అబ్బక్క మహారాణి వెలుగు చూడని వీరనారి “అభయ రాణి” ~ దైవదర్శనం

అబ్బక్క మహారాణి వెలుగు చూడని వీరనారి “అభయ రాణి”


16వ శతాబ్దంలో విదేశీయులపై అలుపెరగని పోరాటం చేసి వాళ్లను చీల్చి చెండాడిన వీర నారి అబ్బక్క రాణి. అయితే ఆమె వీరోచిత చరిత్ర గురించి మన వాళ్ళుగాక ఒక విదేశీ యుడు చెప్పడం గమనార్హం.విజయనగర సామ్రాజ్యం గురించి రాబర్ట్‌ సేవెల్‌ రాసిన ‘ఫర్గాటెన్‌ ఎంపైర్‌’ పుస ్తకం ద్వారా మనకు చారిత్రక వాస్తవాలు ఎన్నో తెలిశాయి. ఆ పుస్తకం రాయడానికి ఆయ నకు విదేశీ యాత్రికులు ఆ సామ్రా జ్యాన్ని సందర్శించిన ‘డొమింగో పైస్‌’ , ‘ఫెర్నో నూనిజ్‌’ రాత ప్ర తులే ఆధారమయ్యాయి. ఆ తరువాత మన వాళ్లు ఎన్నో పరిశోధనలు చేసి కొత్త విష యాలు కనుక్కున్నారు. కానీ ఆ సామ్రాజ్యం గురించి ప్రపంచానికి మొదట తెలియ జేసింది మాత్రం సేవెల్‌.
తుళునాడు ప్రాంతంలో విదేశీయులను గడ గడ లాడించిన వీర వనిత అయిన అబ్బక్క రా ణి గురించి ఆ ప్రాంతంలో ఇప్పటికీ జానప దులు కథలు కథలుగా చెప్పుకుంటారు. అయితే ఆమెను ప్రత్యక్షంగా చూసి ఆమె ఆతిధ్యం స్వీకరించి, ఆమె సాహసం ఎలాంటి దో తెలుసుకున్న ఇటలీ యాత్రికుడు పిట్రో డెల్లా వల్లే. ఆయన భారత దేశంలో 1621- 24 మధ్యన పర్యటించాడు. తన యాత్రా వి శేషాలలో ప్రత్యేకించి అబ్బక్క రాణి గురించి ఎన్నో విషయాలను వెల్లడించాడు.
పిట్రో భారత దేశం రావడానికి ముందు పర్షి యా చక్రవర్తి షా అబ్బాస్‌ను సందర్శించాడు. ఆయన ఆతిధ్యం స్వీకరించాడు. అప్పుడు త్వరలో భారత దేశం వెడుతున్నట్టు పిట్రో చెప్పాడు. అలా వెడితే నువ్వు తప్పకుండా ఉల్లాల్‌ రాజ్యాన్ని పరిపాలిస్తున్న అబ్బక్క రాణ ిని కలుసుకో. ఆమె సాహసాల గురించి చాలా విన్నాం. ఆమెను చూడాలనిపిస్తోంది. మాకా అవకాశం లేదు. నువ్వు స్వయంగా ఆమెను కలిసి మాట్లాడు అని అబ్బాస్‌ చెప్పినట్టు పిట్రో రికార్డు చేశాడు.
దీనికి ముందు భారత దేశ స్థితి గురించి తెలు సుకుందాం. 1336లో ప్రారంభమైన విజయ నగర సామ్రాజ్యం 1565లో జరిగిన తళ్లికోట యుద్దంలో చెల్లా చెదరై పోయింది. ఆ పాలకు లు రాజధాని హంపీ నగరం వదిలి పెనుగొం డకు తరలిపోయారు. అఖండ సామ్రాజ్యం గా వెలిగిన విజయనగరం విచ్ఛిన్నం కావడం తో సామంత రాజులు స్వతంత్ర రాజులైపో యారు. చిన్న రాజ్యాలు బల పడసాగాయి. చిన్న రాజ్యాలను ఒక త్రాటి మీదకు తీసుక వచ్చి తుళునాడు కేంద్రంగా బలమైన నాయ కుడుగా ఎదుగుతున్నాడు కేలాడిని పాలిస్తున్న వెంకటప్ప నాయకుడు. విజయ నగర రాజులకు మంగుళూరు, భత్క ల్‌, హోనవర్‌ మొదలైన ఓడరేవులు చాలా ప్రసిద్ధి చెందాయి. ఈ ఓడరేవుల ద్వారా అరే బియా, పర్షియా దేశాల నుంచి గుర్రాలను దిగుమతి చేసుకొనేవారు. మన వస్తువులను ఎగుమతి చేస్తుండేవారు.
1498 మే 17వ తేదిన పోర్చుగీస్‌ యాత్రికుడు వాస్కోడగామ కాలి కట్‌ ఓడ రేవు ద్వారా భారత దేశంలోకి ప్రవే శించాడు. ఆయన తిరిగి వెడుతూ భారత్‌ నుంచి కొన్ని సరుకులు తీసుకెళ్లి వారి దేశం లో అధిక ధరలకు విక్రయించి బాగా డబ్బు చేసుకున్నాడు. దీనితో పోర్చుగీస్‌ వారి దృష్టి మన దేశం మీద పడింది.
1503వ సంవత్సరంలో అల్ఫొన్సో డే అల్బు కర్క్‌ భారత దేశం వచ్చారు. గోవాను వారి స్ధావరంగా చేసుకున్నారు.1509వ సంవత్స రంలో ఆయన గోవా గవర్నరుగా నియమి తులయ్యారు.
అదే సంవత్సరం విజయ నగర సామ్రాజ్యానికి చక్రవర్తిగా శ్రీకృష్ణదేవరయలు సింహాసనాన్ని అధిరోహించాడు. గోవా అప్పుడు బీజాపూర్‌ సుల్తాన్‌ ఆదిల్‌ షా పరిపా లనలో ఉంది. దీనిపై ఆధిపత్యం సాధించ డా నికి 1510వ సంవత్సరంలో సుల్తాన్‌పై అల్ఫొ న్సో యుద్దం ప్రకటించాడు. అయితే ఆ యు ద్ధంలో పోర్చుగీస్‌ వారు పరాజయం పాల య్యారు. ఫిబ్రవరి 17న అల్ఫొన్సో గోవా వదిలి పారిపోయాడు.
తరువాత బీజాపూర్‌ సుల్తాన్‌ మరణించాడు. పసివాడైన అతని కుమారుడు ఇస్మాయిల్‌ ఆదిల్‌ షారాజు అయ్యాడు. ఇదే సరైన అదు నుగా భావించిన అల్ఫొన్సో స్ధానిక హిందూ నాయకుడు తిమోజ సహాయంతో గోవాను స్వాధీనం చేసుకున్నాడు. అక్కడ నుంచి భారత దేశంలో పోర్చుగీస్‌ వారికి గోవా ము ఖ్యమైన ఓడ రేవు పట్టణమైంది. అప్పుడు దేశంలో సాంఘిక దురాచారం సతీ సహగ మనం ఎక్కు వగా ఉంది. మహిళలు ఇలా అగ్నికి ఆహుతి కావడం అమానుషమని దీని ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు అల్ఫొన్సో. అయితే అది అమలు కాలేదు.
పోర్చు గీస్‌ వారు గోవాలో కోట కట్టుకోవడా నికి కృష్ణదేవరాయలు అనుమతిచ్చారు. అం దుకు ప్రతిఫలంగా యుద్ధ గుర్రాలను సరఫ రా చేయడానికి వారు అంగీకరించారు. భార త దేశంలో పోర్చుగీస్‌ వారు ముస్లిమ్‌ పాలకు లను శత్రువులుగా హిందూ రాజులను మిత్రు లుగా చూశారు. వీరు స్ధిరపడటానికి, వారి వ్యాపారాన్ని విసృ్తతం చేసుకోవడానికి ప్రధాన కారకులు విజయనగర రాజులే.
పోర్చుగీస్‌, స్పెయిన్‌ ప్రపంచాన్ని శాసిస్తున్న రోజులవి. అన్నిచోట్లా వారి గుత్తాధిపత్యం సాగిపోతోంది.
మొదటి నుంచి అరబ్‌ దేశాలు భారత దేశంలోని అనేక రాజ్యాలతో వర్తక సంబంధాలు కలిగి ఉన్నాయి. అరబ్‌ దేశాల ను దెబ్బ కొట్టడానికి స్పెయిన్‌, పోర్చుగీస్‌ దేశా లు చేతులు కలిపాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఉల్లాల్‌ మహారాణి అయిన అబ్బక్క పోర్చు గీస్‌ వారిని చిత్తుగా ఓడించింది. ఒకసారి కా దు రెండు సార్లు కాదు అనేక పర్యాయాలు ఉల్లాల్‌ రేవును స్వంతం చేసుకోవాలని చూసి నప్పుడల్లా అబ్బక్క వారి సైన్యాలను చావుదెెబ్బ తీసింది. అందుకే అటు అరబ్‌ ఇటు పర్షియా దేశాలలో అబ్బక్క పేరు మారుమ్రోగిపోయిం ది. అంతటి తెగువ, సాహసం ఉన్న వీరనారి అబ్బక్క మాత్రమేనని వారి విశ్వసించారు.
తుళునాడును పరిపాలించిన చౌత సామ్రాజ్య వారసురాలు అబ్బక్క. చిన్నప్పుడే ఆమెలోని ప్రతిభను చూసి తండ్రి ప్రోత్సహించాడు. మేనమామ తిరుమల రాయలు శిష్యరికంలో విలువిద్య, కర్రసాము, కత్తివిద్యలో ఆరితేరి పోయింది. గుర్రాన్ని అధిరోహించి యుద్ధం చేస్తుంటే చూడటానికి రెండు కళ్లు సరిపోయే వి కావట. రాజకీయ ఎత్తులకు పై ఎత్తులు వేయడం చిన్న వయసులోనే నేర్చుకుంది.సంప్రదాయం ప్రకారం ఉల్లాల్‌ రాజ్యానికి మహారాణి అయ్యారు. ఆ తరువాత కొన్నాళ్లకే సమీపంలోని వంగ రాకుమారుడు లక్కప్ప అరసతో ఆమె వివాహం జరిగింది. లక్కప్ప అరస పోర్చుగ్రీసు వారికి అనుకూలంగా ఉం డేవాడు. వారిచ్చే ఖరీదైైన బహుమతులు స్వీ రిస్తూ, వారితో పాటు విందు వినోదాలలో ము నిగిపోతుండేవాడు. తమ రైతులు పండించి న పంటలను అతి తక్కువ ధరలకు కొని ఎక్కువ ధరలకు విదేశాలలో అమ్ముతూ ఉం డటం, తమ ఓడ రేవులను స్వాధీనం చేసు కుంటున్నారన్న అభిప్రాయంతో ఉన్న అబ్బక్క కు భర్త ప్రవర్తన నచ్చలేదు.
ప్రజలను దోచుకుంటున్న పోర్చుగీస్‌ ముష్క రులను మట్టు పెట్టాలే తప్ప మర్యాదలు చెయ్యకూడదని చెప్పింది. ఈ విషయంలో ఇద్దరికీ ఘర్షణ జరిగింది. అబ్బక్క తన పిల్లల ను తీసుకొని తిరిగి ఉల్లాల్‌కు వచ్చేసింది. లక్కప్ప అరస, మూలరాజు కుమార్తె తంకరా దేవిని వివాహం చేసుకున్నాడు. అబ్బక్కపై ప్రతీకారంతీర్చుకోవాలనుకున్నాడు. అందుకు పోర్చుగీస్‌వారి సహాయం కోరాడు. వారు కూడా ఇలాంటి అవకాశం కోసమే చూస్తున్నారు.
అబ్బక్క కేలాడి, కాలికట్‌ రాజ్యాలతో సత్సం బంధాలు పెట్టుకుంది. వారి ప్రోత్సాహంతో మధ్య తూర్పు దేశాలకు సరుకులను తమ ఓడ రేవు ద్వారా స్వయంగా ఎగుమతి చేసిం ది. అవకాశం కోసం చూస్తున్న పోర్చుగీస్‌ వారు సముద్రం మధ్యలో నౌకలను పట్టుకు న్నారు. ఇది తెలుసుకున్న అబ్బక్క ఉగ్రురాలై మంగుళూరులో ఉన్న పోర్చుగీస్‌ ఫ్యాక్టరీని ధ్వంసం చేసింది. అడ్డం వచ్చిన సైనికులను నిర్దాక్షిణ్యంగా హతమార్చింది.
పోర్చుగీస్‌ వారు ఉల్లాల్‌ ఓడ రేవును స్వాధీ నం చేసుకొని ఆపైన కోట ముట్టడించడానికి తగిన ప్రణాళిక రచించారు. దీనికి అబ్బక్క మాజీ భర్త లక్కప్ప అరస కూడా తోడయ్యాడు. అదే సమయంలో అబ్బక్కకు సహకారా న్ని అందించే కేలాడి రాజు వెంకటప్ప నాయ కుడు1618వ సంవత్సరంలో వంగ రాజ్యన్ని జయించి మంగుళూరు వైపు వస్తున్నాడు. ఉల్లాల్‌ను ముట్టడించడానికి ఇదే సరైన సమ యమని పోర్చుగీస్‌ వారు భావించారు. ముం దుగా యుద్ధ నౌకలలో సైన్యాన్ని ఉల్లాల్‌ ఓడ రేవులో మోహరించారు.
అమావాస్య రాత్రి. కన్ను పొడుచుకున్నా కనిపించని ఆ కాళరాత్రిలో ఆత్మత్యాగానికి సిద్ధ పడే జాలర్లకు, గజ ఈతగాళ్లకు అబ్బక్క కర్తవ్యాన్ని ఉధ్బోదించింది. ఆమె ఆదేశానుసా రం నాటు పడవల్లో సముద్రంలోకి వెళ్లి, పోర్చుగీస్‌ వారు మోహరించిన ప్రాంతానికి నాలుగు వైపుల నుంచి ముట్టడించారు.
పోర్చుగీస్‌ యుద్ధ నౌకలపై మండుతున్న ఎండు కొబ్బరి కాయలను ఒక్కసారిగా నాలు గు వైపుల నుంచి విసిరి వేశారు. మండుతు న్న కొబ్బరి కాయలు వచ్చి పడుతుంటే పోర్చు గీస్‌ సైనికులు ప్రాణ భయంతో చావు కేకలు పెట్టారు. ఈ లోగా మంటలు యుద్ద నౌకలకు అంటుకున్నాయి. మంటల్లో చిక్కు కొన్న సైని కులు హాహా కారాలు చేస్తూ ప్రాణాలను రక్షిం చుకోవడానికి నీళ్లలోకి దూకి ఈదుకుం టూ ఒడ్డుకు చేరారు. అదను కోసం చూస్తున్న అబ్బక్క సైనికులు వచ్చిన వాడిని వచ్చినట్టు హతమార్చారు. అలా 200 మంది సైనికులు మరణించినట్టు రికార్డుల వల్ల తెలుస్తోంది.
ఇలాంటి సాహసవంతురాలైన వీరవనితను తలుచుకుంటూ పిట్రో మంగుళూరుకు వచ్చి అక్కడ నుంచి ఉల్లాల్‌కు ప్రయాణమయ్యా డు. అతనికి దారి చూపించడానికి స్ధానిక భాషను తర్జుమా చేసి చెప్పడానికి ఒక అనువాదకుని కూడా వెంట తెచ్చుకున్నాడు. వారు ఉల్లాల్‌కు చేరుకునేసరికి రాణి మనేల్‌ అనే గ్రామానికి వెళ్లిందని, అక్కడ వ్యవసా యానికి కావలసిన నీటిని కాలువల ద్వారా మళ్లించడానికి ఏర్పా ట్లు జరుగుతుంటే వాటిని పర్యవేక్షించడా నికి వెళ్లారని కోటలోని వారు తెలిపారు. అప్పటికే ఆమె అక్కడ నుంచి తిరిగి వస్తున్నారు.
ఆమె చుట్టూ 10 మంది వరకు సాయుధులైన సైని కులు తుపాకులతో రక్షణగా ఉన్నారు. స్ధానికులు ఆమెకు నమస్కరిస్తుంటే ఆమె అభివాదం చేస్తూ ముందుకు కదు లుతున్నారు. చామనఛాయ, మామూలు ఎత్తు. కాటన్‌ చీర ధరించింది. మరొక చీర తలపై నుంచి భుజాల వరకు కప్పు కుంది. చెప్పుల్లేకుండా నడుస్తుంటే ఆమెకు ఎండ తగలకుండా వ్యక్షిగత సహా యకుడు తాటి ఆకుల గొడుగు పట్టాడు. ఆ గుంపుతో పాటు పిట్రో కూడా నడు స్తూ ఆమెను ఆశ్చర్యంగా చూస్తున్నాడు.
ఒక గృహిణి లాగా ఉందే తప్ప ఒక రాజ్యానికి రాణిలా అనిపించలేదు. అంత సాధారణంగా ఉంది. అప్పుడు పిట్రో వెళ్లి తనను తాను పరిచయం చేసుకున్నాడు. అత ని భాష తెలిసిన వారు ఎ వరైనా ఉన్నారా? అని అబ్బక్క రాణి జనం వై పు చూసింది. అ ప్పుడు అనువాదకుడు ముం దుకొచ్చాడు. ముందుగా తాను పోర్చుగీస్‌ వాడిని కాదని ఇటలీ నుంచి వచ్చానని చెప్పాడు. తాను పర్షి యన్‌ చక్రవర్తి, మొఘల్‌ చక్రవర్తి మొదలైన వారిని సందర్శించి వచ్చా నని చెప్పాడు.అప్పుడు అబ్బక్క అంత మంది గొప్ప చక్రవర్తు లను సందర్శించిన మీరు నన్ను చూడటానికి రావడం ఆశ్చర్యంగా ఉందే? అని అడిగింది.
మీరు మా దేశాలలో చాలా ప్రసిద్ధి. మీ సా హసం, మీ తెగువు, పోర్చుగీస్‌ వారితో రాజీ లేని మీ పోరాట పటిమ కథలుగా చెప్పుకుం టున్నారు. అందుకే మిమ్మల్ని చూడటానికి ప్రత్యేకించి ఉల్లాల్‌కు వచ్చాను. మీరింత సా దాసీదా ఉంటారని మాత్రం నేను ఊహించ లేదు అని చెప్పాడు పిట్రో. ఆ తరువాత అత నికి కోటలో ఆతిధ్యం ఇచ్చి ఎంతో ఆప్యా యంగా చూసింది అబ్బక్క. దేశం కాని దేశం లో ఆమె చూపించిన అభిమానం, ఆదరణ తన తల్లిని జ్ఞప్తికి తీసుక వచ్చాయని, ఆమెను చూస్తుంటే ఒక దేవతను చూస్తున్నంత ఆరా ధనా భావం కలిగిందని పిట్రో తన యాత్రా విశేషాలలో పేర్కొన్నాడు.
పిట్రో భారత దేశం వదలి వెళ్లిన సంవత్సరా నికి 1625లో బీజాపూర్‌, అహ్మద్‌ నగర్‌, కా లికట్‌ వారితో కలసి అబ్బక్క రాణి, పోర్చు గీస్‌ వారిపై యుద్ధం ప్రకటించింది. అప్పటి వరకూ మంగుళూరు కోట పోర్చుగీస్‌ వారి ఆధీనంలో వుంది. ఆ కోటను ముందుగా నాశనం చేశా రు. పోర్చుగీస్‌ సేనలను చిత్తుగా ఓ డించారు. విజయంతో తిరిగి వస్తుండగా సేనలకు నాయ కత్వం వహించిన కుట్టి పోకర్‌ ను పోర్చుగీస్‌ సైనికులు దొంగ దెబ్బ తీసి చం పేశారు. ఎప్పు డైతే కుట్టి పోకర్‌ చనిపోయాడో సంకీర్ణ సేనలు చెల్లాచెదురయ్యాయి.
పోర్చుగీస్‌ సైనికులు మళ్ళీ విజృంభించి ఉలాలల్‌ రాజ్యాన్ని స్వాధీన పరుచుకున్నారు. అబ్బక్క రాణిని బందీగా పట్టుకుని కారాగారంలో వేశారు. నాలుగు దశాబ్ద్దాలుగా తమను ము ప్పతిప్పలు పెట్టిన అబ్బక్కను చిత్రహింసలు పె ట్టి చంపాలనుకున్నారు. అయితే ఆమె కారా గారంలో ఆడపులిలా విజృంభించి పోర్చు గీస్‌ సైనికులను చంపేసింది. నాలుగు వైపుల నుం చి సాయుధులైన సైనికులు ఒక్కసారిగా దాడి చేసి అతి క్రూరంగా చంపేశారు. ఇంతటి వీర నారి, అనితర సాధ్యమైన వ్యూహ కర్త, రాజనీ తిజ్ఞురాలు, పరిపాలనా దక్షురాలు, పోరాట యోధురాలు చరిత్రలో అరుదుగా కనిపిస్తారు. నిజానికి అబ్బక్క కేవలం ఉల్లాల్‌కే పరిమితమైన మహిళకాదు. భారతీయ మహిళా లోకానికే గర్వ కారణం.మాతృగడ్డ కోసం ఆమె చేసిన పోరాటం, ప్రజ ల కోసమే బ్రతికిన ఆమె జీవితం ఎప్పటికీ స్ఫూర్తిదాయకమే.



Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List