ఇంద్రావతి నది పక్కన మహిమాన్వితమైన "శ్రీ వినాయకుడు" ~ దైవదర్శనం

ఇంద్రావతి నది పక్కన మహిమాన్వితమైన "శ్రీ వినాయకుడు"

* ప్రపంచంలోనే ఎత్తెన ప్రదేశంలో కొలువు తీరిన వినాయకుడు ... 
* ప్రతినిత్యం మునులు, రుషులు వినాయకుడికి పూజలు ....
* కొండపైన వినాయకుడి విగ్రహ ప్రతిష్ఠ చేసిన నాగవంశస్థులు ....
.
.
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం, దంతెవాడ జిల్లా, భైలడిల్లా అడవుల్లో ఢోల్‌కాల్ గుట్టలపై కొలువు తీరిన ఈ వినాయకుడిని చేరుకోవడం చాలా కష్టం. నిటారుగా ఉండే కొండలు, వాటిని ఎక్కిన తర్వాత వచ్చే జలపాతాలు, అవికూడా దాటి ముందుకు వెళ్తే వచ్చే మరో కొండ, ఆ కొండ చిట్టచివరి ప్రాంతంలో కొలువు తీరిన ఈ వినాయకుడిని రోడ్డు మార్గం నుంచి దాదాపు 16 కి.మీలు గుట్టలపై ప్రయాణిస్తే కాని చేరుకోలేం.
.
ఛత్తీస్‌గఢ్‌లోని ఇంద్రావతి నది పక్కన ఉన్న ఢోల్‌కాల్ కొండలపై కొలువుతీరిన వినాయకుడు ప్రపంచంలోనే ఎత్తెన ప్రదేశంలో కొలువు తీరిన వినాయకుడని ఛత్తీస్‌గఢ్ వాసుల నమ్మకం. సాక్షాత్తు మునులు, రుషులు, ఈ వినాయకుడిని పూజించారని ఇక్కడి ఆదివాసీల విశ్వాసం. సముద్రమట్టానికి 13000 అడుగుల ఎత్తు నిటారుగా వుండే ఈ కొండలపైకి మామూలుగా చేరుకోవడమే కష్టం ఇంత పెద్ద వినాయకుడు ఎలా చేరాడనేది ఈ ప్రాంతవాసులకు ఇప్పటికీ ఆశ్చర్యమే, ఈ గణేష్ అసలు ఇక్కడ ఎలా వెలిశాడు? ఎవరైనా చెక్కారా? తీసుకొచ్చి ప్రతిష్ఠించారా? అన్నది నేటికీ అంతుపట్టని రహస్యం. అసలు అక్కడికి వెళ్లడమే కష్టం.
.
దాదాపు కొన్ని వందల కిలోల బరువుండే ఈ విగ్రహం అక్కడికి ఎలా చేరింది? చెక్కడం కూడా సాధ్యం కాని ఈ ప్రదేశంలో ఎలా ఉందనేది పెద్ద మిస్టరీ. ఆజ్ఞాత వాసంలో వున్నప్పుడు అన్నమదేవుడు లేదా అతని వారసులు తమకు విజయం సిద్దింపజేయమని పూజించేందుకు ఇటువంటి విగ్రహ ప్రతిష్టకానీ చేసి పనులు ప్రారంభించి వుండరు కదా అనేది ఒక అనుమానం. దాదాపు వేల సంవత్సరాల కిందట నాగవంశస్థులు ఈ ప్రాంతంలో ఈ విగ్రహ ప్రతిష్ఠ చేసి ఉంటారని ఇక్కడ నివసించే ప్రజల మరోక విశ్వాసం.

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List