పరశురామేశ్వర ఆలయం. ~ దైవదర్శనం

పరశురామేశ్వర ఆలయం.

No photo description available.

.
ఒరిస్సా రాష్ట్ర ముఖ్య పట్టణమైన భువనేశ్వర్ నందు గల విశిష్ట ఆలయం. ఈ ఆలయం క్రీ.శ 7 మరియు 8 ల మధ్య కాలంలోని సాయిలోద్భవ కాలానికి చెందిన ప్రసిద్ధి చెందిన హిందూ దేవాలయం. ఈ దేవాలయ ప్రధాన దైవము శివుడు. ఈ దేవాలయం ఒరిస్సాలోని ప్రాచీన దేవాలయాలలో ఒకటి. ఈ దేవాలయం క్రీ.శ 670 లలో నగర శైలిలో నిర్మితమైనదని నమ్మకం. ఈ దేవాలయం 10 వ శతాబ్దానికి పూర్వం ఉన్న ఒరిస్సా దేవాలయాలకు గల ముఖ్య లక్షణాలు కలిగి యున్నది. ఈ దేవాలయం భువనేశ్వర్ లోని ప్రాచీన దేవాలయాలలోని పరశురామేశ్వర దేవాలయాల వర్గానికి చెందిన ఒక దేవాలయంగా ప్రసిద్ధి పొందింది.
పరశురామేశ్వర దేవాలయం లో "విమానం" , "గర్భగుడి" మరియు "బాడ" ఉన్నవి.దాని పైకప్పు మీద వక్రరేఖలు గల శిఖరం ఉన్నది. ఈ శిఖరం 40.25 ft (12.27 m) ఎత్తు కలిగి ఉన్నది. ప్రాచీన దేవాలయాలలో ఒకేఒక విమానం కలిగి ఉన్న దేవాలయాలకన్న "జగన్మోహన" అనే అదనపు నిర్మాణము కలిగిన మొదటి దేవాలయం. ఈ దేవాలయం శివునికి అంకితం చేయబడినప్పటికీ,ఇది సక్తా దేవాలయాల లో భాగమైన సక్తా దేవతల శిల్పాలను కలిగి ఉన్నది. ఈ దేవాలయం భువనేశ్వర్ లో సప్తమాత్రికలైన చాముండ, వరాహి, ఇంద్రాణి, వైష్ణవి, కౌమారి, శివాని మరియు బ్రహ్మి చిత్రాలను కలిగి ఉన్న మొదటి దేవాలయం. ఈ దేవాలయం ప్రస్తుతం భారతదేశం యొక్క పురాతత్వ సర్వే ద్వారా నిర్వహింపబడుతున్నది. ప్రతి సంవత్సరం జూన్ మరియు జూలై నెలలలో పరాశురాష్ఠమి అనే ప్రధాన పండుగను ఈ దేవాలయంలో జరుపుతుంటారు.

పరశురామేశ్వర దేవాలయం భువనేశ్వర్ నందు గల ప్రాచీన దేవాలయాలలో ఒకటి. ఈ దేవాలయం భువనేశ్వర్ నందు గల ప్రాచీన దేవాలయాలలోని పరశురామ దేవాలయాల వర్గంలో ఒకటి.
పరమేశ్వర దేవాలయం గర్భగుడి కలిగి ఉన్న ప్రాచీన దేవాలయాలలో కన్న జగన్మోహన (భక్త మందిరం) అనే అదనపు నిర్మాణం కలిగిన మొదటి దేవాలయం. ఆలయ శిల్పాలలో ముఖ్యంగా వివిధరకాల ఫలాలు, పూలు, పక్షులు మరియు జంతువులు వంటి నమూనాల దృశ్యాలు వివిధ ప్రాంతాల్లో చిత్రీకరించబడినవి. అనేక దేవాలయాలలో ఒకటైన వైతాల్ ద్యూలా దేవాలయ శిల్పాలలో వలెనే పక్షుల తోక వెనుక భాగంలో పూల దిజైన్లు ఉన్నాయి. ముక్తేశ్వర దేవాలయం వలెనే జాడీ మరియు పూలతో కూడిన కళాకృతులు కలిగి యున్నది.
చరిత్రకారుల ప్రకారం, ఈ దేవాలయం 8 శతాబ్ద మొదట్లో నిర్మించినట్లు తెలియుచున్నది. ఇదే విధమైన దేవాలయాలైన శత్రుఘ్నేశ్వర్, భారతేశ్వర్ అంరియు లక్ష్మణేశ్వర్ దేవాలయాలు 7వ శతాబ్ద చివరిలో కట్టినట్లు తెలియుచున్నది. కానీ ప్రముఖ చరిత్రకారుడు "కె.సి.పాణిగ్రాహి" ఈ దేవాలయం క్రీ.శ 650 నిర్మితమైనట్లు తెలియజేశారు. "ఫెర్గుసన్" అనే చరిత్రకారుని ప్రకారం ఈ దేవాలయం క్రీ.శ 500 లో నిర్మితమైనట్లు తెలియుచున్నది. అనేక మంది పండితులు ఈ దేవాలయ నిర్మాణం మరియు అంతర గర్భాలయంలో ఎనిమిది గ్రహాలను ఒక తలుపుపై చిత్రించుటను బట్టి దీని కాలాన్ని ఏడవ శతాబ్ద మధ్య కాలానిదిగా అంగీకరించారు. ఎందుకంటే తర్వాత కాలంలోని దేవాలయాలలో తొమ్మిది గ్రహాలు ఉన్నట్లు చిత్రీకరణలున్నవి.
ఈ దేవాలయాన్ని "శివుడు" కులదైవంగా భావించిన "శైలోద్భవులు" నిర్మించిరారు. ఈ శైలోద్భవులు వివిధ దేవతల యొక్క శక్త ను గౌరవిస్తారు మరియు దేవాలయ గోడలపై శక్త చిత్రాలను చిత్రీకరించారు. ఈ దేవాలయం 1903 లో బాగుచేయబడినది. ఈ కాలంలో అంతర గర్భాలయం లోని పైకప్పును అసలు నిర్మాణ శైలిలో నిర్మించారు. తూర్పుతీర లో నెలకొన్నటువంటి ఈ దేవాలయం ఒరిస్సాలోని ఇతర దేవాలయాల కంటే 12-13 శతాబ్దాలలో జరిగిన ముస్లిం దండయాత్రల దాడికి గురికాలేదు. ప్రస్తుత కాలంలో ఈ దేవాలయం భారతదేశం యొక్క పురాతత్వ సర్వే వారిచే నిర్వహింపబడుతున్నది.

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List