దైవదర్శనం
  • శ్రీ మల్లెంకోండేశ్వర స్వామి ఆలయం.. మల్లెంకొండ..

    సేతుబంధనం చేసేముందు శివలింగాన్ని శ్రీరాముడు ప్రతిష్టించినట్లు శివపురాణం వర్ణిస్తోంది. ఇతర పురాణాల్లో కూడా రాముడు శివలింగాన్ని ఆరాధించిన విషయం కనిపిస్తుంది. కొన్ని చోట్ల హత్యాపాతక నివారణార్థం శివలింగ ప్రతిష్ఠలు చేసిన గాథలున్నాయి వీటిని కాదనలేము..!

  • పంచలింగాల కోన..

    అది శేషాచల అటవీ ప్రాంతం.. దట్టమైనఅడవులు.. రాళ్లూ రప్పలతో కూడిన గుట్టలు... చిన్న చిన్న బాటలు.. ఎటు చూసినా ఎత్తైన చెట్లు.. పక్షుల కిలకిలలారావాలు... వన్యప్రాణులు.. ప్రకృతి అందాలతో అలరారే ఆ క్షేత్రంలో.. సాక్షాత్తూ శివుడు కైలాసం విడిచి ఇక్కడ కొలువైనాడు. లోతైన లోయలో కొలువుదీరిన శివుడిని చేరుకోవడానికి కాలినడకన 9 కిలోమీటర్లు ప్రయాణించాల్సిందే..! ఆ ఆద్భుత స్థలమే పంచలింగాల కోన..!!.

  • ఉల్లెడ ఉమామహేశ్వ‌ర స్వామి

    నల్ల‌మ‌ల ఆడ‌వి లోని ఉల్లెడ ఉమామహేశ్వ‌ర స్వామి కొండ గుహ లెదా వ‌జ్రాల కొండ గుహ ఆని అంటారు. ఈవ‌జ్రాల కొండ గుహ‌లో ఉల్లెడ న‌ర‌సంహాస్వామి గుహ‌, ఆశ్వ‌థ్దామ గుహ‌, వున్నఉల్లెడ ఉమామహేశ్వ‌ర స్వామి గుహ అను మూడు గుహ‌లు క‌ల‌వు. ఉల్లెడ ఉమామహేశ్వ‌ర స్వామి గుహ లో ఒక శివ‌లింగం, మూడు ప‌డ‌గ‌ల నాగుపాము, శంఖం, మ‌రియు వీణ స్వయంబుగా వెలిచినాయి.

  • కాలి నడకన అధ్భుతమైన యాత్ర...

    ఈ ప్ర‌పంచంలో ప్ర‌కృతిని ఆరాధించ‌నివారుండ‌రు. ప్ర‌కృతి అందాల‌ను చూస్తూ త‌మ‌ను తాము మ‌రిచిపోతుంటారు. అలాంటి ప్ర‌కృతి అందాల‌ను చూసేందుకు ఎంత దూర‌మైనా వెళ్తారు, కొత్త కొత్త ప్ర‌దేశాల కోసం అన్వేషిస్తారు. అలాంటి వారి కోసం నా వంతు స‌హాయాన్ని అందించ‌డానికే ఈ ప్ర‌య‌త్నం. .

  • జ్యోతి శ్రీ సిద్దేశ్వరస్వామి ఆలయం...

    కొన్ని శతాబ్దాలుగా పెన్నానది గర్భంలో దాగి ఉన్న మహిమాన్వితమైన 108 లింగాల శివాలయాల దివ్య క్షేత్రం. రావణ సంహారం అనంతరం బ్రహ్మహత్య దోశ నివారణలో భాగంగా శ్రీ రాముడు దేశవ్యాప్తంగా శివలింగ ప్రతిష్టాపన జరుపుతూ ఇక్కడ శివలింగాలకు పూజలు నిర్వహించి పాప విమోచనం పోందాడని ప్రతీతి. కాలక్రమంలో ఆలయం పెన్నమ్మ కడుపులో కలిసిపోయి, ఇసుకదిబ్బగా మారిపోయింది.

వరాన్ని ప్రసాదించే ముక్తీశ్వరుడుని దర్శిస్తే మీ కోరికలు నెరవేరతాయి





లోక కల్యాణం కొరకు ఆ పరమేశ్వరుడు అనేక ప్రదేశాల్లో ఆవిర్భవించాడు. అనేక లీలా విశేషాలను ప్రదర్శిస్తూ పూజలు, అభిషేకాలు అందుకుంటున్నాడు. అలా ఆ స్వామి కొలువైన ఉన్న పరమ పవిత్రమైన క్షేత్రాలలో 'ముక్తేశ్వరం' ఒకటి. ఎంతో ప్రాచీనమైన క్షేత్రంగా విలసిల్లుతోన్న 'అయినవిల్లి'కి ఒక కిలోమీటరు సమీపంలో ఈ క్షేత్రం అలరారుతోంది. ఇక్కడ స్వామి 'ముక్తేశ్వరుడు' పేరుతో పూజలు అందుకుంటూ ఉన్నాడు.


ఈ ముక్తేశ్వర ఆలయం తూర్పు గోదావరి జిల్లాలోని అమలాపురం రెవెన్యూ విభాగంలో అయినవిల్లి మండలం, కోనసీమ డెల్టాలో ఉంది. ఇది గోదావరి నదికి దగ్గరలో ఉన్న గౌతమి-గొదావరి నదికి సమీపంలో ఉంది. కోనసీమకు ప్రసిద్ది చెందిన ఈ గ్రామ పరిసర ప్రాంతాలు చాలా అందంగా ఉంటాయి. పచ్చటి ప్రకృతి, పంటకాల్వలు, అక్కడక్కడ లంక గ్రామాలు, కొబ్బరి తోటలు, మామిడి చెట్లు గోదావరి నది ఒడ్డు, ఇలా ఎన్నో అందాలన్నింటిని సంతరించుకున్న గ్రామం ముక్తేశ్వరం. ముక్తేశ్వర ఆలయం కాకినాడకు దాదాపు 60కిలోమీటర్ల దూరంలో ఉంది. మరి ఈ ఆలయ విశిష్టత గురించి తెలుసుకుందాం..


పురాణ కథ:


ముక్తేశ్వర ఆలయం ఒక పురాతన ఆలయం. పురాణాల ప్రకారం ఈ గ్రామాన్ని ముక్తేశ్వర స్వామి దేవాలయంగా పిలుస్తున్నారు. ఒక దానికెదురుగా ఒకటిగా రెండు శివాలయాలు ఉండటం ఇక్కడి ప్రత్యేకత.మొదట ఎదురుగా ఉండే దేవాలయంలో ఉన్న దేవున్ని క్షణ ముక్తేశ్వరుడు అని పిలుస్తారు.


శివలింగము చిన్నగా రుద్రాక్ష ఆకారమును పోలి ఉంటుంది..


ఈ ముక్తేశ్వర స్వామి దేవాలయంలో శివలింగము చిన్నగా రుద్రాక్ష ఆకారమును పోలి ఉంటుంది. ప్రసిద్ది చెందిన శివుని ఆలయాల్లో శ్రీముక్తికంఠ ముక్తేశ్వర స్వామి టెంపుల్ ఒకటి. రామాయణం ప్రకారం, స్థల పురాణం ప్రకారం శ్రీరాముడు వనవాస సమయంలో శ్రీలంక నుండి పుష్పకవిమానంలో ఈ ప్రదేశం చేరుకోగానే అక్కడ ప్రకాశించే శివలింగం ఒకటి చూశాడు.


వెంటనే ఆ శివలింగానికి పూజలు చేసి ఆ పరమేశ్వరుడిని అక్కడే కొలువై ఉండాలని కోరగా, శ్రీరాముడి భక్తికి ఆ పరమశివుడు ఇక్కడే కొలువైనాడనికి చెబుతారు. అయితే ఈ క్షేత్రంలోని 'ముక్తేశ్వరుడు' శ్రీరాముడి కాలానికంటే ముందు నుంచే కొలువై వున్నాడని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.


శ్రీరామచంద్రుడు కూడా ఈ స్వామిని సేవించాడని అంటారు. శ్రీరాముడు ప్రార్ధించిన వెంటనే స్వామి క్షణకాలంలో ప్రత్యక్షమై వరాన్ని ప్రసాదించాడట. అందువలన ఇక్కడి స్వామివారిని 'క్షణముక్తేశ్వరుడు' అనే పేరుతోనూ భక్తులు పిలుచుకుంటారు.


దర్శన మాత్రం చేతనే స్వామి ముక్తిని ప్రసాదిస్తాడు కనుక, సోమవారాల్లోను .. విశేషమైన పర్వదినాల్లోను ఈ క్షేత్ర దర్శనం చేసే భక్తుల సంఖ్య అధికంగా ఉంటుంది.


ఈ ముక్తేశ్వరం  గ్రామానికి సుమారు 2కిలో మీటర్ల దూరంలో అయినవిల్లి గ్రామంలో జగత్ప్రసిద్దమైన మహాగణపతి ఆలయం కూడా ఉంది. 


ఓం నమః శివాయ🙏


 

Share:

పంచారామాలు


ఈ క్షేత్రాలు ఎక్కడ ఉన్నాయి మరియు ఈ దేవాలయాల విశిష్టత గురుంచి విపులంగా తెలుసుకుందాం..


ఆంధ్రప్రదేశ్ లోని ప్రసిద్ధమైన  శైవక్షేత్రాలను పంచారామాలు' అని పిలుస్తారు.  'పంచారామాలు' ఏర్పడుటకు, స్కందపురాణంలో ఇలా వివరించబడి యున్నది..


పూర్వం.. తారకాసురుడు అను రాక్షసుడు, 'శివుని' గురించి ఘోర తపస్సు చేసి శివున' ఆత్మలింగము సంపాదిస్తాడు.  దీనితో వీర గర్వముతో, దేవతలను అనేక రకాలుగా హింసలు గురిచేయగా, ఇందుకు దేవతలు, విష్ణుమూర్తిని ప్రార్ధించగా, శివపార్వతుల వల్ల కలిగిన కుమారుడు కుమారస్వామి వల్లనే తారకాసురుని వధించుట సాధ్యపడుతుందని తెలిపి ఆయన్ను యుద్ధానికి పంపుతారు. యుద్ధమునందు స్వామి  తారకాసురుని కంఠంలో గల 'ఆత్మలింగమును' చేధిస్తేనే మరణము కలుగునని గ్రహించి ఆ 'లింగమును' చేధిస్తాడు.  దీనితో తారకాసురుడు మరణిస్తాడు.


చేధిoచే సమయంల్లో, ఆ.. 'ఆత్మలింగము'  వేరై,  ఐదు ప్రదేశములలో పడుతాయి. తరువాత వాటిని ఆయా...ప్రదేశాలలో, దేవతలు లింగ ప్రతిష్ఠ కావిస్తారు.. కనుక ఈ అయిదు 'క్షేత్రాలను',  'పంచారామాలు' అని పిలుస్తారు..


1. దాక్షారామము :


పంచరామాల్లో మొదటిదైన దాక్షారామము తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రాపురంలో ఉంది.  ఇక్కడ స్వామిని "భీమేశ్వరుడు" అని పిలుస్తారు. స్వామి లింగాకారం 60 అడుగులు ఎత్తులో ఉంటుంది. పై అంతస్తు నుండి పూజలు నిర్వహిస్తారు.  ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడి లింగాకారం సగం భాగం తెలుపు మరిఇయు  సగభాగం నలుపుతో ఉంటుంది.


ఇక్కడ దక్షప్రజాపతి యజ్ఞం నిర్వహించాడు. కనుక ఈ ప్రాంతానికి దాక్షారామము అని పేరు వచ్చిందంటారు.  ఈ ఆలయం చాళుక్యరాజయిన, భీముడు నిర్మించాడని పురాణాలలో చెప్పబడి యున్నది.  అనేక పురాణాల్లో ఈ ఆలయం గురించి ప్రస్తావన ఉంది.   పూర్వకాలంలో ఎంతో మంది దేవతలు, రాజులు స్వామి వారిని దర్శించుకొని, తరించారని తన 'భీమేశ్వర పురాణంలో' చెప్పబడి యున్నది.  ఈ ఆలయంలో శిల్పకళ అద్భుతంగా ఉంటుంది.  ఇక్కడ "మహాశివరాత్రి" పర్వదినం కన్నుల పండుగగా నిర్వహిస్తారు.


2. అమరారామము :


పంచారామల్లో రెండవదైన 'అమరారామము',  గుంటూరు జిల్లాలోని అమరావతిలో కృష్ణానదీతీరమునందు వెలసినది.  ఇక్కడ స్వామిని "అమరేశ్వరుడు" అని పిలుస్తారు.  గర్భగుడిలో స్వామి విగ్రహం 9 అడుగుల ఎత్తులో,  తెల్లగా మెరుస్తూ ఉంటుంది.  


ఈ ఆలయం 20 అడుగుల ఎత్తుగల విశాలమైన వేదికపైన నిర్మించబడింది. అమరేశ్వరుడైన 'ఇంద్రుడు' చేత ప్రతిష్టించి ఈ ఆలయానికి తన నగరమైన అమరావతి పేరునే పెట్టారు అని పురాణాలలో చెప్పబడి యున్నది.


3. క్షీరారామము :


క్షీరారామము, పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లులో కలదు. ఇక్కడ 'శివుని' మూర్తిని "శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి"  అని పిలుస్తారు.  ఇక్కడ స్వామివారిని త్రేతాయుగ కాలంలో  'సీతారాములు' కలిసి ప్రతిష్ఠించారట.  ఈ గ్రామానికి పాలకొల్లు అని పేరు రావడానికి కూడా ఒక కధ ఉంది. 


'శివుడు' తన బాణమును భూమిలోనికి వెయ్యగానే భూమి నుండి పాలధార వచ్చిందట.   క్షీరం అనగా పాలు, దీనిమూలంగా క్షీరపురి అనే పేరు వచ్చింది. క్రమంగా 'క్షీరపురి' కాస్తా 'పాలకొల్లుగా' మార్పు చెందింది. స్వామి వారి ఆలయాన్ని 11వ శతాబ్దంలో చాళుక్యులు నిర్మించారు.  ఆలయం 125 అడుగుల ఎత్తులో '9' గోపురాలుతో కట్టబడింది.


4. సోమారామము :


పంచరామాల్లో నాల్గవదైన "సోమారామము".   పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరానికి రెండు కిలోమిటర్లు దూరంలో గల గునిపూడిలో కలదు. ఇక్కడ స్వామి వారిని "సోమేశ్వరుడు" అని పిలుస్తారు.  ఇచ్చట 'శివలింగానికి'  ఒక ప్రత్యేకత ఉంది.  మాములు రోజుల్లో తెలుపు రంగులో ఉండే 'శివలింగం',  అమావాస్య రోజు వచ్చేసరికి గోధుమ రంగులోనికి మారుతుంది. తిరిగి పౌర్ణమి వచ్చేసరికి యధాస్ధానానికి చేరుతుంది.


ఇక్కడ స్వామిని 'చంద్రుడు' ప్రతిష్టించాడు. చంద్రునిచే ప్రతిష్ఠించ బడినది కావున దీనికి 'సోమారామము' అని పేరు వచ్చింది.


5. కుమారభీమారామము :


పంచారామాల్లో చివరిది, 5వది అయిన 'కుమారభీమారామము',  తూర్పుగోదావరి జిల్లాలోని సామర్లకోటకు కిలోమిటరు దూరంలో కలదు.  ఇక్కడ స్వామిని "కాల బైరవుడు"  అని పిలుస్తారు.


ఈ ఆలయాన్ని దాక్షారామాన్ని నిర్మించిన, చాళుక్య రాజయిన భీముడు ఈ ఆలయాన్ని కూడా నిర్మించాడు. ఇక్కడి 'శివలింగం' సున్నపురాయితో చేసినదిలాగా ఉంటుంది.  ఈ ఆలయంలో "మహశివరాత్రి" ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.


ఈ అయిదు ఆలయాలను, ఒకే రోజు దర్శించుకొంటె మోక్షము లభిస్తుంది అని పెద్దలు చెబుతారు.


ఓం నమః శివాయ.🙏🙏

 

Share:

ద్వాదశ జోతిర్లింగాలు ఎవరి పేర్లు ఏర్పడ్డాయి..?



శ్రీ సోమనాధేశ్వర జ్యోతిర్లింగం లభ్యమైన ఆధారాలను బట్టి ఈ జ్యోతిర్లింగాలయం క్రీపూ. 200 సం.రాల నాటిది. 20వ శాతాబ్దం వరకు ఎన్నో యుద్ధబీభత్సాలకు గురైనా 1957లో పున:ప్రాణ ప్రతిష్ఠను పొందింది.


శరీశైలమల్లిఖార్జున జ్యోతిర్లింగం.. 

ఏ శిఖర రూపంలో పర్వతుడు అవతరించాడో ఆ శిఖరం మీదే తపస్సు చేస్తున ఒకానొక భక్తురాలుకు శివసాక్షాత్కరం కలిగిన ఆచోటు తన పేరుతో నిలవాలని కోరడం వల్లన ఆ శిఖరం శ్రీశైలంగా పేరొందింది. మూడో శతాబ్దం నుండి ఈ క్షేత్రం ఉనికి కనిపిస్తుంది.


శ్రీ మహాకాళేశ్వర జ్యోతిర్లింగం.. 

ఉజ్జయినిలో ఈ లింగంవుంది. చైనా యాత్రికుడయిన హ్యుయాన్‌ త్సాంగ్‌ తన పర్యటన గ్రంధంలో ఈ క్షేత్రం గూర్చి చక్కగా వర్ణించారు.


శ్రీ ఓంకారేశ్వర జ్యోతిర్లింగం..  

చారిత్రక ఆధారమంటూ ఈక్షేత్రం గూర్చి ఏమీ లేదు. ‘మాంధాత’ చేసిన తపస్సు ఫలి తంగా ఓంకారేశ్వడు అవిర్భవించాడు.


శ్రీ వైద్యనాథేశ్వరలింగం..

మహా బలేశ్వరలింగమే వైద్యనాధేశ్వర లింగంగా ప్రసిద్ది చెందింది లంకేశ్వరుడైన రావణునికోరిక మేరకు సాంబ శివుడు ఈ ఆత్మలింగంను ప్రసాదించాడు.


శ్రీ భీమ శంకర జ్యోతిర్లింగం..

భీముడు వల్ల వివత్తును తొలిగించి నందువల్ల ఆ జ్యోతిర్లింగం ప్రసిద్ధిచెందింది. దీనికి ఉపలింగం భీమేశ్వరలింగం.


శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగం..

తనని ఆరాధించిన వారికి సర్వ కష్టాలను నివారించి ప్రతిజ్ఞా పూర్వకంగా చెప్పి శివుడు జ్యోతిర్లింగంలోకి నాగేశ్వరుడుగా కలిసి పోతాడు. ఆ జ్యోతిర్లింగమే నాగేశ్వర జ్యోతిర్లింగము.


శ్రీ విశ్వేశ్వర జ్యోతిర్లింగం.. 

వైశ్రమణుని ఘోర తపస్సు వల్ల శివుడు లింగరూపంలో వెలసి ముక్తిని ప్రసాదిస్తాడు. ఆలింగమే విశ్వేశ్వర లింగం.


శ్రీ త్రియంబకేశ్వర జ్యోతిర్లింగం..

శివుడు మూర్తిమంతమై విష్ణువు, బ్రహ్మలకు జ్ఞాన బోధచేయగా త్రిమూర్తులు ఏకమైన లింగంగా శ్రీత్రియంబకేశ్వర జ్యోతిర్లింగం వెలసింది.


శ్రీ కేదారేశ్వర జ్యోతిర్లింగం..

ధర్ముడనే మునికి నరనారాయణలనే పేరిట విష్ణూవు ఇద్దరు పుత్రులుగా జన్మిస్తాడు. ఆ ఇద్దరి కోరిక మేరకు శివుడు బదరీ వనంలో ఈ లింగరూపంలో వెలిసాడు.


శ్రీ రామేశ్వర జ్యోతిర్లింగం..

శ్రీరామాధిత దైవతలింగం గనుక ఆ జ్యోతిర్లింగమే శ్రీరామేశ్వర లింగంగా పేరు పొందింది.


శరీ ఘృశ్నేశ్వర జ్యోతిర్లింగం..

ఘ్నశ్నే అనే భక్తురాలు కోరిక మేరకు శివుడు ఈ జ్యోతిర్లింగంగా వెలిసాడు. సంతాన నష్టం, అకాల మరణం నుండి ఈ లింగం తప్పిస్తుందని చెపుతారు..

Share:

విరూపాక్ష దేవాలయం






హంపీ విరూపాక్ష స్వామిదేవాలయం ఇది కర్ణాటక రాష్ట్రంలో  బెంగుళూరు నుండి 350 కి.మీ మరియు బళ్లారికి 75 కి.మీ. దూరంలో వుంది. హంపిలోని విరూపాక్ష దేవాలయం శివుడికి అంకితం చేయబడింది. విరూపాక్ష దేవాలయం హంపిలో పురాతనమైనది మరియు ప్రధాన ఆలయం.


ఇది భారతదేశంలోని అత్యంత పురాతన దేవాలయాలలో ఒకటి. మరియు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలలో ఒకటిగా గుర్తించబడింది. హంపిని పంపా క్షేత్రం, కిష్కింధ క్షేత్రం మరియు భాస్కర క్షేత్రం అని కూడా అంటారు.


ఆలయ చరిత్ర..


హంపి వీధికి పశ్చిమ చివరన విరూపాక్ష దేవాలయం ఉన్నది. 50 మీటర్ల ఎత్తైన తూర్పు గాలిగోపురం  విరూపాక్ష దేవాలయంలోకి స్వాగతం పలుకుతుంది. ఆలయంలో ప్రధాన దేవత విరూపాక్షుడు (పరమేశ్వడు).


పంపదేవి ఆలయం మరియు భువనేశ్వరి దేవి ఆలయం ప్రధాన ఆలయంతో అనుసంధానించబడి ఉన్నాయి. ఈ ఆలయానికి 7వ శతాబ్దం నుండి గొప్ప చరిత్రను కలిగి ఉంది.   విజయనగర సామ్రాజ్యానికి పూర్వం నుండే ఈ విరూపాక్ష దేవాలయం ఉందని శీలా శాసనాలు ద్వారా తెలుస్తున్నది. చరిత్రకారులు దీనిని 10-12 శతాబ్దాలకు చెంది ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.


చరిత్రక ఆధారాల ప్రకారం, ప్రధాన ఆలయాన్ని చాళుక్యులు మరియు హొయసలులు మార్పులు చేసారు, అయితే ప్రధాన ఆలయాన్ని విజయనగర రాజులు నిర్మించారు. విజయనగర రాజుల పతనం తరువాత, దండయాత్రల వలన 16 వ శతాబ్ధానికి హంపి నగరం లోని అత్యద్భుత శిల్ప సౌందర్యం నాశనం చేయబడింది.


అయితే విరూపాక్ష-పంపా ప్రకారం 1565 దండయాత్రల బారి మాత్రం పడలేదు. విరూపాక్ష ఆలయంలో దేవునికి ధూపదీప నైవేద్యాలు నిరంతరాయంగా కొనసాగాయి. 19వ శతాబ్దం ప్రారంభంలో ఈ దేవాలయంపై కప్పు పై చిత్రాలకి, తూర్పు, ఉత్తర గోపురాలకి జీర్ణోద్ధరణ జరిగింది.


విరుపాక్ష దేవాలయ వర్ణన..


ఈ ఆలయానికి 3 ప్రాకారాలు ఉన్నాయి. 9ఖానాలతో 50 మీటర్ల ఎత్తులో ఉన్న తూర్పు గోపురం లోని రెండు ఖానాలు రాతితో నిర్మించబడ్డాయి. మిగిలిన 7 ఖానాలు ఇటుకతో నిర్మించబడ్డాయి.


తూర్పు ముఖంగా, విరూపాక్షాలయంలో పదకొండు అంతస్తుల ఎత్తైన ప్రధాన రాజ గోపురం ఉంది. ఈ  రాజగోపురంపై స్త్రీ పురుషుల, జంతువుల శిల్పాలు చాలా ఉన్నాయి. గోపురద్వారం లోపల ఒక పక్క  పక్క మూడు తలల  నంది, ఇంకొక పక్క మూడు ఒక చిన్న నంది ఉన్నాయి. వీటికి ఎదురుగా మరో గోపురమున్నది.


ఈ రెండో గోపురం మొదటి దానికన్నా చిన్నది. దీనిని రాయలవారి గోపురం అంటారు. దీనిని శ్రీ కృష్ణ దేవరాయల వారు నిర్మించినందున దీనిని రాయల గోపురం అని కూడా అంటారు. ఈ ద్వారం తర్వాత ఉన్నదే రెండో ఆవరణం.


ఇందులో మధ్యన - ముఖమంటపం, దాని తర్వాత గర్భగుడి ఉన్నాయి. గర్భగుడి చుట్టూ ఉన్న వరండాలలో ఇతర దేవతా ఉప ఆలయాలు ఉన్నాయి. అవి పాతాళేశ్వర, ముక్తి నరసింహ మరియు శ్రీ వేంకటేశ్వరుడు వంటి దేవతల ఆలయాలున్నాయి. 


విరూపాక్ష స్వామి వారికి పంపాపతి అనే మరొక పేరు కలదు. పూర్వం పంపానదిగా పిలువబడినదే ఈ నాటి తుంగభద్రనది. ఈ ఆలయంలో త్రికాల పూజలు జరుగుతాయి. ఈ ఆవరణంలో దీపస్తంభం, ధ్వజస్తంభం, నాలుగు కాళ్ల మంటపం ఉన్నాయి నాలుగు కాళ్ల మంటపంలో, మూడు' నందులున్నాయి.


తర్వాత ముఖమంటపం ఉన్నది. ముఖ మంటపంలోనికి ఎక్కేమెట్ల ప్రక్కన ఒక శిలాశాసనం పురాతన తెలుగులో రెండు వైపులా చెక్కి ఉన్నది. ముఖమంటపం అనేక స్తంభాలతో, వాటిపై అతి సుందర శిల్పాలతో మలచబడి ఉన్నది.


పై కప్పుకు సున్నంతో తాపడం చేసి అందు రంగులతో పులిలాంటి వింత జంతువుల చిత్రాలు చిత్రించి ఉన్నాయి. కాలక్రమేణా చాలా చిత్రాలు  చాలావరకు వెలసి పోయినా ఇంకా కొంత మిగిలి ఉన్నాయి. ముఖమండపంలో నుండి గర్భగుడి లోనికి దారి లేదు. ఉగ్రరూపుడైన స్వామి వారికి.


ఎదురుగా వెళ్లకూడదనే నియమాన్ని అనుసరించి స్వామి దర్శనానికి భక్తులు వెళ్ళడానికి గర్భగుడి కిరువైపులా  మెట్లదారి ఉంది. గర్భాలయానికి ఇరువైపులా రెండు గదులుఉన్నాయి. అందులో స్వామివారి ఉత్సవ - విగ్రహాలున్నాయి.


గర్భగుడికి కుడిప్రక్కన కొంత ఎత్తులో స్వామి వారి బంగారు రత్న ఖచిత కిరీటం యొక్క చిత్రపటం ఉన్నది. ఈ అసలు కిరీటాన్ని శ్రీకృష్ణదేవరాయలవారు చేయించాడు.


ప్రస్తుతం ఆ కిరీటం ప్రభుత్వ ఖజానాలో భద్రపరచబడి ఉన్నది. ఉత్సవాల సందర్భాలలో దాన్ని స్వామివారికి ధరింపజేస్తారు.


గర్భాలయానికి వెనుక బయటకు వెళ్లడానికి మెట్లదారి ఉన్నది. అక్కడ పదిమెట్లు ఎక్కగానే కుడివైపు ఒక చీకటి గది వున్నది. ఆ గదికి తూర్పు వైపు 7 అడుగుల ఎత్తులో రంధ్రం ఉంది. అందులో నుండి వెలుతురు వచ్చి ఎదురుగా ఉన్న గోడపై పడి బయట ఉన్న రాజ గోపురం యొక్క నీడ తలక్రిందులుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది.


దినికి ఎదురుగా ఒక తెల్లని వస్త్రాన్ని అడ్డం పెడితే దానిమీద కూడా  గోపురం యొక్క ప్రతిబింబం కనిపిస్తుంది. అందరూ దీన్ని చాలా వింతగా చూస్తారు. అక్కడ వస్తున్నది  సూర్య కిరణాలు కాదు, కేవలం వెలుతురుమాత్రమే. ఈ వింత వెలుతురు ఉన్నంత సేపు మాత్రమే ఉంటుంది. ఇది అందరు తప్పక చుడవలసిందే..


ఇక్కడ విరూపాక్షాలయంలో తుంగభద్ర నది నుండి ఒక చిన్న నీటి ప్రవాహం ఆలయంలోకి ప్రవేశించి ఆలయ వంటగదికి నీటిని అందించి బయటి ప్రాకారం ద్వారా బయటకు వెళ్తుంది.


విరూపాక్ష దేవాలయం దగ్గరలో గణపతి విగ్రహం ఉన్నది. ఈ గగణపతి విగ్రహం 15అడుగుల ఎత్తు మరియు విగ్రహం పైభాగంలో  శనగబడలవలే బుడిపెలతో కూడుకొని ఉంటుంది. దీనిని శనగలరాయి గణపతి అని అంటారు. దీనికి సమీపంలోనే వేరొక విగ్రహం అతి చిన్న చిన్న బుడిపెలతో కూడుకొని 10 అడుగుల ఎత్తులో ఉంటుంది.


దినిని ఆవాలరాయి గణపతిగా పిలుస్తారు. ఈ నగరం చుట్టుప్రక్కల చాలా చిన్న చిన్న దేవాలయాలు ఉన్నాయి.


ఈ ప్రాంతమే రామాయణంలో సుగ్రీవుడు నివసించిన కిష్కింద అని తన సోదరుడైన వాలి నుండి తప్పించుకోవడానికి ఇక్కడే ఒక గుహలో నివసించేవాడని, రామచంద్రమూర్తి సుగ్రీవుడిని ఇక్కడే కలిసాడని తెలియుచున్నది.


ఇచ్చట ఆంజనేయుని ఆలయం, అంజనీదేవి, కేసరిల గుహలు ఉండేవని చెబుతారు. గర్భగుడికి వెనుక ఉన్న ద్వారం గుండా బయటకు వెళితే అక్కడ శ్రీ విద్యారణ్యస్వామివారి మఠం, ఆలయం ఉన్నది.


ఈ విద్యారణ్యస్వామి 'విజయనగర సామ్రాజ్య నిర్మాణకర్త. విరూపాక్షాలయానికి పక్కనే ఒక చిన్నగుట్టపై అనేక ఆలయాలు కనిపిస్తాయి. 


హేమకుటం..


రాజగోపురం వైపు నుండి వెళితే అక్కడ కోట ద్వారంలా కనిపిస్తుంది. అదే హేమకుటానికి ద్వారం. ఈ హేమకూటంలోని త్రికూటాలయాలు పిరమిడ్ ఆకారంలో ఉన్న రాతి కట్టడమే. ఏ ఆలయంలోనూ విగ్రహంగానీ, శివలింగంగానీ కనిపించవు.


కోదండరామాలయం..


కోదండరామాలయం ముందు నదిని చక్రతీర్థ అంటారు నది ఉదృతిగా ప్రవహించినప్పుడు ఇక్కడ నీళ్లు సుడులు తిరుగుతాయి. అందుకే దీనిని చక్రతీర్థం అంటారు.


ఈ ఆలయానికి ముఖమంటపం, ధ్వజస్తంభం, గర్భాలయం ఉన్నవి. ఇందులోని విశేషమేమిటంటే సీతా, రామ, లక్ష్మణుల విగ్రహాలు ఒకే రాతిపై చెక్కబడ్డాయి.ఈ ఆలయం వెనుక కొండమధ్యలో యంత్రోద్ధార హనుమంతాలయం ఉన్నది.


ఈ ఆలయం నుండి కొంచెం ముందుకు వెళితే అక్కడ కొండ మలుపులో ఒక చిన్న ఆలయం కనబడుతుంది. దీని ముందు భాగంలో, మహావిష్ణువు, లక్ష్మీదేవి శిల్పం చెక్కబడి ఉన్నది. గర్భాలయంలో అందమైన చిన్న మహావిష్ణువు, లక్ష్మీదేవి విగ్రహాలున్నాయి.


ఇక్కడి నుండి రెండు కొండల మధ్యన విశాలమైన ప్రదేశంలో ఉన్నదే అచ్యుత రామాలయం. ఈ ఆలయం వెనుక ఉన్నదే మా తంగ పర్వతం. ఈ మాతంగ పర్వతం హంపి బజారు నుండి కూడా కనిపిస్తుంది.


దినిపై నున్నది వీరభద్రాలయం. అచ్యుత రాయల ఆలయం ముందు నుండి కొంతదూరం నడిస్తే అక్కడ ఎడంవైపు, పెద్ద రాళ్లకుప్ప కనిపిస్తుంది. ఆ బండ రాళ్ళపై తెల్లటి సున్నం పట్టీలు వేసి కనబడుతుంది అదే సుగ్రీవుని గుహ.


విఠల దేవాలయం..


ఈ విఠలాలయం విజయనగర చారిత్రక కట్టడాలన్నింటిలోకి శిల్పకళ రీత్యా అత్యంత ప్రాధాన్యత సంతరించుకొన్నది. విఠల్ అనగా శ్రీకృ ష్ణుని రూపమే. ఆ కాలంలో ఇది అన్నింటికన్నా పెద్ద ఆలయం. దీనిని రెండవ దేవరాయలు 1422-1446 సంవత్సరాల మధ్యలోనిర్మించారు.


ఆ తర్వాత క్రీ.శ. 1513లో శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఆలయం విస్తృతపరచబడినది. 500 అడుగుల పొడవు, 310 అడుగుల వెడల్పు గల విశాలమైన ప్రాంగణంలో మూడు గోపుర ద్వారాలతో అత్యద్భుతంగా ఈ ఆలయం , రూపుదిద్దుకుంది.


క్రీ.శ. 1516-1517 మధ్యకాలంలో ప్రధానా లయానికి నైరుతి మూలలో కళింగ గజపతి రాజు పై తన విజయం సాధించిన జ్ఞాపకార్థం లేఖకులు వంద స్తంభాల మంటపాన్ని రాయలవారు నిర్మిం చారు.


గర్భాలయానికి ఆనుకొని సుమారు 6 మండపాలు, ఆలయ ప్రాంగణంలో విడివిడిగా ఉన్నాయి. ఆలయంలోని సభా మండపంలోని ఏకశిలాస్తంభాలు, అందులోని శిల్పకళ అత్యంత అద్బుతం.


ప్రతి స్తంభానికి నాలుగువైపులా నాలుగు ఉపస్తంభాలు చెక్కి ఉన్నాయి. అందులో ఒకటైన సంగీతస్తంభాల మండపంలో 56 స్తంభాలున్నవి. ఈ స్తంభాలను మీటితే సప్తస్వరాలు విన్పించుట ఒక విశేషం.


శిలారథం..


ఈ ఏకశిలా రథం విఠల దేవాలయ సముదాయానికి తూర్పు వైపున ఉంది. ఈ రథానికి విశేషం ఏమిటి అంటే  ఈ రథానికి కదిలే చక్రాలు ఉండటం.


పాతాళేశ్వర ఆలయం..


పాతాళేశ్వరాలయం ప్రధాన ద్వారం భూమట్టానికి దిగువన ఉన్నందున దీనిని పాతాళేశ్వరాలయం అని పిలుస్తారు.  దీని ముఖ ద్వారం కొంత వైవిధ్యంగా ఉన్నది. చతురస్రారాకారం  మధ్యలో ద్వారం ఉన్నది. పైన గోపురం లేదు ముందు ధ్వజస్తంభం ఉంది.


దిని ముందు మండపాలు, చుట్టు ఆలయాలు ఉన్నాయి. ఇందులో ఉన్నవన్నీ శివాలయాలే. ఇది కూడ శిధిలావస్థలోనే ఉన్నది. అక్కడక్కడ శివ లింగాలు, నంది విగ్రహాలు పడి ఉన్నాయి.


ఈ ఆలయంలో శిల్పకళ అంతగా లేదు. అన్నీ సాధారణ స్థంభాలే. ఈ శైలిని బట్టి, ఇది విజయనగర సామ్రాజ్య నిర్మాణానికి పూర్వం ఉన్నట్లు తెలుస్తోంది. వర్షాకాలంలో ఈ ఆలయం పూర్తిగా నీటితో నిండి పోతుంది.


శ్రీకృష్ణుని ఆలయం..


క్రీ.శ.1515లో కళింగ రాజు గజపతి రాజుపై విజయం సాధించి బాలకృష్ణుని శిలావిగ్రహాన్ని తీసు కొని వచ్చి ఇక్కడ  శ్రీకృష్ణుని ఆలయం నిర్మించి, అందులో ప్రతిష్టించారు. ఈ ఆలయం పంచాయతన పద్ధతిలో కట్టబడినది.


ముఖద్వారంలోనే తెలుగు, సంస్కృతము లలో శాసనాలున్నాయి. ఈ ఆలయానికి రెండు ప్రాకారాలున్నాయి. మొదటి ప్రాకారంలో ముఖ మంటపం, అంతరాళం, సామానుల గది, వంట గది, ఇతర ఉప ఆలయాలు ఉన్నాయి


ముఖ మంటపంలో ఉన్న శిలా స్తంభాలు శిల్పకళా శోభితమై, అందు శ్రీ కృష్ణలీలలు ఘట్టాలు చెక్కబడి ఉన్నాయి. ముఖ మంటపం ప్రక్కనే ఒక గది ఉన్నది. దీని గోడలపై ఎన్నో శాసనాలు చెక్క బడి ఉన్నాయి.


గర్భగుడిలో విగ్రహం లేదు. దీన్ని మద్రాసు మ్యూజియం లో భద్రపరిచారు. మొదటి ఆవరణలో నుండి రెండో ఆవరణ లోనికి వెళ్లడానికి ఒక ద్వారం ఉన్నది. ఈ రెండో ఆవరణలో కట్టడాలేమి లేవు.


అక్కడక్కడా శిధిల శిల్పాలు, పడి ఉన్నాయి. ఈ రెండో ప్రహరీ గోడ గుడి వెనుక వైపు నుండి దక్షిణ వైపుననున్న ద్వారం వరకు ఉన్నది..


(విరూపాక్ష దేవాలయం, హంపి)


Share:

రామేశ్వర లింగము









రామేశ్వర లింగము చాలా గొప్ప లింగము. మహాబలసంపన్నుడయిన రావణాసురుని సంహారం అంత తేలికయినది కాదు. పరమ మంగళప్రదుడయిన శంకరుని అనుగ్రహం కావాలి. ఈశ్వరా ! లంకా పట్టణమునందు ప్రవేశించి రావణుడే పది తలలతో నా కంటపడినా ధర్మము తప్పనంత సంయమనంతో కూడిన బుద్ధి నాయందు ప్రచోదనమయి యుద్ధం జరుగుగాక’ అని శ్రీరాముడు శంకరుని ప్రార్థించాడు. రాముడు ఎన్నడూ ధర్మము తప్పలేదు. శ్రీరాముడు శంభు లింగమును ఆరాధన చేశాడు. ఒక శివలింగమును పెట్టి దానిని ఆరాధన చేసి లేచి దాని ముందు నాట్యం చేశాడట. రామచంద్ర మూర్తికి ఎన్ని విద్యలు వచ్చో అన్ని విద్యలతో శంకరుడు ప్రీతి చెందేటట్లుగా ప్రవర్తించాడు. తనకు ఏ విభూతి ఉంటే ఆ విభూతిని ఈశ్వర ప్రసాదం కొరకు వినియోగించాడు.


స్వామిన్ శంభో మహాదేవ సర్వదా భక్తవత్సలా

పాహిమాం శరణాపన్నం తద్భక్తం దీనమానసం!!


ఈశ్వరా! నేను నీ భక్తుడిని, దీనుడిని. ఎప్పుడయినా నానుండి కోపం బయటకు రావచ్చు. బాహ్యమునందు గొప్ప బలపరాక్రమములు గల రావణాసురుణ్ణి నేను నిగ్రహించాలి. నన్ను ఆశీర్వదించాలి. జయమును ఇవ్వాలి. నన్ను అనుగ్రహించమని అనేసరికి శంకరుడు ప్రత్యక్షం అయి శ్రీరాముని చేత పూజలు అందుకున్నాడు. శ్రీరాముడు నీవు ఇక్కడనే వసించు. ఇక్కడ వసించిన నిన్ను రామచంద్రమూర్తి చేత ప్రతిష్ఠించబడిన లింగమనే పేరుతో లోకమంతా నిన్ను ఆరాధన చేస్తుంది అన్నాడు. శివుడే శ్రీరాముడిగా వెళుతున్నాడు. శివస్య హృదయం విష్ణుః విష్ణోశ్చ హృదయం శివః’ – లంకకు వెడుతున్న శ్రీరామునికి పరమశివుని ఆశీర్వచనం కలిగింది. ‘నీవు జయమును పొందుతావు అని పరమశివుడు ఆశీర్వదించాడు. రామచంద్రమూర్తి కోరిక మేరకు ఒక శివలింగంగా కూడా ఆవిర్భవించారు. రావణుని సంహరించి తిరిగి పుష్పకవిమానంలో రామచంద్రమూర్తి సీతమ్మ తల్లితో కలిసి వెడుతూ కిందికి చూపించి ‘సీతా! ఇదిగో సేతువు. అక్కడే నాకు మహాదేవుడు సాక్షాత్కరించి నన్ను అనుగ్రహించాడు’ అని చెప్పారు. రామాయణంలో యుద్ధకాండలోని శ్లోకములలో ఈపాదం ఉన్నది. ఆయన శివపూజ చేశాడు అనడంలో ఏమీ సందేహం లేదు.


ఇక్కడ మనకి ఒక సందేహం కలగవచ్చు. సముద్రం దాటేముందు రామచంద్రమూర్తి పూజ చేసిన సందర్భంలో శివలింగం ఆవిర్భవించింది అని చెప్పుకున్నాము. ఈవేళ రామేశ్వరం దీవియందున్న శివలింగమును రామచంద్రమూర్తి స్థాపిత లింగంగా పూజ చేస్తున్నాం. రెండూ ఒకటేనా? అలా అయితే స్థలపురాణంలో రావణ సంహారం అయిపోయిన తర్వాత రామచంద్ర మూర్తి ప్రతిష్ఠ చేయడం కోసం హనుమను కాశీ పట్టణం పంపించి విశ్వనాథ లింగము నొకదానిని తీసుకురమ్మంటే హనుమ కించిత్ ఆలస్యంగా వస్తే సీతాదేవి సైకత లింగము తయారుచేసిందని, దానిని రామచంద్రమూర్తి ప్రతిష్ఠ చేశారని రామేశ్వరంలో చెప్తుంటారు. పైగా అక్కడ సరస్వతీ బావి, సావిత్రీ బావి, గాయత్రీ బావి మున్నగు బావులు ఉన్నాయి. ఈ రెండు శివలింగములు ఒకటేనా? ఈవిషయమును మహానుభావుడు మల్లాది చంద్రశేఖరశాస్త్రి గారు ‘రామాయణమునందు ధర్మ సూక్ష్మములు’ అనే గ్రంథంలో పరిష్కారం చేశారు. ఆయన ఒకమాట చెప్పారు. కూర్మపురాణంలోంచి ఒక విషయమును ప్రతిపాదన చేస్తూ...


‘యావస్సేతుశ్చతావశ్చ కాస్యాంయత్రతిరోహితః’ ‘నేను తిరోహితుడనై ఉంటాను. అందరికీ నేను కనపడను, కనపడకుండా ఉంటాను అని శంకరుడు అన్నాడు. కనపడకుండా ఉన్నాడు కాబట్టి రామచంద్రమూర్తి చేత ప్రతిష్ఠించబడి రామచంద్రమూర్తి చేత పూజలందుకున్న శంకరుడు సముద్రమునకు ఈవలి ఒడ్డున సాక్షాత్కరించాడు అని ఒక నమస్కారం చేసి ద్వీపంలోకి వెడితే అక్కడ రామేశ్వర క్షేత్రంలో ఉన్న శివలింగం సీతమ్మ తల్లి చేతులతో పోగుచేయబడిన మట్టితో ఏర్పడిన శివలింగ దర్శనం అవుతుంది. వ్యాసుడు స్కాందపురాణంలో నాగర ఖండమునందు ఈ శివలింగం ప్రతిష్ఠితం చేయబడడం యథార్థమే అని చెప్పి ఉన్నాడు. అది రామేశ్వర లింగమే. హనుమ కూడా శివుని అవతారమే అని శివపురాణం చెప్తుంది. హనుమ కూడా రాక్షస సంహారమునందు ప్రధాన పాత్ర పోషించాడు. హనుమ చేతితో కూడా ఒక శివలింగం ప్రతిష్ఠ అవాలని విశ్వనాథుడు భావించి ఉంటాడు. అందుచేతనే కించిత్ ఆలస్యం అయితే ముహూర్తం అయిపోతుందని సీతమ్మ ప్రతిష్ఠించాలి. తన సంకల్ప ముహుర్తమై హనుమ ప్రతిష్ఠించాలి. ఈశ్వర సంకల్పముగా సీతమ్మ తల్లి అక్కడ ఇసుకను ప్రోగుచేస్తే అది శివలింగం అయింది. దానిని రామచంద్రమూర్తి ప్రతిష్ట చేశాడు. రామనాథ లింగము అని పిలుస్తారు. రెండవది హనుమ తీసుకు వచ్చిన లింగము. అది కాశీనుండి తేబడింది దానిని విశ్వనాథ లింగము అని పిలుస్తారు. ఆ బావులలో ఉండే నీటియందు ఓషధీశక్తులు ఉంటాయి. ఆ బావుల నీటితో స్నానం చేయాలి.


రామేశ్వరంలో మనం సముద్రస్నానం చేస్తాము. రామేశ్వర దర్శనం అద్భుతమయిన దర్శనం. అక్కడ రైల్వేస్టేషన్లో ఒక గొప్పతనం ఉన్నది. కొత్త ప్లాట్ ఫారం కట్టడం కోసమని తవ్వితే అక్కడ పెద్ద దక్షిణామూర్తి విగ్రహం బయటపడింది. ఆ దక్షిణామూర్తిని భారతీయ రైల్వే వారు మరోచోట పెట్టకుండా రైల్వేస్టేషన్ ప్రాంగణంలోనే ఉన్న పెద్ద రావిచెట్టు క్రింద పెట్టారు. రైల్వేస్టేషనులోనే దక్షిణామూర్తిని దర్శనం చేసుకోవచ్చు.


అక్కడే శంకరాచార్యుల వారు తీసుకు వచ్చిన శివలింగములలో ఒక శివలింగం ఉన్నది. అది స్ఫటికలింగం. దానిని సూర్యోదయం కాకుండా దర్శనం చెయ్యాలి. ఆ లింగం చాలా చిత్రంగా ఉంటుంది. అటువంటి స్ఫటికలింగం మరొకటి శ్రీకాళహస్తిలో ఉన్నది. అక్కడ విన్యాసములేవీ కనపడవు. దాని వెనకాల ఒక లైటు వెలుగుతూ ఉంటుంది. కానీ రామేశ్వరంలోని స్ఫటికలింగం అలా కాదు. తెల్లవారుజామున ఆ శివలింగమునకు అర్చకులు పూజచేస్తారు. అలా మంత్రములు చదువుతూ పూజ చేస్తున్నప్పుడు ఒక ఎర్రని పువ్వు తెచ్చి ఆ స్ఫటిక లింగం ముందర పెడితే మొత్తం ఆ శివలింగం అంతా ఎర్రగా మారిపోతుంది. ఆ పువ్వును తీసేస్తే మరల తెల్లటి లింగం కనపడుతుంది. అదీ స్ఫటికలింగ దర్శనం చేయవలసిన విధానం. నిర్గుణమయిన పరబ్రహ్మము శుద్ధసత్వంతో ఉంటాడు. ఆయనయందు లోకము ప్రకాశిస్తూ ఉంటుంది.


ఎవరయినా ఈ రామేశ్వర లింగం దగ్గరకు వెళ్లి కాశీ పట్టణంలో ఉన్న గంగను తీసుకు వెళ్ళి ఆ రామేశ్వర లింగమును గంగధారలతో అభిషేకిస్తే అలా అభిషేకం చేసినవాడు కైలాసమును చేరుకుంటున్నారు. గంగ అనగా జ్ఞానము. కాశీ గంగతో అభిషేకం చేయడం వలన ఉన్నది ఒక్కటే పదార్ధం అన్న ఎరుక లోపల బాగా నిలబడాలి. ఇది నిలబడడం రామేశ్వర దర్శనం. అది చేసిన వారు సంసార సముద్రమును దాటి ఈశ్వరుని పొందుతున్నారు. అటువంటి స్థితిని పొందడానికి పరమయోగ్యమయిన క్షేత్రము రామేశ్వర క్షేత్రము. ఇక్కడ ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. కాశీ వెడతానని సంకల్పం చేసి వెళ్లకపోతే ఆర్తి పొందితే కాశీ వెళ్ళిన పుణ్యం ఇవ్వబడుతుంది. రామేశ్వరం వెడతానని సంకల్పం చేసి వెళ్ళకపోతే మహాపాపమును ఖాతాలో వేస్తారు. రామేశ్వరం వెడదాం అనుకున్నానని అనకూడదు. ‘ఈశ్వరుడు నన్ను రామేశ్వరం తీసుకు వెళ్లాలని ప్రార్థిస్తున్నాను’ అని అనాలి. ఆ బాధ్యతను ఆయన మీద పెడితే ఆయనే రామేశ్వరం తీసుకువెడతాడు.

 

Share:

కోటిలింగేశ్వర ఆలయం





ఈ అద్భుతమైన ఆలయం కర్ణాటకలోని కోలార్ జిల్లాలో ఉంది.  బాగా ప్రసిద్ది చెందిన ఆలయం. దాదాపు ఒక కోటి చిన్న శివ లింగాలతో పాటు, ఆలయ ప్రాంగణంలో 33 మీటర్ల పొడవైన లింగస్వరూపం, 11 మీటర్ల పొడవైన నందీశ్వరుడు కూడా ఉన్నాయి. లింగానికి దగ్గరగా నిర్మించిన నీటి కొలను కూడా ఉంది, ఇది భక్తులు లింగాలకు అభిషేకం సమర్పించడానికి ఉపయోగించవచ్చు.

 

ప్రతి సంవత్సరం రెండు లక్షలకు పైగా భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. మహా శివరాత్రి ఒక ప్రత్యేక సందర్భం మరియు ఈ పవిత్రమైన రోజున పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడ స్వామిని దర్శిస్తారు. ఈ ఆలయం యొక్క ప్రధాన ఆకర్షణ 108 అడుగుల (33 మీ) పొడవు ఉన్న శివయ్య మరియు 35 అడుగుల (11 మీ) పొడవైన నందీశ్వరుడు విగ్రహం. దీని చుట్టూ 15 ఎకరాల విస్తీర్ణంలో లక్షలాది చిన్న లింగాలు ఉన్నాయి. నందీశ్వరుడు విగ్రహాన్ని 60 అడుగుల (18 మీ) పొడవు, 40 అడుగుల (12 మీ) వెడల్పు మరియు 4 అడుగుల (1.2 మీ) ఎత్తు కలిగిన ప్లాట్‌ఫాంపై ఏర్పాటు చేశారు.  

 

ప్రాంగణంలో వివిధ దేవతల కోసం పదకొండు చిన్న దేవాలయాలు నిర్మించబడ్డాయి. ఈ ప్రాజెక్టులో ఒక కోటి శివలింగాల స్థాపన ఉంది కాబట్టే  ఈ క్షేత్రానికి కోటిలింగేశ్వర అని పేరు పెట్టారు మరియు ప్రస్తుతం వంద లక్షల శివలింగాలు కొలువై ఉన్నాయి.


కోటిలింగేశ్వర ఆలయచరిత్ర :-


ఈ ఆలయాన్ని స్వామి సాంబశివ మూర్తి 1980 లో నిర్మించారు. మొదటి లింగాన్ని 1980 లో స్థాపించారు మరియు అప్పటి నుండి ఈ ఆలయంలో అనేక లింగాలు ఉన్నాయి. ఆలయ ప్రాంగణంలో, వివిధ దేవతల కోసం మరో పదకొండు ఆలయాలు ఉన్నాయి. వాటిలో మొదటిది విష్ణువు, బ్రహ్మ దేవుడు మరియు మహేశ్వరుల ఆలయాలు. తరువాత కోటిలింగేశ్వర ఆలయం ఉంది వీటితోపాటు దేవాలయం లో

అన్నపూర్నేశ్వరి ఆలయం, కరుమారి అమ్మ ఆలయం, శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం,  పాండురంగస్వామి ఆలయం,  శ్రీరామ, సీతా మాత మరియు లక్ష్మణ దేవాలయం, పంచముఖ గణపతి ఆలయం,  అంజనేయ ఆలయం ,సంతోషిమాత ఆలయం భక్తులు దర్శించవచ్చు.


ఈ ఆలయాన్ని పర్యాటక ప్రదేశంగా ప్రభుత్వం ప్రకటించింది, తద్వారా ప్రపంచవ్యాప్తంగా వందలాది మంది పర్యాటకులు వస్తున్నారు. భక్తులు లింగాలను వ్యవస్థాపించడం ద్వారా ప్రత్యేక పూజలు కూడా చేసుకోవచ్చు. భక్తులు వారి పేర్లలో ఎన్నుకున్న ఏ రోజునైనా ఈ లింగాలను వ్యవస్థాపించవచ్చు.  నిత్యపూజలు,కైంకర్యాలు నిర్వహించబడతాయి మరియు వ్యవస్థాపించిన అన్ని లింగాలకు అందించబడతాయి. ఆలయ ప్రాంగణంలో భక్తుల కోసం విశ్రాంతి గృహాలు ఉన్నాయి. అదనంగా, ప్రతి సంవత్సరం ఇక్కడ ఉచిత సామూహిక వివాహాలు జరుగుతాయి.


ఓం నమః శివాయ 🙏🙏

కోటిలింగేశ్వర ఆలయం -కోలార్- కర్ణాటక 


Share:

శ్రీ మహాలింగేశ్వర స్వామి





తిరువిదైమరుదూర్ లోని మహలింగేశ్వర స్వామి ఆలయం కుంభకోణం నుండి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది.. పరమేశ్వరుడు స్వయంగా ప్రతిష్టించిన లింగస్వరూపం గా ప్రసిద్ధి. ప్రపంచంలోనే ఏకైక పరమేశ్వర ప్రతిష్ఠిత లింగం.జ్యోతిర్లింగం కానప్పటికీ అంతటి ప్రాముఖ్యత గల లింగస్వరూపం అప్పర్, సుందర్, సంబంధర్, మరియు మణికావాచగర్ అనే ప్రముఖ నలుగురు నాయనార్ లు సందర్శించి స్వామిని కీర్తించిన క్షేత్రం.


శివయ్య,అమ్మవారు ఇరువురూ తూర్పుముఖంగా ఉండే ఆలయం. అమ్మవారు మూకాంబికగా దర్శనమిస్తారు. ధ్యాన భంగిమలో అమ్మవారు ఉంటారు. ఎక్కడ అయినా తొలిపూజ గణపతికి చేస్తారు.ఇక్కడ తొలిపూజ మహాలింగేశ్వరుడికి అనంతరం గణపతిని పూజిస్తారు.


తిరువిదైమరుదూర్ ఆలయం వారణాసి (కాశీ) వలె పవిత్రంగా పరిగణించబడుతుంది. ఐదు లింగాలు చుట్టూ ఉన్నందున ఈ ఆలయం పంచలింగ క్షేత్రాలలో ఒకటి కాగా మిగిలి ఉన్న నాలుగు నాలుగు  దిక్కులలో ఉంటాయి. ఐదవ మహాలింగస్వామి మధ్యలో ఉంటారు. 


తూర్పు వీధిలో -విశ్వనాథర్ ఆలయం. పశ్చిమాన -రిషిపురిశ్వర, దక్షిణ వీధిలో -ఆత్మనాథర్ మరియు ఉత్తర వీధిలో -చోక్కనాథర్ శివాలయాలు ఉన్నాయి. ఈ ఆలయం ఐదు అంచెల రాజగోపురం మరియు మూడు ప్రహారాలు (ప్రదక్షిణ మార్గాలు) తో భారీగా ఉంది.వీటిలో ప్రతి ఒక్కటి భారీ గోడల లోపల ఉన్నాయి..


9వ శతాబ్దంలో ఆలయ నిర్మాణం జరిగింది. ఈ ఆలయం లోపల కరుణమీర్ధ తీర్థం, సోమ తీర్థం, కనక తీర్థం, కల్యాణ తీర్థం, ఐరావత తీర్థం అనే ఐదు పవిత్ర కొనేరులు ఆలయంలో  ఉన్నాయి.


పురాణాల ప్రకారం..


తిరువిదైమరుదూర్ మహాలింగస్వామి ఈ ప్రాంతంలోని అన్ని శివాలయాలకు కేంద్రంగా ఉండి, సప్త విగ్రహ శక్తులు ఆలయం చుట్టూ కొలువై ఉన్నాయి. తమిళనాడు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో ఈ మూర్తులు కొలువైఉన్నాయి.


ఇక్కడ మహాలింగం స్వయంభూ మరియు అమ్మవారు  బృహతసుందరగుజంబిగై, ఈ అమ్మనే కనాన్ములైనాయకి అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలో శ్రీచక్రమహా మేరు ఏర్పాటు చేయబడింది.


🌿తల్ల మద్దిచెట్లు కలిగిన భారతదేశంలోని మూడు శివాలయాలలో తిరువిదైమరుదూర్ ఒకటి..


ఈ మద్ది చెట్టును సాధారణంగా అర్జున అని కూడా పిలుస్తారు. ఈ వృక్షం స్థాల వృక్షం (పవిత్ర వృక్షం) గా భావిస్తారు.  అందువల్ల ఈ క్షేత్రాన్ని ఇడై మరుదూర్ (మధ్యజార్జున) అని కూడా పిలుస్తారు. ఇతర రెండు శివ మందిరాలు ఆంధ్రప్రదేశ్ లోని శ్రీశైలం మల్లికార్జునస్వామి ఆలయం మరియు తిరునెల్వేలి జిల్లాలోని అంబసముద్రంలోని తిరుప్పుడైమరుదూర్ లేదా కడై మారుదూర్ (స్పుతార్జున) ఆలయాలు గా ప్రసిద్ధి.


మానసిక రుగ్మతలతో బాధపడుతున్న ప్రజలు ఆలయ ప్రహారాలలో ప్రదక్షిణ చేయడం ద్వారా నయమవు తుందని నమ్ముతారు. తూర్పు వైపు లోపలి గోపురాలలో ఒకదానిలో చోళ బ్రహ్మహతి శిల్పం ఉంది. ఆలయం యొక్క ప్రముఖ పండుగ థాయిపూసం, థాయ్ నెలలో (జనవరి మధ్యలో) పది రోజులు జరుపుతారు. మహాలింగేశ్వర ఉత్సవ మూర్తిని గ్రామంలోని వీధులలో ఊరేగిస్తారు. పండుగ  చివరి రోజు తీర్థవరితో ముగుస్తుంది.


తమిళ మాసమైన  వైకాసి (అక్టోబర్-నవంబర్), తిరుకళ్యణం, అంబల్ తపసు పండుగలను జరుపుకుంటారు.

ఆలయ రధం తమిళనాడులో అతిపెద్దది. ఇది పై నుండి క్రిందికి 89 అడుగులు ఉంటుంది. 1800 లో అమర్సింగ్ కుమారుడు ప్రతాప్ సింగ్ సింహా ఈ దేవాలయానికి విరాళం ఇచ్చాడు...


శ్రీమహాలింగేశ్వరస్వామి- తిరువిదైమరుదూర్ - కుంభకోణం 🌹


 

Share:

శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయం




కనువిందు చేసే ఆలయ శిఖరంపై కలశం.. జనమేజయ చక్రవర్తి ప్రతిష్టించిన.. శివలింగం వెరసి మహిమాన్వితమైన ప్రకాశం జిల్లాలోని సత్యవోలు రామలింగేశ్వరస్వామి ఆలయం. ఇది చాలా పురాతన ఆలయం.


స్థల పురాణం..


రామాయణం లో రాముడు రావణుడిని సంహరించి బ్రహ్మహత్యా పాతకం కలిగినందుకు దేశంలో చాలా చోట్ల శివలింగాలని ప్రతిష్టించాడని తెలుసు, అదే విధంగా మహాభారతంలో పాండవులు కూడా అదేవిధంగా కొన్ని చోట్లా శివలింగాలను ప్రతిష్టించారని పురాణాలూ చెబుతున్నాయి. 


అయితే ఇక్కడ విశేషం ఏంటి అంటే ఈ ఆలయంలో మాత్రం శివలింగాన్ని పాండవుల మనుమడు శివలింగాన్ని ప్రతిష్టించాడని స్థల పురాణం చెబుతుంది.


ఈ ఆలయంలో పాండవుల మనుమడు జనమేజయుడు శివలింగాన్ని ప్రతిష్టించాడు. ఆ తరువాత కాలంలో చాళుక్యుల రాజులచే ఆలయ నిర్మాణం జరిగింది. 6 వ శతాబ్దంలో బాదామి చాళుక్యులు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. శైవులైన చాళుక్యులు ఆంధ్రదేశంలో అనేక శివాలయాలను నిర్మించారు.


అపురూపమైన చాళుక్యుల వాస్తుశిల్పం రామలింగేశ్వరస్వామి ఆలయంలో ప్రతిఫలిస్తుంది. ఇది ప్రాచీనతతో బాటు విశిష్టత చాటుకుంటూ ప్రసిద్ధ దేవాలయంగా నిలిచింది. ఈ గుడి గిద్దలూరు పట్టణానికి చాలా దగ్గర్లో ఉంది.


గర్భగుడి గోడలకు ఉన్న గూళ్ళలో ఈశ్వరుని విగ్రహం, లింగోద్భవ మూర్తి, దుర్గాదేవి ప్రతిమలు ఉన్నాయి.

గర్భగుడి మధ్యభాగంలో రామలింగేశ్వర రూపమైన శివలింగం ఉంది. శిఖరంపై కలశం కనువిందు చేస్తుంది. 

గుడి చాలా ఎత్తుగా ఉంటుంది.


దేవాలయంలో పెద్ద మండపం, గర్భగుడి, అంతరాళం ఉన్నాయి. గుడికి దక్షిణాన నాలుగు చేతులున్న దేవతామూర్తి ఉంది. అంతరాళం శిఖరంపై రాతి కలశం ఉంది. ప్రాచీనతను చాటే మండపంలో నాలుగు స్తంభాలు ఉన్నాయి. వాటిపై అలరించే శిల్పాలున్నాయి. దేవాలయ మధ్యభాగంలో నటరాజ విగ్రహం ఉంది.


సత్యవోలు రామలింగేశ్వస్వామి ఆలయం ప్రాంగణంలో ఆరు దేవాలయాలు ఉన్నాయి. అన్ని శైవ ఆలయాలే కావడం విశేషం. ఈ దేవాలయాలు అన్నిటిలో పెద్దది భీమలింగేశ్వర స్వామి ఆలయం. దీని ముఖద్వారం తూర్పు దిక్కుకు ఉంటుంది. మహా మండపానికి మూడు దిక్కులా అంటే తూర్పు, పశ్చిమ, దక్షిణ దిక్కుల గుండా భక్తులు వచ్చిపోయే సౌకర్యం ఉంది.


రామలింగేశ్వరస్వామి ఆలయాన్ని చుట్టు పక్కలవారే కాకుండా, ఎక్కడెక్కడి నుండో భక్తులు వచ్చి దర్శించుకుంటారు. మహాశివరాత్రి లాంటి పర్వదినాల్లో రామలింగేశ్వరస్వామి ఆలయం మరీ కిటకిటలాడుతుంది.


సత్యవోలు రామలింగేశ్వరస్వామి దేవాలయ వాస్తు శిల్ప కళ మహానంది ఆలయాన్ని తలపిస్తుంది. 

మహానంది దేవాలయాన్ని కూడా చాళుక్యులే నిర్మించారు.


దేవాలయం తెరచు వేళలు:  

ఉదయం 9:00 గంటలనుండి మద్యహాన్నం:12.30 వరకు, 

తరువాత 1:30 నుండి రాత్రి 5:00 వరకు గుడిని తెరచి వుంచెదరు.


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రకాశం జిల్లా, గిద్దలూరు పట్టణానికి 8 కీ.మీ. దూరంలో రాచర్ల మండలం సత్యవోలు గ్రామంలో శ్రీ రామలింగేశ్వరాలయం ఉంది.

Share:

మన రాశికి సరిపడిన జ్యోతిర్లింగమేదో మీకు తెలుసా?



 ద్వాదశ జ్యోతిర్లింగాలు తెలుసు.!!

12 రాశులు కూడా తెలుసు.!!

కానీ మన రాశికి సరిపడిన జ్యోతిర్లింగమేదో తెలుసా?


మేషం       -   రామేశ్వరం    -  తమిళనాడు

వృషభం    -   సోమనాథ్     -  గుజరాత్

మిధునం   -   నాగేశ్వరం     -  గుజరాత్

కర్కాటకం -   ఓంకారేశ్వరం -  మధ్యప్రదేశ్

సింహం     -   వైద్యనాథ్      -  jharkhand

కన్య         -   శ్రీశైలం           -  ఆంధ్ర ప్రదేశ్

తుల        -   మహాళేశ్వరం -  మధ్యప్రదేశ్

వృశ్చికం   -   ఘృష్ణేశ్వరం   -  మహారాష్ట్ర

ధనుస్సు   -  విశ్వేశ్వరం     -  కాశి

మకరం     -  భీమశంకరం   - మహారాష్ట్ర

కుంభం     -  కేదారేశ్వరం    - ఉత్తరాఖండ్

మీనం       - త్రయంబకేశ్వరం - మహారాష్ట

తెలుసుకుందాం.........

రాశికొక #జ్యోతిర్లింగం


మేషరాశి వారికి పూజనీయమైన జ్యోతిర్లింగం #రామేశ్వరం. మేషరాశి కుజునికి స్వగృహం. చరరాశి వారికి పదకొండవ రాశ్యాధిపతి శని బాధకుడు. గ్రహపీడా నివారణార్థం రామేశ్వర తీర్థ యాత్ర, సుత్రామ పర్ణీ జరరాషి యోగే, నిబధ్య సెతుం విశిఖైర సంఖ్యె శ్రీరామ చంద్రేన సమర్పితం త, రామేశ్వరాఖ్యం నియతం నమామి అనె శ్లోకం రోజూ చదువుకొవాలి. శ్రీరామచంద్రుడు శని బాధానివారణార్థం రామేశ్వర లింగాన్ని స్థాపించాడని ప్రతీతి.


వృషభరాశి వారి పూజాలింగం #సోమనాథ జ్యోతిర్లింగం. ఈ రాశి శుక్రునికి స్వగృహం, చంద్రునికి ఉచ్ఛ రాశి. సోమనాథ జ్యోతిర్లింగం శ్రీకృష్ణుడు స్థాపించిన మహాలింగం. ఈ రాశివారు శనిదోష శాంతికి సోమనాథ దేవాలయ దర్శనం, సౌరాష్ట్ర దేశే విదేశేతిరమ్యే జ్యోతిర్మయం చంద్రకళావసంతం, భక్తి ప్రాదానాయ క్రుపావతీర్ణం తం సోమనాథం శరణం ప్రపద్యే అనే శ్లోకధ్యానం చేయడం శుభప్రదం. ఈ రాశివారు జన్మ నక్షత్రంలో సోమనాథంలో రుద్రాభిషేకం చేయించుకుంటే మంచి ఫలితాలు పొందగలరు.


మిధునరాశి వారి జ్యోతిర్లింగం #నాగేశ్వర లింగం. ఈ రాశి బుధునికి స్వగృహం. గ్రహదోషాలకు నాగేశ్వర పుణ్య క్షేత్ర దర్శన, రోజూ యామ్యే సదంగే నగరే తిరమ్యే విభ్శితాంగం వివిధైశ్చ భోగై, సద్భక్తి ముక్తి ప్రదమేకం, శ్రీనాగనాథం శరణం ప్రపద్యే అనే శ్లోకాన్ని పఠించడం, ఈ రాశిలో శని సంచారకాలంలో కైలాసయంత్రప్రస్తార మహాలింగార్చన జరిపిస్తే విశేష ఫలితాలు ఉంటాయి.


కర్కాటక రాశి వారికి #ఓంకారేశ్వరలింగం పూజనీయ జ్యోతిర్లింగం. ఈ రాశి చంద్రునికి స్వగృహం. ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనం, రోజూ కావేరికా నర్మదాయో పవిత్రే, సమాగమే సజ్జన తారణాయ, సడైవమాన్దాత్రు పురే వసంతం, ఓం కారమీశం శివమే మీడే అనే శ్లోకం పఠించడం, జన్మనక్షత్రం ఉన్న రోజు ఓంకార బీజాక్షరం జపించడం శుభకరం.


సింహరాశి వారికి పూజనీయమైన జ్యోతిర్లింగం శ్రీ ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగం. సింహరాశి సూర్యునకు స్వగృహం. ఘృష్ణేశ్వర జ్యోతిర్లిగం దర్శనం, ఇలాపురే రమ్య విశాలకేస్మిన్ సముల్లసాంతం చ జగద్వ రేణ్యం, వందే మహాదారాతర స్వభావం, ఘృష్ణేశ్వరాఖ్యం శరణం ప్రపద్యే అనే శ్లోకాన్ని నిత్యం పఠించడం ద్వారా సర్వదోషాల నుండి విముక్తులు కావచ్చు.


కన్యారాశి వారికి శ్రీశైల జ్యోతిర్లింగం పూజాలింగం. ఈ రాశికి అధిపతి బుధుడు. వీరు అన్నిరకాల బాధల నుండి ఉపశమనం పొందడానికి శ్రీశైల మల్లికార్జున దర్శనం, భ్రమరాంబకు కుంకుమ జన్మనక్షత్రం రోజున చండీ హోమం చేసుకోవాలి. శ్రీశైల శృంగే విభుధాతి సంగే తులాద్రి తుంగేపి ముదావసంతం, తమర్జునం మల్లిక పూర్వమేకం, నమామి సంసార సముద్ర సేతుం అనే శ్లోకాన్ని పఠించడం శ్రేయస్కరం.


తులారాశి వారికి పూజాలింగం #మహాకాళేశ్వర లింగం. ఈ రాశికి శుక్రుడు అధిపతి. మహాకాళేశ్వర దర్శనం, శుక్రవారపు సూర్యోదయ సమయంలో ఆవన్తికాయం విహితావరం, ముక్తి ప్రధానాయ చ సజ్జనానాం, అకాల మ్రుత్యోః పరిరక్షణార్థం వందే మహాకాల మహాసురేశం అనే శ్లోకాన్ని పఠించడం వల్ల అన్ని గ్రహదోషాల నుండి, బాధల నుండి విముక్తి పొందవచ్చు.


వృశ్చికరాశి వారికి #వైద్యనాథేశ్వర లింగం పూజాలింగం. ఈ రాశికి కుజుడు అధిపతి, వృశ్చికం వైద్య వృత్తికి, శస్త్రచికిత్సలకి కారణభూతమైన రాశి. వైద్యనాథేశ్వరుని దర్శించడం, పూజించడం, మంగళవారం పూర్వోత్తరె ప్రజ్వాలికానిధానే, సాదావసంతం గిరిజాసమేతం, నురాసురారాదిత పాదపద్మం, శ్రీ వైద్యనాదం తమహం నమామి అనే శ్లోకాన్ని పఠించడం శ్రేయస్కరం.


విశ్వేశ్వరలింగం #ధనూరాశివారి పూజాలింగం. ఈ రాశి వారికి గురుడు అధిపతి, సానందవనే వసంతం. ఆనందకందం హతపాపబృందం వారణాసీనాథ మనాథనాథం, శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే అనే శ్లోకాన్ని పారాయణ చేయడం, కాశీ క్షేత్ర దర్శనం, గురువారం రోజున, శనగల దానం ద్వారా శని, గురూ గ్రహదోషాల నుండి విముక్తి పొందవచ్చు.


భీమశంకర లింగం మకరం వారి పూజాలింగం. ఈ రాశి అధిపతి శని. ఇది గురునికి నీచ, కుజునికి ఉచ్ఛ, తెలిసో, తెలియకో చేసిన దోషాల నుంచి విముక్తికిగాను భీమశంకర దర్శనం, యం ఢాకినీ శాకినికాసమాజైః నిషేమ్యమాణం పిశితశనైశ్చ, సదైవ భీమాదిపద ప్రసిద్ధం, తం శంకరం భూతహితం నమామి అనే శ్లోకాన్ని పారాయణ చేయడం, శనివారం నల్ల నువ్వులు, నల్లని వస్త్రాలు దానం ఈవాడం, అవిటివారికి ముసలివారికి వస్త్ర దానం చేయడం మంచిది.


కుంభరాశి వారికి #కేదారేశ్వర లింగం శేయోలింగం. ఈ రాశికి శని అధిపతి. గ్రహపీడలు, శత్రుబాధలు, ఇతర దోషాల విముక్తికిగాను ఈ రాశివారు కేదారేశ్వర దర్శనం. నిత్యం మహాద్రి పార్శ్వేచ మునీంద్రైః సురాసురై ర్యక్ష మహోరగాద్యైః కేదారమీశం శివమేక మీడే అనే శ్లోకాన్ని పారాయణం చేయాలి.శనివారం రుద్రాభిషేకం చేస్తే మంచిది.


త్ర్యంబకేశ్వర లింగం #మీనరాశి వారి జ్యోతిర్లింగం. ఈ రాశి అధిపతి గురుడు. త్ర్యంబకేశరుడు ఎప్పుడూ నీటి మద్యలో ఉంటాడు. త్ర్యంబకేశ్వర దర్శనం, స్వామి చిత్రపటాన్ని పూజామందిరంలో ఉంచుకోవడం, నిత్యం సహ్యాద్రి శీర్షే విమలే వసంతం, గోదావరీ తీర పవిత్ర దేశే, యద్దర్శనాత్ పాతకమాశునాశం, ప్రయాతి తం త్ర్యంబక మీశ మీడే అనే శ్లోకాన్ని పారాయణం చేయటం సకల శుభాలను కలిగిస్తుంది.


ఓం నమః శివాయ నమః

🙏🙏🙏🙏🙏🙏🙏

Share:

శ్రీ కపిలేశ్వరాలయంలో రుద్ర‌యాగం ప్రారంభం..

తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శ్రీ క‌పిలేశ్వ‌ర‌స్వామివారి హోమం (రుద్ర‌యాగం) శనివారం శాస్త్రోక్తంగా ప్రారంభ‌మైంది. నెల రోజుల పాటు జరుగుతున్న హోమ మహోత్సవాల్లో భాగంగా నవంబరు 22వ తేదీ వ‌రకు 11 రోజుల పాటు ఈ హోమం నిర్వ‌హిస్తారు.

ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం పూజ‌, రుద్ర‌జ‌పం, హోమం, ల‌ఘు పూర్ణాహుతి, నివేద‌న, హార‌తి నిర్వహించారు. సాయంత్రం పూజ‌, జ‌పం, హోమం, రుద్ర‌త్రిశ‌తి, బిల్వార్చ‌న‌, నివేద‌న‌, విశేష‌దీపారాధ‌న, హార‌తి ఇస్తారు.
Share:

ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగ ఆలయం



మహారాష్ట్రలో ఔరంగాబాద్ కు దగ్గరలో ఘృష్ణేశ్వరం జ్యోతిర్లింగ ఆలయం ఉంది. ఔరంగాబాద్ నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. జ్యోతర్లింగములలో 12వ జ్యోతర్లింగము. 13, 14 వ శతాబ్దాలలో ఈ ఆలయ నిర్మాణాన్ని ఢిల్లీ సుల్తానేట్ చేత ధ్వంసం చేయబడింది.పునర్నిర్మాణం అనేకసార్లు తిరిగి నిర్మించిన ఈ ఆలయం మొఘల్- మరాఠా వివాదంలో నాశనం చేయబడింది.


మొఘల్ సామ్రాజ్యం పతనం తరువాత, 18 వ శతాబ్దంలో ఇండోర్ రాణి అహిల్యబాయి హోల్కర్ సౌజన్యంతో, ఇది ప్రస్తుతంఉన్న రూపంలో పునర్నిర్మించబడింది. ఇది హిందువుల ముఖ్యమైన, నిరంతరం రోజువారీ భక్తులను, యాత్రికులను ఆకర్షించే పుణ్యక్షేత్రం.


దేవాలయ ప్రాంగణంలోకి, దాని లోపలి గదుల్లోకి ఎవరైనా ప్రవేశించవచ్చు. కాని ఆలయ గర్భగుడి లోపలికి ప్రవేశించడానికి, స్థానిక హిందూ సంప్రదాయం ప్రకారం పురుషులు చొక్కా ధరించకుండా మాత్రమే వెళ్లాలని నియమాన్ని సూచిస్తుంది.


ఈ ఆలయం భారతదేశంలోని జ్యోతిర్లింగ ఆలయాలలో 240 అడుగులు పొడవు, 185 అడుగుల ఎత్తుగల అతి చిన్న ఆలయంగా చెప్పుకోవచ్చు. ఈ ఆలయానికి సగం దూరంలో విష్ణువు దశవతారాలు 24 స్తంభాలపై పెద్దవరండాలో ఎర్ర రాతితో చెక్కబడిన దేవాలయం నిర్మించబడింది.


ఈ స్తంభాలపై శివుని వివిధ ఇతిహాసాలు, పురాణాలను సంగ్రహించే శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. ఇందులోని గర్బాలయం 17 అడుగులు పొడవు, 17 అడుగులు ఎత్తుకలిగిన లింగమూర్తి తూర్పు వైపుకు తిరిగిన ముఖంతో ప్రతిష్ఠంచబడింది. కర్టు హాలులో నంది విగ్రహం ఉంది. ఘృష్ణేశ్వర్ ఆలయం.. మహారాష్ట్రలో ఉన్న ఆలయాలలో దీనిని ఒక గౌరవనీయమైన ఆలయంగా పరగణిస్తారు.ఈ ఆలయంలో అనేక హిందూ దేవతలు శిల్పాలు ఉన్నాయి.


స్థల పురాణం..


పూర్వకాలంలో దేవగిరికి సమీపంలో 'సుధర్ముడు అనే బ్రాహ్మణుడు తన భార్య సుదేహతో కలిసి ఉండేవాడు. ఆయన వేదాంతవేత్త మరియు ధర్మపరుడు. వారిద్దరూ కూడా పరమేశ్వరుడిని ఎంతో భక్తితో పూజించేవారు.


ఈ 'సుధర్ముడు అనే బ్రాహ్మణ దంపతులకు సిరిసంపదలు, భోగభాగ్యాలు అన్నీ ఉన్నాయి, కాని వారికీ సంతానం మాత్రం లేదు. వారు ఎప్పుడు సంతానం కలుగలేదని ఎప్పుడు బాధపడలేదు. అయితే ఒక రోజు సుధర్ముని ఇంటికి బ్రహ్మజ్ఞానియైన ఒక సన్యాసి వచ్చాడు.


అప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కలిసి యతీశ్వరుడికి స్వాగత సత్కారాలు చేశారు.ఆ తరువాత భోజనానికి పిలిచారు. ఆ యతీశ్వరుడు భోజనము చేస్తూ మీకు సంతానం ఎందరు అని అడిగాడు. అప్పడు ఆ బ్రాహ్మణ దంపతుల నోటమాట రాలేదు.


కొంత సేపటికి తాము సంతానహీనులము అని చెప్పగా  అప్పుడు భోజనము చేస్తున్న ఆ యతీశ్వరుడు అక్కడి నుండి లేచిపోయాడు. ఆ దంపతులు యతీశ్వరుడిని,


"స్వామీ! సంతానహీనులమైన మాకు సద్గతులు లేవు మీరు భోజనము చేస్తూ కూడా వదిలి వెళ్తారా అని వేడుకోగా.. దానికి యతీశ్వరుడు కరుణించి కొంత కాలానికి మీకు సంతానము కలుగుతుంది అని ఆశీర్వదించి  వెళ్ళిపోయాడు.


సుదేహ అప్పుడు తన గతాన్ని గుర్తు తెచ్చుకుంటుంది. వివాహం జరగక ముందే జాతకులు నీకు సంతాన యోగం లేదని చెప్తారు. విషయం చెప్పకుండా సుధర్ముడికిచ్చి పెండ్లి చేశారు. సుదేహ ఇప్పుడు ఈ విషయాన్ని తన భర్తకు చెప్పుతుంది.


అలా చెప్పిన తరువాత తన చెల్లెలు అయినా ఘష్మా ను వివాహం చేసుకోని సంతానాన్ని పొందమని చెప్పింది. అందుకు సుధర్ముడు ఒప్పుకోడు. దాని వల్ల వచ్చే అనర్థాలను సుధర్ముడు ఆమెకెన్నో విధాల చెప్పి చూచాడు కాని ఆమె చెవికెక్కించుకోలేదు.


చివరకు బలవంతం మీద అతను భార్య ప్రోత్సాహంతో ఆమెకు చెల్లెలు ఐన ఘష్మాను రెండవ వివాహం చేసుకోవడానికి అంగీకరించాడు.


ఘశ్మ తన అక్క సుదేహను తల్లిగా, భర్తను దేవుడిగా చూసుకుంది. ఆమె కూడా గొప్ప శివ భక్తురాలు కాబట్టి ముగ్గురూ నిరంతరం శివుని కథలను చెప్పుకుంటూ శివుడిని ఆరాధించడంలో నిమగ్నమై ఉన్నారు.


ఇలా కొంతకాలం గడవగా ఘశ్మ గర్భవతి  అయ్యి పండంటి అబ్బాయికి జన్మనిచ్చింది. పిల్లవాడు రోజు రోజుకు అభివృద్ధి చెందుతున్నాడు. ఇలా కొంతకాలం జరిగాక  సుదేహాలో మార్పు వచ్చింది.


చెల్లెలు మీద, పిల్లవాడి పట్ల అసూయ, ద్వేషం పెరిగింది. నా చెల్లెలికి సంతానము కలగటం వలన అందరు ఇంత మర్యాద ఇస్తున్నారు. ఆ సంతానం లేకపోతే మేము ఇద్దరం ఒక్కటే కదా అని ఈ విధంగా ఆలోచించటం మొదలు పెట్టింది.


ఇలా క్రమక్రమంగా తన చెల్లెలు మీద, పిల్లవాడి పట్ల అసూయ, ద్వేషం పెరిగి సుదేహ ఒక రోజు రాత్రి నిద్రపోతున్న పిల్లవాడి గొంతు కోసి  చంపేసింది. తలను మొండేన్ని వేరు చేసి దగ్గరనే ఉన్న చెరువులో పారేసి ఏమీ ఎరుగని దానిలాగా ఇంటికి వచ్చి పడుకుంది.


మరుసటి ఉదయాన్నే లేచి ఘశ్మ చెరువులో స్నానం చెయ్యటానికి వెళ్ళింది. ఆ పిల్లవాడు చెరువులో ఈదుకుంటూ వచ్చి తల్లి కాళ్ళు పట్టుకుని అమ్మా నేను చచ్చి మళ్ళీ బ్రతికినట్లు కలగన్నాను అన్నాడు.

Share:

శ్రీశైల హటకేశ్వరం మరియు మల్లికార్జునస్వామి ఆలయం







శ్రీశైలంలో హటకేశ్వరము అని ఒక దేవాలయం ఉంది. అది చిత్రమయిన దేవాలయం. ఒక బంగారు లింగం తనంత తాను కుండ పెంకునందు ఆవిర్భవించిన హాటకేశ్వర దేవాలయము క్షేత్రము కనుక దానిని ‘హాటకేశ్వరము అని పిలుస్తారు. అక్కడ మెట్లు బాగా క్రిందికి వస్తే ఫాల దారాలు, పంచ దారాలు అని అయిదు ధారలు పడుతుంటాయి. పరమశివుని లలాటమునకు తగిలి పడిన ధారా ఫాలధార. అనగా జ్ఞానాగ్ని నేత్రమయిన ఆ కంటినుండి, పైనుండి జ్ఞానగంగ మరింతగా తగిలి క్రింద పడిన ధార. ఇది శివుడి లలాటమును తగిలి వస్తున్నధార అని లోపలికి పుచ్చుకుంటే ఉత్తర క్షణం మీరు గొప్ప ఫలితమును పొందుతారు.


ఎందుచేత ఇలా ఏర్పడింది? ఈశ్వరాలయంలో తీర్థం ఇవ్వరు కాబట్టి సాక్షాత్తు సాకార రూపుడయిన శంకరునికి తగిలి పడిన ధార ఫాలధార. పంచధారలు అయిదు రకములుగా ప్రకాశిస్తున్న భగవంతుని శిరస్సులకు తగిలి పడిన ధారలు. ఆ తీర్థం తీసుకునేటప్పుడు మర్యాద పాటించాలి. చెప్పులతో వెళ్ళకూడదు. శంకర భగవత్పాదుల వారు తపస్సు చేసి అక్కడే శివానందలహరి చెప్పారు. అక్కడ ఆయనకు భ్రమరాంబికా దేవి ప్రత్యక్షం అయింది.


చంద్రశేఖర పరమాచార్య స్వామి తపస్సు చేసుకుంటూ ఉండిపోతాను అన్న ప్రదేశం అదే. అంత పరమమయిన ప్రదేశంలో పంచధారలు పడతాయి. అందులో ఒకటి బ్రహ్మధార. ఒకటి విష్ణు ధార, ఒకటి రుద్రధార, ఒకటి చంద్రధార, ఒకటి దేవధార. ఈ పంచధారలను స్వీకరించడం సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త లోక సాక్షులయిన సూర్యచంద్రులు ఈ అయిదు తీర్థములను అక్కడ తీసుకోవచ్చు. అంత పరమపావన మయిన క్షేత్రం శ్రీశైల క్షేత్రం.


శ్రీశైలంలో ఉండే భ్రమరాంబా అమ్మవారి దేవాలయం వెనకాతల నిశ్శబ్దంగా ఉన్నప్పుడు వెళ్లి చెవిని బాగా నొక్కిపెట్టి ఉంచి మీరు చాలా జాగ్రత్తగా కళ్ళు మూసుకుని వింటే ఒక తుమ్మెద చేసిన ఝుంకారము వినపడుతుంది. దానిని భ్రమరీనాదము అంటారు. అమ్మవారిని ఇప్పటికీ అక్కడ తుమ్మెదరూపంలో ఉన్న రెక్కలతో అలంకారం చేస్తారు. ఆ తల్లిముందు శంకరాచార్య స్వామి వారు శ్రీచక్రములను వేశారు. అక్కడికి వెళ్లి అమ్మవారి శ్రీచక్రం ముందు కూర్చుని ఏ తల్లి అయినా కుంకుమార్చన చేస్తే ఆమె పూర్ణంగా మూడు తరములు చూసి హాయిగా పదిమంది చేత పండు ముత్తైదువ అని అనిపించుకుని వార్ధక్యంలో హాయిగా ఆవిడ భర్తగారి తొడమీద తల పెట్టుకొని ప్రాణం విడిచిపెట్టగలిగిన అదృష్టం కలుగుతుంది. 


శ్రీశైలలింగమునకు పట్టు తేనెతో అభిషేకం చేస్తే ఉత్తర జన్మలలో గంధర్వగానం వస్తుంది. భ్రమరాంబికా అమ్మవారి దగ్గర కూర్చుని కుంకుమార్చన చేసుకోవాలి. నాలుగు మారేడు దళములు పట్టుకెళ్ళి ఆ శివలింగమును తడిమి తడిమి అభిషేకం చేసుకోవాలి. తల తాటించి నమస్కరించుకోవాలి. పూర్వం అరుణాసురుడనే రాక్షసుడొకడు బయలుదేరాడు. వాడు బ్రహ్మ ఇచ్చిన వరముల వల్ల మిక్కిలి గర్వమును పొంది లోకముల నన్నిటిని క్షోభింపజేస్తున్నాడు. ఆ సమయంలో అమ్మవారు భ్రామరీ రూపమును పొందింది. 


భయంకరమయిన యుద్ధం చేసిన తరువాత భ్రామరీ రూపంతో వెళ్ళి ఆ అరుణాసురుణ్ణి సంహారం చేసింది. ఇప్పటికీ శాస్త్రంలో శ్రీశైల మల్లికార్జునుడు మల్లెపూవు అయితే అమ్మవారు సారగ్రాహి అని చెప్తారు. తుమ్మెద ఎప్పుడూ పువ్వుచుట్టూ తిరుగుతుంది. ఆయన మల్లికార్జునుడు. ఆవిడ భ్రమరాంబికా దేవి. ఎక్కడ శివుడు ఉన్నాడో అక్కడ ఆవిడ భ్రమర రూపంతో తిరుగుతూ ఉంటుంది. అక్కడ శివుడు ఉన్నాడు. పైన శక్తి రూపంతో ఆవిడ ఉన్నది. అందుకే ఇప్పటికీ ఆనాదం వినపడుతూ ఉంటుంది. ఈ నాదమును ఆలిండియా రేడియో హైదరాబాద్, కర్నూల్, విజయవాడ స్టేషన్లు రికార్డుచేశాయి.


శ్రీశైలం వెళ్లి అమ్మవారిని చూసినట్లయితే అమ్మవారి కనుగుడ్లు స్పష్టంగా కనపడుతుంటాయి. ఆమె ముందు గల శ్రీచక్రం ముందు కూర్చుని కుంకుమార్చన చేసుకుని “అవిద్యానామంతస్తిమిర మిహిరద్వీపనగరీ” అని సౌందర్యలహరి లోని నాలుగు శ్లోకములు చెప్పుకుని వస్తే జన్మ ధన్యం అయిపోతుంది.


అక్కడ ఉన్న స్వరూపములలో వీరభద్రుడు ఒకడు. శ్రీశైల మల్లికార్జునుని దర్శనం చేసి బయటకు వచ్చి ఎడమ పక్కకు వెళ్ళినప్పుడు అక్కడ వీరభద్రుడు కనపడతాడు. అక్కడ బయలు వీరభద్రుడు అని క్షేత్ర పాలకుడు ఒకాయన ఉన్నాడు.


రక్త సంబంధమయిన వ్యాధులు శరీరంలో పొటమరిస్తే అటువంటి వారు శ్రీశైల క్షేత్రంలో ఉన్న వీరభద్ర స్వరూపం దగ్గర కూర్చుని ప్రతిరోజూ ఒక గంట సేపు శివనామములు చెప్పుకుని కొద్దిరోజులు అక్కడ ఉండి వస్తే ఆ వ్యాధులు నయం అవుతాయి. అలా నయమయిన సందర్భములు ఎన్నో ఉన్నాయి. అక్కడ ఉన్న వీరభద్ర మూర్తిలోంచి అటువంటి శక్తి ప్రసారం అవుతుంది అని పెద్దలు చెప్తారు. చంద్రవతి అనే రాజకుమార్తె ఒక భయంకరమయిన గడ్డు కాలమును ఎదుర్కొంది. తన తండ్రే తనను మోహించాడు. 


ఆమె పరుగెత్తి శ్రీశైల క్షేత్రమును చేరుకొని గుళ్ళోకి వెళ్ళిపోయింది. రాజు ఆమె వెనుక తరుముకు వస్తున్నాడు. గుళ్ళోకి వెళ్ళిన ఆమె శివలింగమును చూసి దానిని శివలింగమని అనలేదు. అక్కడ మల్లికార్జునుడు ఉన్నాడు అని ఆమె చేతిలో ఉన్న మల్లెపూల దండను సిగకు చుట్టుకుని ‘మల్లికార్జున నేను నీకు ఇవ్వగలిగింది ఇదే – ఇది నీ సిగకు చుట్టుకుని నన్ను నీవు కాపాడు’ అని ప్రార్థించింది.


అపుడు లింగోద్భవ మూర్తి స్వామి వచ్చి ఆమెను తరుముకు వస్తున్నా రాజును చూసి నీవు పచ్చలబండవగుదువుగాక అని శపించాడు. అంతటి దుష్కృత్యమునకు ప్రయత్నించిన ఆ రాజు పచ్చలబండ అయి ఇప్పటికీ అలాపడి ఉన్నాడు. ఈవిడ ఇచ్చిన మల్లికా పుష్పముల మాలను తన సిగకు చుట్టుకుని స్వామి మల్లికార్జునా అని మరొకమారు పిలిపించుకున్నాడు. శ్రీశైలంలో వృద్ధ మల్లికార్జునుడు అని ఉన్నాడు. ఆ శివలింగం ముడతలు పడిపోయి ఉంటుంది. ఆ ముడతలు బాగా దగ్గరగా వచ్చేసి ఉంటాయి. ఈ మల్లికార్జునుడు ఎప్పుడు వెలసినదీ సాధికారికంగా చెప్పలేము.


కానీ అక్కడ జరిగిన విచిత్రం ఒకటి ఉంది. మహీధర మహారాజు అని ఒక రాజుగారు ఉండేవారు. ఆయనకు ఒక కుమార్తె. ఆమె శంకరుని సౌందర్యమును ఉపాసన చేసింది. సాధారణంగా ఈశ్వరుని తండ్రిగా ఉపాసన చేస్తారు. కానీ ఆమె శివుణ్ణి మోహించింది. తనకి శివుడి వంటి భర్త కావాలంది. ఈ పిల్ల ఏమి చేస్తుందో అని శంకరుడు ఆమె కలలోకి వచ్చి 


“నీకు నన్ను వివాహం చేసుకోవాలని ఉంటే శ్రీగిరి పర్వతం మీద ఉన్న తెల్ల మద్దిచెట్టు కిందవున్న మల్లెపొదలో ఉన్నాను. అక్కడకు రా నిన్ను వివాహం ఆడతాను’ అన్నాడు. ఆమె శంకరుడు చెప్పిన చోటికి వచ్చి ఆ చెట్టును, పొదను వెతుకుతోంది. అపుడు పార్వతీ దేవి “జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అని చెప్తారు. కానీ మీకు ఈ బుద్ధి ఎప్పటినుంచి వచ్చింది అని శంకరుని అడిగింది. అపుడు శంకరుడు ఆమె నన్ను భక్తితో ఆరాధన చేసింది. ఇక్కడ వివాహం అనగా నేను ఆవిడను నాలోకి తీసుకోవడం అని చెప్పాడు. అపుడు పార్వతీ దేవి అయితే ఆమెకు ఉపాసనలో అంత భక్తి ఉన్నదా? అని అడిగింది.


అపుడు శంకరుడు ఆమె ఎంత భక్తి తత్పరురాలో చూపిస్తాను చూడు అని వెంటనే 96 సంవత్సరముల వృద్ధునిగా మారి వెతుకుతున్న పిల్ల దగ్గరకు వెళ్ళి పిల్లా నీవు ఇక్కడ ఎవరి కోసం వెతుకుతున్నావు? అని అడిగాడు.


ఆమె తాను శివుడి కోసం వెతుకుతున్నాను అని జవాబు చెప్పింది. అపుడు ఆయన నేనే శివుడిని, ఇంత వృద్ధుడిని కదా నన్ను పెళ్ళాడతావా? అని అడిగాడు. నీవు వృద్దుడవో యౌవనంలో ఉన్నవాడివో నాకు తెలుసు.


నాకు నీవే భర్త. వేరొకరిని ఈ లోకంలో నేను భర్తగా అంగీకరించను అని చెప్పింది. ఆవిడకు కావలసింది ఆయనలో ఐక్యమవడం. చూశావా పార్వతీ, ఈమె భక్తి ఈమెను నాలో ఐక్యం చేసుకుంటున్నాను.. అని శివుడు ఆమెను తనలో ఐక్యం చేసుకుని ఈ పిల్లను స్మరించి ఇటువంటి భక్తి తత్పరురాలికోసం సృష్టిలో లేని విధంగా ముడతలు పడిపోయిన శివలింగమని, వృద్ధ మల్లికార్జున లింగమని తలచుకున్న వాళ్ళని, పొంగిపోతూ నేను చూస్తాను. అని వృద్ధ మల్లికార్జునుడై వెలిశాడు. అందుకే ఇప్పుడు అక్కడ కళ్యాణములు చేస్తున్నారు. ఈవిధంగా శ్రీశైలం ఎన్నో విశేషములతో కూడుకున్న క్షేత్రం.


ఈ క్షేత్రంలోనే శంకరాచార్యుల వారు శ్రీశైల శిఖరం మీద ఉండగా ఒక కాపాలికుడు వచ్చి శంకరాచార్యుల వారి శిరస్సు కావాలని అడిగాడు. అపుడు శంకరాచార్యుల వారు ‘నా శిరస్సును ఇవ్వడానికి నాకేమీ అభ్యంతరం లేదు. కానీ నీవు నా శిరస్సును తీసుకుంటే నా శిష్యులు బాధపడతారు. నా శిష్యులు ఉదయముననే పాతాళగంగ దగ్గరకు వెడతారు. అప్పుడు వచ్చి నా శిరస్సు ఉత్తరించి పట్టుకు వెళ్ళు’ అని చెప్పారు.


మరునాడు ఉదయం ఆ కాపాలికుడు వచ్చి ధ్యానం చేసుకుంటున్న శంకరాచార్యుల వారి శిరస్సును ఉత్తరించడం కోసమని చేతిలో ఉన్న కత్తి పైకెత్తిన సమయంలో స్నానం చేస్తున్న పద్మపాదాచార్యుల వారికి ఏదో అమంగళం గోచరించి అక్కడి నుండే నరసింహ మంత్రోపాసన చేశారు ఆయన. ఎక్కడి నుండి వచ్చాడో మహానుభావుడు నరసింహుడు గబగబా వచ్చి కత్తినెత్తిన కాపాలికుడి శిరస్సును త్రుంచి అవతల పారేసి నిలబడ్డాడు. ఆ తేజోమూర్తిని శంకరాచార్యుల వారు నరసింహస్తోత్రంతో ప్రార్థన చేశారు. 


ఈవిధంగా నరసింహస్వామి దర్శనం ఇచ్చిన క్షేత్రం. శివకేశవ అభేదంగా శంకర భగవత్పాదులు రక్షించబడిన క్షేత్రం శ్రీశైల క్షేత్రం. అది జగద్గురువులను రక్షించుకున్న కొండ. అది మన తెలుగునాట ఉన్న కొండ. అక్కడ ప్రవహించే కృష్ణానదిని కృష్ణానది అని పిలవరు,  కృష్ణా నది శ్రీశైల పర్వత శిఖరమును పామువలె చుట్టుకొని ప్రవహిస్తుంది. శివుడిని విడిచి పెట్టలేక భక్తుల పాపములను తొలగించడానికి ఉత్తరమున ఉన్న గంగ దక్షినమునకు వచ్చి కృష్ణ పేరుతో అక్కడ ప్రవహించింది. కాబట్టి దానిని ‘పాతాళ గంగ అని పిలుస్తారు.


ఆలయ ప్రాంగణంలో పంచపాండవులు అరణ్య వాసం చేసేటప్పుడు శ్రీశైలంలో ప్రతిష్ఠ చేసిన లింగములు అయిదు ఉంటాయి. దేవాలయంలో తూర్పున కృష్ణ దేవరాయలు నిర్మించిన గోపురం దక్షిణమున హరిహర రాయలవారు నిర్మించిన గోపురములు కనపడతాయి. ఆ ఆలయ ప్రాంగణంలోనే త్రిఫల వృక్షమని ఒక పెద్ద వృక్షం ఒకటి ఉంటుంది. అది మేడి, జువ్వి, రావి – ఈ మూడూ కలిసి పెరిగిన చెట్టు. ఆ చెట్టు నాలుగు వేల సంవత్సరములు బ్రతికింది. అక్కడికి సమీపంలోనే వృద్ధ మల్లికార్జునుడు ఉంటాడు. ఆ వెనుక రాజరాజేశ్వరీ దేవాలయం. సమీపంలో భ్రమరాంబ అమ్మవారి త్రిఫల వృక్షం ఉంటాయి.


ఉత్తరమున శివాజీ గోపురం, కళ్యాణమంటపం, నందనవనం అనే పుష్పవాటిక ఉంటాయి. ఆ వనంలో సుబ్రహ్మణ్య స్వామీ నెమలితో ఉంటారు. శివాజీ మహారాజు అక్కడికి వెళ్లి అమ్మవారి ప్రార్థన చేశాడు. ఆ దృశ్యం శివాజీ గోపురం మీద యిప్పటికీ చెక్కబడి ఉంటుంది. భవానీమాత ప్రత్యక్షమై ‘ఈ చంద్రహాసమును చేత పట్టుకో నీకు ఎదురు లేదు’ అని అనుగ్రహించి శివాజీకి చంద్రహాసమును బహూకరించింది. ఆ కత్తి పట్టుకునే మహానుభావుడు హిందూ ధర్మ సామ్రాజ్యమును స్థాపించాడు. అంత గొప్ప క్షేత్రం శ్రీశైల క్షేత్రం...

Share:

ఐశ్వర్యాన్నిచ్చే ఐదువారాల అద్భుత వ్రతం (మార్గశిర లక్ష్మీవార వ్రతం)

హేమంతం వచ్చిందంటే చాలు కోటి శుభాల మార్గశీర్షం వచ్చేసినట్టే. లక్ష్మీకళతో లోగిళ్లన్నీ కళకళలాడినట్టే. ఎటు విన్నా ‘లక్ష్మీ నమస్తుభ్యం...’ ఎటు చూసినా ‘నమస్తేస్తు మహామాయే...’ అంటూ ఆ అమ్మను ఆర్తితో స్తుతించడం, పూజించడం వీనుల విందుగా వినిపిస్తూ, నయనారవిందంచేస్తుంటుంది. శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన ఈ మాసం ఆయన సతీమణి మహాలక్ష్మికీ మక్కువైనదే!


ఈ మాసంలో వచ్చే మొదటి గురువారం నుంచి ఐదు వారాలపాటు తనను నియమనిష్ఠలతో కొలిచినవారికి కోరిన వరాలను ప్రసాదిస్తుంది కనకమహాలక్ష్మి. మార్గశిరమాసంలో మహాలక్ష్మిని ఎవరైతే మనస్ఫూర్తిగా ధ్యానిస్తారో, పూజిస్తారో సంవత్సరంలోని మిగిలిన పదకొండు మాసాల్లోనూ వారికి అష్టలక్ష్మీవైభవం సమకూరుతుంది. వారి మార్గం విజయపథమై విరాజిల్లుతుంది. ఆ వ్రతవిధానం అందరి కోసం...


లక్ష్మీదేవి కరుణాకటాక్షాలు పొందాలనుకునేవారంతా మార్గశిరంలో ప్రత్యేక పూజలు చేస్తూ అమ్మవారికి దగ్గరవుతుంటారు. ఈ మాసంలో ప్రధానంగా చెప్పుకోదగింది లక్ష్మీవార వ్రతమే. దీన్నే కొందరు గురువార లక్ష్మీపూజ అని, లక్ష్మీదేవి నోము అని పిలుస్తారు. మార్గశిర లక్ష్మీవార వ్రతం, ఈప్సితాలను ఈడేర్చుకునేందుకు మహిళలకు, లోకానికి దక్కిన మహోత్కృష్టమైన వరం.


* ఐదువారాల అద్భుత వ్రతం...


మార్గశిర లక్ష్మీపూజ ఐదు గురువారాలు చేయాల్సిన ఐశ్వర్య వ్రతం. ఈ నెలలో గనుక నాలుగే లక్ష్మీవారాలు వస్తే, ఐదవ వారంగా పుష్యమాసం తొలి గురువారం నాడు కూడా నోము నోచుకోవాలి.


* వ్రతవిధానం..


ముందుగా ప్రాతఃకాలాన నిద్రలేచి తలారా స్నానం చేసి ఇంటి ముంగిట రంగవల్లులు తీర్చిదిద్దాలి. లక్ష్మీదేవి ప్రతిమను పూజా మందిరంలో ప్రతిష్ఠించుకోవాలి. దేవి కొలువున్న ప్రదేశాన్ని పూలతో, బియ్యప్పిండితో వేసిన ముగ్గుతో అలంకరించాలి. మహాగణపతి పూజతో వ్రతం మొదలవుతుంది. విఘ్నేశ్వరార్చన అనంతరం మహాలక్ష్మికి షోడశోపచార పూజ నిష్ఠగా నిర్వహించాలి. ‘హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజత స్రజాం’ అంటూ ప్రార్థన చేసి అమ్మవారిని ఆవాహన చేసుకోవాలి. ఆసనం, పాద్యం, అర్ఘ్యం, ఆచమనీయం, శుద్ధోదక స్నానం, వస్త్రం, చామరం, చందనం, ఆభరణం, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలాదులు, కర్పూరనీరాజనాన్ని యథావిధిగా సమర్పించాలి.


" ‘ఓం మహాలక్ష్మీ చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్’ "


అంటూ లక్ష్మీగాయత్రి పఠిస్తూ అమ్మవారికి మంత్రపుష్పాన్ని సమర్పించాలి.


అనంతరం ‘సహస్రదళ పద్మస్థాం పద్మనాభ ప్రియాం సతీం’ అనే సిద్ధలక్ష్మీ కవచాన్ని సభక్తికంగా చదువుకోవాలి. తరువాత అష్టోత్తర నామావళి పూజ చేసి, మహానైవేద్యం సమర్పించాలి. నైవేద్యానంతరం లక్ష్మీవారవ్రత కథ చెప్పుకుని అక్షతలు శిరసున ధరించాలి. చివరగా క్షమాప్రార్థన చేయాలి.


అమ్మవారికి సమర్పించే మహానైవేద్యం విషయంలో కొన్ని నియమాలు పాటించాలని పెద్దలు చెబుతారు.


* తొలి గురువారం అమ్మవారు పుట్టినవారంగా ప్రఖ్యాతమైంది. కాబట్టి ఈ రోజు నోము సందర్భంగా పులగం నివేదన చేయాలి.

* రెండవవారం అట్లు, తిమ్మనం..

* మూడోవారం అప్పాలు, పరమాన్నము..

* నాలుగోవారం చిత్రాన్నము గారెలు నైవేద్యం పెట్టాలి..

* ఐదోవారం నాడు అమ్మవారికి పూర్ణం బూరెలను నివేదించాలి..


ఆ రోజు ఐదుగురు ముత్తయిదువులను ఆహ్వానించి వారికి స్వయంగా వండి వడ్డించాలి. అనంతరం దక్షిణ తాంబూలాదులిచ్చి వారి ఆశీస్సులు పొందాలి. దీంతో మార్గశిర లక్ష్మీవ్రతం పూర్తయినట్టే. మంగళగౌరీవ్రతంలాగ పూజపూర్తయ్యాక ఉద్యాపన చెప్పే క్రియ ఈ నోములో ఉండదు. ఎందుకంటే మన ఇంట్లోసౌభాగ్యలక్ష్మి నిత్యం విలసిల్లేందుకే ఈ పద్ధతిని పాటించాలనేది పండితుల ఉవాచ.


* నియమనిష్ఠలు కీలకం..


గురువార వ్రతం అత్యంత భక్తిశ్రద్ధలతో నియమంగా ఆచరించాల్సిన గొప్ప నోము. కాబట్టి ఈ నోము నోచేస్త్రీలు ఆయా లక్ష్మీవారాల్లో శుచిగా ఉండాలి. తలకు నూనె రాయడం, జుట్టు దువ్వుకోవడం, చిక్కులు తీసుకోవడం నిషిద్ధం. తొలిసంధ్య, మలిసంధ్య నిదురపోకూడదు. కల్లలాడకూడదు. నియమనిష్ఠలతో, భక్తిశ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించిన వారి ఇంట లేమి అనే శబ్దం పొడసూపదు. ఐశ్వర్యదేవత వరాలు కురిపించి విజయాలను చేకూరుస్తుంది.


ఒక్క గురువారాలలోనే కాకుండా ఈ మాసంలోని ప్రతిరోజూ లక్ష్మిని పూజిస్తే విష్ణుసతి దీవెనలతో పదికాలాలు పచ్చగా వర్ధిల్లవచ్చని పురాణాలు చెబుతున్నాయి. అమ్మవారికి పూలు, పండ్లు, సువాసనలిచ్చే అగరుధూపం, పరిమళద్రవ్యాలు ప్రీతికరం. వీటితో ఆమె అనుగ్రహాన్ని అవలీలగా పొందవచ్చు. ఈ సువాసనలతో మన ఇంటిని లక్ష్మీప్రసన్నంగా మార్చుకోవచ్చు.


మార్గశిర లక్ష్మీవార వ్రత కధ:


పూర్వం కళింగ దేశమందు ఒక బ్రాహ్మణుడు కలడు. అతనికి సుశీల అను ఒక కూతురు కలదు. ఆమెకు చిన్నతనమున తల్లి చనిపోయినందున సవతి తల్లి పిల్లను ఎత్తుకొమ్మని చెప్పుచు కొంచెం బెల్లం యిచ్చేది. ఆసుశీల సవతి పిల్లలను ఆడించుచు ఇంటివద్ద సవతితల్లి మార్గశిర లక్ష్మి పూజ చేయుట చూసి ఆమె కూడా మట్టితో మహా లక్ష్మి చేసి జిల్లేడు పూలతోను ఆకులతోను పూజచేసి ఆడుకోమని ఇచ్చిన బెల్లం నేవైధ్యం పెట్టుచూ ఆదుకునేది సుశీల. ఇలాకొన్నాళకు సుశీలకు వివాహం అయ్యింది. అత్తవారింటికి పోవుచూ తానూ తయారు చేసుకున్న లక్ష్మి దేవి మట్టి బొమ్మను తీసుకు వెళ్ళింది. ఇలా వెళ్ళిన వెంటనే కన్నవారు నిరుపేదలు అయినారు. ఈమె ఇంట మహదైశ్వైర్యం అనుభవిస్తున్నారు. పుట్టింటివారు కటిక దరిద్రులు అయిన సంగతి తెలిసికొని సుశీల చాలా బాధపడుతుంది. తల్లి దరిద్రమును భరించలేక కొడుకును పిలచి నాయనా! నీ అక్క ఇంటికి వెళ్లి ఏమైనా డబ్బు తీసుకురమ్మని చెప్పి పంపించెను. సుశీలఇంటికి తమ్ముడు వెళ్లి వారి దరిద్రం గురించి చెప్పాడు. దరిద్రమును తెలుసుకున్న ఒకకర్రను దొలిపించి దానినిండా వరహాలు పోసి అతనికి ఇచ్చింది. ఆచిన్నవాడు కర్రను పట్టుకొని వెళుతుండగా దారిలో కర్రవదిలి వెళ్ళిపోయాడు. ఆకర్ర ఎవరో తీసుకొని వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిన కొడుకుని తల్లి ఏమితెచ్చావు అని అడుగగా ఏమితేలేదు అని చెప్పెను. మనదరిద్రం ఇంతే అని అనుకున్నారు. కొంతకాలం తరువాత సుశీల తమ్ముని పరిస్థితిని అడిగితెలుసుకున్నది. వారి దరిద్రంలో ఎటువంటి మార్పురాలేదని తెలిసి. ఒకచేప్పులు జత తెప్పించి వాటిలో వరహాలు పోసి కుట్టించి వాటికి గుడ్డ చుట్టి తమ్మునికి ఇచ్చి అది తీసుకునివెళ్లి తండ్రికి ఇమ్మని చెప్పెను. సరే అని తీసుకునివెళ్లి మార్గమద్యలో దాహంవేసి ఒక చేరువుగాట్టును చెప్పులు మూట పెట్టి నీరుతాగి వచ్చేసరికి ఎవరో వాటిని తీసుకునిపోయారు. జరిగిన విషయం తల్లికి చెప్పాడు. తల్లి జరిగిన దానికి భాదపడి మనదరిద్రం ఇలాగెందుకు ప్రాప్తించిందో అనుకొనెను. మరలా కొన్నాళ్ళకు కొడుకును పంపిస్తూ ఈసారి అయినా జాగ్రత్తగా తీసుకురమ్మని చెప్పెను. అక్కకు పరిస్థితి ఇదివరకు ఉన్నట్టే వుందని చెప్పెను. అప్పుడు సుశీల ఒకగుమ్మడి పండు తెప్పించి తొలచి దాని నిండా వరహాలు నింపి ఆ పండు అమ్మకి ఇమ్మని చెప్పింది. సరే అని తీసుకువస్తుండగా సాయంసమయంలో ఒకచేరువు వద్దకు వచ్చి దానిని గట్టుమీద వుంచి సాయంసంధ్య వందనం చేస్తూవున్నాడు. ఇంతలో ఒకబాటసారి పండుబాగుందని పట్టుకుని వెళ్ళిపోయెను. ఆకుర్రవాడు గట్టుమీదకు వచ్చి పండు వెతగాగా పండులేదు. ఏమిచేసేది లేక ఇంటికి వెళ్ళాడు. తల్లి ఏమి తెచ్చితివి అని అడుగగా జరిగినది చెప్పెను. తల్లి విచారించింది. కొన్నాళ్ళకు. తల్లి ఇంటిదగ్గర పిల్లలను వుంచి కూతురు దగ్గరకు వెళ్ళెను. తల్లిని చూసి సుశీల వారిదరిద్రమును తెలుసుకొని చింతిచి మార్గశిర లక్ష్మివారం నోము నోచిన ఐశ్వర్యం వచ్చునని తలచినది. అమ్మా ఈరోజు మార్గశిర లక్ష్మివారం నోటిలో ఏమివేసుకోకు మనం వ్రతం చేసుకుందాం అనిచేప్పెను. ఆమెకూడా అలాగే నేనేమైనా చిన్నదాననా? ఎందుకు తింటాను అని చెప్పి పిల్లలకు చల్ది అన్నంపెట్టి నోటిలో ఒకముద్ద వేసుకున్నది. కూతురు వచ్చి అమ్మా స్నానం చెయ్యి మనం వ్రతం చేసుకుందాం అంది. అప్పుడు జరిగినది తల్లిచేప్పినది. ఆవారం కూతురుమాత్రమే చేసుకున్నది. రెండవ వారం వ్రతం చేసుకుందాం అనుకున్నది అప్పుడు పిల్లలకు తలకి నూనె రాస్తూ తానును రాసుకున్నది. ఆవారం కూడా వ్రతం చేయవీలుకాలేదు. మరుసటి వారం అమ్మా ఈసారైనా జాగ్రత్తగావుండమని చెప్పినది. పిల్లలకు తలదువ్వుతూ ఆమె తలదువ్వుకొని వ్రతం చేయలేకపోయినది. కూతురుమాత్రమే చేసుకున్నది. నాలగవ వారం ఈసారి అయినా చాలజాగ్రత గావుండమని చెప్పి సుశీల తల్లి ఈపని చేయకుండా వుండటానికి ఒకగోతి లో కూర్చోబెట్టినది. పని అయినతరువాత అమ్మను తెస్సుకుని వచ్చి స్నానం చేస్తే పూజచేసుకుందాం అని పిలవగా తల్లి పిల్లలు అరటిపండు తిని నేను కూర్చున్న చోట అరటి తోలు వేసారు నేను తోచక అది తిన్నా అని చెప్పింది. అయ్యో అని తలచి కూతురు పూజచేసుకొని. ఐదవ వారం మార్గశిర లక్ష్మివారం వ్రతం ఆఖరి వారం . అప్పుడు సుశీల తల్లిని తన కొంగుకు కట్టుకొని పని పూర్తి చేసుకొని తల్లిచే స్నానం చేయించి వ్రతం చేయించింది. పూర్నకుడుములు తల్లిచే నైవేద్యం పెట్టించింది. కానీ మహాలక్ష్మి దూరంగా వెళ్లిపోయినది. ఏమి అమ్మ అలా వెళ్ళిపోతున్నావు అని అడుగగా.... నీ చిన్నతనం లో నీవు బొమ్మలు తో ఆడుకుంటుంటే మీ అమ్మ చీపురుతో కొట్టింది అందుకే అని చెప్పింది. అప్పుడు తన తల్లి చేసినదానికి క్షమించమని ప్రార్ధించింది. మళ్ళీ నీ తల్లిచే వ్రతం చేయించమని అదృశ్యం అయ్యినది మహాలక్ష్మి. సరే అని మొదటివారం పులగం, రెండవ వారం అట్లు, తిమ్మనం, మూడవ వారం అప్పాలు, పరమాన్నము, నాల్గవ వారం చిత్రాన్నం, గారెలు, పుష్యమాసం లో మొదటి వారం లో పూర్ణపుకుడుములు వడ్డించి తల్లిచే నోము చేయించింది. కధా అక్షింతలు తలమీద వేసుకున్నారు. అప్పటినుండి ఆమెకు సకలసంపదలు కలిగి అంత్యమందున విష్ణులోకమునకు వెళ్ళెను. కధలోపమైనను వ్రత లోపము కారాదు. భక్తి తప్పినను ఫలము తప్పదు.

 

Share:

శివనామాల్లో ముఖ్యమైనవి ‘రుద్ర, శివ’ నామాలు

‘రుద్ర’ అంటే రోదనం పోగొట్టేవాడు. ‘శివ’ అంటే మంగళకరమైనవాడు. జవులకు రోదనము పోగొట్టి మోక్షము కలిగించేవాడు శివుడు భోళాశంకరుడు. భక్తవత్సలుడు. ‘మహదేవ’ అని ముమ్మారు భగవన్నామాన్ని భక్తిశ్రద్ధలతో ఉచ్ఛరిస్తే వారికి ఒక్క నామస్మరణకి ముక్తిని ప్రసాదించి, మిగిలిన రెండు నామాలకీ ఋణపడి ఉంటాడు.., అంతేకాదు, ‘మాని యే మహేశస్య ధ్రువమ ప్రజ్ఞానతోపి వా తేషాం కరతలే ముక్తిః’’


ఎవరైతే పరమేశ్వరుని యొక్క నామాలు జ్ఞానంచేత కాని, అజ్ఞానం చేతకాని స్తుతిస్తూ వున్నారో వారికి ముక్తి చేతిలోనే వుంది అని వేదంలో పేర్కొనబడింది. విదాలలో యుజుర్వేదం గొప్పది. దానిలో నాలుగవ కాండలో ఉన్న రుద్రం ఇంకా గొప్పది. రుద్రం మధ్యంలోని ‘పంచాక్షరి’ అంతకంటే ఇంకా గొప్పది. పంచాక్షరిలోని ‘శివ’ అనే రెండు అక్షరాలు మరీ గొప్పవి.


'శివ’ నామోచ్చారణ మహాత్మ్యమునకు సంబంధించిన ఇతివృత్తం పద్మపురాణంలో పాతాళ ఖండంలో వుంది.

అటువంటి మహాశివుడిని కార్తీకమాసంలో పున్నమి తిథినాడు కులమతభేదాలు వయస్సు తారతమ్యాలు లేకుండా శివభక్తులంతా పూజిస్తారు. 


కార్తీకంలో ఏరోజు శివపూజ చేయకపోయనాకార్తీక పున్నమి నాడు మూడువందల అరవై వత్తుల గుత్తిని స్వామి ఎదురుగా కానీ తులసి సన్నిథిలోకానీ, మారేడు, రావి చెట్ల దగ్గర కానీ వెలిగిస్తే ఆ సంవత్సరం దీపం వెలిగించని పాపమేదైనా ఉంటే అది దూరం అవుతుంది. 


కార్తీక పున్నమినాడు దేవాలయాల్లో శివుని ప్రత్యేక పూజలు నిర్వర్తిస్తారు.

పరభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం

జగన్నాథ నాథం సదానందభాజాం

భవద్భవ్య భూతేశ్వరం భూతనాథం

శివం శంకరం శంభు మీశానమీడే

అని కార్త్తీకంలో ఈశ్వరుణ్ణి ప్రతివారు కొలుస్తుంటారు.


ఉసిరి మూలమున శ్రీహరి, స్కందమున శివుడు, ఊర్థ్వమున బ్రహ్మ, సూర్యుడు, శాఖలయందు, సమస్త దేవతలు కూడి కార్త్తిక మాసంలో ఉసిరి చెట్టును ఆశ్రయించి ఉంటారు. కనుక కార్తికమాసంలో ధాత్రీపూజవలన అశ్వమేధ ఫలం లభించి, ఉసిరి ఫలదానమువల్ల ముక్తి కలుగుతుంది. 


ఉసిరిక దీపదానం కూడా ఈ మాసం లో విశేషంగా చేస్తారు. ఓం నమః శివాయ నమః అంటూ ఉసిరిక కాయమీదనో, పిండి ప్రమిదతోనో, మట్టి ప్రమిదతోనో దీపం వెలిగిస్తే అనంత కోటి పుణ్యరాశి లభిస్తుందంటారు. 


శివుని పేరిట ఉపవాసం చేసినా, ఏకభుక్తం చేసినా, నక్తంచేసినా, ఆయాచిత వ్రతం చేసినా, ఆఖరికి శివనామంతో సూర్యోదయానికి పూర్వం స్నానం చేసినా సరే అనంతకోటి పుణ్యఫలాలను పరమశివుడు అనుగ్రహిస్తాడు..

Share:

నవంబరు 13న తిరుమలలో కార్తీక వన భోజనం




కార్తీక వన భోజన కార్యక్రమం నవంబరు 13వ తేది తిరుమలలోని గోగర్భం సమీపంలో గల పార్వేటమండపంలో జరుగనుంది. పవిత్రమైన కార్తీకమాసంలో వనభోజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

ఇందులో భాగంగా ఉదయం 8.30 గంటలకు శ్రీ మలయప్పస్వామివారు చిన్న గజవాహనంపై, ఉభయనాంచారులు పల్లకిపై ఆలయంనుంచి బయలుదేరి ఊరేగింపుగా పార్వేటమండపానికి వేంచేపు చేస్తారు. ఉదయం 11 నుండి 12 గంటల నడుమ శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహిసారు. ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు. అటు పిమ్మట మధ్యాహ్నం 1 నుండి 2 గంటల నడుమ కార్తీక వనభోజన కార్యక్రమం నిర్వహిస్తారు.

ఈ ఉత్సవం కారణంగా శ్రీవారి అలయంలో నిర్వహించు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జితబ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకారసేవలను టీటీడీ రద్దు చేసింది.

Share:

Search This Blog

Popular Posts

ప్రకృతితో రైతన్న బంధం: పుష్యమి కార్తెలో ఏం జరుగుతుంది?

పుష్యమి కార్తె: వర్షాల ఆశ, ఎదుగుదల.. సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలాన్ని వ్యవసాయ పంచాంగం ప్రకారం ఆ కార్తెగా పిలుస్తారు. మొత్తం 2...

Recent Posts

Unordered List