దైవదర్శనం
  • శ్రీ మల్లెంకోండేశ్వర స్వామి ఆలయం.. మల్లెంకొండ..

    సేతుబంధనం చేసేముందు శివలింగాన్ని శ్రీరాముడు ప్రతిష్టించినట్లు శివపురాణం వర్ణిస్తోంది. ఇతర పురాణాల్లో కూడా రాముడు శివలింగాన్ని ఆరాధించిన విషయం కనిపిస్తుంది. కొన్ని చోట్ల హత్యాపాతక నివారణార్థం శివలింగ ప్రతిష్ఠలు చేసిన గాథలున్నాయి వీటిని కాదనలేము..!

  • పంచలింగాల కోన..

    అది శేషాచల అటవీ ప్రాంతం.. దట్టమైనఅడవులు.. రాళ్లూ రప్పలతో కూడిన గుట్టలు... చిన్న చిన్న బాటలు.. ఎటు చూసినా ఎత్తైన చెట్లు.. పక్షుల కిలకిలలారావాలు... వన్యప్రాణులు.. ప్రకృతి అందాలతో అలరారే ఆ క్షేత్రంలో.. సాక్షాత్తూ శివుడు కైలాసం విడిచి ఇక్కడ కొలువైనాడు. లోతైన లోయలో కొలువుదీరిన శివుడిని చేరుకోవడానికి కాలినడకన 9 కిలోమీటర్లు ప్రయాణించాల్సిందే..! ఆ ఆద్భుత స్థలమే పంచలింగాల కోన..!!.

  • ఉల్లెడ ఉమామహేశ్వ‌ర స్వామి

    నల్ల‌మ‌ల ఆడ‌వి లోని ఉల్లెడ ఉమామహేశ్వ‌ర స్వామి కొండ గుహ లెదా వ‌జ్రాల కొండ గుహ ఆని అంటారు. ఈవ‌జ్రాల కొండ గుహ‌లో ఉల్లెడ న‌ర‌సంహాస్వామి గుహ‌, ఆశ్వ‌థ్దామ గుహ‌, వున్నఉల్లెడ ఉమామహేశ్వ‌ర స్వామి గుహ అను మూడు గుహ‌లు క‌ల‌వు. ఉల్లెడ ఉమామహేశ్వ‌ర స్వామి గుహ లో ఒక శివ‌లింగం, మూడు ప‌డ‌గ‌ల నాగుపాము, శంఖం, మ‌రియు వీణ స్వయంబుగా వెలిచినాయి.

  • కాలి నడకన అధ్భుతమైన యాత్ర...

    ఈ ప్ర‌పంచంలో ప్ర‌కృతిని ఆరాధించ‌నివారుండ‌రు. ప్ర‌కృతి అందాల‌ను చూస్తూ త‌మ‌ను తాము మ‌రిచిపోతుంటారు. అలాంటి ప్ర‌కృతి అందాల‌ను చూసేందుకు ఎంత దూర‌మైనా వెళ్తారు, కొత్త కొత్త ప్ర‌దేశాల కోసం అన్వేషిస్తారు. అలాంటి వారి కోసం నా వంతు స‌హాయాన్ని అందించ‌డానికే ఈ ప్ర‌య‌త్నం. .

  • జ్యోతి శ్రీ సిద్దేశ్వరస్వామి ఆలయం...

    కొన్ని శతాబ్దాలుగా పెన్నానది గర్భంలో దాగి ఉన్న మహిమాన్వితమైన 108 లింగాల శివాలయాల దివ్య క్షేత్రం. రావణ సంహారం అనంతరం బ్రహ్మహత్య దోశ నివారణలో భాగంగా శ్రీ రాముడు దేశవ్యాప్తంగా శివలింగ ప్రతిష్టాపన జరుపుతూ ఇక్కడ శివలింగాలకు పూజలు నిర్వహించి పాప విమోచనం పోందాడని ప్రతీతి. కాలక్రమంలో ఆలయం పెన్నమ్మ కడుపులో కలిసిపోయి, ఇసుకదిబ్బగా మారిపోయింది.

ప్రవర యొక్క అర్ధం.


*చతుస్సాగర పర్యంతం*
(మానవ పరిభ్రమణానికి నలువైపులా కల మహాసముద్రాల అంచుల వరకూ)... 

*గో బ్రాహ్మణేభ్య శుభం భవతు*(సర్వాబీష్ట ప్రదాయిణి అగు..గోవూ మరియు నిత్యం సంఘహితాన్నే అభిలషించే సద్బ్రాహ్మణుడు అతడి రూపంలో ప్రకాశించే వేదధర్మం.. సర్వే సర్వత్రా దిగ్విజయంగా.. శుభప్రదంగా వర్ధిల్లాలని కోరుకుంటూ)....

*×××××××. ఋషేయ ప్రవరాన్విత..*
(మా వంశమునకూ..మా గోత్రమునకూ మా నిత్యానుష్ట ధర్మశీలతకు మూలపురుషులైన మా ఋషివరేణ్యులకూ..

*త్యాగే నైకే అమృతత్త్వ మానశుః......*
అన్న వారి మహోన్నతమైన త్యాగనిష్ఠకు సాక్షీభూతుడనై..

*×××××× గోత్రః*
(మా గోత్రమునకూ..)

*ఆపస్తంభ సూత్రః కృష్ణ యజుశ్శాఖాధ్యాయీ.....*
(మా శాఖకూ..అందలి శాస్త్ర మర్మంబులకు..)

*శ్రీ* *** *శర్మ నామధేయస్య*
( కేవలం జన్మతహానే కాక.. ఉపనయనాది సంస్కారాలతో.. శాస్త్రపఠనంతో..వేదాధ్యయనాది వైదిక క్రతువులతో..
1. స్నానము
2. సంధ్య
3. జపము
4. హోమము
5. స్వాధ్యాయము
6. దేవ పూజ
7. ఆతిధ్యము
8. వైశ్యదేవము అనబడే అష్టకర్మలనూ క్రమంతప్పక నిర్వహిస్తూ..త్రివిధాగ్నులు...
1.కామాగ్ని
2.క్రోధాగ్ని
3.క్షుద్రాగ్ని..
అనే త్రివిధాగ్నులను అదుపులో(సమస్థితిలో) ఉంచుకొన్న వాడినై..పేరుకు ముందు శ్రీ అనబడే..ప్రకృతి స్వరూపమైన శక్తిస్వరూపాన్ని.. శుభప్రదమైన శ్రీకారాన్ని ధరించిన..

*శ్రీ * *శర్మా* అనబడే సుశ్రోత్రియుడనైన నేను..జన్మప్రధాతలైన జననీజనకులముందు..  జ్ఞానప్రధాతలైన ఆచార్యులముందు.. జ్ఞానస్వరూపమైన వేదముముందు..యావత్ ప్రపంచానికే మార్గదర్శకమైన వేదధర్మము ముందు.. నిరాకార నిర్గుణ అవ్యాజ పరంజ్యోతి స్వరూపుడైన పరమాత్మ ముందు..

*అహంభో అభివాదయే..*
( కేవలం నేనూ అన్నదిలేక.. సర్వం ఆ పరమాత్మ యొక్క అనుగ్రహ భాగ్యమేయన్న అహంకారభావ రహితుడనై.. నిగర్వినై..త్రికరణ శుద్ధిగా (మనసా,వాచా,కర్మణా) సాష్టాంగ పూర్వక (మానవశరీరంలోని అత్యంత ప్రాధాన్యమైన ఎనిమిది శరీరాంగములనూ శరణాగత హృదయంచే నేలపై వాల్చి సమర్పిస్తున్న)దండ ప్రణామమిదే..అన్న పరిపూర్ణమైన ఆత్మపూర్వక వేదపూర్వక హృదయపూర్వక నమస్కార భావమే.. సశాస్త్రీయమైన ఈ ప్రవరలోని..అర్ధం అంతరార్ధం పరమార్ధం కూడా..

*సర్వేజనా సుఖినో భవంతు*
*లోకా సమస్తా సుఖినో భవంతు*
Share:

ఓం హ్రీం దృం దుర్గా దేవ్యై నమః.

యుగాంతానికి…. ఇదే గుర్తు!!!
కేదారేశ్వర గుహ… మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ లో వున్న హరిశ్చంద్ర కోటకు కుడి వైపున వుంది . ఇది ఒక అద్భుతమైన కట్టడం.పెద్ద బండరాయి కింద 12 అడుగుల శివ లింగం రూపంలో కొలువై ఉన్నాడు కేదారేశ్వరుడు. ఈ గుహ లోపలి భాగంలో 4- 6 మంది భక్తులు కూర్చుని పూజ, ధ్యానం చేసుకునేందుకు వీలుగా ఒక గది కూడా ఉంది. ఈ శివ లింగాన్ని భూమి నుంచి 6 అడుగుల ఎత్తులో వుండేటట్టు నిర్మించారు.లింగం చుట్టూ నాలుగు స్తంభాలు వుండేవి, వాటిలో 3 స్తంభాలు విరిగిపోగా ఒకటి మాత్రమే మిగిలింది.విశేషం ఏమిటంటే, ఈ నాలుగు స్తంభాలు నాలుగు యుగాలకి ప్రతీకలనీ, ఒక్కొక్క యుగాంతానికి ఒక్కొక్క స్తంభం విరుగుతూ, కలియుగానికి ఒకటే స్తంభం మిగిలిందని... ఎప్పుడైతే ఈ స్తంభం విరిగిపోతుందో, అదే కలియుగానికి ఆఖరు రోజనీ నమ్ముతారు.ఇక్కడ అచ్చెరువొందించేమరో విషయం ఏమిటంటే, ప్రతిరోజు 4 గోడల నుండి నీరు గుహలోకి వస్తుంది. శివలింగం చుట్టూ వేసవి, శీతాకాలాలలో 5 అడుగుల ఎత్తులో చాలా చల్లని నీరు వుంటుంది. కాని, వర్షాకాలంలో చుక్క నీరు కూడా గుహలోకిరాదు, నిలవదు.ఇలాంటి ప్రదేశాలు ఇంకా ఎన్నో భారత దేశంలో వుండడం మన ప్రాచీనుల విజ్ఞానానికి ప్రతీక...!
Share:

తామ్రపర్ణి పుష్కరాలు..

 'తామ్రపర్ణి' ... అంటే 'రాగి ఆకు' అని అర్థం. ఈ నదిలోని ఇసుక ... నీరు రాగి రంగులో ఉంటాయి. నదీ తీరంలో రాగి రంగు ఆకులు గల వృక్షాలు ఎక్కువగా కనిపిస్తూ వుంటాయి. ఈ కారణంగానే ఈ నదికి 'తామ్రపర్ణి' అనే పేరు వచ్చినట్టు చెబుతారు. విశిష్ట గుణాలు కలిగిన శంఖాలను ... అరుదైన ముత్యాలను అందించడం ఈ నది ప్రత్యేకత.

రాగి రంగులో అందంగా కనిపిస్తూ ఆహ్లాదపరిచే ఈ నది, అగస్త్య పర్వతంలో పుట్టి తమిళనాడు - తిరునల్వేలి జిల్లా మీదుగా ప్రవహిస్తూ సముద్రంలో కలుస్తుంది. కైలాస పర్వతంపై శివపార్వతుల కల్యాణం జరిగిన తరువాత, అగస్త్యుడు దక్షిణ భారత దేశ యాత్రలకు బయలుదేరాడు. ఆ సమయంలో తనకి లభించిన 'పద్మమాల'కు స్త్రీ రూపాన్ని ప్రసాదించి, 'తామ్రపర్ణి' పేరుతో జీవనదిగా ప్రవహిస్తూ జీవుల దాహార్తిని తీర్చమని చెప్పాడు. దాంతో తామ్రపర్ణి అగస్త్యుడిని అనుసరిస్తూ వుండగా, ఆయన ఆ నదీ తీరం వెంట అనేక పుణ్య తీర్థాలను స్థాపిస్తూ వెళ్లాడు. అలా ఆయన ఇటు దేవతలు ... అటు మానవులు స్నానమాచరించదగిన 118 పుణ్య తీర్థాలను స్థాపించినట్టు స్థల పురాణం చెబుతోంది.

తామ్రపర్ణి అనేక ప్రవాహాలను తనలో కలుపుకుంటూ అంబ సముద్రానికి కొంత దూరంలోని కొండలపై నుంచి దూకుతుంది. ఈ జలధారలతో ఏర్పడినదే 'పాపనాశ తీర్థం'. ఈ జలాలతో స్నానం చేసిన వారికి అనంతమైన పుణ్య ఫలాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ నదీ తీరంలో కొలువుదీరిన శివ కేశవ క్షేత్రాలను విశేష సంఖ్యలో భక్తులు దర్శిస్తుంటారు. ఈ నది పవిత్రతను గురించి ... దీనిలో స్నానమాడటం వలన కలిగే పుణ్య ఫలాల గురించిన ప్రస్తావన పురాణాలలో కనిపిస్తుంది.
...

తామ్రపర్ణి నదికి పుష్కరాలైతే భీమా నదికి అని చెప్పి మోసం చేస్తున్న వ్యాపారులు
ఏ నదికి ఈ సారి పుష్కరాలు?
------------------////----------
పుష్కరమంటే 12ఏళ్ళు.ప్రతి 12ఏళ్ళకు ఒక నదికి పుష్కరం వస్తుంది. మనకు 12రాశులున్నాయి.ఆయా రాశులలో బృహస్పతి సంచరించే కాలంలో ఒక్కో నదికి పుష్కరాన్ని బ్రహ్మ దేవుడు అనుగ్రహించాడు. బృహస్పతి ఒక్కో రాశిలో ప్రవేశించిన తొలి 12రోజులు ఒక్కో నదికి పుష్కరమొస్తుంది.ఆ సమయంలో ఆ నదిలో స్నానం చేస్తే పుణ్యప్రదం అని నమ్మకం.
ఈ సంవత్సరం భీమా నదికి పుష్కరమని పంచాంగాలలో వ్రాశారు. దీన్ని బట్టి వివిధ ట్రావెల్స్ సంస్థలు ప్రోపగాండా మొదలెట్టేశారు.అప్పుడే రైల్వే టిక్కెట్లన్నీ బ్లాక్ చేసేసారు. భీమానది మహారాష్ట్రలోని భీమశంకర్ నుంచి కర్నాటక మీదుగా తెలంగాణ వరకు వచ్చి కృష్ణలో కలసిపోతుంది.ఈ నదికే పుష్కరమని నిర్ణయించేసి పైన చెప్పినట్లు టిక్కెట్లు బుక్ చేసేసారు.
కానీ భీమానది కి అసలు పుష్కరమే లేదు.పుష్కర నిర్ణయం మూలశ్లోకం చూడండి.

"శ్లొ//మేషే గంగా వృషే రేవా మిథునేతు సరస్వతీ
కర్కటే యమునా ప్రోక్తా సింహే గోదావరీ స్మ్రతా
కన్యాయాం కృష్ణవేణీచ కావేరీ ధటకే స్మ్రతా
వృశ్చికే తామ్రపర్ణీచ చాపే పుష్కర వాహినీ
మకరే తుంగభద్రాచ కుంభే సింధునదీ స్మ్రతా
మీనే ప్రణీతా నదీచ గురోస్సంక్రమణే స్మ్రతా
పుష్కరాఖ్యౌ మునీనాంహి బుధై స్మ్రతా....."

ఇదీ మూల శ్లోకం.
దీన్ని బట్టి చూస్తే ఈ జాబితాలో"భీమానది"లేదు.తామ్రపర్ణి మాత్రమే ఉంది.ఈ తామ్రపర్ణి నది ఒకప్పుడు శివునికి రథంగా ఉండడం చేత దీనికి "భీమరథి"అనే పేరు ఉంది.అంతే కానీ ఇది భీమానది మాత్రం కాదు.

ఈ తామ్రపర్ణి నది తమిళనాడు లోని తిరునల్వేలి ,తూత్తుకూడి జిల్లాల్లో ప్రవహిస్తుంది. శాస్త్రప్రకారం 'బాణతీర్థం'లో పుష్కర స్నానం చేయాలి.బాణతీర్థం దగ్గరలోని రైల్వేస్టేషన్'అంబాసముద్రం'.

కాబట్టి దయచేసి అందరూ గమనించండి.మనం పుష్కర స్నానం చేయవలసింది తామ్రపర్ణి నదిలో!!!!
అంతే కానీ 'భీమానది'లో కాదు.
Share:

కాశీ ఖండం –19

ధ్రువుని భగవద్దర్శనం..   ధ్రువ బాలుడు యమునా నది ఒడ్డున ఉన్న మధు వనం చేరాడు .అది మొదటి భగవత్ స్థానం .అక్కడే హరి మేధసుడు అనే వాడు పాపాన్ని పోగొట్టుకొని పుణ్యాత్ముడైనాడు .ఏ జంతువైనా అక్కడ ఉంటె ,పుణ్యం పొందేట్లు చేసే గొప్ప స్థలం .ధ్రువుడు పర బ్రహ్మ స్వరూపు డైన వాసు దేవుని జపిస్తూ విశ్వ మంతా వాసు దేవ మయం గా భావిస్తూ ఏకాగ్ర దృష్టి తొ ధ్యానం లో నిమగ్నమయ్యాడు .గోవింద నామం తప్ప ,ఆయన ధ్యాస తప్ప అతనికిన్కేమీ లేదు . ఉగ్ర తపస్సుకు ఆయన స్నానం చేసిన నదీ జలాలే కాలుష్యాన్ని వదలించు కొంటున్నాయి .సిద్ధుల తేజస్సు ఆయనలో ప్రకాశిస్తోంది .వాయుదేవుడు ఆయన వాక్కు లో సన్నిహితుడైనాడు .ఆకాశం శబ్ద రూపం తొ అతనిని ఆరాధించా టానికి అతని చెవులను ఆశ్రయిన్చిందిట .అంటే పంచ భూతాలచే ధ్రువుడు ఆరాధింప బడ్డాడు .

            సాధారణం గా ఎవరు తీవ్ర తపస్సు చేస్తున్నా చెడ గొట్ట టానికి అప్సరసలను పంపే ఇంద్రుడు ధ్రువుడు బాలుడు కదా అని పంప లేదట .భయ పడేట్లు చేస్తే తపస్సు మానేస్తాదేమో నని భూత గణాలను పంపాడు భల్లూక ఆకారం  ,ఒంటె మెడ ,పెద్ద కోరల భూతాలు మూడు వచ్చాయి .రంకెలు వేస్తూ ఒక ఎద్దు మీదికి వచ్చింది .ఒకటి మహా సర్పాకారం గా భయ పెట్టె రూపం తొ పెద్ద పడగల తొ మీదికోచ్చ్చింది .దున్న పోతు ఆకారపు భూతం మీద పడింది .ఖర్జూర చెట్టు వంటి తొడలతో ఒకటి ,మండే మంటలతో ఒకటి ,మబ్బులరూపం లో ఒకటి ,గుడ్ల గూబ ఆకారం లో ఒకటి ,అరుస్తూ వచ్చాయి .ఒక భూతం నోటిలో శిశువును కరచుకొని వచ్చి ధ్రువుని ఎడుటనే కర కరానమిలేసింది .ఒకటి పెద్ద మంటలను సృష్టించి భయ పెట్టె ప్రయత్నం చేసింది .ఒక భేతాళం పర్వతాలను ,చెట్లను నగ్గు నుగ్గు చేస్తూ భీభత్సం సృష్టించే ప్రయత్నం చేసింది ,ఒకటి అరుస్తోంది ,ఒకటి ప్రక్క వాటిని కరుస్తోంది .విపరీతం గా ఏడుస్తూ ఒకటి, బ్రతిమి లాడుతూ ఇంకోటి హడా విడి చేస్తున్నాయి .ఇంకో భూతం ఆడ దాని పొందు కంటే సుఖం ఏముంది ?తపస్సు చేసినా ఈ సౌఖ్యానికే గా అని అరిచింది .ఇంద్రియాను భవం కంటే గొప్పేమీ లేదని కామ సుఖాన్ని అనుభ వించ మని ప్రార్ధించింది ఇంకో గడుసు దెయ్యం .వీటికి వేటికీకి ధ్రువుని మనస్సు చలించలేదు భయ పడ లేదు .మళ్ళీ ఏకాగ్రత తొ నారాయణ మంత్రాన్నే జపిస్తున్నాడు .ఇంతలో భయంకర ఆభరణాలను ధరింఛి సుదర్శన చక్రం అక్కడున్న భూతాలకు భాయోత్పాతాలను కల్పించి పార ద్రోలింది .దాన్ని సాక్షాత్తు నారాయణుడే ధ్రువుని రక్షణ కోసం పంపాడు .

                  ఒక అందాల రాశి అక్కడికి వచ్చి ధ్రువుడు భూమి నుండి జన్మించిన తపోమ్కురం అని భావించి ,అతని నిశ్చల తపస్సుకు మెచ్చి నమస్కరించి వెళ్లి పోయింది .భయ పడిపారి పోయిన భూత గణమంతా బ్రహ్మ దేవుని చేరి పరిస్తితి వివ రించారు తమ ప్రయత్నాలన్నీ వ్యర్ధమైనాయని చెప్పారు .బ్రహ్మ వచ్చిన ఆ దేవ గణాన్ని చూసి ‘’దేవత లారా భయ పడద్దు .ధ్రువుడు ధ్రువ మైన పదాన్ని కాన్క్షిస్తున్నాడు .అంతే కాని మీ పదవులకోసం ఆశించటం లేదు .అతడు భగవద్భక్తుడు .అతని వలన భగవద్భక్తు లైన మీకు భయం లేదు .,విష్ణువు నే అతడు నమ్ముకొన్నాడు .ఆయన మాత్రమె అతని మనో భీష్టాన్ని తీరుస్తాడు .మీ పదవులకేమీ ఢోకా లేదు. స్తిర చిత్తం తొ ఉండండి ‘’అని చెప్పి పంపించాడు .

               నారాయణుడు ధ్రువుని దృఢ దీక్షకు, తీవ్ర తపస్సుకు మెచ్చి అతని ఎదుట ప్రత్యక్ష మయాడు .’’బాలకా !నీ తపస్సుకు మెచ్చాను .తపస్సు చాలించు .కావలసిన వరాన్ని కోరుకో ‘’అన్నాడు .ధ్రువుడు కళ్ళు తెరచి అక్కడున్న్న లక్ష్మీ నారాయనులను చూసి సంభ్రమాశ్చర్య  చకితుడై  డైనాడు .ధ్రువ బాలుని వ్రేలు అంది పుచ్చుకొని విష్ణు మూర్తి పైకి లేవ దీశాడు .అతని ధూళి దూసర శరీరాన్ని ఆప్యాయం గా స్పృశించాడు వాసు దేవుడు .దీని తొ ధ్రువుడు తెప్ప రిల్లి తేరి పార జూశాడు .మహ దానందం తొ ధ్రువుని నోటి నుండి సుశబ్ద భూయిష్టమైన సంస్కృత స్తోత్రం గంగా ప్రవాహం లా  వెలు వడింది.

Share:

శ్రీ లలిత సహస్రనామాలకు అర్ధము..

వెయ్యి శిరస్సులతో కూడిన వదనము కలది శ్రీమాత అని అర్ధము.
సహస్ర శబ్ధము అనేకానేక అర్ధములు కలిగి యున్నది. సాహస మనగా అనేకము వేయి  అనినపుడు  ఒకటి తరువాత మూడు సున్నాలు వుండును .మూడు సున్నాలు మూడు లోకములకు సంకేతము కాగా వాటికి పూర్వము నందున్నది ఒకటియే ఒకటియే మూడు లోకములు వ్యాపించి యున్నదని అర్ధము . సృష్టి మొత్తము ప్రజ్ఞ ,శక్తి పదార్ధములతో  చేయ బడినది ఈ మూడింటిని ఆధారమైనది ఒకటియే కావుననే సహస్రపదమును పర తత్వమును తెలుపుటకు వాడుదురు. ఒకటి మూడుగనై నాలుగు అగును. ఒకటి పల్స్ మూడు ఈజి కొల్ట్ నాలుగు  తత్ కారణముగా వాక్కు ,వేదము,కాలము,స్వాభావములు. ప్రధానముగా నాలుగు విభజలు పొందును.ఒకటి నుండి పుట్టిన మూడు నాలుగు నుండి ప్రతి బింబించుటచే ఎడగును.ఒకటి పల్స్ మూడు పల్స్ మూడు ఈజి కొల్ట్ ఏడు  ఇట్లు ఏడు లోకములేర్పడును.ప్రధానముగా మూడే లోకములైననూ ప్రతి బింబ ప్రభావము ఏడుగ గోచరించును .సత్యలోకము తపో లోకము జనోలోకము ప్రధానముగ మూడు లోకములు ఈ మూడు లోకములు మహత్తు అను నాలుగవ లోకము నుండి సువర్లోకము భువర్లోకము భూలోకముగ ప్రతిబింబించును .ముందు మూడు లోకములు సూక్షములు .తరువాత మూడు లోకములు .


     స్థూలములు సూక్షము స్థూలములోనికి వచ్చుటకు మహత్తు నడుచు చున్నది .అదృశ్యము దృశ్యమగుట దృశ్యము అదృశ్యమగుట ఈ మహత్తు ఇట్లు మొత్తమేడు లోకము లేర్పడును.కావుననే ఈ మొత్తమును సంకేతించుటకు ఒకటి తరువాత  ఏడు సున్నాలు అదియే ఒక కోటి సంఖ్య .


     క్లుప్తముగ సహస్రము అని విస్తారముగ కోటి యని మన వాజ్యయమున పేర్కొందురు .ఈ సున్నాలన్నింటికిని ఆధారము శ్రీదేవి. లోకమును పదమున, అందు నశించు వారు,వాటి పాలకులు కూడా ఇమిడి యున్నారు ఇన్ని లోకములకు ముఖము శిరస్సుయై  శ్రీదేవి యున్నది.


      సహస్ర అనునది సహస్రార పద్మ వైభవమును సూచించును. సహస్రార వర్ణనము బహు విస్తారము .

     సహస్ర  అనునది అత్యంత శక్తివంతమగు మంత్రము. రహస్య మగు మంత్రము. అంతరంగమున దివ్యానుగ్రహముగ తెలియబడు మంత్రము.ఈ మంత్రమును తెలిసిన వారు సర్వ శక్తి మంతులు అగుదురు.సుదర్శన ఆయుధము వీరి సొత్తు అగును.అంబరీషాదులు ఈ మంత్రమును ధర్శించిరి .

       స అను శబ్దముతో పురుష సూక్తము ప్రారంభ మగును .సహస్రశీర్షా పురుష హ  అను శబ్దముతో శ్రీ సూక్తము ప్రారంభమగును. హిరణ్యవర్ణాం  సహా అను శబ్దము ప్రకృతి పురుషుల సమాగమ శబ్ధము.

      ఈ శబ్దముల మిశ్రమమే సోహం ,హంస,హసౌం, హింస,సింహ ఇత్యాదివి.ప్రకృతి పురుషుల సమాగమమే సృష్టి రూపము సహా అను శబ్ధము నుండి పుట్టు సృష్టినే స్ర అని పలుకుదురు.సహస్ర శబ్ధము అత్యంత వైభవోపేతమైన శబ్ధము. ఇంకనూ .వివరించుట కిచట తావు లేదు.

ఓం శ్రీ మాత్రే నమః
Share:

శబరిమల అయ్యప్ప స్వామి చరిత్ర..


శబరిమల అయ్యప్ప స్వామి చరిత్ర గురించి మనలో చాలా మందికి తెలుసు. కానీ శబరిమల ఆలయ విశిష్టత, విశేషాలు , ఇప్పుడున్న ఆలయాన్ని ఎవరు కట్టారు, ఎప్పుడు కట్టారు అనే అనేక విషయాలు మనలో చాలా మందికి తెలియదు.
ఆరోజుల్లో శబరిమల వెళ్ళడానికి ఎరుమేలిమార్గం అనే ఒకే ఒక దారి ఉండేది. నెలసరి పూజలకు ప్రత్యేకపూజలకు ఆలయ సిబ్బంది, తాంత్రి, మేల్ శాంతి ఈ మార్గంలో వెళ్ళివచ్చేవారు. పూర్తిగా అటవీ ప్రాంతం కావడంతో శబరిమల యాత్రకి బృందాలుగా వెళ్ళడం అప్పటి నుండి ఆనవాయితీగా వస్తోంది.

సుమారు 200 సంవత్సరాల క్రితం అంటే (1819)లో 70 మంది శబరిమల యాత్ర చేసారని, ఆ సంవత్సర ఆదాయం ఏడురూపాయలని పందళరాజు వంశీయుల రికార్డులలో ఉంది. 1907వ సంవత్సరంలో శబరిమలలో అయ్యప్ప దేవాలయం పైకప్పు (గర్భగుడి) ఎండుగడ్డి, ఆకులతో కప్పబడివుండేది. అప్పుడు అక్కడ శిలా విగ్రహానికే పూజలు జరిగేవి. 1907-1909 మధ్యకాలంలో దేవాలయం అగ్నికి ఆహుతి అవడంతో మరల దేవాలయాన్ని పునఃనిర్మించినట్లు తెలుస్తోంది.

ఈసారి శిలా విగ్రహానికి బదులు, అయ్యప్ప విగ్రహాన్ని పంచలోహాలతో తయారు చేసి ప్రతిష్టించారు. పంచలోహావిగ్రహం ప్రతిష్ఠించాకే శబరిమల వైభవం పెరిగింది. ఈ దేవాలయం 1935 వరకు తిరువాంకూరు మహారాజా సంస్థానంవారి ఆధీనంలో ఉండేది. 1935లో దీనిని తిరువాంకూరూ దెవస్థానం బోర్డువారికి అప్పగించబడింది. ఆ తరువాతే భక్తుల సంఖ్య గణనీయంగా పెరగడంతో జ్యోతి దర్శనానికే కాకుండా మండల పూజ కొరకు కూడా శబరిమలలో దేవాలయం తెరవడం మొదలుపెట్టారు.

చాలక్కాయమార్గం, వడిపెరియారు మార్గం ఏర్పడి తరువాత పంబా ప్రాజెక్టు నిర్మాణంలో శబరిమలకు వచ్చే భక్తుల రద్దీ పెరిగింది. అనంతరం 1945వ సంవత్సరం నుండి భక్తుల సంఖ్య ఇంకా పెరగడంతో విషు, పంకుని ఉత్తారం, ఓణం వంటి పండుగదినాలలొ కూడా తెరవడం ప్రారంభించారు.

శబరిమలకివెళ్ళే భక్తులు పెరగడాన్ని చూసి కొందరికి కన్ను కుట్టి 1950లో దెవలయాన్ని, విగ్రహాన్ని ధ్వంసం చేసారు. అలా పరశురామ నిర్మితమైన దేవాలయం మూడుసార్లు అగ్నికి ఆహుతి అయింది. దేవస్థానం బోర్డు, భక్తుల విరాళాలతో ఇప్పుడున్న దేవాలయాన్ని పునఃనిర్మించి ఇప్పుడున్న పంచలోహ అయ్యప్ప విగ్రహాన్ని చెంగనూరు వాస్తవ్యులు శ్రీ అయ్యప్పన్, శ్రీనీలకంఠన్ అనే శిల్పులిరువురూ కలిసి రూపుదిద్దారు.

దేవస్థానం ముఖ్యతాంత్రి శ్రీకాంతారు శంకర తాంత్రి 1951 జూన్ నెలలో (07-06-1951) వేదపండితుల మంత్రాలమధ్య, భక్తుల శరణుఘోష మద్య ప్రతిష్ఠ జరిగింది. అప్పటి వరకు కేరళీ కేళివిగ్రహంగా కీర్తించబడిన అయ్యప్ప భారతీకాళి విగ్రహంగా కీర్తించబడి, నేడు భూతళీకేళివిగ్రహంగా ప్రపంచమంతటా కీర్తించబడుతున్నాడు.

శబరిమల తపస్వి శ్రీవిమోచనానందస్వామి కృషి ఎంతో మెచ్చుకోదగ్గది. 
1950లో శబరిమల అయ్యప్ప ఆలయం అగ్నికి ఆహుతి అయినప్పుడు, శ్రెవిమోచనానందస్వామి హిమాలయాలలో సంచరిస్తున్నారు.బదరీనాథ్ లో ఈ వార్త విని ఒక్క శబరిమలలో దేవాలయన్ని ధ్వంసం చేసారు, కానీ, భారతదేశమంతటా అయ్యప్ప దేవాలయాలు నిర్మించి, అతిత్వరలో ప్రపంచమంతటా నిన్ను కీర్తించేటట్లు చేస్తానని శపథం చేసి, ఆ మహానుభావుడు కాశీ, హరిద్వార్, పూనా, బొంబాయి, కరుపత్తూరు, శ్రీరంగపట్టణం, మున్నగు పట్టణాలలో అయ్యప్పదేవాలయాలు నిర్మించడానికి దోహదం చేసారు. నేడు ఆయన కోరిక నెరవేరి దేశమంతటా ఎన్నొ అయ్యప్ప దేవాలయాలు నిర్మించారు.నేడు శబరిమల యాత్రకు భారతీయులే కాక విదేశీయులూ వచ్చి దర్శించుకోవడం విశేషం.

శబరిమలకు వచ్చే భక్తులు పెరగడంతో 1980 నుండి దేవస్థానం బోర్డువారు శ్రద్ధ తీసుకొని పంబపై వంతెన, పంబ నుండి విద్యుద్దీపాలు, మంచి నీటి కొళాయిలు, స్వాముల విశ్రాంతి కోసం పెద్ద షెడ్లు నిర్మించారు.

1984 వరకు పదునెట్టాంబడిని ఎక్కడానికి పరశురామ నిర్మితమయిన రాతిమెట్లపైనుండే ఎక్కేవారు. వారువెళ్ళే పడిని బట్టి ఆ మెట్టుపై కొబ్బరికాయ కొట్టి మెట్లు ఎక్కే ఆచారం ఉండేది. మెట్లు అరిగిపోయి, అన్ని మెట్లపై కొబ్బరికాయలు కొట్టడం వలన భక్తులు అనేక ఇబ్బందులకు గురికావడం చూసి, భక్తుల విరాళాలతో పదునెట్టాంబడికి 1985వ సంవత్సరంలొ పంచలోహ కవచాన్ని మంత్రతంత్రాలతో కప్పడం జరిగింది. దీనివలన 18 మెట్లు ఎక్కడం సులభరతమైంది. భక్తుల రద్దీ పెరగడం వలన తొక్కిసలాటలు లేకుండా ఉండటానికి వీలుగా, 1982లో ప్లై ఓవరు బ్రిడ్జి కట్టి దానిపై నుండి పదునేట్టాంబడి ఎక్కిన తర్వాత క్యులో వెళ్ళడానికి ఏర్పాటు చేసారు.

కొండపైనుండి మాలికాపురత్తమ్మ గుడివరకు ప్లైఓవరుబ్రిడ్జి కట్టడం వలన యాత్రీకులు తిరగడానికి వీలుగావుంది. 1989-90లోనే పంబామార్గంలో కొంతభాగం, సన్నిధానం ఆవరణలో మొత్తం భాగం సిమెంటు కాంక్రీటు చేసి, బురద లేకుండా చేసి భక్తులు విశ్రాంతి తీసుకోవడానికి అనువుగా తయారు చేసారు.

1985 నుండి పక్కా బిల్డింగులెన్నో అక్కడ నిర్మించబడి, శబరిమల స్వరూపాన్ని మార్చాయి. బెంగళూరు భక్తుడొకరు శబరిమలగర్భగుడిపైన, చుట్టూ బంగారు రేకులతో తాపడం చేయడానికి పూనుకొని 2000 సంవత్సరంలో పూర్తిచేయడంతో శబరిమల స్వర్ణదేవాలయంగా మారింది.

శబరిమలలో వంశపారంపర్య ముఖ్యపూజారిని తాంత్రి అని పిలుస్తారు. వీర్ని పరశురాముడు పూజ కొరకు ఆంధ్రాలో కృష్ణాజిల్లా నుండి తీసుకెళ్ళారని చెబుతారు. ప్రస్తుతం, శ్రీరాజీవ్ తాంత్రి ఆధ్వర్యంలో శబరిమల దేవాలయంలో పూజలు జరుపబడుతున్నాయి. శబరిమల దేవాలయంలో పూజలు జరిపించడానికి మేల్ శాంతిని (పూజారి) ప్రతి సంవత్సరం లాటరీ ద్వారా ఎన్నుకొంటారు. దేవస్థానంవారికి వచ్చిన దరఖాస్తులని పరిశీలించి పదింటిని సెలక్టు చేసి వారి పేర్లను రాసి ఒక డబ్బాలో ఉంచి,అయ్యప్ప విగ్రహం ముందుంచి ఒక చిన్నపిల్లవాని చేత లాటరీ తీయిస్తారు. ఎవరు పేరు వస్తే, వారు ఆ సంవత్సరనికి మేల్ శాంతిగా శబరిమలలో వ్యవహరిస్తారు.

స్వామి వారి ఆభరణాలను పందళంలో భద్రపరచి ఉంచుతారు. ప్రతీయేటా జనవరి 14 తారీఖునాటికి (మకరసంక్రాంతి) శబరిమల మూడుపెట్టెలలో పందళం నుండి 84 కిలోమీటర్లు ఆడవులలో నడుచుకొని మోసుకువస్తారు. ఈ ఆభరణాలు తేవడానికి పందళంలో భాస్కరన్ పిళ్ళే వారి కుటుంబం ఉంది. వీరు మొత్తం 11 మంది. దీక్షలో ఉండి (65 రోజులు) తిరువాభరణాలను శబరిమల మోసుకువస్తారు.

వీరు జనవరి 12 మధ్యాహ్నం పందళంలో బయలుదేరి మధ్యలో రెండు రాత్రిళ్ళు విశ్రాంతి తీసుకొని, 14 తారీఖున సాయంత్రం 6 గంటలకు శబరిమల సన్నిధానం చేరుతారు. ఆభరణాల వెంట పందళరాజు వంశస్తులలో పెద్దవాడు కత్తి పట్తుకొని నీలిమల వరకు వచ్చి అక్కడ విశ్రమిస్తాడు. తిరు ఆభరణాలు స్వామివారికి అలంకరించి కర్పూరహారతి గుళ్ళో ఇవ్వగానే తూరుపుదిక్కు పొన్నంబలమేడు నుండి భక్తులకు జ్యోతి దర్శనం అవుతుంది. పదునెనిమిది మెట్లు ఎక్కడానికి ఇరుముడి లేకుండా తాంత్రీ, పందళరాజు, తిరువాభరణాలు మోసేవారు ఎక్కుతారు. 
మరల జరవరి 20వ తారీఖునాడు పందళరాజు వెంటరాగా తిరువాభరణాల మూడు పెట్టెలను తిరిగి పందళం తీసుకు వెళ్ళి భద్రపరుస్తారు.

అయ్యప్ప భక్తజనవత్సలుడు. ఆయన అనుగ్రహం ఉంటే మనం సాధించలేనిదంటూ ఏమీ లేదు. ఆయనను ఒకసారి దర్శించుకున్న భక్తులు మళ్ళీ మళ్ళీ ఆయన దర్శనం కోసం మరొక సంవత్సరం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంటారు. అదీ ఆయన మహిమ.
ఓం స్వామియే శరణమయ్యప్ప!
Share:

జ్ఞాన సంబంధ నాయకర్..

శైవ సిద్దాంతం లో ఒక సాధన భగవంతుని తండ్రి గా భావించి సేవించడం. శివపాద హృదయన్,భగవతి లకు జన్మించారు. తండ్రిగారు ఒకరోజు వీరిని 3 సంవత్సరాల వయస్సులో కొలను కు స్నానం కు తీసుకెళ్లారు.వీరిని గట్టుపై కూర్చోబెట్టి వారు స్నానం కు వెళ్లారు.కొద్దిసేపటి కి పసివానికి ఆకలి వేసి పక్కనే వున్న గోపురం వైపు చూసి అమ్మ అని ఏడిచారు. పార్వతి అమ్మ,పరమేశ్వరుడు సమేతంగా వచ్చి స్వయం గా బంగారు పాత్రలో పాలు తెచ్చి పట్టింది.తండ్రి గారు స్నానం తరువాత బాబు మూతి దగ్గర పాలు ఉండటం చూసి ఎవరు పట్టారు అని అడిగితే వీరు గోపురం వైపు చూపి అర్ధనారీశ్వరులు గా దర్శనం ఇచ్చారు.ఆ వయస్సులోనే తనకు తీర్ధ యాత్రలు చేయాలని ఉంది అని తండ్రితో చెప్పారు.పిల్లవాడిని భుజం మీద ఎక్కించుకొని తండ్రి గారు తీర్ధ యాత్రలకు తీసుకెళ్లారు. ప్రతి పుణ్యక్షేత్రం లోని శివాలయంలో భజనలు చేసేవారు.చిట్టి చేతులు తప్పట్లతో భజన చేస్తుంటే చేతులు కందిపోయాయి. శివుడే స్వయంగా వీరికి బంగారు తాళాలను" ఓం నమః శివాయ"అని రాసి ఇచ్చారు.నటరాజ స్వామి దర్శనం కి వెళ్ళినప్పుడు స్వామి స్వయంగా వీరికి ముత్యాల పల్లకి ఏర్పాటు చేయించారు.తీర్థ యాత్రలు ముగిసి గ్రామం కు రాగానేబలవంతంగా పెళ్లి చేశారు.వివాహం అయిన మరుక్షణం వీరు,వీరి పత్ని జ్యోతి రూపంలో శివుని లో ఐక్యం అయ్యారు.
Share:

దేవునికి పుష్పాన్ని అర్పించి ప్రసాదం తీసుకోవటం ద్వారా ఎలాంటి ఫలితం లభిస్తుందని తెలుసుకుందాం..



1. దేవునికి జాజిపూలు అర్పించి ప్రసాదం స్వీకరిస్తే - మీలో ఉన్న దుష్టగుణాలు తొలగి మంచి గుణం వస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారి సమస్యలు తొలగిపోతాయి.
2. దేవునికి సంపెంగ పూలు అర్పించి ప్రసాదం స్వీకరిస్తే - మాంత్రిక ప్రయోగాలు మీపై పని చేయవు. శత్రువుల నివారణ సాధ్యమవుతుంది.
3. పారిజాత పూవును అర్పిస్తే - కాలసర్ప దోషం నివారించబడి మనసుకు శాంతి లభిస్తుంది.
4. రుద్రాక్షపూవును అర్పిస్తే - ఎన్ని కష్టాలు వచ్చినా అంతిమ విజయం మీదే అవుతుంది.
5. మొగలిపూలను అర్పిస్తే - అధికారంలో ఉన్నవారి మనస్తాపాలు పరిహరించబడతాయి.
6. లక్కి పూవుతో పూజిస్తే - భార్య, పిల్లలతో కలహాలు లేకుండా సంతోషంగా ఉంటాయి.
7. పద్మం లేదా కమలంతో పూజిస్తే - సమస్త దారిద్ర్య నివారణ, శ్రీమంతులు అవుతారు.
8. మల్లెపూవుతో పూజిస్తే - అన్ని రోగాలు నయం అవుతాయి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది.
9. కల్హర పుష్పంతో పూజ చేస్తే - అందరిలోనూ మీకు గుర్తింపు వచ్చి ఆకర్షణ పెరుగుతుంది.
10. గన్నేరు పూలతో పూజిస్తే - కవులకు కల్పనా సాహిత్యం వృద్ధి చెందుతుంది.
11. కలువ పూవుతో పూజ చేస్తే - స్తంభన తదితర మంత్ర సంబంధ బాధలు తొలగిపోతాయి.
12. పాటలీ పుష్పంతో పూజ చేస్తే - వ్యాపార-వ్యవహారాల్లో అధిక లాభం వస్తుంది.
13. కుంద పుష్పంతో పూజ చేసి ప్రసాదాన్ని స్వీకరిస్తే ముఖంలో అధికమైన తేజస్సు కాంతి వస్తుంది.
14. మల్లెపూవుతో పూజ చేసి ప్రసాదన్ని స్వీకరిస్తే - అన్ని రకాల మానసిక, దైహిక రోగాలు నయం అవుతాయి.
15. కనకాంబరం పూలతో దేవునికి పూజ చేయకూడదు. ఒకవేళ చేసి ప్రసాదాన్ని స్వీకరిస్తే - జీవితం పట్ల వైరాగ్యం వస్తుంది.
16. మాధవీ పుష్పంతో - సరస్వతి, గాయత్రి, శ్రీ చక్రం, శ్రీ రాజరాజేశ్వరి దేవికి జ్యోతిష్యం చెప్పేవారు పూజ చేస్తే మంచి వాక్‌శుద్ధి కలిగి పలికినట్లే జరుగుతుంది.
17. తుమ్మపూలతో ఈశ్వరునికి పూజ చేస్తే - దేవునిపై భక్తి అధికమవుతుంది.
18. నందివర్థనం పూలతో శివునికి పూజ చేస్తే - జీవితంలో సుఖం, శాంతి, ప్రశాంతత లభిస్తుంది.
19. కణగలె పుష్పం - దీనితో దేవునికి పూజ చేస్తే మనను పట్టి పీడిస్తున్న భయం, భీతి తొలగిపోతాయి. గణపతికి ఈ పూలతో పూజ చేస్తే మాంత్రిక బాధల తొలగిపోతాయి. విద్యా ప్రాప్తి సిద్ధిస్తుంది. దుర్గాదేవికి ఈ పూలతో పూజ చేస్తే దేవీ అనుగ్రహంతో శత్రువుల నిర్మూలనం అవుతుంది.
20. పొద్దుతిరుగుడు పువ్వుతో పూజ చేస్తే - పూవును హోమం పూర్ణాహుతికి వేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి.
Share:

కాశీ ఖండం –18

ధ్రువ చరిత్ర...  శివ శర్మ విష్ణు గణాలను ‘’ఏక పాదం మీద నిలిచి ,ఏదో ఆలోచిస్తున్నట్లు ,కాంతుల చేత ముల్లోకాలకు మండప స్థంభం వంటి వాడుగా ,కాంతులు వేద జల్లుతూ ,అనంత తేజో విరాజం గా ఉన్న ,ఆకాశం లో సూత్ర ధారిలా ,దాన్ని కొలుస్తున్న వాడిలా .యూప స్థంభం లా నిల బడి ఉన్న ఈ మహా పురుషుడు ఎవరు ?’’అని ప్రశ్నించాడు .ఆ మహనీయుడే ద్రువుడని చెప్పి ధ్రువ చరిత్ర ను తెలియ జేశారు .స్వయం భువునకు ఉత్తాన పాదుడనే కుమారుడున్నాడు .అతనికి సురుచి అనే భార్య వల్ల ఉత్తముడు అనే పెద్ద కొడుకు ,సునీతి అనే భార్య వల్ల ధ్రువుడు అనే చిన్న కొడుకు కలిగారు .ఒక రోజు సునీతి ఏదో పని లో ఉండి తనకుమారుడు ధ్రువుడిని సర్వాంగ సుందరం గా లంకరించి దాసికి చ్చి  రాజు దగ్గరకు పంపింది .అతను తండ్రికి నమస్కరించి నిల బడ్డాడు .అప్పటికే ఉత్తముడు రాజు గారి తోడ మీద కూర్చుని రాజసం ఒలక బోస్తున్నాడు .బాల్య చాపల్యం చేత ధ్రువుడు కూడా తండ్రి తోడ మీద కూర్చొనే ప్రయత్నం చేస్తు కాళ్ళ మీద నుంచి పాకుతున్నాడు . .అప్పుడు చుప్పనాతి సురుచి ‘’నువ్వు బాలిసుడివి .మహా రాజు అంకాన్ని చేరే అదృష్టం నీకు లేదు .అభాగ్యు రాలి గర్భం లో జన్మించావు .నేల మీద పాకే నువ్వెక్కడ ?సింహాసనం మీద కూర్చునే ఉత్తముడేక్కడ ?’’అని లాగి పారేసింది .రాజు కూడా ఏమీ అనలేక పోయాడు .కానీ లోపలి పోయి కన్నీళ్లు పెట్టు కొన్నాడు రాజు .

             అమాయకుడైన ధ్రువుడు ఏమీ చేయ లేక తండ్రికి నమస్కరించి తల్లి సునీత వద్దకు చేరి ఏడ్చాడు .తండ్రి తొడ మీద కూర్చునే అదృష్టం తనకు ఎందుకు కలగ లేదని ,ఆ అర్హత సంపాదించ టానికి తానేం చేయాలని అడిగాడు .అప్పుడు తల్లి‘’నాయనా ధ్రువా !సురుచి మానవతి అయిన భార్య ..ఆమె అంటే రాజు గారికి అభిమానం ఎక్కువ .నా దురదృష్టం వల్ల నేను ఆయన ప్రేమకు ఎక్కువ గా నోచుకో లేక పోయాను .పుణ్య వశం చేత ఉత్తముడు ఆమె గర్భం లో జన్మించి రాజ యోగ్యుడైనాడు‘’అని చెప్పి పుణ్యం రావాలంటే ఎలా వస్తుందో వివ రించింది సాత్విక మైన మనస్సు ,దయాదృష్టి ,శివ పూజ ,శాస్త్ర జ్ఞానము ,చదువు ,అరిషడ్వర్గాలను జయించటం ,తియ్యని మాట ,పనులలో శ్రద్ధ ,అలస్యం చేయక పోవటం ,గురు భక్తీ ,నిష్కాపట్యం ,దైన్యం లేని సంభాషణ ,శబ్ద పాండిత్యం ,బంధు గణాలను ఆదరించటం ,క్రయ ,విక్రయాలలో కఠినత్వం భార్యతో మృదువు  గా మాట్లాడటం ,తీర్ధాలు సేవించటం ,యుద్ధం లో వీర మరణం ,పిల్లల మీద వాత్సల్యం ,యాచకులకు ,వికలాంగులకు దానం చేయటం ,తల్లి దండ్రుల సేవ ,నిత్య ధర్మా చరణ,ఉత్తమ శీలం ,మంచి వారితో స్నేహం ,ఇతి హాస పురాణాలను వినటం ,ఆపదలలో ధైర్యం ,సంపద చేరినపుడు స్తైర్యం ,యతీశ్వరుల యెడ ఔదార్యం ,దేహాన్ని కృశింప జేసుకోవటం ,ఇంద్రియ జయం ,తపో నియమం అనే  ఉత్తమ గుణాల చేత తపో వృక్షం ఫలిస్తుంది .నువ్వు రాజు గారి కుమారుడవే కాని విశేష పుణ్యం చేయలేదు .నువ్వు చేసిన కర్మ కు తగిన ప్రతి ఫలమే లభిస్తుంది .కనుక దుఖించకు అని ఓదార్చింది .

                 తల్లి సునీతి మాటలు విన్న ధ్రువుడు ‘’అమ్మా !నేను బాలుడిగా మాట్లాడుతున్నానని అనుకో వద్దు .ఉత్తాన పాద రాజు గారి కుమారుడిని కనుక తపస్సు చేస్తాను .తపస్సు సర్వ సంపదలకు కారణం కదా .ఎవరికీ లభించ నంతటి గొప్ప పదవిని నేను సాధిస్తాను .నన్ను ఆశీర్వ డించి పంపించు ‘’అని కోరాడు అప్పుడామె ‘’ధ్రువా !నీకిప్పుడు తోమ్మిదేళ్ళే.నీకు ఆజ్న ఇచ్చే సమర్ధత నాకు లేదు .కానీ నీ మనో నిశ్చయం నాకు సంతృప్తి నిచ్చింది .కన్నీటి తోనే నిన్ను తపస్సుకు అంగీకారిస్తున్నాను‘’అని ఆశీర్వదించి పంపింది .

                ధ్రువ బాలకుడు అక్కడి నుండి బయల్దేరి నిర్జరా రణ్యం ప్రవేశించాడు .దారిలో సప్తర్షుల దర్శన భాగ్యం కలిగింది .వారికి నమస్కరించాడు .తన చరిత్ర అంతా వారికి దీనం గా వివ రించి ,వారి మనసులను దోచాడు .అతడి కోరిక ఏమిటని అడిగారు .అప్పుడు ధ్రువుడు వినయం గా వారితో ‘’నా సోదరుడు ఉత్తముడు మా తండ్రి తోడ మీద కూర్చునే అదృష్టాన్ని పుణ్యం వల్ల  పొందాడు .నాకూ ఆ అర్హత కావాలి మా తండ్రి సింహాసనం వేరొకరికి దక్క రాదు .ఇది ఇతరుల సింహాసనం కంటే ఉన్నత  మైంది .అది ఇంద్రాదులకు కూడా పొంద రానిది .మా తండ్రి వదిలిన సింహా సనం కాదు నాకు కావాల్సింది .నా బలం చేత సాధించుకొన్న సింహాసనం నాకు కావాలి .అది నాకు ఎలా  వస్తుంది ?దాని సాధనకు నేనేమి చేయాలి ‘’అని ప్రార్ధించాడు .అప్పుడు వారిలో మరీచి మహర్షి  ‘’శ్రీ మన్నారాయణుని భజించకుండా ఆ యోగ్యత రాదు .అన్నాడు .అంగీరసుడు ‘’ఈలోకం లో సంపద ను అను భ వించాలంటే కమలాక్షుని సేవిన్చాల్సిందే ‘’అనగా ,పులస్తుడు ‘’ఎవరిని స్మరిస్తే సమస్త పాపాలు నశిస్తాయో అతడే మహా విష్ణువు ‘’అని ,పులహుడు ‘’ఎవని మాయ చేత అంత ప్రవర్తిస్తోందో ఆ అచ్యుతు డే సర్వాన్ని ఇస్తాడు ‘’అని ,క్రతువు ‘’ఈ జగాలకు ఎవరు అంత రాత్మ యో ఆ విష్ణువు సంతోష పడితే ఇవ్వనిది ఉండదు ‘’అని వసిష్ఠ మహర్షి ‘’ఎవరి కను బొమల అజ్ఞచేత అష్ట సిద్ధులు ప్రవర్తిస్తాయో ,ఆ హృషీ కేషుని ఆరాధించు ‘’అని అందరు విష్ణువే ఏదైనా ఇవ్వ గల సమర్ధుడని బోధించారు .

               అప్పుడా ధ్రువ బాలుడు ‘’మహర్షి సత్తము లారా !నిలబడినా ,నడుస్తున్నా ,పడుకొన్నా ,నిద్రిస్తున్నా ,మేలుకొన్నా కూర్చున్నా ,ఎప్పుడూ నారాయణుడిని స్మరించాలి ద్వాదశాక్షరీ మంత్రం వాసు దేవాత్మకం .ఆ జపం తో శ్రీ మన్నారాయనుని జపించి నేను నా కోర్కెను తీచుకొంటాను .ఆయన మనసు కరగిస్తాను .ఈ మంత్రాన్ని పూర్వ బ్రహ్మ ,మునులు ఉపాసిన్చారని తెలుస్తోంది ‘’అన్నాడు మహర్షులు ద్వాదశాక్షర మంత్రం తో వాసు దేవుడిని ప్రసన్నం చేసుకోమని సలహా నిచ్చి మనస్పూర్తిగా ఆశీర్వా దించి అంతర్హితులయ్యారు .ధ్రువుడు వాసు దేవ మనస్కుడై తపస్సు చేసుకోవ టానికి అక్కడి నుండి బయల్దేరాడు.
Share:

విస్తరి ఆకులకు, మనిషి జీవితానికి దగ్గరి సంబంధము ఉంది .


విస్తరి ఆకుని ఎంతో శుభ్రంగా ఉంచుకొని నీటితో కడిగి నమస్కారం చేసుకుని భోజనానికి కూర్చుంటాము.

భోజనము తినే వరకు ఆకు కు మట్టి అంటకుండా జాగ్రత్త వహిస్తాము.

తినిన మరుక్షణం ఆ విస్తరి ఆకును మడిచి , దూరంగా పడేసి వస్తాము...

మనిషి జీవితం కూడ అంతే ఊపిరి పొగానే ఊరిబయట పారేసి వస్తారు ,

విస్తరి ఆకు పారేసినప్పుడు సంతోష పడుతుంది.

ఎందుకంటే పొయే ముందు ఒకరి ఆకలిని తీర్చటానికి తను ఉపయేగ పడినాను కదా అన్న తృప్తి  ఉంటుంది.

విస్తరి ఆకు కు ఉన్న  ఆలోచన  మనము కుడా అలవర్చుకోవాల,

మనకు శక్తి వున్నపుడే సేవ చేసుకోవాలి.

అవకాశము వచ్చినపుడు వెంటనే చేయడం మంచిది.

మరి ఎప్పుడో చేయవచ్చు అనుకొని వాయిదా వేయకూడదు.

ఆ అవకాశము మళ్లీ వస్తదని అనుకుంటే .... రాకపోవచ్చు.

కుండ ఎప్పుడైనా పగలవచ్చు.

అప్పుడు విస్తరికి ఉన్న తృప్తి కూడ మనకి ఉండదు .

యెంత సంపాదించి ఏమి లాభం ?

ఒక్క పైస నైనా తీసుక పోగలమా ?

మనం పోయిన నాడు మనవెంట వచ్చేది, మన తోడు ఉండేది, ఈ సేవ ఒక్కటే.....🙏
Share:

కామాక్షీ వైభవం..



ఒకప్పుడు పరమశివుడు కైలాసపర్వతం మీద కూర్చుని ఉన్న సమయంలో, అమ్మవారు లీలావినోదంగా ఆయనతో సంతోషంగా కాలం గడుపుతూ, ఆయన రెండు కళ్ళూ మూసింది. ఆయన రెండు కళ్ళు 'సూర్యచంద్రౌ చ నేత్రే'

ఆయన ఒక కన్ను సూర్యుడు, ఒక కన్ను చంద్రుడు. అగ్నిహోత్రం మూడవ కన్ను. ఆ కారణం చేత ఆవిడ ఆయన రెండు కన్నులూ మూస్తే లోకమంతా చీకటియిపోయింది. సూర్యచంద్రుల గమనం లేకపోతే వచ్చే పెద్ద ప్రమాదం ధర్మచక్రం ఆగిపోతుంది. ఏది లుప్తమైనా పరవాలేదు గాని ధర్మచక్రం ఆగిపోకూడదు.

ఏ పని చేసినా ఆయా కాలాలలో చేయాలి తప్ప, ఏ కాలంలో ఏది చెయ్యాలో అది చేయకుండా వేరొక పని చెయ్యకూడదు. సూర్యచంద్రులు కదలిక లేక ఆగిపోవడంతో లోకమంతా చీకట్లు కమ్మి కాలం తెలియలేదు కాబట్టి చేయవలసిన అనుష్టానాలు జరగక ధర్మానికి గ్లాని ఏర్పడింది. ఇది జరిగినది ప్రమశివునకు లిప్తకాలమైనా భూలోకంలో దాని ప్రభావం చాలా ఉంటుంది. లోకులు ఖేదపడ్డారు. ఈశ్వరునిలో ఉన్న గొప్పదనం ఏమిటంటే అమ్మవారికి పాపపుణ్యాలు ఉండవు. 

కానీ ఒక పని చేసినప్పుడు ఇతరులు బాధ పడేటట్లు చేస్తే అది దోషమవుతుంది. అలా ఎప్పుడూ చెయ్యకూడదు. సూర్యచంద్రుల ప్రకాశం లేక లోకులు బాధ పడ్డారు. పార్వతీ దేవి కదా అని ఉపేక్షిస్తే లోకంలో మిగిలిన వాళ్ళు ఇతరులను బాధపెట్టి మేం మాత్రం ఎందుకు ఉపేక్షించ కూడదు అంటారు. అందుకని ఆయన భూలోకానికి వెళ్ళి తపస్సు చేయి అంటే ఆవిడ భూలోకానికి వచ్చి తపస్సు చేసింది.

ఆ తల్లి ఉత్తరభారతంలో హిమాలయాల మీద ఎప్పటి నుండో తనని కుమార్తెగా పొందడానికి ప్రయత్నిస్తూ తపస్సు చేసుకుంటున్న కాత్యాయన మహర్షి కుమార్తె అయి, కాత్యాయనుని కూతురు కాబట్టి కాత్యాయిని అని పేరుపొందింది. ఆ తల్లి యుక్త వయస్సు పొందిన తరువాత ఆమెకి వివాహం చేయవలసివచ్చింది. అమ్మవారు ఎంతమందికైనా కూతురవుతుంది కాని పరమేశ్వరునికే ఇల్లాలు. ఆయనని భర్తగా తేవడం ఆమెకే సాద్యం తప్ప ఇతరులకు సాధ్యం కాదు.

కాత్యాయనమహర్షి కొన్ని వస్తువులిచ్చి అమా! ఇవి పట్టుకుని బయలుదేరు. నువ్వు ఏ ప్రాతాంనికి వెళ్ళినప్పుడు ఈ వస్తువులు మార్పు చెందుతాయో అక్కడ తపస్సు చేయి ఈశ్వరుడు స్వీకరించి భార్యాస్థానంలో కూర్చోపెట్టుకుంటాడు. 

ఆమె బయలుదేరి దక్షిణదేశం వస్తుండగా, కాంచీపురానికి వస్తున్నప్పుడు ఆమెకి ఇచ్చిన వస్తువులు మార్పు చెందాయి. ఆ పట్టణంలోనే తపస్సు చేయాలని అమ్మవారు అక్కడ తపస్సు ప్రారంభించింది. పరమశివుడు ఆమెకి తన పట్ల ఉన్న ప్రేమ ఎటువంటిదో ఎంతటి మహాపతివ్రతో లోకానికి చాటి చెప్పాలనుకున్నాడు. ఆయన తన జటాజూటంలోని గంగపాయను ఒకదానిని విడచి పెట్టాడు. విశేషమైన ప్రవాహంతో విచ్చేస్తున్నది. ఆవిడ ఇసుక లింగాన్ని చేసి ఆరాధన చేస్తున్నది. 

ఆమెకి తాను కొట్టుకుపోతానని బెంగ కాదు, సైకత లింగం కొట్టుకొనిపోతుందేమో అని బెంగ కలిగి దుర్గమ్మ ఆవిర్భవించేటట్లుగా ధ్యానం చేసి ఆ నీటినంతటినీ త్రాగేయమంది. ప్రళయకాల బంధిని అయిన గంగా ప్రవాహాన్ని పుక్కిట పట్టి దుర్గమ్మ తాగేసింది. శివుడు చూసి ఏం చేస్తుందో చూద్దామని అంతకన్నా అధృతమైన ప్రవాహాన్ని విడిచి పెట్టాడు. 

బ్రహ్మాండమైన ప్రవాహం కాంచీపురం వైపు వస్తుంటే, పార్వతీదేవి కంప కంప అన్నది. అంటే భయం భయం అని అర్థం. అమ్మవారే భయం పోగొట్టగలిగిన ఆదిశక్తి. ఆవిడకు భయం లేదు. సైకత లింగం వెళ్ళిపోతుందని ఆవిడకు భయం. ఆ శివలింగం పోవడానికి వీలు లేదు. లింగానికి నీళ్ళు తగిలేముందు నేనే వెళ్ళీపోవాలని, తన పతిభక్తిని చాటి చెప్పడానికి, సైకత లింగాన్ని గట్టిగా కౌగిలించుకున్నది. అప్పుడు అమ్మవారి కుచములు, కంకణాల ముద్రలు శివలింగం మీద పడ్డాయి.

పరమశివుడు చూసి అమ్మవారి పతిభక్తికి మెచ్చి, ప్రవాహాన్ని ఉపసంహారం చేసి అమ్మవారిని తాను స్వీకరించాడు. 
Share:

ప్రభాత గుళిక..


*మనసు*:...దీనికి కళ్లెం వేయాలి...అసలు వేయగలమా?

*మనసు*:...పరచిన పానుపు కాదు. *మనసు*:...గులాబీతోట కాదు.
*మనసు*:...శీతల పవనం కాదు.
*మనసు*:...మనం చెప్పినట్లు వినే మన ఇంటి పెంపుడు కుక్కపిల్లా కాదు. మనలోనే ఉండి, మనతోనే ఉండి, మనలను తన ఇష్టం వచ్చినట్లు ఆడించే ఒక శక్తి. దీనికి కళ్లెం వేయాలి...అసలు వేయగలమా?

మనసులో రకరకాల ఆలొచనలు వస్తూ ఉంటాయి. అవి మనలను వేధిస్తూ ఉంటాయి. చాలా ఇబ్బంది పెడుతూంటాయి. మనకు తెలియకుండా మనం వాటికి వసమైపోతూ ఉంటాం. వీటినుంచి విముక్తి పొందేదెలా?



అందరూ యోగులు కారు. యోగులు కాలేరు. కనీసం సాధకులైనా కారు. నిత్యం మనసుతో పోరాటంచేసే సామాన్య మానవులం మనం. జీవితం పోరాటం. జీవనం పోరాటం. మనసుతో హాయిగా విహరించాలని అందరికీ ఉంటుంది. అదే పక్కలో బల్లెమై కాచుకుని ఉంటే ఏం చేయగలం? ఏదైనా దారి ఉందా?....ఉంది.

రోగం ఇచ్చిన భగవంతుడు ఔషదం ఇచ్చేడు. ఆకలిని స్రుష్టించిన అదే భగవంతుడు అన్నం చూపించేడు....అలాగే మనసుకు కళ్లెం వేయటానికి మనిషికి పట్టుదల అనే అస్త్రం ఇచ్చేడు.

మంచి భావనలను ప్రతిసారీ మళ్లీ మళ్లీ ప్రయత్నించటమే పట్టుదల. అయితే దీని ఉనికి మనకు తెలియడంలేదు. ప్రతిదానికీ మనసునే ఆశ్రయిస్తున్నాం.



కూడదు అంటున్నారు పెద్దలు. మన ముందు వెళ్లిన వాళ్లు. మనసును మచ్చికచేసుకో అంటున్నారు కొందరు. మనసుకు అతీతంగా వెళ్లిపో అంటున్నారు మరికొందరు. ఏది నిజం? దాన్ని మనసే చెప్పాలి. ఎందుకంటే మన మనసు ఏదైతే(దేనినైతే) మళ్లీ మళ్లీ చెబుతుందో దాన్నే మనం నమ్ముతాం, ఆచరిస్తాం. అక్కడే ఉంది చిక్కు. అక్కడే మన మనసుకు మనం బానిసలైపోతున్నాం.

ఇలా ఉంటే మనం ముందుకు సాగలేం. అయితే ఈ మనసును ఎలా జయించాలి? దీనికోసమే మనకు ఒక ఆయుధం ఇచ్చేడు భగవంతుడు. పట్టుదల. మనం ఎలా అనుకుంటే అలా ఉండే సంకల్ప శక్తి. ఏ కార్యానికైనా ఇది కావాలి. గట్టిగా ఒక మంచి భావాన్ని పట్టుకుని నిలబడగలిగితే మంచి పనులు చెయ్యగలుగుతాం. ఇదే క్రియా శక్తిగ, ఙ్ఞాన శక్తిగా మారుతుంది. చివరికి అద్భుతాలు సాధిస్తాం.

పట్టుదల నిప్పురవ్వలాంటిది. దాన్ని మనమే రాజేసి, ద్విగుణీక్రుతం చేసి, జ్వాలాయమానంగా చేసి మహా అగ్నిలా మార్చుకోవాలి. అప్పుడు మనం మనసుకు కళ్లెం వేసినట్లే!
Share:

చంద్రఘంట..గాయత్రి దేవి.

చంద్రఘంట..గాయత్రి దేవి..
చంద్రఘంట దేవీ పూజ ఎలా చేయాలి?
.
.
నవరాత్రుల్లో మూడో రోజున సింధూర్ తృతీయగా జరుపుకుంటారు. ఈ రోజున శాంతినీ, ధైర్యాన్ని ప్రసాదించే చంద్రఘంట అవతారంలో అమ్మవారిని పూజించాలి. ఈ శక్తి రూపాన్ని తెల్లని చీరతో అలంకరిస్తారు. ఇదే రోజున గౌరీ వ్రతం కూడా చేస్తారు. భక్తులు ఈ రోజున బూడిద రంగు దుస్తులు ధరించాలి. చంద్రఘంటకు శుక్ర గ్రహం అధిపతిగా చెప్తారు.
.
దుర్గామాతయొక్క మూడవ శక్తి నామము ‘చంద్రఘంట’. నవరాత్రి ఉత్సవాలలో మూడవరోజున ఈమె విగ్రహానికే పూజాపురస్కారాలు జరుగుతాయి. ఈ స్వరూపము మిక్కిలి శాంతిప్రదము, కల్యాణ కారకము. ఈమె తన శిరమున దాల్చిన అర్ధచంద్రుడు ఘాంటాకృతిలో ఉండటంవల్ల ఈమెకు ‘చంద్రఘంట’ అనే పేరు స్థిరపడింది. ఈమె శరీరకాంతి బంగారువన్నెలో మిలమిలలాడుతుటుంది. తన పది చేతులలో – ఖడ్గము మొదలయిన శస్త్రములను, బాణము మున్నగు అస్త్రములను ధరించి ఉంటుంది. సర్వదా సమరసన్నాహయై యుద్ధముద్రలో ఉండే దివ్య మంగళ స్వరూపం. ఈమె గంటనుండి వెలువడే భయంకర ధ్వనులను విన్నంతనే క్రూరులైన దుష్టులు గడగడలాడిపోతారు.
.
నవరాత్రి దుర్గాపూజలలో మూడవ రోజు సేవ మిక్కిలి మహిమోపేతమైనది. ఆ రోజు సాధకుని మనస్సు మణిపూరక చక్రాన్ని ప్రవేశిస్తుంది. చంద్రఘంటాదేవి కృపవలన ఉపాసకునికి దివ్య వస్తు సందర్శనం కలుగుతుందని చెబుతారు. దివ్య సుగంధ అనుభవము కూడా సిద్ధిస్తుంది. అలాగే వివిధాలైన దివ్యధ్వనులు కూడా వినిపిస్తాయి. ఈ దివ్యానుభవ అనుభూతికొరకు, సాధకుడు సావధానుడై ఉండాలి.
.
ఈ మాత కృపవలన సాధకుని సమస్త పాపాలూ, బాధలూ తొలగిపోతాయి. ఈమె ఆరాధన సద్యః ఫలదాయకము. ఈమె నిరంతరమూ యుద్దసన్నద్ధురాలై ఉన్నట్లు దర్శనమిస్తుంది కనుక భక్తుల కష్టాలను అతి శీఘ్రముగా నివారిస్తుంది. ఈ సింహవాహనను ఉపాసించేవారు సింహసదృశులై పరాక్రమశాలురుగా నిర్భయులుగా ఉంటారు. ఈమె ఘాంటానాదము సంతతము భక్తులను భూతప్రేతాది బాధలనుండి కాపాడుతూ ఉంటుంది. ఈమెను సేవించినంతనే శరణాగతుల రక్షణకై అభయఘంట ధ్వనిస్తూ ఉంటుంది.
.
ఈ దేవీ స్వరూపము దుష్టులను అణచివేయటంలో, హతమార్చుటంలో అను క్షణమూ సన్నద్ధురాలై ఉండునదే; అయినప్పటికీ భక్తులకూ, ఉపాసకులకూ ఈమె స్వరూపము మిక్కిలి సౌమ్యముగానూ, ప్రశాంతముగానూ కనబడుతూ ఉంటుంది. ఈమెను ఆరాధించడంవల్ల సాధకులలో వీరత్వ నిర్భయత్వములతోపాటు సౌమ్యతా, వినమ్రతలు పెంపొందుతుంటాయి. వారి నేత్రాలలోని కాంతులు, ముఖవర్చస్సు, శరీర శోభలు ఇనుమడిస్తూ, సద్గుణములు వృద్ధిచెందుతుంటాయి. వారి కంఠస్వరములలో అలౌకికమైన దివ్యమాధుర్యము రాశిగా ఏర్పడుతుంది. చంద్రఘంటాదేవిని భజించేవారు, ఉపాసించేవారు ఎక్కడికి వెళ్ళినా వారిని దర్శించిన వారందరూ సుఖశాంతులను పొందుతారు. ఇలాంటి ఉత్తమ సాధకుల శరీరాలనుండి దివ్యమూ, ప్రకాశవంతమూ అయిన తేజస్సు బహిర్గతము అవుతూ ఉంటుంది. ఈ దివ్య ప్రక్రియ సామాన్యులదృష్టికి గోచరించదు. కానీ ఉత్తమ సాధకులూ, వారి అనుయాయులు మాత్రము వీటిని గ్రహించి, అనుభూతిని పొందగలరు.
.
మనము త్రికరణశుద్ధిగా విధ్యుక్తకర్మలను ఆచరిస్తూ, పవిత్రమైన అంతఃకరణ కలిగి చంద్రఘాంటాదేవిని శరణుజొచ్చి, ఆమెను ఉపాసించడానికీ, ఆరాధించడానికీ తత్పరులమై ఉండాలి. అలాంటి ఉపాసన ప్రభావము వల్ల, మనము సమస్త సాంసారిక కష్టములనుండి విముక్తులమై, సహజంగానే పరమపద ప్రాప్తికి అర్హులమవుతాము. నిరంతరమూ ఈ దేవి పవిత్రమూర్తిని ధ్యానిస్తూ మనము సాధనలో అగ్రగణ్యులమవ్వటానికి ప్రయత్నిస్తూ ఉండాలి. దేవి ధ్యానము మనకు ఇహపర లోకాలలో పరమ కల్యాణదాయకమై సద్గతులను ప్రాప్తింపజేస్తుంది.
.
చంద్రఘంట దేవీ పూజ ఎలా చేయాలి...?
చంద్రఘంట దేవిని...
పిండజ ప్రవరారూఢ చండకో పాస్త్రకైర్యుతా|
ప్రసాదం తమతేహ్యం చంద్రఘంటేతి విశ్రుతా|| అనే మంత్రంతో స్తుతించాలి.
.
చంద్రఘంట అన్నపూర్ణ దేవి గా పూజిస్తారు
దక్షిణ భారత్ లో - కొబ్బరి అన్నం
రంగు - నారింజ రంగు
ఉత్తర భారత్ లో - పాలు
రంగు - తెలుపు
Share:

అన్నపూర్ణ అలంకారం - కూష్మాండ రూపం..

కూష్మాండ దేవి...
అన్నపూర్ణ అలంకారం - కూష్మాండ రూపం..
.
.
దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు గ్రాండ్ గా జరుగుతున్నాయి. అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుంచే అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు పండితులు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నాలుగవ రోజు అమ్మవారు కూష్మాండ రూపంలో భక్తులకు దర్శమిచ్చారు. ఉదయాన్నే మహంకాళీ, మహాలక్ష్మీ, జ్ఞాన సరస్వతీ అమ్మవార్లకు సుప్రభాత సేవ, లలితా సహస్రనామ సహిత చతుషష్టి పూజ నిర్వహించారు. సెలవు రోజులు కావడంతో అమ్మవారి దర్శనానికి భక్తులు భారీగా తరలిరావడంతో క్యూ లైన్లు కిక్కిరిస్తున్నారు.
.
దుర్గామాత నాలుగవ స్వరూప నామము ‘కూష్మాండ’. దరహాసముతో అంటే అవలీలగా బ్రహ్మాండమును సృజించుతుంది కాబట్టి ఈ దేవి ‘కూష్మాండ’ అనే పేరుతో విఖ్యాతి చెందింది.
.
ఈ జగత్తు సృష్టి జరుగక ముందు అంతటా గాఢాంధకారమే అలముకొని ఉండేది. అప్పుడు ఈ దేవి తన దరహాసమాత్రంతో ఈ బ్రహ్మాండాలను సృజించింది. కాబట్టి ఈ స్వరూపమే ఈ సృష్టికి ఆదిశక్తి. ఈ సృష్టిరచనకు పూర్వము బ్రహ్మాండమునకు అస్తిత్వమే లేదు.
.
ఈమె సూర్యమండలాంతర్వర్తిని. సూర్యమండలంలో నివసింపగల శక్తిసామర్థ్యములు ఈమెకే గలవు. ఈమె శరీరకాంతిచ్ఛటలు సూర్యకిరణ ప్రభలలాగా దేదీవ్యమానముగా వెలుగొందుతూ ఉంటాయి. ఈమె తేజస్సు నిరుపమానము. దానికి అదే సాటి. ఇతర దేవతాస్వరూపాలేవీ ఈమె తేజః ప్రభావములతో తులతూగలేవు. ఈమె తేజోమండల ప్రభావమే దశదిశలూ వెలుగొందుతూ ఉంటుంది. బ్రహ్మాండములోని అన్ని వస్తువులలో, ప్రాణులలో ఉన్న తేజస్సు కూష్మాండ ఛాయయే.
.
ఈ స్వరూపము ఎనిమిది భుజాలతో విరాజిల్లుతూ ఉంటుంది. అందువల్లనే ఈమె ‘అష్టభుజాదేవి’ అనే పేరుతో కూడా వాసిగాంచింది. ఈమె ఏడు చేతులలో వరుసగా కండలమూ, ధనుస్సూ, బాణమూ, కమలమూ, అమృతకలశమూ, చక్ర గదలు తేజరిల్లుతూ ఉంటాయి. ఎనిమిదవ చేతిలో సర్వ సిద్ధులనూ, నిధులనూ ప్రసాదించే జపమాల ఉంటుంది. సింహవాహన. సంస్కృతంలో ‘కూష్మాండము’ అంటే గుమ్మడికాయ. కూష్మాండబలి ఈమెకు అత్యంత ప్రీతికరము. ఇందువల్ల కూడా ఈమెను ‘కూష్మాండ’ అని పిలుస్తారు.
.
నవరాత్రి ఉత్సవాలలో నాల్గవరోజు కూష్మాండాదేవీ స్వరూపమే దుర్గామాత భక్తుల పూజలను అందుకొంటుంది. ఈనాడు సాధకుని మనస్సు అనాహత చక్రంలో స్థిరమవుతుంది. కాబట్టి ఈ రోజు ఉపాసకుడు పవిత్రమైన, నిశ్చలమైన మనస్సుతో కూష్మాండాదేవి స్వరూపాన్నే ధ్యానిస్తూ పూజలు చేయాలి. భక్తులు ఈ స్వరూపాన్ని చక్కగా ఉపాసించడంవల్ల పరితృప్తయై ఈమె వారి రోగాలనూ, శోకాలనూ రూపుమాపుతుంది. ఈమె భక్తులకు ఆయుర్యశోబలములూ, ఆరోగ్యభాగ్యములు వృద్ధి చెందుతాయి. సేవకుల కొద్దిపాటి భక్తికే ఈ దేవి ప్రసన్నురాలవుతుంది. మానవుడు నిర్మల హృదయంతో ఈమెను శరణుజొచ్చిన వెంటనే అతి సులభముగా పరమ పదము ప్రాప్తిస్తుంది.
.
శాస్త్రాలలో, పురాణాలలో పేర్కొనబడిన రీతిలో విధివిధానమును అనుసరించి మనము దుర్గాదేవిని ఉపాసిస్తూ అనవరతము భక్తి మార్గంలో అగ్రేసరులమై ఉండాలి. ఈ తల్లి భక్తిసేవా మార్గంలో కొద్దిపాటిగానైనా పురోగమించగలిగిన సాధకునికి ఆమె కృపానుభవము అవశ్యము కలిగి తీరుతుంది. దాని ఫలితంగా దుఃఖరూప సంసారమంతా భక్తునికి సుఖదాయకమూ, సుగమమూ అవుతుంది. మనిషి సహజంగా భవసాగరాన్ని తరించడనికి ఈ తల్లియొక్క ఉపాసన అతి సులభమైన, శ్రేయస్కరమైన మార్గం. మనిషి ఆదివ్యాధులనుండీ సర్వదా విముక్తుడవటానికీ, సుఖసమృద్ధిని పొందటానికీ, ఉన్నతిని పొందటానికీ కూష్మాండా దేవిని ఉపాసించటమనేది రాజమార్గం వంటిది. కాబట్టి లౌకిక, పారలౌకిక ఉన్నతిని కాంక్షించేవారు ఈ దేవీస్వరూపంయొక్క ఉపాసనలో సర్వదా తత్పరులై ఉండాలి.
.
శ్రీ కూష్మాండ దేవి అమ్మవారి యొక్క మంత్రం:
సురాసంపూర్ణకలశం రుధిరాప్లుతమేవ చ ।
దధానా హస్తపద్మాభ్యాం కూష్మాండా శుభదాస్తు మే ॥
పైన ఇవ్వబడిన మంత్రాన్ని ఉదయం పూజ చేసేటప్పుడు ఒక్కసారి పట్టించాలి
శ్రీ కుశమంద దేవి అమ్మవారి యొక్క బీజ మంత్రం 108 సార్లు పట్టించాలి.

Share:

స్కందమాత దేవి.. లలితా త్రిపురసుందరి..

దుర్గామాత ఐదవ స్వరూపం స్కందమాత దేవి..
లలితా త్రిపురసుందరి..
.
.
త్రిపురత్రయంలో రెండో శక్తి లలితా త్రిపుర సుందరి. దేవి ఉపాసకులకు ఈమె ముఖ్య దేవత. త్రిగుణాతీతమైన కామేశ్వరీ స్వరూపం ఈ తల్లి. పంచదశాక్షరీ మహామంత్ర అధిష్టాన దేవతగా లలితాత్రిపుర సుందరిని ఆరాధిస్తారు. సకల లోకాతీతమైన కోమలత్వం కలిగిన మాతృమూర్తి ఈమె. చెరుకుగడ, విల్లు, పాశాంకుశములను ధరించిన రూపంతో కుడివైపున లక్ష్మీదేవి, ఎడమవైపున సరస్వతీదేవి పూజలు చేస్తుండగా లలితాదేవి భక్తులను అనుగ్రహిస్తుంది. దారిద్య్ర ద్ణుఖాలను తొలిగించి, సకల ఐశ్వర్యాభీష్టాలను ఈమె సిద్ధింపజేస్తుంది. ఈమె శ్రీవిద్యా స్వరూపిణి, సృష్టి, స్థితి, సంహార రూపిణి. కుంకుమతో నిత్యపూజలు చేసే సువాసినులకు (ముత్తైదువులకు) ఈ తల్లి మాంగల్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. శ్రీచక్రానికి కుంకుమార్చన చెయ్యాలి. లలితా అష్టోత్తరంతో పూజించాలి. ”ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ్ణ” అనే మంత్రాన్ని సార్లు జపించాలి.
.
దుర్గా మాతయొక్క ఐదవస్వరూపము ‘స్కందమాత’ అనే పేరుతో ప్రసిద్ధి గాంచింది. స్కందుడనగా కుమారస్వామి. ఆయనకు ‘కార్తికేయుడు’ అనే మరొక పేరు. ప్రసిద్ధమైన దేవాసుర సంగ్రామంలో ఈయన దేవతల సేనలకు అధిపతిగా ఉన్నాడు. పురాణాలు ఈయనను శక్తిధరుడని పేర్కొని, ఈయన మహిమలను వర్ణించాయి. ఈతడు నెమలి వాహనుడు. స్కందభగవానుడి తల్లి అయినందున దుర్గాదేవి ఐదవ స్వరూపానికి ‘స్కందమాత’ అనే పేరు ప్రసిద్ధమైనది. నవరాత్రి ఉత్సవాలలో ఐదవ రోజున ఈ స్వరూపంలో దుర్గాదేవి ఆరాధించబడుతుంది.
.
ఈ రోజు సాధకుని మనస్సు విశుద్ధచక్రంలో స్థిరమవుతుంది. ఈమె మూర్తిలో బాలస్కందుడు ఈమె ఒడిలో కూర్చొని ఉంటాడు. స్కందమాత ‘చతుర్భుజ’. తన ఒడిలో చేరి ఉన్న స్కందుడిని తన కుడిచేతితో పట్టుకొని దర్శనమిస్తుంది. మరొక కుడి చేతిని పైకెత్తి పద్మమును ధరించి ఉంటుంది. ఎడమవైపున ఒక హస్తం అభయముద్రలో ఉంటుంది. మరొక కరములో కమలమును కలిగి ఉంటుంది. ఈమె శ్వేతవర్ణ శోభిత. ఈ దేవి కమలాసనంపై విరాజిల్లుతుంటుంది. కనుక ‘పద్మాసన’గా ప్రసిద్ధికెక్కినది. సింహవాహన.
.
నవరాత్రి ఉత్సవాలలో ఐదవనాటి పూజ ఒక ప్రత్యేకతను సంతరించుకొని ఉన్నది. దాని మహా మాహాత్మ్యం గురించి శాస్త్రాలు వేనోళ్ళ శ్లాఘించాయి. విశుద్ధచక్రంలో స్థిరమైన మనస్సుగల ఉపాసకునికి లౌకిక ధోరణులు, చిత్తవృత్తులూ అంతరిస్తాయి. అతడు విశుద్ధ చైతన్య స్వరూప మార్గంలో పురోగమిస్తాడు. అతని మనస్సు సమస్తమైన లౌకిక సాంసారిక మాయా బంధములనుండి విముక్తిని పొంది, పిదప పద్మాసనంలో ఆసీనయైన స్కందమాత స్వరూపంలో పూర్తిగా కలిసిపోతుంది. ఈ సమయంలో సాధకుడు పూర్తిగా సావధానుడై ఉపాసనలో ముందుకు సాగాలి. అతడు తన ధ్యానవృత్తులలో ఏకాగ్రతను కలిగి ఉండి సాధనలో పురోగమించాలి.
.
స్కందమాతను ఉపాసించటంవల్ల భక్తుల కోరికలన్నీ నేరవేరుతాయి. ఈ మృత్యులోకంలోనే వారు పరమశాంతిని, సుఖాలనూ అనుభవిస్తారు. వారికొరకై మోక్షద్వారము నిరంతరము తెరచుకొని వుంటుంది. స్కందమాతకొనర్చిన పూజలు బాల స్కందునికీ చెందుతాయి. ఈ దేవిని ఆరాధించటంలో ఉన్న వైశిష్ట్యము ఇదే! కనుక భక్తులు స్కందమాతను ఆరాధించటంపై ప్రత్యేక ధ్యాసను కలిగి ఉండాలి. ఈ దేవి సూర్యమండల అధిష్ఠాత్రి అవటంవల్ల ఈమెను ఉపాసించేవారు దివ్యతేజస్సుతో, స్వచ్ఛకాంతులతో విరాజిల్లుతుంటారు. ఒక అలౌకిక ప్రభా మండలం అదృశ్యరూపంలో సర్వదా వారి చుట్టూ పరివ్యాప్తమై ఉంటుంది. ఈ ప్రభామండలం అనుక్షణమూ వారి యోగక్షేమాలను వహిస్తుంటుంది.
.
కాబట్టి మనము ఏకాగ్రతో పవిత్రమైన మనస్సులతో స్కందమాతను శరణుజొచ్చుటకు ప్రయత్నిస్తూ ఉండాలి. ఈ ఘోర భవసాగరముల దుఃఖమునుండి విముక్తులమై మోక్షమును సులభంగా పొందటానికి ఇంతకుమించిన ఉపాయము మరొకటి లేదు.


https://www.facebook.com/rb.venkatareddy
Share:

కాత్యాయని దేవీగా మ‌హాల‌క్ష్మీదేవి అమ్మవారు..


కమలాలు రెండు చేతులలో ధరించి, అభయవరద హస్త ముద్రలను ప్రదర్శిస్తూ, గజరాజు సేవిస్తుండగా మూడోరోజు శ్రీమహాలక్ష్మి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు.

మహాలక్ష్మి సర్వమంగళకారిణి, ఐశ్వర్యప్రదాయిని. 

అష్టలక్ష్ముల సమష్టి రూపమే మహాలక్ష్మి. అమ్మవారు డోలాసురుడు అనే రాక్షసుడిని వధించింది. శక్తి త్రయంలో మధ్య శక్తి, ఈ దేవిని ఉపాసిస్తే ఫలితాలు త్వరితంగా కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. యాదేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా అంటే అన్ని జీవలలోనూ ఉండే లక్ష్మీస్వరూపం దుర్గాదేవని చండీసప్తసతి చెబుతోంది. కాబట్టి శరన్నవరాత్రులలో మహాలక్ష్మిని పూజిస్తే సర్వ మంగళ మాంగల్యాలు కలుగుతాయి. ”ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మీ స్వాహా” అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. పూర్ణాలు నివేదన చెయ్యాలి.లక్ష్మి యంత్రాన్ని పూజించాలి, ఎరుపు రంగు పూలతో పూజించాలి, లక్ష్మీ స్తోత్రాలను పఠించాలి.
.
దుర్గామాత ఆరవ స్వరూపం కాత్యాయని. పూర్వం ‘కత’ అనే పేరుగల ఒక గొప్ప మహర్షి ఉండేవాడు. అతని కుమారుడు ‘కాత్య’ మహర్షి. ఈ కాత్యగోత్రజుడే విశ్వవిఖ్యాతుడైన ‘కాత్యాయన’ మహర్షి. ఇతడు ‘పరాంబా’ దేవిని ఉపాసిస్తూ, ఎన్నో సంవత్సరాలు కఠినమైన తపస్సును ఆచరించాడు. భగవతీదేవి లేదా దుర్గాదేవి పుత్రికగా తన ఇంట జన్మించాలని అతని కోరిక. భగవతీ మాత ఆయన ప్రార్థనను అంగీకరిస్తుంది. కొంతకాలం తరువాత ‘మహిషాసురుడు’ అనే రాక్షసుని అత్యాచారాలతో భూలోకం పెచ్చరిల్లిపోతుంది. ఈ మహిషాసురుని సంహరించడానికై బ్రహ్మవిష్ణు మహేశ్వరులు తమ తమ తేజస్సుల అంశలతో ఒక దేవిని సృష్టిస్తారు. మొట్ట మొదట కాత్యాయన మహర్షి ఈమెను పూజిస్తారు. అందువలన ఈమె ‘కాత్యాయని’ అని ప్రసిద్ధికెక్కింది.
.
ఈమె ‘కాత్యాయన’ మహర్షి ఇంట పుత్రికగా అవతరించిందని మరి ఒక కథ. ఈమె అమాంత భాద్రపద బహుళ చతుర్దశినాడు జన్మించింది (ఉత్తర భారత పౌర్ణిమాంత పంచాంగ సంప్రదాయమును బట్టి ఇది ఆశ్వీయుజ శుద్ధ చతుర్దశి). ఈమె ఆశ్వీయుజ శుక్ల సప్తమి, అష్టమి, నవమి తిథులలో కాత్యాయన మహర్షి పూజలందుకొని విజయదశమినాడు మహిషాసురుని వధించింది.
.
కాత్యాయనీదేవి అమోఘఫలదాయిని. కృష్ణుడిని పతిగా పొందటానికి గోకులంలో గోపికలందరూ యమునానదీ తీరాన ఈమెనే పూజించారని భాగవతం చెబుతుంది. ఈమె గోకులానికి అధిష్ఠాత్రిగా వెలిసినది. ఈమె స్వరూపము దివ్యమూ, భవ్యమూ. ఈమె శరీరకాంతి బంగారు వన్నెతో తళతళ మెరుస్తూ ఉంటుంది. ఈమె నాలుగు భుజాలతో విరాజిల్లుతూ ఉంటుంది. ఈమె కుడిచేతులలో ఒకటి అభయముద్రనూ, మరొకటి వరదముద్రనూ కలిగి ఉంటుంది. ఈమె ఒక ఎడమ చేతిలో ఖడ్గమూ, మరొక ఎడమ చేతిలో పద్మమూ శోభిల్లుతూ ఉంటాయి. సింహవాహన.
.
దుర్గా నవ రాత్రులలో ఆరవరోజున కాత్యాయనీ స్వరూపం పూజింపబడుతుంది. ఆ దినాన సాధకుడి మనస్సు ఆజ్ఞా చక్రంలో స్థిరమవుతుంది. యోగసాధనలో ఈ ఆజ్ఞా చక్రం యొక్క స్థానం ప్రముఖమైనది. ఈ చక్రంపై స్థిర మనస్సుగల సాధకుడు తన సర్వస్వమును కాత్యాయనీ దేవి చరణాలలో సమర్పిస్తాడు. పరిపూర్ణంగా ఆత్మసమర్పణము చేసిన భక్తుడికి సహజంగానే కాత్యాయనీ మాత దర్శనం లభిస్తుంది. ఈ దేవిని భక్తితో సేవించిన వారికి ధర్మ, అర్థ, కామమోక్షాలనే చతుర్విధ పురుషార్థముల ఫలములు లభిస్తాయి. అతడు ఈ లోకంలో అలౌకిక తేజస్సులను, ప్రభావములను పొందగలడు. రోగములు, శోకములు, సంతాపములు, భయము మొదలైనవి అతడినుండి సర్వదా దూరమవుతాయి. జన్మజన్మాంతరాల పాపాలు నశించటానికి ఈ దేవి ఉపాసనకంటె సులభమైనా, సరళమైన మార్గం మరొకటి లేదు. ఈమెను ఆరాధించేవారు నిరంతరం ఈమె సాన్నిధ్యం నుండీ, పిమ్మట పరమపదప్రాప్తికీ అర్హులవుతారు. కాబట్టి మనము అన్ని విధాలా ఈ తల్లిని శరణుజొచ్చి, ఈమె పూజలందూ, ఉపాసనయందూ తత్పరులము కావాలి.

https://www.facebook.com/rb.venkatareddy
Share:

కాళరాత్రిదేవి ...స‌ర‌స్వ‌తిదేవి.


శరన్నవరాత్రులలో మూలా నక్షత్రానికి ప్రత్యేక విశిష్టత ఉంది. చదువులతల్లి సరస్వతి రూపంలో దుర్గాదేవి దర్శనమిచ్చే పవిత్రమైన రోజు ఇది. బ్రహ్మ చైతన్య స్వరూపిణిగా సరస్వతీదేవిని పురాణాలు వర్ణిస్తున్నాయి. శ్వేత పద్మాన్ని ఆసనంగా అధిష్టించి, వీణ, దండ, కమండలం, అక్షమాల ధరించి, అభయముద్రతోభక్తుల అఙ్ఞాన తిమిరాలను ఈ దేవి సంహరిస్తుంది. వ్యాసుడు, వాల్మీకి, కాళిదాసు, మొదలైన లోకోత్తర చరిత్రులకు ఈమె వాగ్వైభవాన్ని వరంగా ఇచ్చింది. త్రి శక్తి రూపాల్లో అమ్మ మూడో శక్తి రూపం, సంగీత- సాహిత్యాలకు అధిష్టాన దేవత. సకల జీవుల జిహ్మగ్రంపై (నాలుకపై) ఈమె నివాసం ఉంటుంది. అమ్మను కొలిస్తే విద్యార్ధులకు చక్కని బుద్ధి వికాసం కలుగుతుంది. అందుకే ఈ రోజున అమ్మను సరస్వతీరూపంలో ప్రత్యేకంగా పిల్లలతో (విద్యార్ధులు) పూజలు చేయిస్తారు. బాసరలో ఙ్ఞాన సరస్వతీదేవికి ఈ దినం విశేషంగా పూజలు జరుగుతాయి.ఈ రోజు అమ్మవారి ఆధ్వర్యంలో మూలా నక్షత్ర యుక్త పూజతో విశేషంగా అక్షరాభ్యాసం చేస్తారు. దీనిని ”విజయారంభం” అని పిలుస్తారు.
.
దుర్గామాత ఏడవ శక్తి ‘కాళరాత్రి’ అనే పేరుతో ఖ్యాతివహించింది. ఈమె శరీరవర్ణము గాఢాంధకారము వలె నల్లనిది. తలపై కేశములు చెల్లాచెదరై ఉంటాయి. మెడలోని హారము విద్యుత్కాంతులను విరజిమ్ముతూ ఉంటుంది. ఈమెకు గల త్రినేత్రాలు బ్రహ్మాండములాగా గుండ్రనివి. వాటినుండి విద్యుత్కాంతులు ప్రసరిస్తూ ఉంటాయి. ఈమె నాసికాశ్వాసప్రశ్వాసలు భయంకరములైన అగ్ని జ్వాలలను వెడలగ్రక్కుతుంటాయి. ఈమె వాహనము గార్ధబము లేదా గాడిద. ఈమె తన ఒక కుడిచేతి వరదముద్ర ద్వారా అందరికీ వరాలను ప్రసాదిస్తుంది. మరోక కుడిచేత అభయముద్రను కలిగి ఉంటుంది. ఒక ఎడమచేతిలో ఇనుపముళ్ళ ఆయుధాన్నీ, మరొక ఎడమచేతిలో ఖడ్గాన్నీ ధరించి ఉంటుంది.
.
కాళరాత్రి స్వరూపము చూడటానికి మిక్కిలి భయానకమైనప్పటికీ ఈమె ఎల్లప్పుడూ శుభ ఫలితాలనే ప్రసాదిస్తుంది. అందువలన ఈమెను ‘శుభంకరి’ అని కూడా అంటారు. కాబట్టి భక్తులు ఈమెను చూసి ఏ భయాన్నిగానీ, అందోళననుగానీ పొందనవసరంలేదు.
.
దుర్గానవరాత్రులలో ఏడవ రోజున కాళరాత్రి మాతను ఉపాసిస్తారు. ఆ రోజు సాధకుని మనస్సు సహస్రార చక్రంలో స్థిరమవుతుంది. అతనికి బ్రహ్మాండములలోని సమస్త సిద్ధులూ కరతలామలకములవుతాయి. ఈ చక్రాన స్థిరపడిన సాధకుడి మనస్సు పూర్తిగా కాళరాత్రి స్వారూపంపైనే స్థిరమవుతుంది. ఈమె సాక్షాత్కారం వలన భక్తునికి మహాపుణ్యము లభిస్తుంది. అతని సమస్త పాపాలు, ఎదురయ్యె విఘ్నాలు పటాపంచలైపోతాయి. అతనికి అక్షయ పుణ్యలోప్రాప్తి కలుగుతుంది.
.
కాళరాత్రి మాత దుష్టులను అంతమొందిస్తుంది. ఈమెను స్మరించినంత మాత్రానే దానవులూ, దైత్యులూ, రాక్షసులూ, భూతప్రేతపిశాచాలూ భయంతో పారిపోవడం తథ్యం. ఈమె అనుగ్రహంవల్ల గ్రహబాధలు తొలగిపోతాయి. ఈమెను ఉపాసించేవారికి అగ్ని, జలము, జంతువులు మొదలైన వాటి భయం కానీ శత్రువుల భయం కానీ, రాత్రి భయం కానీ – ఏ మాత్రం ఉండవు. ఈమె కృపవల్ల భక్తులు సర్వదా భయవిముక్తులవుతారు.
.
కాళరాత్రి మాత స్వరూపాన్ని హృదయంలో నిలుపుకొని మనుష్యుడు నిష్ఠతో ఉపాసించాలి. యమ, నియమ సంయమనాలను పూర్తిగా పాటించాలి. త్రికరణ శుద్ధి కలిగి ఉండాలి. ఈ దేవి సర్వశుభంకరి. ఈమెను ఉపాసించే వారికి కలిగే శుభాలు అనంతాలు. మనం నిరంతరం ఈమె స్మరణ, ధ్యానములను, పూజలనూ చేయటం – ఇహపర ఫల సాధకం.
Share:

పంచభూతలింగాలు..


పరమేశ్వరుడు లింగరూపంలో భక్తులకు దర్శనమిస్తాడు. ఆ లింగరూపాన్ని దర్శించుకునే వారికి సకలసంపదలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. అందులో కీలకమైన పంచలింగాలు. పృథ్విలింగం, ఆకాశలింగం, జలలింగం, తేజోలింగం, వాయులింగములను పంచభూతలింగాలు అంటారు.

1. పృథ్విలింగం:
ఇది మట్టిలింగం. కంచిలోఉంది. ఏకాంబరేశ్వర స్వామి అంటారు. పార్వతీదేవిచే ఈ లింగం ప్రతిష్టించబడినది. ఇక్కడున్న అమ్మవారి పేరు కామాక్షీదేవి. అష్టాదశ పీఠాలలో ఇది ఒకటి.

2. ఆకాశలింగం:
ఇది తమిళనాడులోని చిదంబర క్షేత్రంలో ఉన్నది. ఆకాశలింగ దర్శనం రహస్యమైనది. ఆకాశంవలే శూన్యంగా కనిపిస్తుంది. లింగ దర్శనముండదు. అందువల్లనే చిదంబర రహస్యం అనే పేరు వచ్చినది. ఈ క్షేత్రంలో నటరాజస్వామి, శివకామ సుందరి అమ్మవార్లు మాత్రమే ఉంటారు.

3. జలలింగం:-
ఈ లింగం క్రింద ఎప్పుడూ నీటి ఊట ఉండటం వలన దీనిని జలలింగం అంటారు. ఇది తమిళనాడులోని తిరుచురాపల్లికి సమీపంలో జంబుకేశ్వర క్షేత్రంలో ఉంటుంది. ఈ స్వామి పేరు జంబుకేశ్వరుడు. అమ్మవారి పేరు అఖిలాండేశ్వరి. బ్రహ్మహత్యా పాతక నివారణకోసం పరమేశ్వరుడు జంబూక వృక్షం క్రింద తపస్సు చేసినందుకే ఇక్కడి శివునికి జంబుకేశ్వరుడని పేరువచ్చెను.

4. తేజోలింగం:
తమిళనాడులోని అరుణాచలంలో తిరువన్నామలై క్షేత్రంలో తేజోలింగం ఉన్నది. అరుణాచల శిఖరాగ్రంపై అగ్నిశిఖ ఒకటి ఆవిర్భవించి తేజోలింగ రూపమయ్యాడు శివుడు. ఈయన పేరే అరుణాచలేశ్వరుడు. అమ్మవారి పేరు అరుణాచలేశ్వరి.

5. వాయులింగం:
ఆంధ్రప్రదేశ్ తిరుపతికి దగ్గరలోని శ్రీ కాళహస్తీశ్వరస్వామి ఆలయంలోని లింగమే వాయులింగం. ఈయన పేరు కాళహస్తీశ్వరుడు. అమ్మవారి పేరు . సాలెపురుగు, పాము, ఏనుగులకు మోక్షము ప్రసాదించిన క్షేత్రం. ఇవే పంచభూతలింగాలుగా ప్రసిద్ధి చెందినవి.
Share:

నవగ్రహాలు మరియు వారి భార్యలు..

ఇప్పటి వరకు మీకు నవగ్రహాలు వారి పేర్లు మాత్రమే తెలుసు, అయితే కొందరికి అదికూడా తెలియని వారు ఉన్నారు, అయితే ఇప్పుడు మనం నవగ్రహాలు మరియు వారి భార్యలు, వారి పేర్లు కలిపి ఇక్కడ అందిస్తున్నాను.









Share:

ప్రపత్తి అనగా..!!

మనం వేంకటేశ్వరస్వామి సుప్రభాతంలో  తరచూ వింటూ ఉండేదే. మరి ప్రపత్తి అంటే ఏంటి? జన్మలలో శ్రేష్టమైనది మానవజన్మ. అటువంటి మానవువునికి జీవిత లక్ష్యం ఆ శ్రీమన్నారాయణుని పాదముల శరణు పొందుటయే. దీనినే ప్రపత్తి అంటారు. ఎవరిని శరణు పొందాలి. మనకంటే ఉన్నతమైన స్థానంలో ఉనశరణం🌷🌷

కానేకాదు. సమస్త లోకములను నియంత్రించువాడు సర్వలోకములను పోషించువాడు అయిన ఆ భగవంతుని శరణు పొందవలెను. అందుకే శ్రీకృష్ణుడు భగవద్గీతలో

🙏సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ
అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః!! 🙏

🙇‍♂ అనగా అన్ని ధర్మములను త్యజించి నన్నే శరణు పొందు. నీ పాపములన్నింటి నుండి మోక్షం ను ఇచ్చెదను. సాక్షాత్తుగా ఆ శ్రీకృష్ణుడే మనకి భరోసా ఇస్తున్నప్పుడు ఇక ఆచరించకపోవడానికి ఏమిటి ఇబ్బంది. ఇబ్బంది ఎందుకొస్తుందంటే మనకి నమ్మకం లేదు. నమ్మకం ఎందుకు లేదు? ఆ భగవంతుని పై ప్రేమ లేదు. ప్రేమ ఉంటే నమ్మకం తప్పక కలుగుతుంది. ప్రేమ కలగాలంటే ఏమి చెయ్యాలి. ఇందులో అనుభవం లేని వారెవ్వరైనా ఉన్నారా ? తల్లిదండ్రులను మనం ప్రేమిస్తాం. వారి మీద మనకు నమ్మకం ఉండబట్టేకదా . మరి ఈసమస్త సృష్టికి తండ్రి అయిన ఆ భగవంతుని ఎందుకు శరణు పొందకూడదు. సరే భగవంతుని శరణు పొందుట ఎట్లు? భగవంతుని శరణు పొందుటకు సులభమైన ఉపాయము శ్రీమద్ భాగవతము లో బాలుడైన ప్రహ్లాదుడు ఇట్లు చెప్పెను.

🙏 శరవణం కీర్తనం విష్ణోః స్మరణం పాద సేవనం
అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం 🙏

🙇‍♂ నారాయణుని గురించి శ్రవణం చెయ్యాలి. కీర్తించాలి, స్మరించాలి. స్వామి పాదములను సేవించాలి. అర్చనము చెయ్యాలి. నమస్కరించాలి. స్వామికి దాసుడవ్వాలి. స్నేహం చెయ్యాలి, తనను తాను సమర్పించుకోవాలి.

🙇‍♂ ఇవన్నీ చేయాలంటే స్వామి మనకు కనిపించాలి కదా. అవును. ఆ స్వామి ని చూచుటకు మనకున్న ఈనేత్రములు చాలవు. అందుకే స్వామి మనమీద దయతో అర్చారూపంలో మన ముందుకు వచ్చాడు. మనసా వాచా కర్మణా ఆస్వామిని మనము సేవించవలెను. సద్గురువు ను ఆశ్రయించి సమస్త దుఃఖములను దూరం చేసుకొను మార్గం తెలుసుకొని శాశ్వత ఆనందాన్ని పొందుటకు ప్రయత్నం చేయవలెను.

🌷శరీమన్నారాయణ చరణం శరణం ప్రపధ్యే🍀
Share:

Search This Blog

Popular Posts

ప్రకృతితో రైతన్న బంధం: పుష్యమి కార్తెలో ఏం జరుగుతుంది?

పుష్యమి కార్తె: వర్షాల ఆశ, ఎదుగుదల.. సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలాన్ని వ్యవసాయ పంచాంగం ప్రకారం ఆ కార్తెగా పిలుస్తారు. మొత్తం 2...

Recent Posts

Unordered List