సంతాన భాగ్యాన్ని ప్రసాదించే దేవాలయం... ~ దైవదర్శనం

సంతాన భాగ్యాన్ని ప్రసాదించే దేవాలయం...



సంతానం కోరుకునే ప్రజలు ఇక్కడ తమ శిరస్సులు వంచుతారు. ఈ దేవాలయంలో కాళ్‌రాత్రి మాత ప్రధాన దేవతగా పూజలందుకుంటోంది.
దేవాలయం విశిష్టత తెలియగానే రాత్రి 10 గంటల ప్రాంతంలో మేము ఈ దేవాలయానికి చేరుకున్నాము. భారీ సంఖ్యలో చేరిన భక్తసమూహం మాకు అక్కడ కనిపించింది. వారిలో కొందరు సంతాన భాగ్యం కోసం చేరుకోగా, మరికొందరు తమ కోరిక తీర్చినందుకుగాను కాళ్‌రాత్రి మాతకు కృతజ్ఞతలు చెప్పుకునేందుకు దేవాలయానికి విచ్చేసారు.
వివాహం జరిగి పది సంవత్సరాలు కావొస్తున్నా తమకు సంతానం కలగలేదని భక్తులలో ఒకరైన సంజయ్ అంబారియా మాతో అన్నారు. స్నేహితులలో ఒకరు దేవాలయ మహత్యాన్ని తనకు తెలిపారని సంజయ్ వెల్లడించారు. ఇక్కడకు వచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్న అనంతరం కొంత కాలానికి తమకు సంతాన
భాగ్యం కలిగిందని సంజయ్ చెప్పుకొచ్చారు.
ఇక్కడ మొక్కులు తీర్చుకునే విధానం విభిన్నంగా ఉంటుంది. మొదటగా తమకు సంతాన భాగ్యం ప్రసాదించాలని అమ్మవారిని కోరుతూ మూడు కొబ్బరి కాయలను సమర్పించుకుంటారు. అనంతరం సంతానం కోరుకునే భక్తులు ఐదు వారాల పాటు మెడలో ధరించేందుకుగాను ప్రత్యేకమైన దారాన్ని పూజారి అందిస్తారు. తమకు సంతానభాగ్యం కలిగిన వెంటనే దేవాలయ ఆవరణలోని చెట్టుకు ఐదు కొబ్బరికాయలను భక్తులు కడతారు. చెట్టుకు కొబ్బరికాయలు కట్టే నిమిత్తం సంజయ్ అంబారియా ఇక్కడకు వచ్చారు.

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ప్రకృతితో రైతన్న బంధం: పుష్యమి కార్తెలో ఏం జరుగుతుంది?

పుష్యమి కార్తె: వర్షాల ఆశ, ఎదుగుదల.. సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలాన్ని వ్యవసాయ పంచాంగం ప్రకారం ఆ కార్తెగా పిలుస్తారు. మొత్తం 2...

Blog Archive

Recent Posts

Unordered List