సిరిధాన్యాల గురించి సంపూర్ణ వివరణ - ఉపయోగాలు 3 . ~ దైవదర్శనం

సిరిధాన్యాల గురించి సంపూర్ణ వివరణ - ఉపయోగాలు 3 .


  
జొన్నలు  -

 *  రుచికి  వెగటుగా ఉండును.

 *  శరీరం నందు కఫమును, పైత్యాన్ని హరించును .

 *  వీర్యవృద్ధి బలాన్ని ఇచ్చును.

 *  జొన్నలలో ఎరుపు, తెలుపు, పసుపు మూడురంగుల జాతులు ఉండును.

 *  జొన్నలలోని మాంసకృత్తుల్లో మనకు అవసరమయిన అన్ని ఎమైనో ఆసిడ్స్ తగినంతగా లభ్యం అవుతాయి. వీటిలో విటమిన్ B కాంప్లెక్స్ మరియు సెల్యూలోజులు సమృద్ధిగా లభిస్తాయి.

 *  జొన్నపిండితో తయారుచేసిన రొట్టెలను ప్రతిరోజు స్వీకరిస్తుంటే మంచి బలవర్ధకమైన ఆహారంగా పనిచేయును . మలబద్ధకాన్ని తగ్గించి వేయును . జీర్ణశక్తి తక్కువ ఉన్నవారు తినరాదు.

 *  జొన్నలలో అధికంగా ఉన్న "ఫైటేట్స్ " అనే పదార్థం వలన మిగతా ఆహారపదార్ధాలలోని క్యాల్షియం, ఐరన్ వంటి ఖనిజ లవణాలు శరీరానికి పట్టుట కష్టం అగును.కాబట్టి జొన్నలను పరిశుభ్రముగా శుద్ధిచేసి పిండిమరలో వేసి మెత్తగా పిండిచేసి ఆహారంలో ఉపయోగిస్తుంటే ఫైటేట్స్ అడ్డురావు. దీనివల్ల ఐరెన్ , క్యాల్షియం ఒంటికి పట్టును .

 * మంచిగా శుద్ది చేసిన జొన్నపిండిని పాలతో కాని మజ్జిగలో కాని కలిపి తాగుతుంటే మొలలు , అజీర్తి , B1 , B2 లోపముతో బాధపడువారికి మంచి ఔషధంగా పనిచేయును .

 *  100 గ్రాములు జొన్నలలో పిండి పదార్దాలు 73 గ్రా, మాంసకృత్తులు 10.5 గ్రా , కొవ్వులు 1.7 గ్రా , ఫాస్ఫరస్ 286 మి.గ్రా , కాల్షియం 20 మి.గ్రా , ఐరన్ 6 మి.గ్రా , సోడియం 7 మి.గ్రా , పొటాషియం 130 మి.గ్రా , విటమిన్స్ A - ౧౪0 , I.U ,B -345 మి.గ్రా , B2 - 365 మి.గ్రా , నియాసిన్ 1.7 మి.గ్రా ఉన్నాయి. ఇవి జీర్ణం అగుటకు 3 గంటలు పట్టును .

 *  జొన్నలను కడుపులో గుల్మాలు ఉన్నవారు , మొలలు సమస్య ఉన్నవారు తీసుకోరాదు . జొన్నలు అధికంగా తీసుకోవడం వలన నేత్రసంబంధ సమస్యలు వస్తాయి.

 *  జొన్నలకు విరుగుళ్లు పాలు , నెయ్యి, మిఠాయి
వాము .

  సజ్జలు  -

 *  100 గ్రాముల సజ్జలలో కార్బోహైడ్రేట్స్  66 గ్రా , ప్రొటీన్స్ 10 గ్రా, ఫాట్స్ 4.5 గ్రా , కాల్షియం 50 గ్రా , ఫాస్ఫరస్ 350 మి.గ్రా , ఐరన్ 10 మి.గ్రా , సోడియం 11 మి.గ్రా , పొటాషియం 30 మి.గ్రా , విటమిన్స్ A -2205 I .U , B1 - 329 మి.గ్రా , నియాసిన్ 3.2 మి.గ్రా ఆక్సాలిక్ ఆసిడ్ 14 .5 మి.గ్రా ఉన్నాయి .

 * 100 గ్రా సజ్జలు  జీర్ణం అగుటకు మూడున్నర గంటలు పడుతుంది.

 *  సజ్జలలో మాంసకృత్తులుకు అవసరం అయిన ఆర్డీనైన్ మొదలుకొని హెలైన్ వంటి ఎమైనో ఆసిడ్స్ తగినంతగా ఉన్నాయి. సజ్జలలో ఇంకా ఐరన్ , విటమిన్ A , B లు కూడా పుష్కలంగా ఉన్నాయి . ఇవి మంచి బలవర్థకమైన ఆహారంగా చెప్పవచ్చు.

 *  సజ్జలను మెత్తగా పిండిచేసి తయారుచేసిన రొట్టెలను తేనెతో కలిపి ప్రతినిత్యం ఉదయం పూట వాడుచున్న శరీరముకు మంచి బలం కలుగును.

 *  నిద్ర పట్టనివారు , మొలల వ్యాధితో బాధపడేవారు , నరాల బలహీనంతో బాధపడేవారు పైనచెప్పినట్టు సజ్జరొట్టెలను తేనెతో కలిపి తీసుకొనుచున్న మంచి ఫలితం కనిపించును.

 *  సజ్జలను అధికంగా తీసుకొనుచున్న యూరిక్ ఆసిడ్ ఉత్పత్తి అయ్యే అవకాశం ఉన్నది. కావున మితముగా తీసికొనవలెను.

 *  మధుమేహ వ్యాధిగ్రస్థులు , శుక్రంనష్టం , తెల్లబట్ట సమస్య ఉన్నవారు, మలబద్దకం, క్షయ , గనేరియా , సిఫిలిస్ వంటి సుఖవ్యాధులు ఉన్నవారు సజ్జలు తినరాదు.

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List