అనంత చరితల సారం లేపాక్షి కూర్మశైలం. ~ దైవదర్శనం

అనంత చరితల సారం లేపాక్షి కూర్మశైలం.


భారతదేశంలో లభించే బంగారంలో హెచ్చుభాగం అనంతపురం జిల్లాలో లభిస్తుందని ప్రతీతి. సముద్ర సరిహద్దులేని జిల్లా ఇది. ఈ జిల్లాలో అనేక పర్యాటక ప్రదేశాలున్నాయి.
లేపాక్షి:- హిందూపురానికి 15 కి.మీ దూరంలో నెలకొని ఉన్న శైవక్షేత్రం లేపాక్షి కూర్మశైలం అనే కొండపై ఈ దేవళం నిర్మితమైంది. లేపాక్షి పేరు చెప్పగానే ఏకశిలతో నిర్మితమైన బసవయ్య కనులముందు సాక్షాత్కరిస్తాడు. అతి పెద్ద నంది విగ్రహం తప్పక చూడవలసింది. లేపాక్షి గ్రామంలో వీరభద్రుడి ఆలయం జగద్విఖ్యాతి గాంచింది. విజయనగర సామ్రాజ్య శిల్పకళా వైభవానికి ఇది మచ్చుతునక.
పెన్న అహోబిలం:- ఉరవ కొండకు 12 కి.మీ దూరంలో నెకొని ఉన్న ఈ వైష్ణవ క్షేత్రానికి రోడ్డు రవాణా వసతులున్నాయి. శ్రీలక్ష్మీ నరసింహాలయం ఈ క్షేత్రంలోని దర్శనీయస్థలం. ఇది నరసింహాస్వామి పాదముద్రలపై నిర్మితమైందని పురాణాలు చెబుతున్నాయి. సమీపాన పెన్నా జలపాతం చూడదగింది.
హేమవతి:- అనంతపురానికి 140 కి.మీ దూరాన హేమవతి గ్రామంలో సిద్దేశ్వరస్వామి ఆలయం నిర్మించారు. ఇక్కడి ఆలయాన్ని పల్లవరాజులు నిర్మించారు. ఇక్కడ ఒకే ప్రాంగణంలో రెండు విశాలయాలు ఉండటం విశేషం.
పెనుగొండ:- అనంతపురం నుండి 70 కి.మీ దూరంలో బెంగళూరుకు వెళ్ళే రహదారిలో పెనుగొండ నెలకొని ఉంది. తొలినాళ్ళలో విజయ నగర సామ్రానికి రాజ ధానిగా విరాజిల్లింది. విజయ నగర ప్రభువులు పెనుగొండ లోని కోటను వేసవి విడిదిగా ఉపయోగించే వారు. అందమైన ప్రకృతి ఒడిలోని కుంభకర్ణుని తోట సందర్శించగింది. ఇక్కడ 142 అడుగుల పొడవూ 32 అడుగుల ఎత్తు కలిగిన కుంభకర్ణుడు ఆదమరచి నిద్రిస్తున్న భింగిమను చూసితీరాలి.
పుట్టపర్తి:- అనంతపురంకు 75 కి.మీ. దూరంలో పుట్టపర్తి క్షేత్రం ఉంది. భగవానే శ్రీ సత్యసాయిబాబా ధార్మిక సామాజిక కార్యకలాపాలకు కేంద్రమైన ప్రశాంతి నిలయం ప్రపంచ వ్యాప్తంగా భక్తులను పర్యాటకులను ఆకర్షిస్తుంది. సనాతన ధర్మాన్ని సత్సంకల్పంతో ఆచరిస్తూనే ఆధునిక విజ్ఞాన ప్రయోజనాల్ని మానవాళి పొందాలన్నదే సత్యసాయి సంస్థల మహాదా శయం. తిమ్మమ్మ మర్రిమాను:- అనంతపురం 130 కి.మీ దూరంలోని గూటి బయలు గ్రామం వద్ద గిన్నీస్‌బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రాకర్డ్సులో చోటు చేసుకున్న ఒక అద్భుత మర్రిచెట్టు ఇక్కడ నెలకొని ఉంది. 550 సంవత్సరాల నాటి ఈ మర్రిచెట్టు 5.6 ఎకరాల మేరకు విస్తరిం చిన బృహత్తర దృశ్యం సందర్శకుల్ని అలరిస్తుంది.
ధర్మవరం:- ఇది అనంతపురానికి 47 కి.మీ. దూరంలో ఉంది. ధర్మవరం పట్టు చీరలకు ప్రసిద్ధిగాంచింది. ఈ గ్రామంలో శ్రీలక్ష్మీ చెన్నకేశ్వర ఆలయం నిర్మాణ శైలిలోనూ, శిల్పకళా వైవిధ్యంలోనూ ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలోని స్తంభాల్ని మెల్లగా కొడితే సప్తస్వరాలు వెలువడతాయి. ధర్మవరం పట్టు చీరలకేకాదు నూలు చీరలకు సైతం ప్రసిద్ధి చెందినది. ఇక్కడ చేనేత పరిత్రమ ప్రధానమైంది. ఇక్కడి పట్టుచీరలు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యాన్ని పొందాయి.
గుత్తికోట:- ఇది అనంతపురానికి 52 కి.మీ దూరంలో కర్నూలు-బెగళూరు జాతీయ రహదారిలో ఉంది. ఒక పెద్దగుట్టపై 300 కి.మీ ఎత్తున నిర్మితమైన గుత్తికోట విజయనగర సామ్రాజ్య వైభవాన్ని మౌనంగా చాటుతుంది.
రాయదుర్గం కోట:- అనంతపురం నుండి 130 కి.మీ దూరంలో రాయదుర్గం నెలకొని ఉంది. విజయనగర రాజులు తమ సామ్రాజ్య పరిరక్షణకోసం అలనాడు నిర్మించిన సిధకోట రాయదుర్గంలో ఉంది. ఇక్కడి ఆలయాలు చారిత్రక ప్రాధాన్యాన్ని, ధారిక విశిష్టతను చాటిచెబుతున్నాయి.
ఆలూరు:- ఇది అనంతపురం నుండి 65 కి.మీ. దూరంలో ఉంది. దట్టమైన తోపులు, ఎతైన కొండలు, జలపాతాలు ఈ ప్రాంతాన్ని అందమైన విహార కేంద్రంగా రూపొందించాయి. ఇక్కడి రంగనాధస్వామి దేవళం దర్శనీయం. ప్రతి ఏడాది మార్చి -ఏప్రిల్‌ మాసాల్లో ఇక్కడ రథోల్సవానికి పర్యాటకులు, భక్తులు వేలాదిగా తరలివస్తారు.
అనంతపురం:- బుక్కరాయల భార్య అనంతమ్మపేర పుట్టిన పట్టణం కావడంతో దీనికి అనంతపురం అనే సార్థక నామమేర్పడింది. ఇక్కడ ఆయిల్‌ టెక్నాలజీకి ప్రత్యేక శిక్షణాలయమున్నది.
వజ్రకరూరు:- ఇది ఉరవకొండ సమీపాన ఉంది. అతి ప్రాచీన కాలంనుండి వజ్రకరూరులో వజ్రాల ఉత్పత్తి మంచి స్థానం ఉంది. భూగర్భం నుండి వజ్రాలను తీయడం చాలా కష్టమైనవి. అలా వెలికి తీసిన వజ్రాలను సైజులవారీ కోయించడం నునుపుగా సానబెట్టడం దాని కారెట్టు నిర్ణయించడం ఇత్యాది ముఖ్యమైన పనులన్నీ వజ్రకరూరులో జరుగుతాయి. ఇక్కడి వజ్రాల వ్యాపారం వల్ల ఎంతో విదేశీ మారకద్రవ్యం మనకు లభిస్తుంది.

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List