మహాత్రిధార తైలం . ~ దైవదర్శనం

మహాత్రిధార తైలం .



( 1 ) త్రిధార చెట్టు పాలు  100గ్రా 
( 2 ) జిల్లేడు చెట్టు పాలు 100గ్రా
 ( 3 )  నాగేటి ధుంప 100గ్రా
( 4 ) నాభి 100గ్రా
( 5 )  తెల్లగురిగింజలు 100గ్రా
( 6 ) చేదుపుచ్చవేరు 100గ్రా 
( 7 ) తెల్లావాలు  100గ్రా 
( 8 ) వస  100గ్రా 
( 9  ) ఊడుగ గింజలు 100గ్రా   
( 10 ) పచ్చి వాకుడుకాయల రసం 100గ్రా

ఈ అన్ని వస్తువులు సమానంగా తీసుకొని అనగా పై అన్ని వస్తువులు కలిపి 1000 గ్రాలు ( 1కేజీ ) అవుతాయి తీసుకొని దుంపలు, గింజలు, విడివిడిగా దంచుకొని పొడిలాగా చేసి అన్నింటినీ కలిపి కల్కంలాగా చెసుకొవాలి ఇలా చేసిన మిశ్రమాన్ని ఒక పెద్ద ఇనుప పాత్రలో వేసుకొని  ఈ పై వస్తువులకి సమానంగా లోహాభస్మం 1000గ్రా ( 1కేజీ) వేసుకొని, లోహా భస్మానికి  నాలుగు రెట్లు అధికంగా స్వచ్చమైన నల్ల నువ్వుల నూనె వేసుకొనవలెను అనగా   నువ్వులనూనె : 4000 గ్రా ( 4కేజీలు) వేసుకొని, ఈ నువ్వులనూనె కి నాలుగు రెట్లు గుంటగలగరపచ్చి ఆకురసం 16000గ్రా( 16కేజీలు),  మేకమూత్రం  16000గ్రా( 16కేజీలు), మేకపాలు 16000గ్రా ( 16కేజీలు) గోమూత్రం 16000గ్రా ( 16కేజీలు) ఈ అన్ని వస్తువులు పై చెప్పిన విధంగ ఒక పెద్ద ఇనుప పాత్రలో వేసి  కింద అగ్ని వెలిగించి మెల్లగా మంటపెడుతూ, అధికంగా మంట తగలకుండా మద్యముగా వేడి తగిలేలా చూసుకొంటూ పై వాటిలో నీరు అంశం పూర్తిగా ఇగిరిపొయి కేవలం నూనె మాత్రమే మిగిలేవరకు మరిగించి, ఈ నూనె ని పలుచని బట్టలో కింద మాడు రాకుండా వడపొసుకొవాలి, ఇలా చేసుకొంటె పై నూనెలో సుమారు 2 నుంచి 3 లీటర్లు మీకు చేతికి రావొచ్చును. ఈ నూనెని బట్టతల వారు  వెంట్రుకలు లేని చోట రాసుకొన్న వెంట్రుకలు వచ్చును, కొత్తవెంట్రుకలు రావడం మీరు 40 నుంచి 60 రోజుల్లో చూడగలరు, ఇలా మీరు సుమారు 9 నెలలు వాడితే మీకు వెంట్రుకలు మునుపటిలాగే బట్టతల పోయి వెంట్రుకలు దట్టంగా పెరుగుతాయి. ద్రుడంగా మారుతాయి.

ఈ నూనె యెక్క ప్రయేజనాలు :
* ఈ నూనె తాబేలు చిప్పవంటి తలపైన కూడా వెంట్రుకలు మెలిపించును.
* ఈ నూనె వాడటం వల్ల వెంట్రుకలు సన్నగా వున్నవి లావుగా అవుతాయి,
* ఈ నూనె వాడటం వల్ల మీ వెంట్రుకులు నల్లగా మారుతాయి.
*  ఈ నూనె మీ చుండ్రు సమస్యను తొలిగిస్తుంది.
* ఈ నూనె వాడటం వల్ల మీ యెక్క తలవెంట్రుకలు రాలడం 95% తగ్గుతాయి.
* ఈ నూనె వాడటం వల్ల అలోపీసియా, మరియు తలలో వుండు చర్మ సమస్యలు దురదలు లాంటి సమస్యలు కూడా పొవును.
* ఈ నూనె వాడటం వల్ల తలభారం తగ్గును, తలనొప్పికూడా తగ్గుతుంది, అలాగె తల వెంట్రుకలు వ్రుద్ది చెందుతాయి.
*  కొత్తవెంట్రుకలు30 నుంచి40 రోజుల్లో చిన్న చిన్న మెలకలు రావడం మీరు గమనించగలరు, ( రోజు వాడిన వారికి మరియు శీకాకాయ, కుంకుడుకాయలు కలిపి వెంట్రుకలు కడుక్కొన్నవారికిఅత్యద్బుతమైన రిసెల్ట్ వుండును.)
* వెంట్రుకులని బలిస్టంగా చేసి మరలా మరలా జుట్టు సమస్యలు రాకుండా చేయును.
* ఈ నునెలో మేకమూత్రం మరియు గోమూత్రం వేయునందున తలకు పూసుకొన్నచొ కొద్దిగా వాసన వచ్చును మీరు తలకు బట్టకట్టుకొంటే వాసన  పెద్దగా అనిపించదు.
* బట్టతలపోయి, అందమైన జుట్టు మీ సొంతం అవుతుంది.

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List