయి. ఆధ్యాత్మిక కీర్తిలో మునిగి పారవశ్యం పొందటానికి ప్రతి ఏటా పెద్ద సంఖ్యలో తీర్థయాత్రీకులు ఈ ఆలయానికి వస్తారు. నవరాత్రి సందర్భంగా జరిగే ప్రతి ఏటా జరిగే ఉత్సవంలో అనేక మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించడం మరొక ప్రధాన అంశం.
పాతాళగంగ.
ముక్కనుమ.
*ముక్కనుమ భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు గడిచిన నాలుగువ రోజున వస్తుంది.
*కనుమ మరునాటిని 'ముక్కనుమ' అని అంటారు. దీనికి బొమ్మల పండుగ అని పేరు.
* ఈ రోజున కొత్తగా పెండ్లి అయిన మహిళలు 'సావిత్రి గౌరివత్రం' అంటే 'బొమ్మల నోము' పడతారు.
*దేవిని తొమ్మిది రోజులు పూజించి తొమ్మిది పిండివంటలతో రోజూ నివేదన చేసిన పిదప ఆ మట్టి బొమ్మలను పుణ్య తీర్థమందు నిమజ్జనం చేస్తారు.
*ముక్కనుమ నాడు సావిత్రి గౌరివ్రతం చేసే మహిళలకు దీర్ఘ సుమంగళీ ప్రాప్తం చేకూరుతుందని విశ్వాసం.


























