శ్రీ సరస్వతీదేవి ప్రాధాన్యత ~ దైవదర్శనం

శ్రీ సరస్వతీదేవి ప్రాధాన్యత

*సచామరరమావాణీసవ్యదక్షిణసేవితా*

మన జీవితంలో దేనికి అమిత ప్రాధాన్యం ఇవ్వాలో పై నామముతో వ్యాసులవారు *శ్రీ లలితా రహస్య సహస్రనామము* లో వివరించారు.

వివరణ:
సచారమ -- వింజామరలను కలిగియున్న అనగా చేతపట్టుకుని విసురుతున్న,సవ్య -- ఎడమవైపు,దక్షిణ -- కుడివైపు,(వరుసగా) రమా--లక్ష్మీ దేవిచేత, వాణీ --- సరస్వతీదేవిచేత, సేవితా -- సేవించబడునది.

విత్తానికి,విజ్ఞానానికి వరుసగా అధిష్టానదేవతలైన లక్ష్మీదేవి,సరస్వతీదేవి. ఈ ఇద్దరూ  సింహాసనరూఢురాలైన అమ్మవారికి వరుసగా ఎడమవైపున,కుడివైపున నిలుచుని అమ్మవారికి వింజామరలు వీస్తూఉంటారని ఈ నామము తెలియచేస్తుంది.దీనినిబట్టి అమ్మవారిని సేవిస్తే ఈ ఇద్దరి వలన పొందవలసినవి కూడా అనుగ్రహంచబడతాయని ఈ నామము సూచిస్తుంది.
శ్రీ ఆదిశంకరులు కూడా సౌందర్యలహరి శ్తోత్ర ఫలశ్రుతిగా చెప్పిన " *సరస్వత్యా లక్ష్మ్యావిధిహరిసపత్నోవిహరతే* " అన్న 99వ శ్లోకంలో ఇదే విషయాన్ని ప్రతిపాదిస్తారు.
అమ్మవారికి సంబంధించిన అష్టోత్తర శతనామావలి పఠించేటప్పుడు కూడా *ఓం,ఐం,హ్రీం,శ్రీం*బీజాక్షరాలను నామానికి ముందుగా ఉచ్చరిస్తాము.వీటిలో అమ్మవారి శక్తి బీజమైన *హ్రీం*కు సరస్వతీ బీజము *ఐం*,లక్ష్మీ బీజము *శ్రీం* ఉండటము ఇక్కడ గుర్తు చేసుకోవాలి.

అమ్మవారికి వరుసగా ఎడమవైపున,కుడివైపున నిలుచుని అమ్మవారికి వింజామరలు వీస్తూఉంటారని చెప్పబడిన ఈ నామములో స్టూలముగా చెప్పకుండానే ఒక చక్కని విషయాన్ని వ్యాసులవారు పొందుపరిచారు.

ఎప్పుడూ ఎడమవైపు ఉన్నవారి కంటే కుడివైపు ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. అమ్మవారికి ఎడమవైపు ఉన్న లక్ష్మీదేవి కంటే కుడివైపు ఉన్న సరస్వతి దేవికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు వ్యాసులవారు.

సరస్వతి ఉంటే-అంటే విద్యఉంటే ఆవిద్యతో లక్ష్మిని అనగా ధనమును సంపాదించవచ్చు.ఇది గౌరవప్రదమైన విషయముగూడా! అయితే లక్ష్మి అనగా ధనము ఉన్నంతమాత్రమున సరస్వతి అనగా విద్యను స్వంతము చేసుకొనుట అంత తేలికైన విషయము కాదు.ఒకవేళ పొందినా.. అలాపొందిన విద్య గౌరవప్రదము కూడా కాదుకదా!

అందుకని అమ్మవారికి కుడిప్రక్కన సరస్వతికి స్థానమిచ్చి సరస్వతీదేవికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు వ్యాసులవారు.
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ప్రకృతితో రైతన్న బంధం: పుష్యమి కార్తెలో ఏం జరుగుతుంది?

పుష్యమి కార్తె: వర్షాల ఆశ, ఎదుగుదల.. సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలాన్ని వ్యవసాయ పంచాంగం ప్రకారం ఆ కార్తెగా పిలుస్తారు. మొత్తం 2...

Blog Archive

Recent Posts

Unordered List