మహిమాన్వితమైన అతి పురాతన హిందూమత విగ్రహల నిలయం శ్రీభగవాన్ మహావీర్ మ్యూజియం. ~ దైవదర్శనం

మహిమాన్వితమైన అతి పురాతన హిందూమత విగ్రహల నిలయం శ్రీభగవాన్ మహావీర్ మ్యూజియం.


* రాతి గోడల్లో దాగి ఉన్న అలనాటి హిందూమత చారిత్రక జ్ఞాపకాలను మననం చేసుకోవాలంటే కడప గడపలో ఉన్న ఈ మ్యూజియం చూడవలసిందే..
.
కడప జిల్లాలోని జైన మతానికి చెందిన నిర్మాణ వివరాలను, కళా సంపద, సంస్కృతిని పదిలపరచడంలో కీలకపాత్ర పోషిస్తుంది శ్రీ భగవాన్‌ మహావీర్‌ మ్యూజియం. 1982లో ఈ మ్యూజియాన్ని నిర్మించినారు. ప్రాచీన కళాకృతులకు నెలవుగా చెప్పవచ్చు. మ్యుజియం , నిర్మాణం కోసం భారీ విరాళాలు జైన్ సంఘం ఏర్పాటు చేసింది. జైన మతానికి సంబంధించిన కళలు ఈ మ్యూజియం లో గమనించవచ్చు. ఈ మ్యూజియంలో రాతితో చెక్కబడిన శిల్పాలు, కాంస్యంతో తయారుచేయబడిన చిహ్నాలు, మట్టితో చేసిన బొమ్మలు, శాసనాలతో ఉన్న రాళ్ళు ఇలా ఎన్నో చారిత్రక అవశేషాలను చూడవచ్చును.
.
పురావస్తు శాఖ తవ్వకాలలో బయటపడిన కళాకృతులని భగవాన్‌ మహావీర్‌ మ్యూజియంలో చాల వరకు భద్రపరిచినారు. మన హిందూ మతంకు సంభందించిన ఏనుగు ఆకారంలో కనిపించే వినాయక విగ్రహం ప్రత్యేక ఆకర్షణ. జడలా అల్లుకున్న జుట్టుతో హనుమంతుని విగ్రహం, శివుని తలపై నుంచి కాకుండా పక్క నుండి పారుతున్న గంగతో శివుని విగ్రహం మాహిమాన్వతమైన కొన్ని అరుదైన విగ్రహలు మరియు కళాకృతులు ఈ మ్యూజియంలో చూడవచ్చు.
.
భారత దేశంలోని జైన మతం అభివృద్ధి చెందుతున్న సమయంలోని ప్రాచీన కాలానికి చెందినవి. క్రీస్తు శకం ఐదవ శతాబ్దం నుంచి 18వ శతాబ్దం వరకూ పట్టణాలుగా వర్థిల్లిన నందలూరు, గుండ్లూరు, తిమ్మాయపాలెం, అత్తిరాల, మంతమ పంపల్లీ, పోలి, కొలత్తుర్‌, పెన్నానది పరవాహ ప్రాంతాలు, కమలాపురం, ఎఱ్ఱగుడిపాడు, ఉప్పరపల్లి తదితర మరెన్నో ప్రాంతాల నుంచి శిలా శాసనాలు, పురాతనమైన మాహిమాన్వితమై హిందూ దేవతల విగ్రహాలు, తెలుగు లిపికి సంభందించిన అనావాళ్ళ, పురాతన నాణ్యలు, పనిముట్లు, రాజులు వాడిన కత్తులు, ఖడ్గలు, కిరీటాలు, అభరాణాలు, ఫిరంగులు, అలానాడు వాడిన పురాతన వస్తువులు, అలాగే మెుదటి తెలుగు శాసనాలు, ఆలయ శాసనాలు, పురాతన లిపీలు మరేన్నో సేకరించిన వస్తువులను ఈ మ్యూజియంలో చూడవచ్చును.
.
సేకరణ…
మీ..
ఆర్.బి. వెంకటరెడ్డి
భారతీయ సనాతన హిందూ ధర్మ సంరక్షణ సమితి
reddemb@gmail.com
https://www.facebook.com/rb.venkatareddy
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List