చాళుక్యుల కాలంనాటి శిల్ప కళా నైపుణ్యం. ~ దైవదర్శనం

చాళుక్యుల కాలంనాటి శిల్ప కళా నైపుణ్యం.




ఎన్నో పురాణ, ఇతిహాసాలు, సంఘటనలు, బోధనలు వీటిలో కనపడతాయి. ఇవి మొత్తంగా నాలుగు దేవాలయాలు.
బాదామి ఫొటోలు, గుహ దేవాలయాలు విష్ణు మూర్తి
ఒకటవ గుహ దేవాలయం
అన్నిటికంటే ప్రాచీనమైనది ఒకటవ గుహ దేవాలయం. ఇది అయిదవ శతాబ్దంలో నిర్మించబడింది. దీనిలో శివుడిని అర్ధనారీశ్వర మరియు హరి హర అవతారాలలో చెక్కారు. నాట్యం చేస్తున్న నటరాజుగా కూడా చూపారు. శివుడికి కుడిభాగంలో హరిహర అవతారం మరియు ఎడమ భాగంలో విష్ణు మూర్తి అవతారం చెక్కబడ్డాయి. దీనిలో మహిషాసుర మర్దిని మరియు గణపతి, శివలిలంగం మరియు షణ్ముఖ శిల్పాల చెక్కడాలు కూడా చూడవచ్చు.
రెండవ గుహ దేవాలయంఇది పూర్తిగా విష్ణుమూర్తి చెక్కడాలతో ఉంటుంది. వరాహ మరియు త్రివిక్రమ అవతారాలలో చూపబడింది. విష్ణుమూర్తి, గరుడఅవతారాలు దేవాలయ పై భాగాన చూడవచ్చు.
మూడవ గుహ దేవాలయం
100 అడుగుల లోతు ఉన్న మూడవ గుహ దేవాలయంలో విష్ణు మూర్తి త్రివిక్రమ మరియు నరసింహ అవతారాలలో కనపడతాడు. ఇంతేకాక పర్యాటకులు అదనంగా శివ పార్వతుల కళ్యాణ చిత్రాలు కూడా చూడవచ్చు.
నాలుగవ గుహ దేవాలయంనాలుగవ గుహ దేవాలయం పూర్తిగా జైనులకు సంబంధించినది. మహావీరుడు కూర్చుని ఉన్న భంగిమలో, తీర్ధంకరుడు పార్శ్వనాధుడు చిత్రీకరించబడ్డాయి.

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ప్రకృతితో రైతన్న బంధం: పుష్యమి కార్తెలో ఏం జరుగుతుంది?

పుష్యమి కార్తె: వర్షాల ఆశ, ఎదుగుదల.. సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలాన్ని వ్యవసాయ పంచాంగం ప్రకారం ఆ కార్తెగా పిలుస్తారు. మొత్తం 2...

Blog Archive

Recent Posts

Unordered List