దైవదర్శనం
  • శ్రీ మల్లెంకోండేశ్వర స్వామి ఆలయం.. మల్లెంకొండ..

    సేతుబంధనం చేసేముందు శివలింగాన్ని శ్రీరాముడు ప్రతిష్టించినట్లు శివపురాణం వర్ణిస్తోంది. ఇతర పురాణాల్లో కూడా రాముడు శివలింగాన్ని ఆరాధించిన విషయం కనిపిస్తుంది. కొన్ని చోట్ల హత్యాపాతక నివారణార్థం శివలింగ ప్రతిష్ఠలు చేసిన గాథలున్నాయి వీటిని కాదనలేము..!

  • పంచలింగాల కోన..

    అది శేషాచల అటవీ ప్రాంతం.. దట్టమైనఅడవులు.. రాళ్లూ రప్పలతో కూడిన గుట్టలు... చిన్న చిన్న బాటలు.. ఎటు చూసినా ఎత్తైన చెట్లు.. పక్షుల కిలకిలలారావాలు... వన్యప్రాణులు.. ప్రకృతి అందాలతో అలరారే ఆ క్షేత్రంలో.. సాక్షాత్తూ శివుడు కైలాసం విడిచి ఇక్కడ కొలువైనాడు. లోతైన లోయలో కొలువుదీరిన శివుడిని చేరుకోవడానికి కాలినడకన 9 కిలోమీటర్లు ప్రయాణించాల్సిందే..! ఆ ఆద్భుత స్థలమే పంచలింగాల కోన..!!.

  • ఉల్లెడ ఉమామహేశ్వ‌ర స్వామి

    నల్ల‌మ‌ల ఆడ‌వి లోని ఉల్లెడ ఉమామహేశ్వ‌ర స్వామి కొండ గుహ లెదా వ‌జ్రాల కొండ గుహ ఆని అంటారు. ఈవ‌జ్రాల కొండ గుహ‌లో ఉల్లెడ న‌ర‌సంహాస్వామి గుహ‌, ఆశ్వ‌థ్దామ గుహ‌, వున్నఉల్లెడ ఉమామహేశ్వ‌ర స్వామి గుహ అను మూడు గుహ‌లు క‌ల‌వు. ఉల్లెడ ఉమామహేశ్వ‌ర స్వామి గుహ లో ఒక శివ‌లింగం, మూడు ప‌డ‌గ‌ల నాగుపాము, శంఖం, మ‌రియు వీణ స్వయంబుగా వెలిచినాయి.

  • కాలి నడకన అధ్భుతమైన యాత్ర...

    ఈ ప్ర‌పంచంలో ప్ర‌కృతిని ఆరాధించ‌నివారుండ‌రు. ప్ర‌కృతి అందాల‌ను చూస్తూ త‌మ‌ను తాము మ‌రిచిపోతుంటారు. అలాంటి ప్ర‌కృతి అందాల‌ను చూసేందుకు ఎంత దూర‌మైనా వెళ్తారు, కొత్త కొత్త ప్ర‌దేశాల కోసం అన్వేషిస్తారు. అలాంటి వారి కోసం నా వంతు స‌హాయాన్ని అందించ‌డానికే ఈ ప్ర‌య‌త్నం. .

  • జ్యోతి శ్రీ సిద్దేశ్వరస్వామి ఆలయం...

    కొన్ని శతాబ్దాలుగా పెన్నానది గర్భంలో దాగి ఉన్న మహిమాన్వితమైన 108 లింగాల శివాలయాల దివ్య క్షేత్రం. రావణ సంహారం అనంతరం బ్రహ్మహత్య దోశ నివారణలో భాగంగా శ్రీ రాముడు దేశవ్యాప్తంగా శివలింగ ప్రతిష్టాపన జరుపుతూ ఇక్కడ శివలింగాలకు పూజలు నిర్వహించి పాప విమోచనం పోందాడని ప్రతీతి. కాలక్రమంలో ఆలయం పెన్నమ్మ కడుపులో కలిసిపోయి, ఇసుకదిబ్బగా మారిపోయింది.

హిందువుల పరమ పవిత్ర గ్రంథం భగవద్గీత.


* శ్రీ మహావిష్ణువు ముఖ కమలం నుంచి వెలువడిన సిద్ధాంత గ్రంథం భగవద్గీత ...
* భగవద్గీత ఎలా ఆవిర్భావించింది ..??

భగవద్గీత భారతదేశ సాహిత్యంలో తలమానికంగా నిలిచి, ప్రపంచ సాహిత్యంలో ఎంతో ఉన్నతమైనదిగా గుర్తింపు సంపాదించుకున్నది. మహాభారత గ్రంథంలో అంతర్భాగమై స్వతంత్ర గ్రంథంగా యుగయుగాల నుంచి చెలామణిలో ఉంది. మహాభారత యుద్ధ ప్రారంభంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి తన కర్తవ్యాన్ని గుర్తుచేస్తూ ”శరీరం, ఆత్మ వేర్వేరు అంశాలు. శరీరానికి పుట్టుట- గిట్టుట (జనన మరణాలు) అనేవి ఉంటాయి. ఆత్మకు మరణం లేదు. ఈ సృష్టికి ఆది- అంతము నేనే. నీవు నిమిత్తమాత్రుడవు” అనే అర్థంలో హితబోధ చేశాడు. అదే భగవద్గీత.
.
క్రీ.శ. ఎనిమిదవ శతాబ్దంలో భగవద్గీతను మొదటిసారిగా వ్యాఖ్యానించింది ఆదిశంకరా చార్యులు. ఇందులో ఆద్యంతంతో పాటు మాయా వాదాన్ని ప్రచారం చేయగా, పదో శతాబ్దంలో శ్రీరామానుజాచార్యులు విశిష్టాద్వైతంతో పాటు పరిణామవాదాన్ని ప్రచారం చేశాడు. స్వామి వివేకానందుడి నుంచి నేటి వరకు ఎంతో మంది తాత్వికులకు స్ఫూర్తి నిచ్చింది భారత ఉపనిషత్‌లు, భగవద్గీత మాత్రమే. అందుకే భగవద్గీత భారత తాత్వికతకు హృదయం వంటిది అని చెప్పవచ్చు.
.
భగవద్గీత, మహాభారత ఇతిహాసములోని భీష్మ పర్వము 25వ అధ్యాయము మొదలు 42వ అధ్యాయము వరకు 18 అధ్యాయములు భగవద్గీతగా ప్రసిద్ధము. కాని గీత ఒక ప్రత్యేక గ్రంథముగా భావింపబడుతుంది. సాక్షాత్తు కృష్ణ భగవానుడు బోధించిన జ్ఞానము గనుక ఇది హిందువుల పరమ పవిత్ర గ్రంథాలలో ఒకటి. సిద్ధాంత గ్రంథమైన భగవద్గీతయందు వేద, వేదాంత, యోగ విశేషాలున్నాయి. భగవద్గీతను తరచుగా "గీత" అని సంక్షిప్త నామంతో పిలుస్తారు. దీనిని "గీతోపనిషత్తు" అని కూడా అంటారు. భగవద్గీతలో భగవంతుని తత్వము, ఆత్మ తత్వము, జీవన గమ్యము, గమ్యసాధనా యోగములు బోధింపబడినవి.
.
భగవద్గీత మహాభారతము యుద్ధానికి ఆదిలో ఆవిర్భవించింది. దాయాదులైన కౌరవ పాండవులు రాజ్యాధికారం కోసం యుద్ధానికి సన్నద్ధమయ్యారు. పాండవవీరుడైన అర్జునునకు రథసారథి శ్రీకృష్ణుడు. యుద్ధానికి ఇరువైపువారూ శంఖాలు పూరించారు. అర్జునుని కోరికపై కృష్ణుడు రణభూమి మధ్యకు రథాన్ని తెచ్చాడు. అర్జునుడు ఇరువైపులా పరికించి చూడగా తన బంధువులు, గురువులు, స్నేహితులు కనిపించారు. వారిని చూచి అతని హృదయం వికలమైంది. రాజ్యం కోసం బంధుమిత్రులను చంపుకోవడం నిష్ప్రయోజనమనిపించింది. దిక్కుతోచని అర్జునుడు శ్రీకృష్ణుని "నా కర్తవ్యమేమి?" అని అడిగాడు. అలా అర్జునునికి అతని రథ సారథి శ్రీకృష్ణునికి మధ్య జరిగిన సంవాదమే భగవద్గీత.
.
భగవద్గీత ఉపనిషత్తుల సారమని, గీతాపఠనం కర్తవ్య నిర్వహణకు, పాపహరణకు మార్గమని హిందువుల విశ్వాసం. కర్మ యోగము, భక్తి యోగము, జ్ఞానయోగము అనే మూడు జీవనమార్గాలు, భగవంతుని తత్వము, ఆత్మ స్వరూపము ఇందులో ముఖ్యాంశములు. భగవద్గీతకు హిందూ మతంలో ఉన్న విశిష్ట స్థానాన్ని ప్రశంసించే కొన్ని ఆర్యోక్తులు ఇవి:
సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాల నందనః
పార్ధో వత్స స్సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్
శ్రీకృష్ణుడను గొల్లవాడు ఉపనిషత్తులనెడు గోవులనుండి అర్జునుడనెడి దూడను నిమిత్తముగా చేసికొని గీత అను అమృతమును పితికెను. బుద్ధిమంతులు అంతా ఈ గీతామృతమును పానము చేయవచ్చును.
ప్రతి వ్యక్తి గీతను శ్రవణ, కీర్తన, పఠన, పాఠన, మనన, ధారణాదుల ద్వారా సేవింపవలెను. అది పద్మనాభుని ముఖ కమలమునుండి ప్రభవించింది. (మహాభారతం - భీష్మ పర్వం)
నేను గీతను ఆశ్రయించి ఉండును. గీత నా నివాసము. గీతాధ్యయనము చేయువాడు భగవంతుని సేవించినట్లే (వరాహ పురాణం)
నిరాశ, సందేహములు నన్ను చుట్టుముట్టినపుడు, ఆశాకిరణములు గోచరించనపుడు నేను భగవద్గీతను తెరవగానే నన్ను ఓదార్చే శ్లోకము ఒకటి కనిపిస్తుంది. ఆ దుఃఖంలో కూడా నాలో చిరునవ్వులుదయిస్తాయి. భగవద్గీతను మననం చేసేవారు ప్రతిదినమూ దానినుండి క్రొత్త అర్ధాలు గ్రహించి ఆనందిస్తారు. (మహాత్మా గాంధీ)
.
(భగవద్గీత గురించి ఎన్నో వ్యాఖ్యానాలున్నాయి. ఎందరో పండితులు, సామాన్యులు, ఔత్సాహికులు కూడా అర్ధాలు, అంతరార్ధాలు, సందేశాలు, విశేషాలు వివరించారు. కనుక "భగవద్గీత సారం" అన్నవిషయం ఇది వ్రాసేవారికి "అర్ధమయినంత, తోచినంత" అని గ్రహించాలి)
కర్తవ్య విమూఢుడైన అర్జునుడికి జ్ఞానం బోధించి, కర్తవ్యంవైపు నడిపించడం అనేది గీత లక్ష్యం అని సందర్భానుసారంగా అనుకోవచ్చును. అయితే అర్జునుడు ఒక పట్టాన ఈ విషయాన్ని అంగీకరించక ప్రశ్నిస్తూ ఉంటాడు. శిష్యునిపై వాత్సల్యంతో శ్రీకృష్ణుడు అతనికి నిగూఢమైన, వేరెవరికీ తెలియని అనేక విషయాలు బోధిస్తాడు.
ఆత్మ నిత్య సత్యమైనది మరియు చావు లేనిది. మృత్యువు వారిని శరీరాల నుండి వేరుచేస్తుందే కానీ ఆత్మను చంపదు. సత్యమైన జ్ఞానము ఆత్మ జ్ఞానమే అంటే తనను తాను తెలుసుకోవడమే, తనలోని అంతరాత్మ గురించి తెలుసుకోవడమే. అభ్యాస వైరాగ్యముల ద్వారా యోగి, వస్తు ప్రపంచాన్ని వదలి సర్వోత్కృష్టమైన పరబ్రహ్మాన్ని చేరగలడు. భక్తి, కర్మ, ధ్యాన మరియు జ్ఞాన మార్గాలలో భగవంతుని చేరవచ్చును.
మనిషి కర్మ చేయకుండా ఉండడం సాధ్యం కాదు. అయితే కర్మలవలన దోషాలు కూడా తప్పవు. సత్పురుషుల ద్వారా జ్ఞానాన్ని సంపాదించి, సత్కర్మలు ఆచరించాలి. కర్మలపై ప్రతిఫలాన్ని ఆశించరాదు. అన్ని కర్మల ఫలాన్ని భగవంతునకు ధారపోయాలి.
కృష్ణుడే పరబ్రహ్మము. సృష్టిలోని సకలము భగవంతుని అంశతోనే ఉన్నాయి. అన్ని పూజల, యజ్ఞాల ఫలాలు ఆ దేవదేవునకే చెందుతాయి. బ్రహ్మ తత్వాన్ని తెలుసుకోవడానికి శ్రీకృష్ణుడు అర్జునునకు తాత్కాలికముగా దివ్య దృష్టిని ప్రసాదించాడు. అనంతము, తేజోమయము, సర్వవ్యాప్తము, కాల స్వరూపము అయిన ఆ శ్రీకృష్ణుని విశ్వ రూపాన్ని చూసి అర్జునుడు తరించాడు.
ప్రకృతిలో సకల జీవాలు సత్వరజస్తమోగుణాలచే నిండి ఉన్నాయి. భగవంతునకు శరణాగతుడైనవాడికి ఈ గుణాల బంధంనుండి విముక్తి లభిస్తుంది.

Share:

కొండపేటు లోని కోరిన కోర్కెలు తీర్చే నిత్యానందుడు నిత్య పూజ కోన.

నిత్య పూజ స్వామి కోన లేక సిద్దేశ్వర కోన అని పిలవబడే ఈ పుణ్య క్షేత్రం కడప జిల్లా, సిద్ధవటం కి 16 కిలోమీటర్లు దూరంలో ఉంది . బస్సు మార్గంలో 12 కిలోమీటర్లు వెళ్ళవచ్చు . తరువాత కాలి నడకన వెళ్ళాలి . ఇక్కడ ప్రతి ఏట శివరాత్రి ఉత్సవాళ్ళు జరుగుతుంటాయి. సుమారు 2 లక్షల ప్రజు స్వామిని దర్శించుకుంటారు. ఈ సిద్దేశ్వర స్వామి వెలసి ఉన్న క్షేత్రం కావున ఈ ఊరికి సిద్ధవటం అని పేరు వచ్చింది.
కోరిన కోర్కెలు తీర్చే నిత్యానందుడుగా నిత్యమూ పూజలందుకుంటూ నిజమైన స్వామి నిత్యపూజ స్వామిగా ప్రసిద్ధి గాంచిన ఆ శివపరమాత్ముని చరిత్ర తెలుసుకోవాలన్న ఆదుర్దా భక్తుల్లో నెలకొనడం జరుగుతోంది. సిద్దవటం సమీపంలో ఉన్న నిత్యపూజయ్యకోనలోని కొండపేటు పైనుండి రాళ్లు ఎగసి పడుతున్నప్పుడు శివనామస్మరణ చేస్తే అక్కడికక్కడే మరో దారిలో వెళ్లిపోతాయని భావన కూడా భక్తుల్లో నిండుగా నిండుకుంది. ఇంతటి ఘనచరిత్ర కలిగిన ఆ మహనీయుడే నిత్యపూజస్వామి. కోరిన వారికి కోర్కెలను తీర్చే నిత్యానందునిగా భక్తులు భక్తిపారవశ్యంతో పూజించే ఈ నిత్యపూజస్వామి లీలలు అంతా ఇంతా కాదు. సాక్షాత్తు శివపరమాత్ముడే నిత్యానంద అనే మహాఋషి అవతారమెత్తి కొండపేటుపై స్వరంగ మార్గంలోని ఓ గుహలో తపస్సునాచరిస్తూ ఊద్భవలింగంగా మారినట్లు పూర్వీకులు చెబుతున్నారు. ఊద్భవలింగంగా మారిన స్వామివారిని కొండ కింది భాగాన కొలువుదీరిన అక్కదేవతలు, ఊద్భవలింగానికి అహర్నిషలూ పూజలు చేస్తూ ఆయన సేవలకు తమ జీవితాన్ని అంకింతం చేశారన్న వార్తలు కూడా పూర్వీకుల ప్రచారంలో ఉన్నాయి.
ఇక్కడ ప్రతి ఏట శివరాత్రి ఉత్సవాల నాడు అన్నదాన కార్యక్రమాలు జరుగుతుంటాయి , ఇక్కడ ప్రకృతి మహా సోయగంగ ఉంటుంది. పచ్చని చెట్లు, అందమైన జలపాతం ఈ పుణ్య క్షేత్రం ప్రత్యెకత. వరాన్ని సిద్దించే స్వామి కావున సిద్దేశ్వర స్వామి అని ఈ క్షేత్రాని ఆ పేరు వచ్చింది.

Share:

ఇంద్రకీలాద్రి పర్వతం పై తనకు తానుగా వెలసిన దుర్గామాత.

* విజయేశ్వర స్వామి ప్రతిష్టించిన హిందూ ఆలయం ...
* ఇంద్రాది దేవతలు కీలాద్రికొండ‌కు తరచూ దుర్గామాత దర్శనం ...
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్ధానం విజ‌య‌వాడ‌లోని కృష్ణానది ఒడ్డున‌ ఉన్న ఇంద్రకీలాద్రి పర్వతం పై ఉన్నది. ఇక్కడ దుర్గా దేవి తనకు తానుగా వెలసిందని క్షేత్ర పురాణంలో చెప్పబడింది. కృతయుగానికి ముందు రాక్షసుల బాధ భరించ లేక కీలుడనే మహర్షి గోర‌ తపస్సు చేసి దుర్గాదేవిని ప్ర‌త్య‌క్ష్యం చేసుకొని అమ్మవారిని తన పైనే నివాసం ఉండి ఆ రాక్షసులను సంహరించమని కోరాడు, అప్ప‌డు అమ్మవారు కీలుని పర్వతంగా నిలబడమని కృతయుగంలో రాక్షస సంహారం చేసిన త‌ర్వాత‌ తాను ఆ పర్వతం మీద నిలిచి ఉంటానని మాటిచ్చింది. అప్పుడు కీలుడు కీలాద్రిగా మారి అమ్మవారి కొరకు ఎదురుచూస్తూ వున్నాడు. ఆ అమ్మవారిని సేవించుకోవడానికి ఇంద్రాది దేవతలు కీలాద్రికొండ‌కు తరచూ రావడం వలన ఇంద్రకీలాద్రిగా మారింది. ఇక్కడ మహిషాసురమర్ధిని వెలసిన కారణంగా ఆమె కనకవర్ణంతో వెలుగుతుండ‌డం వ‌ల్ల‌ కనక దుర్గ అయింది.
.
ఈ ప్రాంతంలోనే అర్జునుడు శివుడి కొరకు తపసు చేసి శివుడి నుంచి పాశుపతాస్త్రాన్ని పొందాడ‌ని పుర‌ణాలు చేబుతున్నాయి. ఆ అద్భుత క్షణాలకు గుర్తుగా అర్జునుడు ఇంద్రకీలాద్రిపై విజయేశ్వర స్వామి వారి గుడిని ప్రతిష్టించాడని ప్రతీతి. ఈ స్వామి పేరు మీదుగా ఈ ప్రాంతానికి విజయవాడ అయింది. పూర్యం ఇంద్రకీలాద్రిపై బోలెడన్ని రాతి గుడులు ఉండేవి. ఈ గుడులు కాలక్రమంలో కొన్ని శిధిలమైపోయాయి. ఇక్క‌డ‌ క్వారీలలో రాళ్ళ కోసం తవ్వకాలు జరుపుతుండ‌గా అక్కడ కొన్ని రాతి గుడులు బయటపడ్డాయి.

Share:

సతీసహగమనం చేసేందకు పూనుకున్న ఉయ్యూరు వీరమ్మ తల్లి చరిత్ర.


వీరమ్మ తల్లి కి 520 చరిత్ర వుంది .ఆ కాలమ్ లో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు దగ్గర పెద కడియం అనే గ్రామం లో యాదవ కులానికి చెందిన ”బొడ్డు ”వారి ఆడ పడుచు గా ఆమె జన్మించింది .తండ్రి పరశురామయ్య ,తల్లి పార్వతమ్మ .పరమేశ్వర వర ప్రసాదం గా జన్మించి నందున ”వీర శివమ్మ ”అని పేరు పెట్టారు .చిన్న తనం నుంచి భక్తీ శ్రద్ధ లతో ,దైవ చింతన తో పెరిగింది .ఉయ్యూరు గ్రామానికి చెందిన యాదవ దంపతులు పారుపూడి చలమయ్య ,చెల్లమ్మ ల పెద్ద కుమారుడు చింతయ్య తో ,ఆమె ఎనిమిదవ ఏట జ్యేష్ట శుద్ధ దశమి నాడు ,పెదకడియం లో ఆమెకు వివాహం చేశారు .కొంత కాలమ్ పుట్టింట్లో నే వుంది ,యుక్త వయసు రాగానే ఉయ్యూరు లోని మెట్టి నింటికి సంసార జీవన మాధుర్యాన్ని అనుభవించ టానికి పుట్టి నింటి వారు పంపారు .అత్త వారింట్లో అందరి అభిమానాన్ని ,ఆదరాన్ని పొందింది వీరమ్మ .తన సేవా తత్పరత తో అత్త గారైన మేనత్తను ,మామయ్యను మెప్పించింది .మరది భోగయ్య ను బిడ్డ లాగ చూసింది .చుట్టు పక్కల వారికే కాక బంధు గణానికీ అంతటికీ ఆమె ”ఉత్తమా ఇల్లాలు ”అయింది .భర్త సేవలో జీవితం ధన్యం చేసుకోంది .కాలమ్ ప్రశాంతం గా గడిచి పోతోంది .ఇంతలో కుటుంబం లో ఒక అలజడి రేగింది .మరది భోగయ్యకు అచ్చమ్మ తో వివాహ మైంది .ఆమె గర్విష్టి ,విద్యా హీన .ఆమెకు వీరమ్మ మీద అసూయా పెరిగింది .ఊరందరూ తోడి కోడలు వీరమ్మను మెచ్చు కోవటం ఆమె కు బాధ కలిగి అలిగి పుట్టింటికి చేరింది .అయితె సాధ్వి వీరమ్మ ,అత్త మామలకు ,మరిదికి నచ్చ చెప్పి ,తోడి కోడల్ని ,మళ్ళీ అత్త వారిల్లు చేరేట్లు చేసింది .ఆమె మనసు లోని అసూయా తొలగి పోయి ,తోడికోడళ్ళు అన్యోన్యం గా వుంటూ ,వూరి వారికి ఆదర్శ మైనారు .
ఉయ్యూరు గ్రామం లో ,కరణం సుబ్బయ్య కు స్త్రీ వ్యామోహం ఎక్కువ .అతని కళ్ళు సాధ్వీ మణి వీరమ్మ పై పడ్డాయి .లోబరుచు కోవటానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు .దగ్గర లో వున్న” గురజాడ ”గ్రామం లోని తన బావ మరిది ”సీతయ్య ”ను తనకు సాయం చేయమని బ్రతిమి లాడాడు .అతడు రావణాసురుడికి మారీచుడు చేసి నట్లు హిత బోధ చేశాడు .చెవి కెక్క లేదు .ఎంతైనా బావ గారు కదా తన సోదరి కాపురం ఏమవుతుందో ననే భయం సీతయ్య కు పట్టు కొంది .మంత్ర తంత్రాలు తెలిసిన సీతయ్య మెత్త బడి చివరికి సాయం చేయ టానికి ఒప్పు కున్నాడు .మేకల ,గొర్రెల మేత కోసం చింతయ్య ,భోగయ్య సోదరులు వాటిని తోలు కోని ఉత్త రాదికి అంటే బెజవాడ అవతలి ప్రాంతాలకు వెళ్ళారు .ఇదే అదునైన సమయం అని బావమరిది సీతయ్య ను ప్రేరేపించాడు బావ సుబ్బయ్య .సీతయ్య ప్లాన్ వేశాడు .తన నౌకరుకు విషం పూసిన సొర ముల్లు ఇచ్చి ,చింతయ్య పై రహశ్యం గా ప్రయోగించమని చెప్పి పంపాడు .ముస్తాబాద్ లో గొర్రెల మందల దగ్గర నిద్ర పోతున్న చింతయ్యను ఆ నౌకరు విషం వున్న ఆ సొర ముల్లు తో పొడిచి హత్య చేశాడు . .చింతయ్య బాధ భరించ లేక చని పోయాడు .తమ్ముడు భోగయ్య అన్న శవాన్ని ఉయ్యూరు చేరుస్తాడు . ఈ వార్త విని వీరమ్మ తల్లడిల్లి పోతుంది .తాను గాడం గా ప్రేమించిన భర్త తో సహ గమనం చేయాలని నిస్చ యించుకొంది .తన భర్త హత్యకు కారణం సుబ్బయ్య అని తెలుసు కోని ,అతని వంశం నిర్వంశం కావాలని శపించింది .సుబ్బయ్య అకస్మాత్తు గా చని పోయాడు .అతనితో అతని వంశము అంతరించింది .వీరమ్మ పుట్టినింటి వారు ఈమెను మళ్ళీ పెళ్లి చేసుకోమని బల వంత పెట్టారు .ఆమె కు కోపం వచ్చి పుట్టి నింటి వారిని కూడా ”నిర్వంశం ”కావాలని శాపంపెట్టింది.
సతీ సహగమనానికి ఉయ్యూరు జమీందారు గారు ,గోల్కొండ నవాబు ప్రతినిధి ”జిన్నా సాహెబ్ ”అంగీకరించారు .వీరమ్మ మహిమలు వెంట వెంటనే బయట పడుతూ ,ఆమె అంటే అందరి లో భక్తీ ఏర్పడింది . చింతయ్య కు చితి ఏర్పాటు చేయించారు .వీరమ్మ కు అగ్ని గుండం ఏర్పాటు అయింది .గుండం తవ్వ టానికి ఉప్పర కులస్తులు ఒప్పుకోక పొతే ,మాదిగ వారు వచ్చి తవ్వారట అందుకే సిడి బండి నాడు ఆ కులానికి ప్రాధాన్యత ఏర్పడింది .ముత్తైదువులు పసుపు దంచుతుంటే ,రోలు పగిలింది .వీరమ్మ తల్లి మోకాలు అడ్డు పెట్టి ,తానూ రోకటి పోతూ వేసింది .ముత్తైదువులకు పసుపు ,కుంకుమ లు పంచి పెట్టింది .ఆమె దంచిన రోలు ఇప్పటికీ ఆలయం దగ్గర కన్పిస్తుంది .చింతయ్య చితికి తమ్ముడు భోగయ్య నిప్పు అంటించాడు .వేలాది ప్రజలు భోరున విల పిస్తుండగా ,అత్తా మామలు ,బంధు గణం శోక సముద్రం లో మునిగి ఉండ గా పుణ్య స్త్రీలతో, తోడి కొడాలి తో ,”పారెళ్ళు ”పెట్టించుకొని ,పెళ్లి కూతురు లా ,పుష్పాలతో శిరోజాలను అలంకరించు కోని ,సాధ్వీమ తల్లి ,పతివ్రతా శిరోమణి ,వీరమ్మ తల్లి ,భర్త చితికి మూడు సార్లు ప్రదక్షిణం చేసి ,భగ భగ మండే ఆ మంటలో తానూ ,భర్త చితి పై చేరి అగ్ని గుండం లో సహ గమనం చేసింది .ఆదర్శ మహిళ గా ,మహిమ గల తల్లి గా ఆ నాటి నుంచి ,ఈ నాటి వరకు ప్రజల నీరాజనాలు అందు కొంటోంది.
రాజ ప్రతినిధి ”జిన్నా సాహెబ్’ వీరమ్మ నమస్కారం చేసి ,ఇంటికి వెళ్లి నిద్ర పోయాడు .ఆ రాత్రి నిద్ర లో వీరమ్మ భర్త చింతయ్య తో సహా మహా తేజో వంతం గా ,సర్వాలంకార శోభ తో ,కన్పించింది .స్త్రీలు పూజలు చేస్తున్నట్లు ,వీరమ్మ వారి కోర్కెలు తీరుస్తున్నట్లు ,గండ దీపాల కాంతి లో అమ్మ తల్లి ,ఒక దుష్ట శక్తిని కాలితో తన్నుతూ ఉయ్యాల ఊగు తున్నట్లు గుడి పక్కనే పెద్ద తటాకం వున్నట్లు ,అందులో వికసించిన తామర పూలున్నట్లు సాహెబ్ గారికి కల లో కన్పించిందట .ఉదయం లేచి జమీందారు ను పిలి పించారు .జమీందార్ కు కూడా అలాంటి స్వప్నమే వచ్చి నట్లు చెప్పారట చింతయ్య మరణానికి కారకు లెవరో తెలుసు కోవ టానికి వేగుల్ని పంపారు .సుబ్బయ్యే కారణం అని అమ్మ వారి సహ గమనం రోజే తీవ్ర మైన బాధ తో అతడు మరణిం చాడని తెలుసు కున్నారు .సుబ్బయ్య వంశం సర్వ నాశనమై చివరికి వారసులెవరు లేకుండా నిర్వంశం అయింది .
అందరూ ఆలోచించి ,వీరమ్మ అత్త మామ ల తో సంప్రదించి ,గ్రామస్తులతో సమా వేశం జరిపి ,సహగమనం జరిగిన చోటు లో ఆలయాన్ని నిర్మించారు .చెరువు తవ్వించారు .వీరమ్మ ,చింతయ్య లవిగ్రహాలను ఉయ్యాల స్తంభాలను తయారు చేయించారు .జిన్నా గారు ,జమీందారు గార్ల సమక్షం లో భక్త జన సందోహం మధ్య వైభవం గా ప్రతిష్ట జరిగింది .ఆలయం ఉయ్యాల స్తంభాల ఖర్చును జిన్నా గారే పెట్టు కొన్నారు .చెరువును తవ్వించిన ఖర్చు ,ప్రతి ఏటా మాఘ శుద్ధ ఏకాదశి నుండి పదిహేను రోజులు పాటు జరిగే ఉత్సవ ఖర్చు జమీందారు భరించారు.
ఆ నాటి నుంచి ముందుగా మెట్టి నింటి వారు తర్వాత జిన్నా గారు రాజు గారు తర్వాత గ్రామస్తులు అమ్మ వారి ఉత్స వాలను ప్రారంభించి కొన సాగించారు .పారు పూడి వంశం వారినీ ,జమీందారు గారినీ ,ప్రభుత్వాధి కారులని ధర్మ కర్తలు గా జిన్నా గారు నియమించారు .అంటే వీరమ్మ తల్లి తిరుణాలను ప్రభుత్వ పరం గా నిర్వ హించే ఏర్పాటు చేశారన్న మాట .అందుకే నేటికీ పోలీసు వారిచ్చే పసుపు కుంకుమ చీరే సారే లతో సంబరాలు ప్రారంభ మవటం ఆన వాయితీ గా వస్తోంది .
అమ్మ వారు ఉయ్యాల ఊగే ప్రదేశం లో ఏ కట్టడమూ వుండదు .తన భర్తనూ హత్య చేయించిన కిరాతకుడు సుబ్బయ్య ను కాలితో తన్ని,చిరు నవ్వు చిన్దిస్తున్నట్లు ఉయ్యాల ఊగటం లో అంత రార్ధం .ఆమె సహగమనం చేసిన రెండు మూడు రోజులకే మాఘ శుద్ధ ఏకాదశి రావటం అదే భీష్మ ఏకాదశి కావటం ఆ రోజూ నుంచే ఉత్స వాలు ప్రారంబించటం జరుగు తోంది . చరిత్ర కాల గర్భం లో కలిసినా ,వీరమ్మ తల్లి మహిమలు నిత్య నూతనం .నమ్మిన వారికి నమ్మి నంత శుభం చేకూర్చే తల్లి వీరమ్మ .తిరునాళ్ళు పదిహేను రోజుల్లో ను ,ఉయ్యూరు లో ఏ ఇంట్లోను పసుపు దంచరు ,కుంకుమ తయారు చేయరు .ముందే సిద్ధం చేసు కొంటారు .కారం కూడా కొట్టరు .ఇవి స్వచ్చందం గా అందరు పాటించే నియమాలే .తిరునాళ్ళ లో అమ్మ వారికి సాధారణం గా అందరు చీరే పసుపు కుంకుమ పెట్టటం అలా వాటు .అంతే కాక ఆ తర్వాత ఎవరింట్లో నైనా వివాహం లాంటి శుభ సందర్భాలు వచ్చి నప్పుడు కూడా చీరా సారే పెడుతుంటారు మెట్టి నింట్లో వున్న అమ్మ వారికి ”.అమ్మ వారి చీరలు” అని ప్రత్యేకం గా అందరికి అందు బాటైన ధరలో ప్రతి వస్త్ర దుకాణం లో ను లభిస్తాయి .ఆమె పవిత్రత ను ఇలా తర తరాలుగా పాటిస్తూ ,నేటికీ నిల బెట్టు కొంటు న్నారు ఉయ్యూరు ,పరిసర గ్రామాల వారు .అమ్మ వారి ఊరేగింపులో జనరేటర్ తో అమర్చే విద్యుత్ బల్బుల శోభ ఆకట్టు కొంటుంది .యాదవ కులస్తులు తిరునాళ్ళ రోజుల్లో వివాహాలు చేయరు .పెళ్లి అయిన వాళ్ళు కూడా ,ఆ పవిత్ర దినాలలో బ్రహ్మ చర్యం పాటించి ,వంశ ప్రతిష్ట ను నిల బెట్టు కొంటారు .బంధువులను పిల్చుకొని విందు భోజ నాలు ఏర్పాటు చేసు కొంటారు .అంతా పెళ్లి శోభ లాగా వుంటుంది .ఇప్పటికీ పారు పొడి వంశాస్తులే ఆలయ పూజార్లు .ఆలయానికి చాలా ఎకరాల పంట పొలాలున్నాయి .అవన్నీ పూజారులే అనుభవిస్తారు . . .ఇదే వీరమ్మ తల్లి పుణ్య చరిత్ర .ఇప్పుడు అమ్మ వారి చరిత్ర పై మంచి పాటల కేసెట్లు సి.డి లు వచ్చి అందరికి అందు బాటు లో వున్నాయి.

Share:

మంచు గడ్డల్లోని 70 అడుగుల శివలింగం శ్రీఖండ్ మహాదేవ క్షేత్రం.


హిమాచల్ ప్రదేశ్ లోని కులు జిల్లా లోని సముద్ర మట్టం నుండి 5155 మీటర్ల ఎత్తులో ఉన్న శ్రీఖండ్ మహాదేవ, హిందువుల యొక్క ప్రసిద్దమైన పుణ్యక్షేత్రం. మహా శివుడు ఇందులో కొలువై ఉన్నాడు. శివుడు ఈ పర్వతం వద్ద ధ్యానం చేసాడని పురాణాలు చెబుతున్నాయి. గొప్పదైన భారతీయ ఇతిహాసం అయిన మహాభారతంలో పాండవులు ఈ ప్రాంతానికి విచ్చేశారని చెప్పబడింది. ఈ పర్వతం వద్ద ఉన్న శివలింగం లో అధ్బుతాలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. ఏడాది పొడవునా ఈ ప్రాంతం లో మంచు కురిసినా ఈ శివలింగం పైన మాత్రం కురిసిన వెంటనే మంచు కరిగి పోతుందని వారు చెబుతున్నారు. అధ్బుతమైన పుష్పాలతో సందర్శకులని ఆకర్షిస్తున్న గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్కలోని భాగం శ్రీఖండ్ మహాదేవ అలయం.
Share:

అత్యంత సంపన్నమైన మహాలక్ష్మీ దేవి ఆలయం.

* భక్తులకు నైవేద్యంగా బంగారాన్ని, వెండిని ఇచ్చే మహిమాన్వితమైన ఆలయం ..
* ఆలయంలో బంగారు, వెండి, డబ్బుల కట్టలతో తోరణాలు...
.
.
భక్తులారా..!! గుడిలో ప్రసాదంగా మీకు ఏమి ఇస్తారు..?? మహఅంటే లడ్డు, కేసరి, శనగలు, పులిహోర, దద్దోజనం … లడ్డు (తిరుపతి) అవునులెండి ఇండియాలో ఎక్కడ పోయినా ఇలాంటివి నైవేద్యంగా ఇవేయిస్తుంటారు కదా..!! కొన్ని దేవాలయాల్లో కాస్త విచిత్ర ప్రసాదాలను సైతం ఇవ్వటం ఇప్పటివరకు చూశాము. భారతదేశంలోని హిందూ దేవాలయాలలో విచిత్ర ప్రసాదాలు ఇచ్చే ఒక ఆలయం ఉంది అక్కడ ఆలయంలో దర్శనానికి వచ్చిన భక్తులకు నైవేద్యంగా బంగారం, వెండి ఇస్తుంటారు..
.
నైవేద్యంగా బంగారాన్ని, వెండిని ఇచ్చే దేవాలయం భారతదేశంలో ఇదొక్కటే. అదే మహాలక్ష్మీ దేవాలయం. ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రత్లామ్ అనే ప్రాంతంలో కలదు. రత్లామ్ ప్రాంతం బంగారానికి, రత్లమి సేవ్ కు, రత్లమి చీరలకు ప్రసిద్ధి చెందినది. మండు వేసవి విహార యాత్రకు చక్కటి ప్రదేశం ! రత్లామ్ లోని మహాలక్ష్మి గుడి అత్యంత సంపన్నమైనది. గర్భగుడిలోని దేవతకు నోట్ల దండలు, బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలతో అందంగా ముస్తాబుచేస్తారు. ప్రతిఏడాది ఈ గుడికి విరాళాలు భారీగా వస్తుంటాయి. అందులో బంగారం, వెండి కీలకం.
.
ప్రత్యేకంగా ప్రతిఏడాది దీపావళి రోజున మహాలక్ష్మీ దేవాలయంలో ఉత్సవాలు జరుగుతాయి. వీటిని మూడు రోజులపాటు నిర్వహిస్తారు. వేడుకలు జరిగేటప్పుడు అమ్మవారిని నోట్ల దండలతో, బంగారు, వెండి వస్తువులతో అలంకరిస్తారు. వీటి విలువ 100 కోట్ల పైమాటే. బహుశా ఇండియాలో ఎక్కడా ఇలా అలంకరించరేమో … !! బాంధవ్ ఘర్ – పాండవులు వేటాడిన ప్రాంతం ! అంత భారీగా విరాళాలుగా వచ్చే బంగారాన్ని, వెండిని దేవస్థానం వారు భక్తులకు ప్రసాదంలా తిరిగి ఇస్తుంటారు. ఈ ప్రసాదాన్ని పొందేందుకు భక్తులు కొన్ని వందల, వేల కిలోమీటర్లు ప్రయాణిస్తుంటారు. ఇండోర్, ఉజ్జయిని, వడోదర తదితర ప్రాంతాల నుండి రత్లామ్ చేరుకోవడం సులభం.
.
ఒక్కోసారి భక్తులు పొందే ప్రసాదం (బంగారం, వెండి) వచ్చే రాకపోకల ఖర్చుకు సరిపోదు. అయినా భక్తులు దేవుని ప్రసాదంగా ఇంట్లో పెట్టుకుంటే శుభం కలుగుతుందని నమ్ముతారు. ఆలస్యం చేయకుండా మీరూ వెంటనే ప్రసాదం తెచ్చేసుకోండి ..! రత్లామ్ గురించి రత్లామ్ సముద్రమట్టానికి 480 మీటర్ల ఎత్తున (1575 అడుగులు) మాళ్వా ప్రాంతంలో కలదు. మధ్యప్రదేశ్లోని రత్లమ్ జిల్లాకు హెడ్క్వాటర్స్ ఇది. రత్లమ్ అందమైన ఆలయాలకు నెలవు.
.
రత్లామ్ ఎలా చేరుకోవాలి:..
రత్లామ్ చేరుకోవడానికి వాయు, రైలు మరియు రోడ్డు మార్గాలు చేరువలో ఉన్నాయి. వాయు మార్గం : సమీపాన 104 కి. మీ ల దూరంలో ఇండోర్ విమానాశ్రయం, 190 కి. మీ ల దూరంలో ఉదైపూర్ ఏర్ పోర్ట్ లు కలవు. క్యాబ్ లేదా ట్యాక్సీ లలో ప్రయాణించి రత్లామ్ చేరుకోవచ్చు. రైలు మార్గం : రత్లామ్ లో రేల్‌వే జంక్షన్ కలదు. దేశం నలుమూలల నుండి ఇక్కడికి రైళ్ళు వస్తుంటాయి. హైదరాబాద్, ముంబై, ఇండోర్, ఉదైపూర్, కోల్‌కతా ప్రాంతాల నుండి రెగ్యులర్ గా రైళ్ళు స్టేషన్ మీదుగా వెళుతుంటాయి. బస్సు మార్గం/ రోడ్డు మార్గం : రత్లామ్ కు దాని సమీప ప్రాంతాల నుండి చక్కటి రోడ్డు సదుపాయం కలదు. రోడ్డు మార్గంలో వచ్చేవారు అంతర్ రాష్ట్ర బస్సులు, ట్యాక్సీ లు, క్యాబ్ లలో ప్రయాణించి చేరుకోవచ్చు.
Share:

అరకొండ సంజీవరాయుని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం.

ప్రాచీన కాలంలో ఒక వానర జాతి ఉండేది. ఆ వానర జాతి వారు మనుషుల్లాగానే నాగరికత కలిగి పట్టణాల్లో జీవించేవారు. పెళ్ళిళ్ళు చేసుకొని సంసారం కొనసాగించేవారు. వారిలో కొందరు వేదాలు , పురాణాలు చదువుకొన్న మహా పండితులు కూడా ఉండేవారు. మనషులకు మించిన శక్తి యుక్తులు వారి సొంతం. వారికి ప్రత్యేకత ఏమంటే వెనక ఒక తోక ఉండేది. సభ్యత సంస్కారం కలిగిన వానరులకు ఒక రాజు కూడా ఉండేవాడు. అంటే పేరుకు వానరులయినా మేధస్సులో మనుషులకు తీసిపోని జాతి అది. హనుమంతుని జీవితం గురించి వివిధ గాధలు ప్రచారంలో ఉన్నాయి. ప్రధానంగా రామాయణంలో హనుమంతుడు శ్రీరాముని బంటుగానే ప్రస్తావింపబడింది. కొన్ని పురాణాలు, ఉపనిషత్తులు,సంప్రదాయ గాధలలో మరికొన్ని విషయాలు, కథలు ఉన్నాయి.
చిత్తూరు జిల్లా, తవణంపల్లి మండలానికి చెందిన గ్రామము. అరగొండ చిత్తూరు పట్టణము నుండి 20 కిలోమీటర్ల దూరములో ఉన్నది. రావణ సంహారం చేయడానికి రామలక్ష్మణులు యుద్ధరంగాన నిలుస్తారు. మేఘనాథుడుతో తలపడిన లక్ష్మణుడు, ఆయన అదృశ్య శక్తుల ధాటికి తట్టుకోలేక స్పృహకోల్పోతాడు. అప్పటికప్పుడు సంజీవిని ఔషధం అవసరం కావడంతో, ఆ మొక్కకోసం ఓ పర్వత భాగాన్ని పెకిలించుకు వస్తానప్పుడు కొండలో సగభాగం ఇక్కడ విరిగి పడింది కనుక ఈప్రాంతానికి అరకొండ అనే పేరువచ్చిందని క్రమంగా అదే అరగొండ అయిందని స్థానికుల భావిస్తున్నారు. అనుదుకని ఇక్కడ ఆంజనేయస్వామికి గుడి కట్టి ఆరాధిస్తుథున్నారు. అర్ధ గిరిలో సంజీవరాయ పుష్కరణి' లో నీటిని సేవించిన సర్వ రోగములు తొలగును అని ప్రజల విశ్వాసం.

Share:

మహిమాన్వితమైన బాల హనుమంతుడు.

* భారతదేశంలో అతి ప్రాచీన హనుమాన్ ఆలయం..
* ముష్కర మూకల దౌర్జన్యానికి తట్టుకొని నిలబడిన హిందూ దేవాలయం .
.
ఇప్పుడు కొత్త ఢిల్లీగా పిలవబడే ఇంద్రప్ర స్థపురం పురాణ ప్రసిద్ధి చెందిన నగరం ఎన్నో రాజ వంశాలు పాలించిన నగరం .ఇక్కడ కన్నాట్‌ సర్కస్‌ ప్రాంతంలో జంతర్‌ మంతర్‌ సమీపం లో పాండవుల కాలం నాటి బాల హనుమాన్‌ మందిరం చాలా ప్రసిద్ధి చెందింది .దీంతో బాటు మేహ్రాలిలోని యోగమా య ,కల్కాజిలోని కల్కాజి మా, పురాన్‌ ఖిల్లాలోని భైరవ దేవాలయాలు పౌరాణికప్రసిద్ధి చెం దిన దేవాలయాలు. ఇవన్నీ ఒేక కాలంలో నిర్మింప బడినవే ….
.
బాల హనుమాన్‌ దేవాలయం :కొత్త ఢిల్లీలోని కన్నాట్‌ ప్లేస్‌ దగ్గర బాబా ఖరాక్‌ సింగ్‌ మార్గ్‌లో అతి ప్రాచీన బాల హనుమాన్‌ దేవాలయం ఉంది .ఈ దేవాలయమే భారతదేశంలో అతి ప్రాచీన హనుమదాలయం అని భావిస్తారు పాండవుల కాలం నాటి ఆలయమని ఇక్కడి వారి పూర్తి విశ్వాసం . .పైన పేర్కొన్న దేవతా మూర్తులందరూ స్వయంభువులేనని నమ్మిక .ఈ బాల హనుమాన్‌ మందిరం మొగలాయి దండయాత్రలలో ముష్కర మూకల దౌర్జన్యాలలో తట్టుకొని నిలబడిన దేవాలయం .దీనికి ఒక ముఖ్య కారణంఉంది.ఆ నాటి రాజ పుత్ర వీరుడు పృద్వీరాజ్‌ చౌహాన్‌ మహామ్మదీయులను ఎదిరించి పోరాడాడు. దానికి ప్రతీకారంగా వారు హిందూ దేవాలయాలన్నిటిని ధ్వంసం చేశారు కుతుబ్‌ కాంపెక్స్‌లోని లాల్‌ కోట వద్ద అవ్వత్‌ ఉల్‌ ఇస్లాం మసీదు నిర్మాణానికి ఈ రాళ్ళు అన్నీ వాడారు. బాల హనుమాన్‌ దేవాలయం విమానం మీద చంద్ర వంక ఉన్నది. సాధారణంగా విమానం మీద ఓం లేక సూర్యుని చిహ్నాలు ఉండటం సంప్రదాయం .దీనికి భిన్నంగా ఇక్కడ చంద్ర వంక(నెల వంక ) ఉండటం ఒక ప్రత్యేకత .
.
ఈ చంద్రరేఖను చూసి ముస్లిములు దీన్ని పవిత్రంగా భావించి ఈ బాల హనుమాన్‌ దేవాలయం జోలికే పోలేదు.ఆ చంద్రవంకయే ఈ ఆలయాన్ని కాపాడిందని చెబుతారు. బాల హనుమాన్‌ ఆలయానికి ప్రత్యేకతలు కొన్ని ఉన్నాయి .బాల హనుమంతుడు దక్షణ దిశా ముఖంగా ఉండటం వల్ల ఒక కన్ను మాత్రమే మనకు కనిపిస్తుంది .బాల హనుమంతుడు ఎడమ చేతితో గదను ధరించి ఉంటారు. కుడి చేయి చాతీ పైన ఉండి ప్రార్థన చేస్తున్నట్లు అనిపిస్తుంది పుష్పమాలలతో స్వామి అలంకరింపబడి ఉంటారు. గంధ సింధూరం పూతతో ధగధగలతో శ్రీ బాల హనుమాన్‌ దర్శనమిస్తారు . దాదా గురు అని పిలువ బడే మహారాజ మంగళ దాస్‌ అనే సంత్‌ గారికి స్వామి కలలో దర్శనమిచ్చి తాను స్వయంభువు గా వెలిశానని చెప్పారట. దేవాలయవెండి ద్వారాలన్నీ చక్కని కళాత్మక చిత్రాలతో వైభవంగా కనిపిస్తాయి .
.
రామాయణ గాథలన్నీ దీనిపై చెక్కబడి ఉండటం విశేషం ..ముఖద్వారమే అనేక శతాబ్దాల ప్రాచీనమైనదిగా భావిస్తారు. డెబ్భయవ దశకంలో ఆలయాన్ని కొత్త రీతులతో తీర్చారు.శ్రీ తులసీదాసు విరచిత రామాయణాన్ని ముఖ మండపంపై భాగంలో చిత్రించారు .ఇవి కనులకు గొప్ప విందును చేకూరుస్తాయి .ఈ పైన్టింగ్‌ల కింద తులసీదాస్‌ రామచరిత మానస్‌లోని సుందర కాండ గీతాలను పాలరాయి ఫలకాలపై చెక్కించారు.ఈ విధంగా హనుమంతుడు ఎక్కడాలేని విధంగా బాలహనుమ రూపంలో ఉండటం, అతి ప్రాచీన దేవాలయం అవటం, ముస్లింలు ఈ ఆలయాన్ని ధ్వంసం చేయకుండా ఉండటం, విమానం పై చంద్ర రేఖ ఉండటం… ఈ బాల హనుమాన్‌ దేవాలయ ప్రత్యేకతలు.

Share:

33 కోట్ల దేవి,దేవతల ఆకారాలు కనబడే పాతాళ భూమి శివాలయం గుహ.




కర్నూలు జిల్లా, ఆళ్లగడ్డ మండలం అహోబిలం లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి ముందు 3కిలోమీటర్ల దూరంలో ఎడ‌మ ప‌క్క కొండ‌ల్లోని ఉల్లెడ ఉమామహేశ్వ‌ర స్వామి దెవ‌స్థానంకు మరియు పాతాల్ భువనేశ్వర్ గుహకు దగ్గరి పోలికలు కలవా...? https://www.facebook.com/rb.venkatareddy/posts/10204416195797780 ని చూడండి.....
ఉత్తరాంచల్ పిత్తోడఘడ్ జిల్లా లో ఉంది. ఉత్తరాంచల్ పర్వత ప్రాంతాన్ని "ఘరేవాల్" మరియు" కుమావు"గ విభజించారు . "ఘరేవాల్" మండలంలో కేదార్నాథ్, బదరీ నాథ్ ,గంగోత్రి, యమునోత్రి మొదలైన ప్రాంతాలు ఉన్నాయి "కుమావు "మండలంలో నైనిటాల్, అల్మోడ, పిత్తోరాఘడ్ మొదలైనవి ఉన్నాయి .ఢిల్లీ నుంచి "అల్మోడ "కి 370కిమి,అక్కడ నుంచి "పాతాల్ భువనేశ్వర్ "కి దగ్గర దగ్గర 110కిమి.
పాతాళ భువనేశ్వర్ చాల చిన్న గ్రామం . ఈ గుహా మందిరం ఊరి నుంచి 2,3 కిమీ సన్నని కాలి బాటన ప్రయాణించాలి గుహ చేరడానికి నడక తప్ప మరో మార్గం లేదు. గుహ ముందర చిన్న శివాలయం ఉంటుంది . గుహ ద్వారం చాలా చిన్నది. ఒక మనిషి కూర్చొని ప్రక్కల వేలాడుతున్న గొలుసులు పట్టుకొని జాగ్రత్తగా జారుతూ లోనికి వెళ్ళాలి. అలా ఓ వంద అడుగులు లోపలికి వెళ్ళిన తరవాత 90 అడుగుల లోతు 180 మీటర్ల పొడువు ఉన్న గుహల సముదాయం. ఈ గుహలు సున్నపు రాతి గుహలు. ఇవి ప్రకృతి సిద్దంగా నిర్మించబడ్డాయి. సంవత్సరాలు ఒకేచోట నిరంతరం నీళ్ళు ప్రవహించడం వల్ల ఏర్పడ్డ రూపాలు మనకి మన ఆరాధ్య దేవతా మూర్తులుగా కనబడతాయి. అందులో శివుని జటాఝూటం , వేయి పడగల శేషుడు, ఐరావతం, కల్పవృక్షం , కామధేనువు ,బ్రహ్మ , విష్ణు , మహేశ్వరులు తో పాటు 33 కోట్ల దేవి,దేవతల ఆకారాలు కననడతాయి. ఇవి కొన్ని గుహల సముదాయం .
అది కూడా ప్రకృతిసిద్దం గా ఏర్పడింది అని చెప్తారు ఆ పక్కనే కొంత దూరంలో ఒక చిన్నపిల్లవాని మొండెము ఆకారం కనబడుతుంది దీనిపైన నిరంతరమూ నీటి బిందివులు పై కప్పు నుండి పడుతూ ఉంటాయి . వినాయకుని తల నరికిన పరమశివుడు ఏనుగు తల తెచ్చి అతికించి నంతవరకు ఇక్కడ వినాయకుని మొండెము ఉంచారని దానికి గుర్తుగా ఇక్కడ శిలా రూపాన్ని వదిలి పెట్టారని చెప్తారు.
ఈ గుహలో నాలుగు ద్వారాలు కనిపిస్తాయి ఇవి 1)పాప ద్వారము 2) రణ ద్వారము 3) మోక్ష ద్వారము 4)ధర్మ ద్వారము పాప ద్వారము రావణుని మరణానంతరము మూసుకు పోయిందట. రణ ద్వారము మహాభారత యుద్దానంతరము మూసుకు పోయిందిట. మిగిలిన రెండు ద్వారాలు తెరిచి ఉన్నాయి.ఇక్కడ నుండి కైలాస్ పర్వతానికి గుప్తమార్గం ఉన్నదని అంటారు.
స్కంద పురాణంలో మానస ఖండం లో 800 శ్లోకాలు ఈ గుహల గురించి వర్ణించడం జరిగింది. ఈ గుహలని మొట్ట మొదటగా కనుగొన్నది త్రేతాయుగం లో సూర్య వంశానికి చెందిన ఋతుపర్ణ మహారాజు.అది ఎలా అంటే నల మహారాజు తన భార్య అయిన దమయంతి చే ఒకానొక పందెములో ఓటమి పొందుతాడు. శిక్ష నుండి తప్పించు కొనడానికై రుతుపర్ణుని సహాయం కోరుతాడు నలుడు. అప్పుడు ఋతుపర్ణుడు నలుని ఈ అరణ్యమున విడిచిపెట్టి తిరిగి తన రాజ్యమునకు -పోవు మార్గములో కొంత సమయము విశ్రాంతి కొరకై చెట్టు నీడన విశ్రమిస్తాడు. అప్పుడు ఒక అందమయిన జింక "నన్ను వేటాడకు రాజా "అంటూ పరుగెత్తుకొని పోవడం కనిపిస్తుంది. "నేను జింకను వెంటాడనేలేదు .మరి జింక అలా అన్నది అంటే వెంబడించమనా?"అని
తలపోసి ఆ జింకని వెంబడించెనట .కొంత దూరం పరుగెత్తిన జింక ఒక ప్రదేశంలో అంతర్దానమైనదట. ఆ ప్రదేశమును ఋతుపర్ణుడు పరిశీలించగా అక్కడ రామగంగా ,గుప్తగంగా మరియు సరయు నదుల సంగమమని తెలుసుకొని "ఇంత పవిత్రమైన ప్రదేశమునకు మాయ జింక ఏదో కార్యార్దమై దారి చూపెనని "తలచి పొదలు తొలగించి చూడగా పాతాళభువనేశ్వర్ గుహలు బయల్ప్దడినవని ఇక్కడ స్తల పురాణం వివరిస్తోంది. త్రేతాయుగములో పాండవులు మహాభారత యుద్దానంతరము ఇక్కడ కొద్ది రోజులు ఈ గుహలలో తపస్సు చేసుకొని ఇక్కడ గల గుప్త మార్గము గుండా కైలామునకు వెళ్లేరని చెప్తారు.
ఆది శంకరాచార్యుల వారు పూజించిన శివలింగం కలియుగములో ఆది శంకరులు కుడా ఇక్కడికి వచ్చి తపస్సు చేసుకొని ఇక్కడ నుండే కైలాసానికి వెళ్లినారని చెప్తారు. ఈ గుహలో గల శివలింగమునకు వెండి, పాదరసము పూసి అప్పటి వరకు జ్వలిస్తున్న లింగాన్ని ఆది శంకరులు చల్లపరిచేరని అంటారు.ఈ పాతాళభువనేశ్వరుని దర్శించుకుంటే చార్ ధామ్ యాత్ర చేసినంత పుణ్యం వస్తుందని స్తానికుల నమ్మకం. మరో విషయం ఈ గుహలలో రాతికి చెవి ఆనిస్తే నీటి ప్రవాహ "గల గలలు" వినిపిస్తాయి.

Share:

మహిమాన్వితమైన శ్రీహనుమాన్ మందిరం.

* హనుమాన్ విగ్రహనికి మీసాలు, ఆడ రాక్షసిని కాళ్ళ కింద తొక్కుతున్న దృశ్యం ...
* పవిత్రమైన హనుమంతుణ్ణి బావిలోని నీరు ....
* దయ్యాలను వదిలించే కస్త్ భంజన్ దేవ్ ....
.
.
గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్ నుండి భావనగర్ వెళ్లే దారిలో, సాలంగ్ పూర్ (సారంగ్ పూర్) అనే ప్రాంతంలో ప్రసిద్ధిచెందిన శ్రీ హనుమాన్ మందిరం కలదు. ఈ హిందూ దేవాలయం స్వామినారాయణ ఆలయంగా ప్రసిద్ధి చెందినప్పటికీ ... హనుమాన్ కు అంకితం చేశారు. ఈయనను ఇక్కడ కస్త్ భంజన్ దేవ్ గా పూజిస్తారు.
.
దేశంలో ప్రసిద్ధిచెందిన స్వామినారాయణ ఆలయాలలో ఇది కూడా ఒకటి. ఇక్కడ అప్పుడప్పుడు ఎన్నో వింతలు, విశేషాలు చోటుచేసుకుంటాయి. దేవాలయంలో విగ్రహాన్ని సద్గురు గోపాలనంద్ స్వామి ప్రతిష్టించినారు. గోపాలనంద్ స్వామి విగ్రహాన్ని ప్రతిష్టించే సమయంలో హనుమంతుడు విగ్రహంలోకి ఆవహించి చాలాసేపు ఊగిపోయాడని, ఇదొక అద్భుత దృశ్యం అని చెబుతారు.
.
సాలంగ్ పూర్ లో హనుమాన్ 'కస్త్ భంజన్ దేవ్' గా భక్తులకు దర్శనం ఇస్తుంటాడు. హనుమాన్ విగ్రహం మీసాలను కలిగి ఉంటుంది. ఆడ రాక్షసిని కాళ్ళ కింద తొక్కుతున్న దృశ్యం, విగ్రహం వెనకాల కోతులు పండ్లను పట్టుకున్న దృశ్యాలు, గద మొదలైనవి చూడవచ్చు. ఆలయాన్ని ఎక్కువగా దయ్యంపట్టినోళ్లు దర్శిస్తారు. ఆలయంలో రెండు, మూడు రాత్రులు నిద్రించి హనుమంతుణ్ణి సేవిస్తే ఆ బారినుండి విముక్తి లభిస్తుందని భక్తుల నమ్మకం.
.
శనివారం, ఆదివారాలలో ఒక్కోసారి భక్తులు ఆలయం గేట్ బయటే వేచి ఉన్న సందర్భాలు ఉన్నాయి. ఆలయ ప్రాంగణం చాలా పెద్దది, విశాలంగా ఉంటుంది. ప్రాంగణంలోని బావిలో దొరికే నీరు పవిత్రమైనదిగా భావిస్తారు. సమీపంలోనే కౌంటర్ లు ఉంటాయి డబ్బులు చెల్లించి నీటిని ఇంటికి తీసుకెళ్లవచ్చు. ప్రసాదంగా 'సుఖ్ దిస్' అనే గుజరాతి స్వీట్ ను ఇస్తారు.
.
నిత్యాన్నదానాన్ని ఆలయ డైనింగ్ హాల్ లో వడ్డిస్తారు. ఆలయానికి ఎంతమందైతే దర్శిస్తారో అంతమందీ వెళ్లి తినవచ్చు. మీకు ఇష్టమైతే విరాళాలు ఇవ్వండి బలవంతం ఏమీ లేదు. ఎవ్వరూ అడగరు. ఈ అన్నదాన భాద్యత ఆలయ కాంప్లెక్స్ లోని స్వామినారాయణ ఆలయం మరియు ఆలయాల ట్రస్ట్ చూసుకుంటుంది. సుమారు ఐదు వేల మందికి ప్రతిరోజూ అన్నదానం కార్యక్రమంలో భాగంగా ప్రసాదాన్ని ఇస్తారు. ఇది శనివారాలలో రెట్టింపు సంఖ్యలో ఉంటుంది (దాదాపు పది వేలు). హనుమాన్ చాలిసా పుస్తకాలు తక్కువ ధరకే లభ్యమవుతాయి.
Share:

గాయత్రి దేవి అంటే ఎవరు..?


* గాయత్రి మంత్రంలో నిక్షిప్తమై ఉన్న దేవతా శక్తులు...
* మహా శక్తి వంతమైన గాయత్రి మంత్రాక్షరాలు ....
* తల్లిని మించిన దైవం, గాయత్రిని మించిన దైవం ఎవరు లేరా ...
.
.
ఈ సందేహమే ఒకసారి వశిష్ఠ మహర్షికి వచ్చింది. వెంటనే విధాత వద్దకు వెళ్ళి గాయత్రీ తత్త్వాన్ని తెలుపని వేడుకోగా, ‘నా, స్ఫురణ మాత్రంగా ఏ చైతన్యశక్తి ఉత్పన్నమయిందో, దానినే జ్ఞానము లేక వేదముగా చెప్పుకోవచ్చు. దీనినే గాయత్రి నామంతో వ్యవహరిస్తారు. నా నుండి అగ్ని. అగ్ని నుం...డి వాయువు, వాయువు నుండి ఓంకారం, ఓంకారంతో హృతి, హ్రుతితో వ్యాహృతి, వ్యాహృతితో గాయత్రి, గాయత్రితో సావిత్రి, సావిత్రితో వేదాలు, వేదాలలో సమస్త క్రియలు ప్రవర్తిమవుతుదిన్నాయి’ అని బ్రహ్మ తెలియజేశాడు.
.
గాయత్రి మంత్రంలో నిక్షిప్తమై ఉన్న 24 దేవతా శక్తులు.
గాయత్రీ మంత్రంలోని 24 దేవతలు, వారి చైతన్య శక్తులు:
01. వినాయకుడు: సఫలత్వ శక్తికి అధిపతి.విఘ్ననాయకుడైన వినాయకుడు బుద్ధినీ, జ్ఞానాన్నీ ప్రసాదిస్తాడు.
02. నృసింహ స్వామి: పరాక్రమ శక్తికి అధిపతి, పురుషార్థ, పరాక్రమ, వీరత్వ విజయాలను ప్రసాదించేది ఈయనే.
03. విష్ణుమూర్తి: పాలనాశక్తికి అధిష్ఠాత అయిన విష్ణు సర్వజీవ రక్షకుడు.
04. ఈశ్వరుడు: సకల జీవులకూ ఆత్మ పరాయణత్వాన్ని సర్వవిధ కల్యాణ శక్తులనూ ప్రసాదించే దయామయుడు.
05. శ్రీకృష్ణుడు: యోగ శక్తికి అధిష్ఠాత అయిన కృష్ణ భగవానుడు ప్రాణులకు కర్మయోగ ఆత్మనిష్ఠలను, వైరాగ్య, జ్ఞాన, సౌందర్యాదులును ప్రసాదిస్తాడు.
06. రాధాదేవి: ఈమె ప్రేమ శక్తికి అధిష్ఠాత్రి, భక్తులకు నిజమైన ప్రేమ భావాన్ని కలుగజేసి అసూయద్వేష భావాలకు దూరం చేస్తుంది.
07. లక్ష్మీదేవి: ధన వైభవ శక్తులకు అధినేత్రి. సకల లోకానికీ ఐశ్వర్యం, సంపద, పదవి, వైభవం, ధనం, యశస్సులను పుష్కలంగా అందిస్తుంది.
08. అగ్నిదేవుడు: తేజోశక్తికి అధినేత అయిన ఈయన ప్రకాశం, శక్తి, తేజస్సు శక్తి సామార్ధ్యాలను ప్రాసాదిస్తాడు.
09. మహేంద్రుడు: రక్షాశక్తికి అధిష్ఠాత, అనారోగ్యాలు, శతృభయాలు, భూత ప్రేతాదులు నుండి రక్షిస్తాడు.
10. సరస్వతి: విద్యా ప్రదాత. జ్ఞానాన్ని, వివేకాన్ని, బుద్ధిని ప్రసాదిస్తుంది.
11. దుర్గాదేవి: దమన శక్తికి అధిష్ఠాత్రి. అన్ని బాధలనూ తొలగించి, శత్రువుల బారి నుండి కాపాడుతూ సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది.
12. ఆంజనేయుడు: నిష్ఠాశక్తికి ఉపకారి హనుమంతుడు. తన భక్తులకు భక్తి, నిష్ఠ, కర్తవ్య పరాయణ తత్వం, బ్రహ్మచర్య పాల నాశక్తి ప్రసాదిస్తాడు.
13. భూదేవి: ధారణాశక్తికి అధినేత్రి. సకల ప్రాణకోటికి క్షమాశీలత్వాన్ని, ధైర్యాన్ని, దృఢత్వాన్ని, నిరంతరత్వాన్ని ప్రసాదిస్తుంది.
14. సూర్య భగవానుడు: ప్రాణశక్తికి అధిపతి. ఆరోగ్యాన్ని,సుదీర్ఘ జీవనాన్ని, ప్రాణశక్తికి, వికాసాన్ని, తేజస్సును ప్రసాదిస్తాడు.
15. శ్రీరాముడు: ధర్మం, శీలం, సౌమ్యత, మైత్రి, ధీరత్వం లాంటి గుణాలకు ప్రతీక. మర్యాదాశక్తికి అధిష్ఠాత ఈయన.
16. సీతాదేవి: తపశ్శక్తి అధిష్ఠాత్రి. అనన్య భావాలతో భక్తులను తపోనిష్ఠులుగా తయారుచేసి, అధ్యాత్మికోన్నత మార్గానికి ప్రేరేపించేదీమె.
17. చంద్రుడు: శాంతి శక్తికి అధిష్ఠాత. చింత శోకం, క్రోధం, మోహం, లోభం వంటి మానసిక వికారాలను అణిచివేసి శాంతిని ప్రసాదిస్తాడు.
18. యముడు: కాలశక్త్యాదిస్థాత. మృత్యువునకు భయపడకుండా సకల జనులను సమాయత్తం చేసేవాడు.
19. బ్రహ్మ: సకల సృష్టికి అధిష్ఠాత.
20. వరుణుడు: భావుకత్వాన్ని, కోమలత్వాన్ని, దయాళుత్వాన్ని, ప్రసన్నతను, ఆనందాన్ని అందిస్తాడు.
21. నారాయణుడు: ఆదర్శ శక్తికి అధిష్ఠాత. నిర్మలత్వాన్ని ప్రసాదిస్తాడు.
22. హయగ్రీవుడు: సాహన శక్తికి అధిష్ఠాత. ఉత్సాహాన్ని, సాహసాన్ని ప్రసాదిస్తాడు.
23. హంస: వివేక శక్తికి అధిష్ఠాత్రి. హంస క్షీరనీరవివేక జగత్ ప్రసిద్ధమైంది.
24. తులసీ మాత: సేవాశక్తికి అధిష్ఠాత్రి. ఆత్మశాంతి, దుఃఖ నివారణ వంటి ఫలాలను ప్రసాదిస్తుంది.
.
శ్రీ గాయత్రీ మాత మహాత్యం :..
వాల్మీకి రామాయణానికి మూలాధారం గాయత్రీ మంత్రమే. గాయత్రీ మహామంత్రానికి వ్యాఖ్యాన రూపంలో ఈ మహాకావ్య రచన జరిగిందని అంటారు.
ఓమ్ భూర్భువ స్వః ఓమ్తత త్సవితుర్వరేణ్యమ్
భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్
ఇదే గాయత్రీ మూల మంత్రం. గాయత్రిని మించిన మంత్రం లేదు. తల్లిని మించిన దైవం లేదు.
.
త్రికాలలలోనూ గాయత్రీ మంత్రాన్ని అనుష్ఠించటం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. ఆరోగ్యం, సంకల్ప బలం, ఏ కాగ్రత, ఇంద్రియాలపై అదుపు సాధించటానికి ఈ మంత్రం ఉపయోగపడుతుందని మన ప్రాచీన రుషులు చెబుతున్నారు. అటువంటి గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం, గాయత్రీదేవిని మించిన దైవం మరెవరూ లేరన్నది అక్షర సత్యం. హిందూ ధర్మ శాస్త్రాల్లో ఆత్మశక్తిని ప్రసాదించే మంత్రాలు ఎన్నో ఉన్నప్పటికీ, వాటన్నింటిలో గాయత్రీ మంత్రం సర్వ శ్రేష్ఠమైనది. నాలుగు వేదాలలో గాయత్రిలో సమానమైన మంత్రం ఏదీ లేదని విశ్వామిత్రుడు చెబుతాడు. ప్రతి నిత్యం నియమ నిష్ఠలతో గాయత్రిని ధ్యానించలేని, ఉపాసించలేని వారు గాయత్రీ మంత్రాన్ని త్రికాలలోనూ పదిసార్లు చొప్పున జపిస్తే చాల మంచిది. ఏ పనిలో ఉన్నప్పటికీ చేస్తున్న పనిని కాసేపు ఆపి, కాళ్ళకు ఉండే పాదరక్షలను వదిలిపెట్టి ఈ మంత్ర జపం చేయువచ్చు. గాయత్రీ మంత్రాన్ని జపం చేస్తే మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. గాయత్రీ మంత్రంతో పాటుగా ప్రతి ఒక్కరూ ‘ఓం నమో గాయత్రీ మాత్రే’ అని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపిస్తే తప్పక సత్ఫలితాలను పొందుతారు. శ్రీ గాయత్రీ మాత అనుగ్రహం తప్పక లభిస్తుంది.
.
బ్రాహ్మీ ముహూర్తకాలంలో ప్రకృతిలో చేతనాశక్తి పరుచుకుంటున్నవేళ, నిర్మల నదీ తరంగాలు వేదనాదంలా తరంగించే వేళ అపూర్వ తేజోవిరాజితుడైన మునిసత్తుముని కంఠంలో నుండి వెలువడిన సుస్వర మంత్రర్పరి, సృష్టి ఉత్పత్తి, వర్తన, పోషణాలను నిర్దేశించిన అద్భుత చంధో తరంగం గాయత్రీ మంత్రం. ఆ రుషి సత్తముడు మరెవరో కాదు. సృష్టికి ప్రతిసృష్టి చేసిన అపూర్వ తపోబల సంపన్నుడు విశ్వామిత్ర మహర్షి. ఆ మహారుషి తపశ్శక్తిలోంచి వెలువడిన మంత్రమే ఇది.
.
గాయత్రి మంత్రాక్షరాలు :..
సహస్ర పరమాం దేవీం శతమధ్యాం దళవరాం
సహస్ర నేత్రాల గాయత్రీం శరణ మహం ప్రపద్యే
‘న గాయత్ర్యా నరం మంత్రం న మాతుః పర దైవతమ్’
గాయత్రీ మంత్రం అన్ని మంత్రాలలోకెల్లా శ్రేష్ఠమైనది. తల్లిని మించిన దైవం, గాయత్రిని మించిన దైవం లేదు. ‘గయాన్ త్రాయతే ఇతి గాయత్రీ.’ శంకరుని భాష్యం ప్రకారం ప్రాణాన్ని రక్షించేది గాయత్రి. అంటే ఒక స్వతంత్రమైన దేవి, దేవత కాదు. పరబ్రహ్మ పరమాత్మల క్రియాభాగం గాయత్రి. బ్రహ్మయే గాయత్రి. గాయత్రే బ్రహ్మమని శతపథ బ్రాహ్మణం చెబుతోంది. పరమశివుడు బ్రహ్మానందంలో తన డమరుకం చేసిన 24 ధ్వనులే శ్రీ గాయత్రీ మంత్రంలోని 24 అక్షరాలు. ఈ 24 అక్షరాలే 24 దైవిక శక్తులకు ప్రతీకలు. వీటికి 24 పేర్లు ఉన్నాయి. వీటిలో 12 వైదిక మార్గాలు కాగా, 12 తాంత్రిక మార్గాలు. ఈ 24 అక్షరాలు నివాసం ఉంటే 24 దైవశక్తులు ఆయా పేర్లతో పూజింపబడతాయి. గాయత్రి మంత్రాన్ని అనన్య భక్తితో పఠించేవారిని ఆ 24 శక్తులు సర్వవేళలా కాపాడుతాయి.

Share:

నవనందులు

నవనందుల దర్శనం - మోక్షానికి మార్గం..
 సోమవారం రోజున నంద్యాల చుట్టు కొలువై ఉన్న నవనందుల దర్శనం జన్న జన్మల నుండి వెంటాడుతున్న పాప గ్రహ దోషాలన్ని పటాపంచలు అవుతాయని పెద్దల నానుడి. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం లోపల ఈ క్షేత్రాలన్నింటినీ దర్శిస్తే అన్ని దోషాలు తొలగి కుటుంబంలో ఆయురారోగ్యాలతో కోరిన కోర్కెలు ఇట్టే తీరుతాయని భక్తుల ప్రధాన విశ్వాసం. 14వ శతాబ్దం నందన మహారాజుల కాలంలో నవనందుల నిర్మాణ జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. వీటిని దర్శించాలంటే నంద్యాల పట్టణంలో శ్యామ్‌ కాల్వ గట్టున ప్రథమనందీశ్వర ఆలయం, ఆర్టీసి బస్టాండ్‌ దగ్గర ఉన్న శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో నాగనందీశ్వరుడు, ఆత్మకూరు బస్టాండ్‌ సమీపంలో సోమనందీశ్వరుడు, బండిఆత్మకూరు మండలం కడమకాల్వ సమీపంలో శివనందీశ్వరుడు, ఇక్కడి నుండి సుమారు 3 కిలో మీటర్ల దూరంలో కృష్ణనంది (విష్ణునంది), నంద్యాల మహానందికి వెళ్ళే దారిలో కుడి వైపుకు తమ్మడపల్లె గ్రామ సమీపంలో సూర్యనందీశ్వర ఆలయం, మహానంది క్షేత్రంలో మహానందీశ్వరుని దర్శనం అనంతరం వినాయక నందీశ్వరుడు, అనంతరం నంది విగ్రహం సమీపంలో గరుడనందీశ్వర ఆలయాలు కొలువై ఉన్నాయి. వీటికి ప్రత్యేకంగా నంద్యాల ఆర్టీసి వారు బస్సులను ఏర్పాటు చేశారు.
Share:

ఓం నమో వేంకటేశాయ .. శ్రీ వేంకటేశ్వర స్వామి చరిత్రామృతం.


* బ్రహ్మాండ నాయకుని వివాహం ఎలా జరిగింది ...
* సమస్త బ్రహ్మాండం అంతా తిరుమలకు పయనం ...
* శ్రీనివాసుడు మహా శక్తిమంతుడు ...
.
మాకు వార్షికం ఇస్తే వస్తాం అంటారు దేవతలు. అంటే పారితోషికం, ఇంగ్లీష్‌లో బోనస్ అన్నమాట. దేవతలకు డబ్బు వార్షికం కాదు, పుణ్యం, జ్ఞానం మొదలైనవి వార్షికం. ప్రతి ఏటా వీటిని బ్రహ్మదేవుడు దేవతలకు ప్రసాదిస్తాడని చెప్తారు. కలికాలంలో మానవులతో ఏదైనా కార్యం చేయలాంటే, వారికి ఎంతో కొంత మూటజెప్పాల్సి ఉంటుంది. అధికశాతం మంది ఏ పని చేస్తున్నా, 'అయితే నాకేంటీ? ఇందులో నాకు లాభమేమిటి?' అన్న ధోరణితోనే చేస్తారు. దానికి సంకేతంగానే ఈ సన్నివేశం.
.
బ్రహ్మ ఆదేశాల మీద ముక్కోటిదేవతలు కదిలి వస్తారు. గరుడుని వార్తతో యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, మునులు, ఋషులు అంతా బయలుదేరతారు. పురాణం ఆ సన్నివేశాన్ని అద్భుతంగా వివరిస్తుంది. బ్రహ్మ పరివారమంతా కలిసి 10 లక్షల మంది ఉంటారు. 3 యోజనాల దూరం ఉంటుంది ఆ గుంపు. వీరు ఒక్కో లోకాన్ని దాటుతున్న సమయంలో, ఆయా లోకాలవారు కూడా వీరిని కలుస్తారు. అందరూ దివ్యతేజో మూర్తులు. అంతరిక్షంలో ఉన్న నక్షత్రాలన్నీ ఒక చోట చేరితే ఎలా ఉంటుందో, గుంపుగా వస్తుంటే ఎలా ఉంటుందో, అలా ఉంది సన్నివేశం. ఈ పరివారం మధ్యలో గంధర్వులు గానంచేస్తున్నారు, నాట్యం చేసేవారు నాట్యం చేస్తున్నారు. అందరి ముఖాలలో ఆనందం తాండవిస్తోంది.
.
వీళ్ళందరి సంగతి అటుంచితే, ఇక్కడ శ్రీనివాసుడికి ఆతృత పెరిగిపోతోంది. ఏంటో, వీళ్ళు ఇంకా రాలేదు, ఎప్పటికి వస్తారో, అసలు బయలుదేరారో లేదో, సమయానికి చేరుకుంటారా? ..... ఇలా ఆయనలో అనేక ఆలోచనలు కలుగుతున్నాయి. బయటకు, లోపలికి తిరుగుతున్నారు. ఇంతలో గరుత్మంతులవారు, ఆదిశేషులవారు బ్రహ్మాది దేవతల ప్రయాణ వివరాలు చెప్తుంటారు. మీరేం కంగారు పడకందీ స్వామి, దేవతలు ఇప్పుడే హిమాలయాలు దాటారనీ, కాసేపాగి, గంగా దాటారనీ, గోదావరీ నదిని దాటి కృష్ణానదిని సమీపించారని చెప్తుంటారు. అంటే ఎప్పటకప్పుడు 'లైవ్ అప్‌డేట్స్' ఇస్తుంటారనమాట.
.
దేవతలందరితో కలిసి బ్రహ్మ తుంబుర తీర్దం చేరి అక్కడ స్నానం చేసి, అక్కడి నుంచి తిరిగి బయలుదేరుతారు. ఈ విషయం తెలుసుకున్న శ్రీనివాసుడు ఇక ఆగలేక, ఎదురువెళ్ళి బ్రహ్మదేవుని ఆలింగనం చేసుకుంటాడు. శివుడి తలపై నిమురుతాడు. కొందరికి కరచాలనం చేస్తాడు, కొందరికి చేయి ఊపి, ఇంకొందరిని మందహాసంతో, కొందరికి కనుసైగలతో పలకరిస్తాడు. వాయుదేవుడిని ఆలింగనం చేసుకుంటాడు.
.
ఇలా ఇంద్రుడు, అగ్ని, యముడు మొదలైన దేవతలందరినీ ఆదరంతో ఆహ్వానిస్తున్న శ్రీనివాసుడు దృష్టి విశ్వకర్మపై పడుతుంది. "ఇంత మంది నా దగ్గరకు వచ్చినా, నువ్వు మాత్రం గర్వంతో దూరంగా ఉన్నావు" అని పలికి, "ఇతనిని విశ్వకర్మ పదివి నుంచి తొలగించి, నా యందు భక్తిప్రపత్తులు కలిగిన వానిని నియమించు" అని ఇంద్రునితో పలుకుతాడు. వర్ధకి అని పేరుగల ఈ విశ్వకర్మ క్షమించమని స్వామి పాదాలపై పడతాడు. మొత్తం వేంకటాచలం అంతా అతిధులతో నిండిపోయింది. ఎక్కడ చూసిన పండుగ వాతావరణం, కోలాహలం, సందడి, ఒకరిని ఒకరు పరిచయం చేసుకుంటున్నారు, దీవెనలు తీసుకుంటున్నారు, కబుర్లు చెప్పుకుంటున్నారు. పెళ్ళి కళ వచ్చేసింది వేంకటాచలంలో. ఇంతమంది అతిధులు రావడం ఒక ఎత్తైతే, ఇంతమందికి వసతి భోజన ఏర్పాట్లు చేయడం మరొక ఎత్తు కదా.
.
అందుకే శ్రీనివాసుడు ఇంద్రునితో "ఇంత మంది దేవతలు, ఋషులు, బ్రాహ్మణులు వచ్చినపుడు వారికి తగిన సదుపాయాలు చేయాలి కదా, అందుకని 50 యోజనాల పొడవు, 30 యోజనాల వెడల్పు గల ఒక మనోహరమైన సభాభవనం ఏర్పాటు చేయమంటాడు. విశ్వకర్మతో క్షణాల్లో అలాంటి భవనం నిర్మాణం చేయిస్తాడు ఇంద్రుడు. ఇంత మంది అతిధులతో మనం నారాయణ వనం వెళితే, అక్కడ విడిది ఏర్పాటు చేయడంలో ఆకాశరాజు గారికి ఇబ్బంది కలగవచ్చు. అక్కడ కూడా విడిది భవనాలు, సభాభవనాలు ఏర్పరచాలి. ఆకాశరాజు వద్దకు విశ్వకర్మను పంపించి, మాట్లాడి తగిన విధంగా నిర్మాణం చేయించి అని ఇంద్రునితో అంటాడు శ్రీనివాసుడు. అలా నారయణవనం సమీపంలో ఒక మహానగర నిర్మాణమే జరుగుతుంది.
.
బాధ్యత అంతా ఒక్కడే మోయడం కష్టం కనుక, ఒక్కొక్కరికి ఒక్కో పని అప్పజెప్పాడు శ్రీనివాసుడు. ఋషులకు, మునులకు సదుపాయాలు కల్పించడం శివుడికి, మర్యాదలు, పిలుపుల బాధ్యత షణ్ముకుడికి, వంటావార్పు అగ్నిహోత్రునికీ, నీటి సదుపాయం వరుణునికి, ఆకులుదొన్నెలు తయారీ నవగ్రహాలకు, పాత్రల శుద్ధి (ఒకరకంగా క్లీనింగ్ డిపార్ట్‌మెంట్ అనుకోండి) వసువులకు, పౌరోహిత్యం వశిష్టునికి, బ్రాహ్మణులకు దానాలిచ్చే బాధ్యత కుబేరునికి, వెలుగుకి (లైటింగ్ అర్రెంజ్మెంట్) చంద్రునికి అప్పగించారు. బయటకు ఇంతమంది దేవతలు పెళ్ళి పనుల్లో మునిగిపొయినట్టు కనిపించినా, అంత ఒకటే తత్వం. వీళ్ళంతా పరబ్రహ్మం యొక్క ప్రతిరూపాలే. ఒకే భగవంతుడు, అనేక రూపాల్లో, అనేక కార్యాలు చేస్తున్న అద్భుత సన్నివేశం ఇది.
.
వచ్చిన అతిధులందరికీ స్వాగతం పలికిన స్వామి ఒక్కసారిగా డీలాపడిపోతాడు. ఎందుకో ఎవరికి తెలియదు. కారణం అడిగిన బ్రహ్మతో ' ఎంతమంది వస్తే ఏంటి? నా మహాలక్ష్మీ రానంతవరకు ఎవరూ రానట్లే ' అంటాడు. ఇంకా శ్రీనివాసుడు 'ఆమెను ఎవరు పిలుస్తారు? పిలిస్తే వస్తుందా? అంటారేమో, సూర్యుడిని పంపుదాం, సూర్యుడంటే ఆమెకు చాలా అభిమానం, ప్రీతి అని నాకు తెలుసు' అని అంటాడు.
.
ఈ విషయం విన్న సూర్యుడు భయంతో ఒణికిపోతాడు. పెద్దల వ్యవహారం, అందునా భార్యాభర్తల మధ్య తగాదా, ఏమంటే ఏమవుతుందో, అసలేం జరుగుతుందో అని తన భయాన్ని వ్యక్తం చేస్తాడు. తన మాట విని విష్ణుమూర్తితో ప్రణయకలహం ఆడిన లక్ష్మీదేవి తిరిగి వస్తుందన్న నమ్మకం సూర్యునికి ఏ మాత్రం లేదు. సూర్యుడి మాట విన్న శ్రీనివాసుడు 'నువ్వెళ్ళి పిలిస్తే తప్పక వస్తుంది' అంటాడు. వెళ్ళడం తప్పదు అనుకున్న సూర్య్డు ఏం చెప్పాలని నసుగుతాడు.
.
నాకు అనారోగ్యం చేసిందని చెప్పు. ఒక చేయి బ్రహ్మపైన, మరొక చేయి శివుడి పైన వేసి, ఎంతో కష్టపడితే కానీ, నడవలేని పరిస్థితిలో ఉన్నానని చెప్పు అంటాడు శ్రీనివాసుడు. స్వామి దోషరహితుడు, సర్వమంగళకారుడు, నిరామయుడు, ఎటువంటి వికారానికి లోను కానివాడు. అందరి రోగాలను నయం చేసేవాడు, ధన్వంతరీ కూడా ఆయనే, అటువంటి స్వామికి జబ్బు చేయడం అసాధ్యం. లక్ష్మీదేవికి ఈ విషయం తెలుసు. సూర్యుడికి కూడా ఈ అనుమానం వచ్చి 'ఆమె నమ్ముతుందా?' అంటాడు. నా మాయతో ఆమె కూడా మొహితురాలవుతుంది. నువ్వు వెళ్ళిరా అంటాడు శ్రీనివాసుడు.
.
శ్రీనివాసుడు మాట విన్న సూర్యుడు లక్ష్మీదేవిని తీసుకురావడానికి కరివీరపురం (కొల్హాపూర్) వెళతడు. మొదట ప్రణయకలహ గుర్తుకొచ్చి రానన్న, తరువాత స్వామికి అనారోగ్యం చేసిందనేసరికి పరుగుపరుగున బయలుదేరుతుంది. ఆమెకు నిజం తెలియదా అంటే ............ ఆమె సర్వజ్ఞురాలు, అంతటా వ్యాపించి ఉన్న శక్తి తత్వం, పైగా విష్ణుమూర్తి హృదయంలోనే ఉంటుంది, నిజానికి వారిద్దరికి బేధం కూడా లేదనే చెప్పాలి. విష్ణుమూర్తి, లక్ష్మీదేవి రెండుగా కనిపిస్తున్న ఒకే శక్తి స్వరూపం. కానీ కలియుగంలో భక్తజనాన్ని అనుగ్రహించడం కోసం, తాము ఆడుతున్న లీలానాటకాన్ని రక్తి కట్టించడం కోసం అమ్మ ఏమి తెలియనట్లు, అబద్ధం నమ్మినట్లు నటించింది.
.
మొత్తానికి లక్ష్మీదేవి కూడా వేంకటాచలం చేరుకుంది. దాంతో పెళ్ళిపెత్తనమంతా లక్ష్మీదేవిది, వకుళాదేవిది అయ్యింది. పెళ్ళిపనులు చకచకా చేయడం మొదలుపెట్టింది. శ్రీవారి మంగళస్నానానికి ఏర్పాట్లు చేసింది. చక్కగా ముత్తైదువలంతా కలిసి లక్ష్మీదేవి ఆధ్వర్యంలో, శ్రీనివాసుడి ఒంటికి నూనె పట్టించి, నలుగు పెట్టి హారతి ఇచ్చారు. తరువాత అభ్యంగనస్నానం చేయించి, మళ్ళీ హారతులిచ్చారు. మరీ చల్లటి నీరు పోస్తే జలుబు చేస్తుందేమొ అని భయంతో, 'గోరు వెచ్చటి నీరు మాత్రమే పోయొండమ్మా మా ఆయనకు' అంటూ లక్ష్మీదేవి తన స్వామి పట్ల విశేష శ్రద్ధ తీసుకుంది. అసలే జగన్మోహనాకారుడు, పెళ్ళి కళతో మరింత మెరిసిపోతున్నాడు, దానికితోడు ఈ క్రతువుతో శ్రీనివాసుడు ఎంత అందంగా, సమ్మోహనంగా కనిపిస్తున్నాడో మాటల్లో చెప్పలేం. అందరి కళ్ళు ఆయన మీదే. వైభవంగా మంగళస్నాన ఘట్టం ముగిసింది.
.
తరువాతి కార్యక్రమం పుణ్యావచహనం, అటు తరువాత కులదేవత స్థాపనం, కులదేవతను పూజించడం. దేవతా సార్వభౌముడైన స్వామికి కులదేవత ఎవరుంటారు? ఇదే పెద్ద సందేహం. దానికి సమాధానం స్వామియే చెప్తారు. 'శమీవృక్షమే మా కులదైవం' అని చెప్పిన స్వామి, కూమారధారలో ఉన్న శమీవృక్షానికి కులదేవత పూజ చేస్తారు. మరి ప్రతిష్ట ఎక్కడ చేయాలని అడుగుగా, వరాహస్వామి వారి నివాస ప్రాంగణంలో చేద్దాం అంటారు. అప్పుడు స్వామికి తాను మర్చిపోయిన ముఖ్యమైన విషయం ఒకటి గుర్తుకువస్తుంది.
.
అంతా చేశాం, అంతా పిలిచాం కానీ వరాహస్వామికి ఆహ్వానపత్రిక ఇవ్వడం మరిచాం, పత్రిక సంగతి తరువాత, కనీసం కబురు కూడా చేయలేదన్న సంగతి శ్రీనివాసుడికి గుర్తుకువస్తుంది. స్వయంగా తానే వెళ్ళి వరాహస్వామిని ఆహ్వానిస్తాడు. వరాహస్వామి మాత్రం తాను పని ఒత్తిడి వల్ల పెళ్ళికి హాజరు కాలేనని, తన పంటలపై తరుచూ రాక్షసులు దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నారని, పంటలను కాపాడడం కోసం ఇక్కడే ఉండాలసిన అవసరం ఉంది అని వరాహస్వామి అంటారు. అలాగే తాను ముసలివాడినయ్యానని, ఓపిక లేదని చెప్పి, తన తరుఫున వకుళమాత వస్తుందని చెప్తారు. "మీరు అందరూ వెళ్ళి శుభకార్యం నిర్విఘ్నంగా పూర్తి చేసుకుని రండి, నా ఆశీర్వాదం మీ వెంట ఎప్పుడు ఉంటుంది" అంటారు. తరువాత కులదేవత స్థాపన, పూజ ముగుస్తాయి.
.
ఇక అందరం పెళ్ళికి బయలుదేరుదాం అంటాడు స్వామి. ఇంతలో బ్రహ్మదేవుడు కలుగజేసుకుని ఆక్షేపిస్తాడు. "కులదేవతను ఆహ్వానించి పూజించిన తరువాత అన్నసంతర్పణ చేయకుండా ఎలా వెళతాం? బంధువులు, ఋషులు, బ్రాహ్మణులు, పిల్లలు చాలా ఆకలితో ఉన్నారు. ప్రయానం చేసి అలసిపోయారు. అందరికి కడుపునిండా తృప్తిగా భోజనాలు పెట్టకా, అప్పుడు బయలుదేరితే బాగుంటుంది" అంటారు.
.
సమంజసమే కానీ, ఇంతమందికి విందు ఏర్పాటు చేయడానికి నా దగ్గర డబ్బేది? అంటాడు శ్రీనివాసుడు. డబ్బు లేదని చెప్పి పదిమంది ముందు పరువు పోగొట్టుకోమంటామా? డబ్బు లేకపోతే అప్పోసొప్పో చేసైనా శుభకార్యం జరిపంచాలి" అంటాడు శివుడు. తనకు అప్పు ఎవరిస్తారన్నది శ్రీనివాసుడు సందేహం. అలకాపురీ అధిపతి అయిన కుబేరుని పిలిపించండి అంటారు బ్రహ్మ. అలాగే కుబేరుని పిలిపిస్తారు. కుబేరుడు కొంత ఆలస్యంగా రావడంతో శ్రీనివాసుడు మందలిస్తాడు.
.
అందరి ముందు అప్పు తీసుకుంటే ఏం బాగుంటుందని శ్రీనివాసుడు, కుబేరుడు, బ్రహ్మ, శివుడు కలిసి తిరుమల పుష్కరిణికి పడమర దిక్కున గల అశ్వత్థవృక్షం (రావి చెట్టు) వద్దకు వెళతారు. అక్కడికి వెళ్ళాకా, నాకు కొంచం డబ్బు కావాలి అని అడుగుతారు. "స్వామి, మీరిలా నన్ను అడగడమేమిటి? ఇదంతా మీ ఐశ్వర్యమే. మీ తరుపునే నేనీ ధనాన్ని సంరక్షిస్తున్నాను. మీకు ఎంత కావాలంటే అంత తీసుకోండి" అంటాడు కుబేరుడు. యుగధర్మాన్ని అనుసరించి ఇవ్వమంటాడు శ్రీనివాసుడు. కలియుగంలో అప్పుకు పత్రం రాసి, చక్రవడ్డీ కట్టాలనీ, ఇదే కలియుగంలో కనిపిస్తుందని, కనుక ఆ ప్రకారమే పత్రం రాయమని చెప్తాడు కుబేరుడు.
.
అప్పు ఇస్తాను సరే, నీవు తిరిగి ఇస్తావన్న నమ్మకం ఏంటి? ఇది కలియుగం, కలియుగ ప్రజలు మాట మీద నిల్చునే రకం కాదు. కనుక నీవు నా దగ్గర అప్పు తీసుకున్నట్టుగా సాక్షులు కావాలి అంటాడు కుబేరుడు శ్రీనివాసుడితో. పక్కనే ఉన్న బ్రహ్మ సాక్షి సంతకం పెడతానంటాడు.
.
బ్రహ్మ విష్ణుమూర్తి కుమారుడు కనుక, పక్షపాతంతో వ్యవహరించే అవకాశం ఉన్నదని, అప్పు చెల్లించకుండా మాట మార్చే సమయంలో శ్రీనివాసుడికి సాయం చేయవచ్చునని అనుమానపడి, ఈయన ఒక్కడితోనే కుదరదు అంటాడు కుబేరుడు.
.
శివుడు సంతకం పెడతానంటాడు. నీవు ఎప్పుడు కైలాసపర్వతం మీద ధ్యానంలో కూర్చుంటావు. నీకు కోపం ఎక్కువంటారు. కోపం తో మూడవకన్ను తెరిచి అంతా బూడిద చేస్తావు. అమ్మో! నీ దగ్గరకు రావాలంటేనే నాకు భయం, కనుక మరొక సాక్షి కావాలి అంటాడు కుబేరుడు.
.
అప్పుడు తమ పక్కనే ఉన్న ఆ రావి చెట్టు పేరు చెప్తారు. సరే అయితే, నేమి సాక్షి సంతకం పెడతా అంటుంది ఆ రావి చెట్టు. ముగ్గురు సాక్షులు వచ్చారు కనుక, అప్పు పత్రం రాసుకుందాం అంటారు. అప్పు పత్రం ఈ విధంగా రాస్తారు.
అప్పు తీసుకున్నవాడు శ్రీనివాసుడు. అప్పు ఇచ్చినవాడు కుబేరుడు. అతని వివాహం కొరకు కలియుగంలో, వైశాఖమాస శుక్లపక్ష సప్తమినాడు పదునాలుగు లక్షల రామముద్ర గల సువర్ణ నాణేములు వడ్డీనిచ్చు షరతుతో ఇవ్వబడినవి. వడ్డితో కలిపి మూలము చెల్లించుటకు శ్రీనివాసునిచే అంగీకరించబడినది. వివాహమైన సంవత్సరము నుంచి వెయ్యి సంవత్సరముల తరువాత ఈ మొత్తం ఇవ్వబడును. ఇది కుబేరునికి శ్రీనివాసుడు రాసిచ్చిన అప్పు పత్రం. దీనికి మొదటి సాక్షి చతుర్ముఖుడు. రెండవ సాక్షి రుద్రుడు (శివుడు). మూడవ సాక్షి అశ్వత్థరాజము.
.
అప్పు ఎలా తీరుస్తాడో కూడా శ్రీనివాసుడు పత్రంలో చెప్తాడు. 'భవిషత్తులో నా భక్తులు మంచిదో, పాపిష్టిదో, చాలా కానుకలు నా హుండీలో వేస్తారు. ఆ డబ్బుతో నీ అప్పు తీరుస్తాను' అంటాడు. అందరికి అన్నీ ప్రసాదించగలవాడు, కుబేరునికి ధనాధిపత్యం ఇచ్చినవాడు కుబేరుడి దగ్గర అప్పు అడగడం ఒక దివ్యలీల. డబ్బి మీ దగ్గరే ఉంచి, ఖర్చు చెయ్యి అని కుబేరునితో శ్రీనివాసుడు పలుకుతాడు.
.
ఇదంతా మనకు ఒక సందేశం ఇవ్వడానికి స్వామి ఆడిన దివ్యలీల. ఇంటికి వచ్చిన అతిధులకు సంతృప్తిగా భోజనం పెట్టాలి, పెద్దపెద పూజలు, వ్రతాలు, నోములు చేసినప్పుడు, కులదేవత ఆరాధన చేసినప్పుడు వచ్చిన అతిధులకు తప్పక భోజనం పెట్టి పంపించాలి, తీసుకున్న అప్పు సకాలంలో తీర్చాలి వంటివి అనేకం కనిపిస్తాయి. కుబేరుడు కూడా 'ఇదంతా నీదే స్వామి. ఇదంతా నీవు ప్రసాదించిందే అంటాడు.' ఎవరి దగ్గర ఏ ఐశ్వర్యం ఉన్నా, అది డబ్బు, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, తెలివితేటలు, కళలు, ఇలా ఏవైనా కావచ్చు, ఇవన్నీ ఆయన అనుగ్రహించినవే. అన్నీ ఆయన ఇచ్చినవే కనుక, అహకారం లేకుండా, ఉన్న ధనాన్ని మంచి పనులకు వాడడం వలన దానికి సార్ధకత లభిస్తుంది. ఇదే కుబేరుడి మాటలలోని అంతరార్ధం.
.
అప్పు అయితే తీసుకున్నాం కానీ, ఇంకా చేయాల్సిన పెళ్ళి పనులు అనేకం ఉన్నాయి. ఇవన్నీ ఎవరు చేస్తారన్నది శ్రీనివాసుడికి వచ్చిన ఇంకో సందేహం. ఇంతలో శివుడు కలుగజేసుకుని 'ఓ తాతాయ్య! ఆపవయ్యా నీ లీల. ఇక్కడ ఉన్నవారంతా నీ సేవకులే కదా. నీవు ఆజ్ఞ చేయి, అందరూ నీవు చెప్పినట్టుగాన్ చేస్తారు' అంటాడు. విష్ణువు నుంచి బ్రహ్మ ఉద్భవిస్తే, ఆయ్న నుంచి రుద్రులు పుట్టడం వలన, రుద్రుడికి విష్ణువు తాతయ్య అవుతాడు. మరొక రకంగా చూస్తే, శివకేశవులు బావ, బావామరిదులు. కానీ నిజానికి శివుడు అనాది, ఆయన ఎప్పుడు ఉండేవాడు, ఎప్పటికి ఉండేవాడు. శివుకేశవులు ఇద్దరూ ఒక్కటే తత్వం. కాని సృష్టి నడవడం కోసం, వేర్వేరు పాత్రలు పోషిస్తూ, వేర్వేరు రూపాల్లో లీల చూపిస్తున్నారు. అంతే. 
.
అందరు దేవతలకు వారివారి శక్తినిబట్టి, యోగ్యతను అనుసరించి పని అప్పహించబడింది. వంటపని అంతా అగ్నిదేవునికి, మర్యాదలు, పిలుపులు ఆరుముఖాల షణ్ముఖుడికి (కుమారస్వామికి), వచ్చినవారికి సౌకర్యాలు ఏర్పాటు చేయడం విశ్వకర్మకు, వీటన్నిటికి డబ్బులు సర్దడం కుబేరుని బాధ్యత. పిల్లగాలులు వీస్తూ వచ్చినవారికి ఆహ్లాదం కలిగించడం వాయుదేవుని పని. ఎవరి పనులు వారి చేస్తుంటారు. ఇంతలో అగ్నిదేవుడు, వంట చేయడానికి పాత్రలు లేవంటాడు. నిజమే మీ ఇంట్లో శుభకార్యానికి అయితే అన్నీ ఉంటాయి. నా పెళ్ళికి మాత్రం ఏమీ ఉండవు. అయినా పాత్రలెందుకు, వేంకటాచలం మీదనున్న తీర్ధాలలో వంట వండండి అంటాడు శ్రీనివాసుడు.
.
నిజమే జనాన్ని బట్టి పాత్రలు వాడతాం. వందల్లో వస్తే పెద్దపెద్ద పాత్రలు వాడవలసి వస్తుంది. కానీ ఈయన పెళ్ళికి సమస్త బ్రహ్మాండం అంతా దిగివస్తుంది. కొన్ని కోట్ల మంది వస్తారు. అంతమందికి వండడానికి పాత్రలు ఏం సరిపోతాయి. పైగా సృష్టిలో ఉన్న సమస్త పుణ్యతీర్ధాలు తిరుమలలో కొలువై ఉన్నాయి.
.
ఒక్కో తీర్ధంలో / సరోవరంలో ఒక్కో వంటకం వండుతారు. స్వామి పుష్కరిణిలో అన్నం, పాపనాశనంలో పప్పు, ఆకాశగంగలో బెల్లం వేసి చేసిన పరమాన్నం, కూరలకు,, నెయ్యి కాచడానికి దేవతీర్ధం, తుబురతీర్ధంలో పులిహోర, కుమార తీర్ధంలో వివధ రకాలైన భక్ష్యాలు (బూరెలు, పూర్ణాలు, బొబ్బట్లు వంటివి), పాండుతీర్ధంలో పులుసు, ఇతర తీర్ధాల్లో లేహ్యాలు మొదలైని తయారు చేయమని స్వయంగా శ్రీనివాసుడే అగ్నిదేవుడిని ఆజ్ఞాపిస్తాడు. 
.
దేవతలందరూ చక్కగా ఆటపాటలతో, కబుర్లతో, భజనలతో, భక్తిపారవశ్యతంతో, తమ ఇఛ్ఛాశక్తి చేత పంచభక్ష్యపరమాన్నాలతో భోజనం సిద్ధమైంది. వంటకాలు గుమగుమలు బ్రహ్మండమంతా వ్యాపిస్తున్నాయి. ఎప్పుడు రుచి చూడాలో అన్న కోరిక పెంచే విధంగా ఉన్నాయి. అంతా సిద్ధం అయిన తరువాత నివేదనకు ఏర్పాట్లు చేస్తాడు బ్రహ్మదేవుడు.
.
"నైవేద్యం పెట్టిన తరువాతే అథిదలందరీకి వడ్డన. నువ్వే భగవంతుండివి, యజ్ఞభోక్తవి, కనుక ముందు నువ్వు భోజనం చేయి" అని శ్రీనివాసునితో బ్రహ్మదేవుడంటాడు. "నా ఇంట్లో శుభకార్యానికి వచ్చిన అతిధులకు భోజనం పెట్టకుండా నేను భోజనం చేయడం తగదు, అది సంప్రదాయం కాదు" అంటాడు స్వామి. మన ఇంట్లో శుభకార్యం జరిగినప్పుడు అందరూ భోజనం చేశాక మనం భోజనం చేయడం విధి. మనకు అది ఎప్పుడు గుర్తుండడం కోసం స్వామి పలికిన మాటలవి. మరి నివేదన చేయని పదార్ధాలను అతిధులెవ్వరూ ముట్టుకోరు, మరి నివేదన ఎవరికి చేయాలి? అంటాడు బ్రహ్మ. 
.
నేను ఇంకో రూపంలో ఇదే కొండ (శేషాచలం) మీద, అహోబలంలో (ఈనాడు అహోబిలం) నరసింహునిగా వెలసి ఉన్నాను. ఆ అహోబిల నరసింహస్వామికి నివేదన చేసి అందరీకి నైవేద్యం వడ్డించండి అంటాడు శ్రీనివాసుడు. సాక్షాత్తు బ్రహ్మ అహోబల నరసింహస్వామికి నివేదన చేస్తారు.
.
(తిరుమల కొండ శేషాచలం పర్వతం మీద ఉంది. శేషాచలం అంటే సాక్షాత్తు ఆదిశేషుడు. వీటిని ఆకాశం నుంచి చూసిన పాము ఆకారంలో ఈ కొండలు దట్టమైన అడవులతో కనిప్సితాయి. శేషాచలం కొండలు చిత్తూరు జిల్లా నుంచి కర్నూలు జిల్లావరకు వ్యాపించి ఉన్నాయి. ఆదిశేషుడి తలపై శ్రీనివాసుడి, నడుమ భాగాన అహోబిల నృసింహుడు, తోకభాగాన శ్రీశైలంలో మల్లిఖార్జునుడు భ్రమరాంభ సమేతంగా వెలసి ఉన్నారు. కర్నూల్ జిల్లా నంద్యాలకు దగ్గరలో ఉన్న అహోబిల క్షేత్రంలోనే హిరణ్యకశిపుడుని నరసింహస్వామి సంహరించారట. ఆ సమయంలో మహోగ్రంగా ఉన్నారు స్వామి. ఆయన బలం చూసిన దేవతలు 'అహో బలం, అహో బలం' అంటూ ఆయన శక్తిని కీర్తించారు. అదే అహోబల క్షేత్రంగా విరాజిల్లింది. అక్కడే నృసింహుడు వెలిశారు. కాలక్రమంలో అది అహోబిలంగా మారింది.) 
.
నివేదన చేశాక వైశ్వదేవం చేశారని భవిష్యోత్తర పురాణం చెప్తుంది. ఇది అగ్నిదేవుడి ఆరాధన. అగ్నిహోత్రం పెట్టి చేసేది. వైశ్వదేవం మిగిశాకా అందరూ భోజనాలకు సిద్ధమయ్యారు.
.
చక్కగా శివుడు అతిధులందరినీ కూర్చోబెట్టే బాధ్యత శివుడు తీసుకున్నాడు. పాండు తీర్ధం (గోగర్భం డ్యాము నుంచి దక్షిణగా కొద్ది రూరంలో ఉంది. ఇప్పటికి చూడవచ్చు) నుంచి శ్రీశైలం వరకు విస్తళ్ళను (ఆకులను) పరిచి, వారివారి పెద్దతనానాన్ని అనుసరించి ఆశీసులు చేశాక అందరికి ఒకేసారి వడ్డించారు.
వడ్డించడంలో కూడా శాస్త్రం కొన్ని నియమాలను విధించింది. ఆకులో ఏది ఎక్కడ వడ్డించాలి, ఏలా వడ్డించాలన్నది చెప్పింది. ఇవన్నీ ఎంతో శాస్త్రీయమైనవి. వాటి ముందు ఈనాటి పాశ్చ్యాత ఆహారనియమాలు, భుజించే విధానం ఎంత మూర్ఖమైనవో అర్ధం అవుతుంది. భవిషోత్తర పురాణం కూడా ఎలా వడ్డించాలి, గృహస్తు మర్యాదలు ఏ విధంగా చేయాలన్న విషయాన్ని విపులంగా వివరిస్తుంది.
.
దాన్ని అనుసరించి వేంకాటాచలంలో కూడా వడ్డన జరిగింది. ముందు విస్తళ్ళపై నీరు చల్లి, ఉడిచి, పాత్రశుద్ధికి కొంత నెయ్యి వడ్డించి, సంస్కారపూర్వకంగా ఉప్పు, శాస్త్రం ప్రకారం ఇతర పదార్ధాలు వడ్డించారు. వడ్డన పూర్తి అయ్యాక అగ్నిదేవుడు వడ్డన పూర్తయ్యిందన్న విషయం శ్రీనివాసుడికి చెప్పగా, అందరూ కలిసి ముక్తకంఠంతో విష్ణువును స్మరించారు.
.
అంతటా వ్యాపించిన ఒకే తత్వము, చిన్న దేహములు కలిగిన అనేక జీవులయందూ కూడా ఉండి, మూడులోకములు వ్యాపించి సమస్త విశ్వాన్నే భుజించగల సామర్ధ్యం కలిగి, చిన్నచిన్న జీవుల దేహమందూ వాసము చేస్తూ వారూ తిన్న ఆహారమను స్వీకరిస్తున్నది, ఆని ప్రార్దించి
.
భోజన ప్రారంభకాలే భగవన్నామస్మరణ గోవిందా అని శ్రీనివాసుడనగా గోవిందా ఆని అందరూ పలికి ఆహారం తీసుకోవడం ప్రారంభించారు. భోజన ప్రారంభానికి ముందు శ్రీనివాసుడు ఒక పాత్ర నిండుగా నీరు తీసుకుని, అతిధులందరికి నమస్కరించి, మీ వంటి జ్ఞానపూర్ణులైనవారికి ఈ కొద్దిపాటి అన్నమూ, నీరుచే ఏ మాత్రము తృప్తి కలుగదు. అయినా తపోధనులారా! మీరు కరుణ కలిగినవరు కనుక నీ పెట్టిన ఈ కాస్త ఆహారమునూ, అధికంగా, ఎన్నో రకాలుగా భావించి నన్ను కృతార్ధుడిని చేయండి అన్నాడు. చివరగా సర్వం శ్రీ కృష్ణార్పణమస్తూ అంటూ ముగించాడు.
.
నువ్వు పెట్టిన అన్నము ముక్తిని సాధించే అమృతము అను చెప్పి అతిధులు భుజిస్తారు. భోజన మధ్యకాలంలోనూ, ఆఖరునా గోవింద నామం మళ్ళీ చెప్తారు. మనం తినే ఆహారంలో ఆరవవంతు మనసుగా మారుతుంది. మనం ఆహారం తినే సమయంలో ఏం చూస్తామో, ఏమి ఆలోచిస్తామో, ఏది మాట్లాడుతామో, అది మన మనసులో తీవ్రప్రభావం చూప్సితుంది. అదే భోజన సమయంలో భగవన్నామం చెబితే, మన మనసులో భగవన్నామం మంచి ఆలోచనలకు ప్రేరకం అవుతుంది.
.
అందరి భోజనాలు ముగిశాకా, అందరికి దక్షిణతామ్మూలాలు శ్రీనివాసుడు ఇచ్చాడని పురాణం. అది కూడా వారివారి పాండిత్యాన్ని, యోగ్యతను అనుసరించే. శ్రేష్టులైన ద్విజులకు ఒక రామటెంక (నాణెము), వేదాంతులకు అందులో సగము, బ్రహ్మచారులకు వేదాంతుల దక్షిణలో సగమూ, ........ ఇలా ఇచ్చడు స్వామి.
.
అందరి భోజనాలు మిగిశాకా శ్రీనివాసుడు, లక్ష్మీదేవి, శివుడు, బ్రహ్మ, లోకపాలురు, గరుత్మంతుడు, ఆదిశేషుడు కలిసి భోజనం చేశారు. వీరి భొజనాలు మిగిసేసరికి సూర్యాస్తమయం అయిందని పురాణంలో కనిపిస్తుంది.
.
అలా అందరి భోజనాలు పూర్తయ్యాక, ఆ రాత్రికి అక్కడే గడిపేసి, తెల్లవారుఝామునే మంగళవాయిద్యాల నడుమ మగపెళ్ళివారి బృందం ఆకాశరాజు ఇంటికి నారాయణవనం బయలుదేరింది. మంగళవాయిద్యాలు, కబురులు, సబరాల నడుమ సరదాగా నడిచిపోతున్న బృందం పద్మసరోవరం చేరుకుంది. ఇక్కడే శ్రీ శుకాచార్యులవారి ఆశ్రమం ఉంది. పద్మసరోవరం సమీపిస్తున్న సమయంలో శుకుడు శ్రీనివాసుని చేరి, తన ఆశ్రమానికి విచ్చేసి, ఆతిధ్యం స్వీకరించవలసిందిగా కోరుతాడు. 
.
"కోట్లాదిమందితో ఉన్నాను, నేను ఒక్కడినే రాలేను, ఇంతమందిని తీసుకువస్తే నీకు ఇబ్బంది. అందరం ఆకాశరాజు ఆతిధ్యం స్వీకరించాలనుకుంటున్నాం" అంటాడు శ్రీనివాసుడు. "నువ్వు ఒక్కడివి తింటే చాలు, అందరు తిన్నటే" అని శుకుడు శ్రీనివాసుడిని బ్రతిమాలుతాడు. "నాన్నా! నీ పెళ్ళికి శుకబ్రహ్మ చాలా సహాయం చేశాడు. కనుక ఆయన చేసిన సాయానికి గుర్తుగా, ఆయన ఆతిధ్యం అంగీకరించి, భోజనం చేయి" అంటుంది వకుళమాత. అమ్మ మాట కాదనలేని స్వామి సరేనంటాడు.
.
శుకుడు కుటీరంలోనికి ప్రవేశిస్తాడు. చింతతొక్కుల పచ్చడి, పులుసులతో స్వయంగా శుకుడే శ్రీనివాసుడికి భోజనం వడ్డించడని భవిష్యోత్తర పురాణం చెప్తున్నది. ఇంతవరకు బాగానే ఉంది, భక్తుని కోరిక మన్నించిన భగవంతుడు, భక్తుడి ఇంట భోజనం చేయడం. కానీ లోకులు అలా ఆలోచించరు కదా. బయట ఉన్నవారు శుకమహర్షి గురించి నానారకాలుగా అనుకొవడం మొదలుపెట్టారు. ఇంతమంది ఉండగా, ఒక్క శ్రీనివాసుడికే భోజనం పెట్టడమేంటి? ఇదేం వింత? శుకుడికి బాగా గర్వం పెరిగిపోయింది, మదంతో ఈ చర్యకు పూనుకున్నాడు. అందరూ ఉన్నప్పుడు ఒక్కడినే పిలిచి భోజనం పెట్టడం భావ్యమా? అందరిని అవమానిస్తున్నాడు .......... ఇలా రకరకాల మాటలు మొదలుపెట్టారు. శుకుడికి కీడు చేయాలని తలచారు. 
.
లోపల భోజనం చేస్తున్న స్వామికి ఈ విషయం తెలిసింది. భక్తుడి రక్షణ భగవంతుని బాధ్యత. అందుకే భోజనం చివరిలో సంతృప్తిగా శ్రీనివాసుడు త్రేనుస్తాడు. అంతే! బయటనున్న అందరికి ఆకలి ఒక్కమాటున తీరిపోతుంది, కడుపు నిండిపోతుంది. అందరికి శుకుడి భోజనం తిన్న భావన కలుగుతుంది. సర్వజీవలయందూ ఆకలిరూపంలో ఉంటూ ఆహారం జీర్ణం చేసే పరమాత్మ, అందరి ఆకలిని తీర్చడం వింత ఏమీ కాదు. ఇది జరిగింది వైశాఖ శుక్ల పక్ష అష్టమి నాడు. ఆ రాత్రికి అక్కడే గడపాలని నిశ్చయించుకుంటారు.
.
నవమినాడు శ్రీనివాసుడితో సహా అందరూ నారాయణపురం చేరుకుంటారు. శ్రీనివాసుని స్వాగతించడానికీ ఎదురువచ్చిన ఆకశరాజుతో స్వామి, అతిధులందరూ ఆకలితో ఉన్నారు, భోజనాలకు ఏర్పాట్లు చేయండని ప్రత్యేకంగా చెప్పినట్టు పురాణంలో కనిపిస్తుంది. 
.
దశమినాటి ఉదయమే శ్రీనివాసుడు మంగళస్నానం చేశాడు. పురోహితుడైన వశిష్ఠునితో లోకరీతిని తెలుపుతూ "ఈనాటి రాత్రియే వివాహమూహుర్తం కనుక మనం ఐధుగురం, నేను, లక్ష్మీదేవి, వకుళాదేవి, బ్రహ్మ, మీరు (వశిష్ఠుడు) భోజనం చేయకూడదు. అలాగే ఆకాశరాజు, ధరణీదేవి, తొండమానుడు, పద్మావతీదేవి (పెండ్లికూతురు), వారి పురోహితుడు భోజనం చేయకూడదు" అని చెప్పి, కుబేరునితో "కుబేరా! బ్రాహ్మణభోజనానికి ఆకాశరాజును తగిన ఏర్పాట్లు చేయమని చెప్పు, ముహూర్తం రాత్రి 13నాడులకు, ఆ తరువాత బ్రాహ్మణులు భోజనం చేయడం నిషేధం" అని చెప్తాడు.
.
శ్రీనివాసుని విడిది ఇంటి నుంచి వివాహవేదికకు ఆకాశరాజు ఎంతో ఘనమైన ఏర్పాట్ల మధ్య తీసుకువెళ్ళాడని పురాణం చెప్తోంది. విశ్వకర్మ నిర్మించిన సభలో మునిశ్రేష్టులతో శాస్త్రచర్చ చేస్తున్న శ్రీనివాసుని రాజగృహానికి తీసుకువెళ్ళడం కోసం ఇంద్రుడి ఐరావతం తీసుకువస్తాడు ఆకాశరాజు. ధరణీదేవి కూడా ఆకాశరాజు వెంట వస్తారు. ఐరాతవతంపై శ్రీనివాసుని కూర్చొబెట్టి, లక్ష్మీదేవి, బ్రహ్మ, రుద్రుడు, కుబేరుడు, యముడు, ఇంద్రుడు, ఇలా అందరి సమేతంగా తీసుకివెళతాడు ఆకాశరాజు.
.
శ్రీనివాసుడు రాజగృహానికి చేరుకోగానే తొండమానుడి భార్య కుంకుమ కలిపిన ఎర్రని నీటితో కుంభహారతి ఇచ్చి లోపలికి ఆహ్వానించిందట. శ్రీనివాసుడి పాదాలు కడగటానికి స్వామి పుష్కరిణి జలాలు తెప్పించాడు ఆకాశరాజు. బ్రహ్మ కడిగిన పాదాలకు ఆకాశరాజూ, ధరణీదేవి కడిగే అదృష్టం పొందారు. ఏ స్వామి పాదాల దర్శనం కనిపిస్తే చాలు ధన్యమనీ, ఎందరో తపస్సులు చేస్తున్నారో, ఏవరి పాదదూళి సోకితే పరమదరిద్రుడు కూడా అత్యంత ధనవంతుడవుతాడో, ఏ పాదాలను నిత్యం లక్ష్మీదేవి, బ్రహ్మ, ఇతర దేవతలు కొలుస్తూ ఉంటారో అటువంటి స్వామి పాదోదకం (కాళ్ళు కడిగిన నీటిని) రాజ్యమంత ప్రోక్షణ చేయించాడు (చల్లించాడు). ముహూర్తం సమీపించగా, కోటి సువర్ణనాణేములు కానుకగా ఇచ్చాడు ఆఖశరాజు. నాకీ డబ్బు ఎందుకు, నవరత్నఖచితమైన ఆభరణాలు ఇవ్వండి అంటాడు శ్రీనివాసుడు.
.
అప్పుడు ఆకాశరాజు శ్రీనివాసుడికిచ్చిన ఆభరాణాల గురించి భవిష్యోత్తర పురాణం ప్రస్తావించింది. 100 తులాల బంగారు కీరీటం, అంతే బరువుగల నడుముపట్టీ, భుజకీర్తులు, నూపురములు, 2 నాగ భుజ భూషణములు, భుజాల వరకు వేళాడే ముత్యాలతో చేయబడిన కర్ణభూషణములు (చెవికి పెట్టుకునే ఆభరాణాలు), 32 తులాల బరువుగలిగిన నవరత్నఖచిత కంకణాలు, నాగభూషణాలు రెండు, 111 తులాల బరువు కలిగిన, వజ్రాలు పొదిగిన బంగారు కటిసూత్రము, పాదుకలు, 64 తులాల బంగారు భోజనపాత్ర, చెంబు, పంచపాత్రలు, పంచపాత్రలు, 64 పట్టువస్త్రాలు, ఇలా శ్రీనివాసుడికి శరీరమంతా ఆభరణాలు సమర్పించాడు ఆకాశరాజు.
.
వధూవరుల ప్రవరలు చెప్పించి, బృహస్పతి, వశిష్ఠులు కన్యాదానం చేయించారు. ' అత్రిగోత్రమున జన్మించిన సువీరుని మునిమనుమరాలు, సుధర్ముని మనుమరాలు, ఆకాశరాకు పుత్రిక అయినా పద్మావతీదేవిని యయాతి మునిమనుమడు, శూరశేనుని మనుమడు, వసుదేవుని కుమారుడు, వశిష్ఠ గోత్రములో పుట్టిన వేంకటేశ్వరునకిచ్చి వివాహాం చేయదలిచారానీ చెప్తూ, కన్యాదానం పూర్తి చేశారు.
.
కంకణధారణ చేయించడం దగ్గరి నుంచి మొత్తం వివాహవేడుకను అధ్భుతంగా వర్ణిస్తుంది పురాణం. మంగళసూత్రధారణ చేసిన తరువాత నవరత్నాలను అక్షింతలుగా వేసి, ఆశీర్వదించారు మునీశ్వరులు. అటు తరువాత వచ్చిన అతిధులందరికీ దక్షిణతాంబులాలు ఇచ్చాడు ఆకాశరాజు. కోటిసహస్ర గోవులను బ్రాహ్ముణలకు దానం ఇచ్చాడు ఆకాశరాజు.
.
అంతా ముగిశాకా కొత్త దంపతులతో కలిసి అందరూ భూరిభోజనాలు చేశారు.
.
మొత్తం 5 రోజుల పెళ్ళి జరిగిందని పురాణం చెప్తోంది. ఐదవరోజు అప్పగింతలు జరిగాయట. అపగింతల్లో నాభికి పాలు అద్ది, ఆకాశరాజు, ధరణీదేవి పద్మావతీదేవిని శ్రీనివాసునికి అప్పగించారు. పద్మావతీదేవి శ్రీనివాసునితీ అత్తారింటికి వెళ్ళిపోతోందన్న బాధతో భోరున ఏడ్చారు ఆకాశరాజు దంపతులు, పద్మావతీదేవి సోదరుడు వసుద, ఆమె పినతండ్రి తొండమానుడు. అప్పటివరకు ఉస్తాహంతో, కోలాహలంతో నిండిన పెళ్ళిమండపం ఒక్కసారిగా దుఃఖంలో మునుగిపోయింది. ఇదంతా చూస్తున్న మునులు కూడా దారుణంగా ఏడ్చారట. తన విడిచికి పద్మావతీదేవిని తీసుకువెళ్ళి శ్రీనివాసుడు గృహప్రవేశం చేశాడు. అటు తరువాత గరుత్మంతునిపై కూర్చోబెట్టుకుని తన నివాసానికి తీసుకువెళతాడు శ్రీనివాసుడు.
.
ఇలా అమ్మవారిని పంపుతూ, ఆకాశరాజు పద్మావతీదేవికి మూదువందల పుట్ల పెసలు, ఎంతో బరువున్న బెల్లం, అధికంగా చింతపండు, వెయికడవల పాలు, నూరుకుండ పెరుగు, పదిహేనువందల చర్మపాత్రల నిండ నెయ్యి, ఆవాలు, మెంతులు, ఇంగువ, ఉప్పు, పాత్రల నిండ నూనె, రెండువందల కుండల నిండా పంచదార, దోసపండ్లు, మామిడిపండ్లు, అరటిగెలలు, గుమ్మడికాయలు, కందమూలాలు, మిరియాలు, ఉసిరికాయలు, రెండువందల కుండల నిండుగా తేనె, లెక్కలేనన్నని అరటికాయలు ఇచ్చారాని, వాటిని 10,000 గుర్రాలు, 1,000 ఏనుగులు, 5,000 ఆవులు, 100 మేకలు, 200 మంది దాసీజనం, 300 దాసజనం, రకరకాల వస్త్రాలు, రత్నాలు పొదిగి తయారు చేసిన మంచం, పరుపులు, దిండ్లను సారెగా ఇచ్చాడు. శ్రీనివాసుడు ఆకాశరాజు భక్తికి మెచ్చి సాయుజ్యమోక్షాన్ని ఇచ్చాడని పురాణం.
.
స్వామి వివాహం జరిగిన నారాయణపురం తిరుపతికి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడ వేంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. పద్మావతీదేవి కల్యాణానికి వడ్లు విసిరిన పెద్ద తిరగలి కూడా ఇక్కడ మనం ఈరోజుకి చూడచ్చు.
.
వివాహం జరిగిన తరువాత 6 నెలల వరకు కొండ ఎక్కనని దీక్ష తిసుకున్నానని, అందువల్ల, అగస్త్యుని ఆశ్రమంలో 6 నెలలు ఉండడానికి నిశ్చయించుకున్నానని చెప్పిన శ్రీనివాసుడు, తన పెళ్ళికి హాజరైన దేవతలకు, ఋషిమునులకు వస్త్రాలు, కానుకలు వారీవారీ యోగ్యతను అనుసరించి ఇచ్చి పంపుతాడు. ఇది జరిగాక మహాలక్ష్మీ కరివీరపురం (కొల్హాపూర్) వెళ్ళిపోయిందట. ఈ అగస్త్యాశ్రమం తొండవాడ, శ్రీనివాసమంగాపురానికి దగ్గరలో ఉండిందని భావిస్తున్నారు. ఇక్కడే అగస్త్యుడు ప్రతిష్టించి పూజించిన శివలింగం మనం ఇప్పటికి దర్శించవచ్చు. స్వామి నివసించిన చోటనే శ్రీనివాసమంగాపురంలో ఆలయం ఉంది. ఇక్కడ ఉన్న స్వామి కల్యాణ వేంకటేశ్వరుడు. ఈయన్ను దర్శించి, ఇక్కడ పద్మావతీ శ్రీనివాసుల వివాహం జరిపిస్తే తొందరగా వివాహం అవుతుంది.
.
ఈ విధంగా శ్రీనివాసుని కల్యాణ కధను జనకమహారాజుకు శతానందుడు చెప్పాడని, శౌనకాది మునులకు సూతమహాముని చెప్పాడు. శ్రీ వేంకటేశ్వర కల్యాణగాధకు ఫలస్తుతి కూడా చెప్తూ పురాణం కోటి కన్యాదానలు చేయడం వల్ల ఎంత ఫలితం వస్తుందో, భూమి మొత్తాన్ని దానం చేయడం వలన ఎంత ఫలం లభిస్తుందో, ఈ కధ చదివినా, విన్నా అంతే ఫలితం కలుగుతుంది. ఎవరు శ్రీనివాసుని కల్యాణం చేయిస్తారో, వారి ఇంట్లో కూడా త్వరలోనే అటువంటి ఉత్సవం జరుగుతుంది. నీ కోసం ఈ శ్రీనివాస మహాత్యాన్ని చెప్పాను. ఎవరు శ్రీనివాసుని వివాహ చరితాన్ని, మహాత్యంతో కలిపి చెప్తారో, ఎవరు వింటారో, ఎవరు పారాయణ చేస్తారో, వారికున్న అన్ని కోరికలు నెరవేరుతాయి. విన్నమాత్రం చేతనే సుఖం కలుగుతుంది. ఇది ఎప్పుడు మంగళప్రదము అని శతానందుడు జనకమహారాజుతో చెప్పాడు.


Share:

Search This Blog

Popular Posts

ప్రకృతితో రైతన్న బంధం: పుష్యమి కార్తెలో ఏం జరుగుతుంది?

పుష్యమి కార్తె: వర్షాల ఆశ, ఎదుగుదల.. సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలాన్ని వ్యవసాయ పంచాంగం ప్రకారం ఆ కార్తెగా పిలుస్తారు. మొత్తం 2...

Recent Posts

Unordered List