నున్నని బట్టతల పై కూడా వెంట్రుకులని మెలిపించే అంకోలా తైలం (ఊడుగ తైలం). ~ దైవదర్శనం

నున్నని బట్టతల పై కూడా వెంట్రుకులని మెలిపించే అంకోలా తైలం (ఊడుగ తైలం).

రెండు కేజీల అంకోలా బీజాలను భాగా దంచి 32 లీటర్ల నీటిలో వేసి సన్నగా మరిగించి, ఈ నీటిని సగం అయ్యేవరకు మరిగించాలి అనగా 16 లీటర్లు అయ్యెవరకు మరిగించి, ఈ కసాయాన్ని వడపొసుకొని ఒక పెద్ద ఇనుప పాత్రలోకి పొయాలి, ఈ ఇనుప పాత్రలోకి ముందుగానే అంకోలా గింజలనుంచి తీసిన అంకోలా తైలాన్ని 2 లీటర్లు వేయాలి ( అంకోలా తైలం తీయడం ఊడుగ గింజలను చిన్న చిన్నముక్కలు లేదా పొడి చేసి ఈ పొడిలో నల్లనువ్వులనూనె తగినంత వేసి ఉదయం ఎండలో ఆరించాలి ఇలా రోజూ రాత్రి నానించి ఉదయం ఎండించాలి, ఇలా ఒక వారం రోజులు వరుసగా చేసి  పెద్ద కంచు పాత్ర తీసుకొని పాత్రలో పై విదంగా చేసిన మిశ్రమాన్ని ప్లేట్ లాగా వున్న కంచు పాత్రలో పొసి ఎర్రటి ఎండలో ఏటవాలుగా ప్లేట్ ని ఉంచితే అందులోనుంచి నూనె చుక్కలు చుక్కలుగా కారుతుంది, ఇలా కారినప్పుడు ఈ నూనెని మరొక పాత్ర ద్వారా సేకరించాలి, ఇలా సేకరించిన నూనెని   పై  చెప్పిన అంకోలా కసాయంలో ఇనుప పాత్రలో వుండే విదంగా కలపాలి.

అలాగే త్రిఫల కసాయం, అగరుచెక్క కసాయం, అరిమేద కసాయం, వెర్రిపుచ్చువేర్ల రసం, మయూరశిఖి రసం, కలబందరసం, గుంటగలగర రసం, చింతాకురసం, ఉసిరికాయలరసం, మాలతీ ఆకుల రసం, కొబ్బరినీరు, మెగలిపువ్వుల రసం, ఈ అన్ని వస్తువులు కూడా  ఒక్కొక్కొటి 2 లీటర్లు వేయాలి,


అలాగే పై వాటిలో తానికాయ గింజల లోని పప్పుని 200గ్రాలు,  ఏలాది గుణ ద్రవ్యాల చూర్ణం 200గ్రాలు, ఏలాది గుణ ద్రవ్యాలను తయారు చేయు విధానం ( 1, ఏలకులు 1 భాగం, 2, లవంగపట్ట 2భాగాలు, 3,ఆకుపత్రి 3 భాగాలు, 4, నాగకేసరాలు 4భాగాలు, 5, మిరియాలు 5భాగాలు, 6, పిప్పళ్ళు 6 భాగాలు, 7,శొంటి 7భాగాలు  పై విదంగా మంచి నాన్యమైన మూలికలను తీసుకొని విడివిడిగా మ్రుదు చూర్నం చెసుకొని పై విదంగా భాగాలు గా కలిపితే ఇదే ఏలాది గుణ ద్రవ్యం ఈ మిశ్రమాన్ని 200గ్రాలు పై చేయు దానిలో కలపాలి ).


అలాగే మంచి నాన్యమైన శుద్ది చేసి తయారు చేసిన లోహభస్మం 1 కేజీ పై చేయు తైల పాత్రలో వేసి, సన్నని మంటమీద నిదానంగా మండిస్తూ కట్టెల పొయ్యి మీద మాత్రమే చేయాలి, ఇలా చేస్తే మంచి నాన్యత తైలానికి అత్యంత శక్తి వచ్చును. సన్నని మంటమీద కసాయాలన్నీ ఆవిరి అయిపొయి కేవలం తైలం మాత్రమే మిగిలే వరకు మరిగించాలి, ఇలా మరిగించిన తైలాన్ని అంకోలా కేశతైలం అంటారు.

ఈ అద్బుతమైన తైలాన్ని తలకు రాసుకుంటుంటే, వెంట వెంటనే తెల్ల వెంట్రుకలు నల్లబడిపొవడం జరుగుతుంది.
జుట్టురాలు సమస్య ఆగిపొతుంది.
జుట్టుమారిన రంగు నల్లగా తుమ్మెద రెక్కలవెలే వెంట్రుకలు మారుతాయి.
వెంట్రుకలు రావాల్సిన ఏ భాగంలో అయినా ఈ తైలాన్ని రాస్తే అత్యద్బుతంగా కొత్త వెంట్రుకలు మరల పూర్వంలాగా  వస్తాయి.
బట్టతల ఎంత కాలమైనా ఎంత దీర్గకాలంగా బట్టతల వున్నా కూడా నున్నని తాబేలు చిప్పవలే వున్న బట్టతలమీద కూడా వెంట్రుకలు బట్టతల కనిపించకుండా వస్తాయి.
ముసలివారికున్న బట్టతల మీద కూడా వెంట్రుకలు భాగా మెలుచును.
ఈ అత్యద్బుతమైన తైలాన్ని వాడి మీ కేశాలను వ్రుద్దిపరుచుకొండి.

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List