శిశువుకి స్వర్ణప్రాశన చేయించుట వలన కలుగు ఉపయోగాలు. ~ దైవదర్శనం

శిశువుకి స్వర్ణప్రాశన చేయించుట వలన కలుగు ఉపయోగాలు.

ప్రస్తుత పరిస్థితుల్లో శిశువుకి స్వర్ణ ప్రాసన చేయడం అనేది చాలమందికి తెలియని విషయం . అన్నప్రాసన చేసేప్పుడు శిశువుకి స్వర్ణప్రాసన అన్న మాట విధిగా వస్తుంది. అప్పుడు చేతికి ఉన్న ఉంగరాన్ని శిశువు యొక్క నాలుకపైన రాస్తారు .దానినే మనం స్వర్ణప్రాసనగా తీసుకుని మురిసిపోతాం. నిజానికి అది స్వర్ణప్రాసన కాదు.

ఈ స్వర్ణప్రాసన గురించి సుశ్రుతుడు తన సుశ్రుతసంహితలో ఏ విధముగా చేయవలెనో వివరంగా ఇచ్చాడు. పుట్టిన శిశువుని చన్నీళ్లతో శుభ్రపరచి జాతకసంస్కారం చేసిన తరువాత తేనె , నెయ్యి బంగారం మెత్తటి పొడిని నెయ్యి, తేనె తో కలిపి ఉంగరం వేలుతో శిశువు నాకించవలెను. బంగారపు భస్మాన్ని కూడా ఇదే విధంగా వాడవచ్చు . ఈ స్వర్ణభస్మ మోతాదు శిశువు యొక్క బలప్రకృతులును అనుసరించి ఆవగింజ అంత మోతాదు వరకు వాడవచ్చు .దీనిని ప్రతిశిశువుకు ప్రతిదినం ఇవ్వవచ్చు.

శిశువుకు స్వర్ణభస్మం ఇవ్వడం వలన కలిగే ప్రయోజనాలు -

* ఈ స్వర్ణభస్మం శిశువుకి తినిపించడం వలన బుద్ది, జఠరాగ్ని , బలం వృద్దినొందును .

* ఆయష్షు వృద్ధిచెందును.

* అన్ని రకాల రోగాలు పొయి ఆరొగ్యకరంగా వుంటారు..

* పిల్లల మేధాశాక్తికి, ఎదుగుధలకి భాగ పనిచెయును..

* మగవారి యొక్క పుంస్త్వమును పెంచును.

* చర్మకాంతి వృద్ధిచెందును.

* గ్రహపీడ పొగొట్టును.

* కొంతకాలం స్వర్ణభస్మం వాడుట వలన శిశువు యొక్క రోగనిరొధక శక్తి పెరిగి రోగాలపాలు అవ్వడు .

* ఆరుమాసములు విడవకుండా వాడిన శిశువు బ్రహుస్పతి సమానమైన తెలివితేటలు కలిగినవాడు అగును. అనగా ఒక్కసారి చదివిన చాలు ఎంతపెద్ద విషయం అయినను తిరిగి చెప్పగలడు.
* శరీరం నందు అతను పెరిగేకొలది అతనియొక్క శరీరబలం కూడా అమితంగా పెరుగును .
గమనిక -
ఈ స్వర్ణభస్మాన్ని "ఆటిజం " వ్యాధితో బాధపడే పిల్లలకు ఇచ్చిన చాలా తొందరగా వ్యాధినుంచి బయటపడతారు. నేను ఈ స్వర్ణభస్మాన్ని చాలా మందిపై ప్రయొగించాను. నేను గమనించిన విషయం ఏమిటంటే ఇది ముఖ్యంగా "హార్మోన్స్" పై చాలా బాగా పనిచేస్తుంది. ముఖం నందు తేజస్సు పెరిగింది. వీర్యకణాల సంఖ్య, మరియు సంఖ్య కూడా పెరిగింది. రోగనిరోధక శక్తి, కండరాల శక్తి, చాలాబాగా పనిచేస్తుంది . నరాల బలహీనత పోయి వణుకుడు తగ్గింది . స్వర్ణభస్మం ఖరీదుతో కూడిన వ్యవహారం అలాగే అనుభజ్ఞుల దగ్గర పొందగలరు.
ఈ స్వర్ణప్రాశన గురువారం పుష్యమి నక్షత్రం లేదా అదివారం పుష్యమి నక్షత్ర గడియల్లో మొదలు పెట్టండి. చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఈ యోగాన్ని పుష్యార్క యోగం అని పిలుస్తారు .

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List