వైరాగ్యం అంటే.!! ~ దైవదర్శనం

వైరాగ్యం అంటే.!!

నువ్వు ఇప్పుడున్న పరిస్థితిలలో ఉంటే  మనసు వశము కాదు.
అభ్యాసము, వైరాగ్యము అనే పదాలు ఎందుకు చెప్పబడ్డాయి అంటే,
మనిషి తాను ఇప్పుడు ఎలా ఉన్నాడో,
దానికి తేడాగా కూడా ఉండగలడు.

అభ్యాసము అంటే.💐
మనల్ని వేరేగా తయారు చేసే పద్ధతి;
బాహ్య అంతర స్థితులలో పూర్తిగా పరివర్తన తీసుకురావడం,
మనలో ఏవైతే సంస్కారము లున్నాయో,
మనలో పేరుకుపోయినవి ఏమైతే ఉన్నాయో,
వాటిని ముక్కలు చేసి క్రొత్తదారి చూపించడం;
మీరు ఏ స్థితిలో ఉన్నారో,
ఆ స్థితి నుండి మిమ్మల్ని వేరే ఉన్నతస్థితికి తీసుకువెళ్లడం.
అబ్యాసము.. అంటే ధ్యానం.

అభ్యాసము ఒక్కటే చాలదా?
వైరాగ్యం ఎందుకు జోడింపబడింది అంటే,
వైరాగ్యం లేకుంటే మనము చేయవలసిన పనులను చేయము.
ఎందుకంటే "రాగము" అనేది పరుగులు తీసే వ్యవస్థ. రాగము లేకుండా ఎవరూ పరుగులు తీయరు.
ఏదైనా పొందాలి అనే కోరిక పరుగులు తీయిస్తుంది.
రాగం చంచలంగా ఉండడానికి ఆధారం అయితే,
వైరాగ్యం విశ్రమించడానికి ఆధారం.

వైరాగ్యం ఉంటేనే అభ్యాసముంటుంది.
వైరాగ్యం అంటే జీవితంలోని రాగం యెడల విముఖత.
ఏ ఆనందాన్ని మనం పోగొట్టుకున్నామో,
ఆ ఆనందాన్ని తిరిగి మనం ఎలా పొందాలి అనే ప్రశ్నని మనం వైరాగ్యం వైపు దృష్టిని సారించినపుడే వేసుకోగలం.

ఇల్లు వాకిలి వదిలేసి భాధ్యతలు వదిలేసి వెళ్లిపోతే వైరాగ్యం వస్తుందా ...
అందరికి దూరంగా వెళ్లిపోతే వెంటనే వస్తుందా ? మౌనంగా ఉంటే వైరాగ్యం వస్తుందా?
అసలు వైరాగ్యం అంటే ?
నిరాశ నిస్ప్రుహలో జీవించడమా ??

ఒకటా రెండా ఎన్నో ప్రశ్నలు అంతరంగం నుండి శరాలు సందిస్తూ ఉంటాయి ...

రామ కృష్ణా కధామృతంలో రామకృష్ణల వారు
సమాధానం..
వైరాగ్యం అంటే విషయ వాసనలు అందు ఆసక్తి లేకపోవడం.
నీవు బాధలు పడినప్పుడో..
కష్టాలలో కన్నీళ్లలో..
అయిన వారు దూరమయునపుడో..
వచ్చేది వైరాగ్యం కాదు ..
అది శాశ్వతమ్ కాదు ..
అది శ్మశాన వైరాగ్యం లా..ప్రసూతి వైరాగ్యంలా తాత్కాలికమే ...
కాలం మరపు ఆనే మందు పూసేస్తుంది ..

నువ్వు  'సమూహానికో సమాజానికో దూరంగా వెళ్ళి నేను అన్నింటిని న్యసించాను అంటే కుదరదు
అన్నిటిలో ఉండి అందరిలో ఉండి
కామ క్రోధ లోభ మధ మాత్సర్యాలకు దూరంగా ఉండటమే విశేషం.

ఇక వైరాగ్యం అంటే ఏ విషయమైనా గాని
అందం..
ఆస్డి..
పదవి..
హోదా..
భోగ భాగ్యాలు..
సుఖ సంపదలు..
అన్నీ అనుభవిస్తూనే..
ఇంతకు మించి ఇంకేముంది..
ఇదేమి గొప్పకాదని నిరాడంబర  భావంతో..
వాటిపై ప్రత్యేకమైన ఆసక్తి ఉండదు .
తన ధర్మం తాను నిర్వహిస్తూ ..
పలాఫెక్ష రహితంగా వెళ్లిపోతూ ఉంటారు ..

అంటే ఒక రాజుగారి కోటలో ఒక దాసి ఉంటారు .
రాజుగారి దాసి అంటే ఇక ఆమె భోగ భాగ్యాలకు ఏమీ తక్కువకాదు ..
అంతఃపురం వీడి బయటకు వచ్చే పనే లేదు ...
రాజుగారి బిడ్డలను తన బిడ్డలగా పెంచి పెద్ద చేస్తుంది ..
అక్కడ చేసే ప్రతి పని చాలా శ్రద్దగా ఆసక్తిగా చేస్తూనే ..
ఇదేదీ నాది కాదు అన్న భావంతో పనిచేస్తుంది.
ఇక్కడ ఎక్కడా గర్వం, అహంకారానికి తావులేదు ..
అన్నీ నాకు ఉన్నాయి . కానీ ఇవి ఏమీ నావు కావు .. అన్న ఎరుకతో బ్రతికేస్తుంది...

నా దేహ ధర్మం నేను చేస్తున్నాను.
నాదేహానికి సంభందించిన ఏ బంధమూ నాకు శాశ్వతమ్ కాదు..
వీరెవ్వరూ నాకు తోడు రారు.
జీవి జీవించి ఉన్నంత వరకు దేహ ధర్మాలు నిర్వహించ వలసిందే..
అన్నీ ఉన్నా అందరిలో ఇదేదీ నాది కాదని జీవించడమే నిజమైన వైరాగ్యం ..
ఆ స్దితిలో ఉన్నవారు..గృహస్తులైనా , సన్యాసి అయినా
విషయ వాంచలు అందు ఆసక్తిలేని నిజమైన వైరాగ్యులే.
నువ్వు ఆస్దితిలోనే ఉన్నావా ??
లేదా అని నిర్ణయించేది నీకు నువ్వే ...
అంతా ఆడంబరమా ???
లేక ఏవీ అంటని నిరాడంబరమా అని చెప్పేది
నీ మనస్సాక్షే ...!!
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ప్రకృతితో రైతన్న బంధం: పుష్యమి కార్తెలో ఏం జరుగుతుంది?

పుష్యమి కార్తె: వర్షాల ఆశ, ఎదుగుదల.. సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలాన్ని వ్యవసాయ పంచాంగం ప్రకారం ఆ కార్తెగా పిలుస్తారు. మొత్తం 2...

Blog Archive

Recent Posts

Unordered List