భారతదేశ చరిత్రలో ఏమి జరిగి ఉండాలి? ~ దైవదర్శనం

భారతదేశ చరిత్రలో ఏమి జరిగి ఉండాలి?

మనకు తెలిసిన ప్రపంచయుద్ధాలు రెండే. 1914-1918, 1937 - 1945లలో జరిగినవి. భారతీయ చరిత్ర ఇతిహాసాల రూపంలో ఉంది. ఇతిహాసము అనగా ఈ విధంగా జరిగింది అని అర్థం. రామాయణ, మహాభారత ఇతిహాసాలు మన చరిత్ర. రామాయణ, మహాభారత యుద్ధాలు ప్రపంచయుద్ధాలే, అవి ధర్మానికి - అధర్మానికి మధ్య జరిగిన చారిత్రక మహా యుద్ధాలు. అయితే, ఇంగ్లీష్ చరిత్రకారులు వాటిని పుక్కిట పురాణాలుగా ముద్ర వేసినప్పటికీ, అవి వాటి చారిత్రక వాస్తవాన్ని బహిర్గతం చేస్తున్నాయి. అమెరికా అంతరిక్ష సంస్థ (NASA) నాసా తీసిన ఫోటోలలో రామసేతు ఆనవాళ్లు బయటపడ్డాయి. భారతదేశంలోని రామేశ్వరం నుండి శ్రీలంక వరకు ఉన్న ఈ వారధి సముద్ర జలాలలో 1 నుండి 10 మీటర్ల లోతులో ఉన్నది. వాస్తవానికి ఇది సముద్ర మట్టం పైనే ఉండేది కానీ సముద్ర నీటి మట్టం పెరిగి (ఉదా : సునామీల వల్ల) నేడు సముద్రమట్టానికి కొంచెం దిగువగా ఉంది అని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. దీనిని మానవ నిర్మిత వారధిగా భావిస్తూ 15CE వరకు మనుషులు నడిచే విధంగానే ఉండేదనే వాస్తవాన్ని శాస్త్రజ్ఞులు తెలియజేస్తున్నారు. ఈ విధంగా రామాయణం యొక్క చారిత్రక ప్రమాణాలు బయటపడ్డాయి.
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ప్రకృతితో రైతన్న బంధం: పుష్యమి కార్తెలో ఏం జరుగుతుంది?

పుష్యమి కార్తె: వర్షాల ఆశ, ఎదుగుదల.. సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలాన్ని వ్యవసాయ పంచాంగం ప్రకారం ఆ కార్తెగా పిలుస్తారు. మొత్తం 2...

Blog Archive

Recent Posts

Unordered List