ఆయుర్వేదం నందు ఔషధ సేవన కాలముల గురించి సంపూర్ణ వివరణ. ~ దైవదర్శనం

ఆయుర్వేదం నందు ఔషధ సేవన కాలముల గురించి సంపూర్ణ వివరణ.

ఆయుర్వేదం నందు ఔషధాలను సేవించు విధానమును రోగాలకు బట్టి 10 రకాలుగా వర్గీకరించబడినది. ఈ విధముగా ఔషధాలను సేవించినచో ఆయా ఔషధాలు బలంగా పనిచేసి రోగి తొందరగా కోలుకుంటాడు. మరియు ఔషధాలను సూర్యోదయానికి ముందు , సూర్యాస్తమయం తరువాత సేవించిన మంచిఫలితాలు పొందగలరు. ముఖ్యంగా ఔషధసేవన గురువారం నందు మొదలు పెట్టిన త్వరగా రోగం నుంచి విముక్తి పొందవచ్చు.

  ఆయుర్వేదం వర్గీకరించిన 10 రకాల ఔషధసేవన కాలాలు  -

 * అనన్నౌషధ కాలము  -

        తినినట్టి ఆహారం పూర్తిగా జీర్ణం అయిన తరువాత ఔషధాన్ని సేవించుట . రోగి బలవంతుడుగా ఉన్నప్పుడు కఫరోగం నందు దీనిని ఉపయోగించవలెను .

 * అన్నాదౌష్యధ కాలము  -

        ఆహారమును భుజించుటకు ముందు ఔషధమును తినినవెంటనే ఆహారమును భుజించుట . దీనిని అపానవాతం ప్రకోపించినప్పుడు ఉపయోగించవలెను .

 * మధ్యోషధ కాలము  -

         ఆహారం తినునప్పుడు మధ్య సమయం నందు తినునట్టి ఔషధం . దీనిని సమాన వాతం ప్రకోపించినప్పుడు ఉపయోగించవలెను .

 * అంతౌషధ కాలము  -

         ఆహారం భుజించుతూ ఉన్న సమయంలో చివరలో ఔషధం సేవించటం . దీనిని వ్యానవాతం ప్రకోపించినప్పుడు మధ్యాహ్న భోజనం చివర సమయంలో , ఉదాన వాతం ప్రకోపం చెందినపుడు రాత్రి భోజనం యొక్క చివరలో ఔషధం సేవించవలెను .

 * కబాలాంతరౌషధ కాలము -

          ఆహారం భుజించునప్పుడు మొదటిముద్ద తిని వెంటనే ఔషధమును భుజించిన పిదప మరలా ఒక ముద్ద అన్నము తినునట్టి ఔషధం . దీనిని ప్రాణవాతం ప్రకోపం చెంది ఉండునప్పుడు ఉపయోగింపవలెను.

 * గ్రాసగ్రాసౌషధ కాలము  -

          ప్రతి అన్నపు ముద్దతోను ఔషధం చేర్చి భుజించటం. దీనిని ప్రాణవాతం ప్రకోపం చెందినపుడు ఉపయొగింపవలెను.

 * ముహురౌషధ కాలము -

           అన్నము తిన్నను , తినకున్నను ఔషధమును అనేక పర్యాయాలు తీసుకోవడం . దీనిని విషదోషం , వాంతులు , ఎక్కిళ్లు , దప్పిక, శ్వాస , దగ్గు అను రోగములు కలవారికి ఉపయోగించవలెను .

 * స్నానౌషధ కాలము -

           ఆహారంతో కూడా చేర్చి తినునట్టి ఔషధము . నోటికి రుచిలేకపోవుట వంటి రోగముల యందు అనేక రకాల ఆహార పదార్ధములతో చేర్చి ఉపయోగించవలెను .

 * సాముద్గౌషధ కాలము -

           మొదట ఔషధమును తిని వెంటనే ఆహారంను భుజించి మరలా ఔషధమును సేవించుట . దీనిని ఆక్షేపక వాతము , ఎక్కిళ్లు , కంపవాతం అనగా పార్కిన్సన్స్ వ్యాధి నందు ఉపయోగించవలెను .

 * నిశౌష్యథ కాలము  -

           రాత్రి పడుకునే సమయం నందు తినునట్టి ఔషధము . దీనిని మెడకొంకులకు పై భాగమున పుట్టు రోగములు నందు ఉపయోగింపవలెను .

         పైన చెప్పిన విధముగా 10 రకములుగా ఔషధసేవన పద్ధతులు కలవు. ఔషధంతో పాటు ఔషధసేవన కాలం కూడా రోగాన్ని తగ్గించడంలో ప్రముఖపాత్ర వహించును.

   

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List