దేవతలను పద్మాలలో కూర్చున్నట్లుగా వర్ణిస్తారు. ముఖ్యంగా మహాలక్ష్మిని. ఏ కారణం చేత? ~ దైవదర్శనం

దేవతలను పద్మాలలో కూర్చున్నట్లుగా వర్ణిస్తారు. ముఖ్యంగా మహాలక్ష్మిని. ఏ కారణం చేత?

పద్మం పరిపూర్ణ కుసుమం. అది ఐశ్వర్యానికి, వికసించిన జ్ఞానానికి సంకేతం. జ్ఞానంలోనే దేవతాశక్తి దీపిస్తుంది. అదేవిధంగా, దేవతాశక్తి అనుగ్రహించినప్పుడే ఐశ్వర్యం లభిస్తుంది. దేవత అంటేనే ఐశ్వర్యశక్తి. వాక్కు, జ్ఞానం, ధనం, ధాన్యం, సంతోషం, ఆయువు - ఇవన్నీ ఐశ్వర్యాలు. వీటిని అధిష్టించి ఉంటారు దేవతలు. ఐశ్వర్యాదిదేవత లక్ష్మిని 'కమల'గా వర్ణిస్తారు.
హృదయాన్ని కూడా పద్మంగా పేర్కొన్నారు. సద్భావాలతో పరిమళించి, శాంతానందమే అనుభూతిమకరందంగా, మెత్తదనమే లక్షణంగా జ్ఞానంతో వికసించిన మనఃపద్మంలో దైవం గోచరిస్తాడు. దానికి సంకేతంగా పద్మంలో దైవాన్ని దర్శిస్తారు. యోగపరంగా - సుషుమ్నా నాడి మార్గంలో ముఖ్య ప్రాణరూపంగా ప్రసరించే దైవ చైతన్యాన్ని ఆరు చక్రాలలో ఆవిష్కరించుకుంటాం. ఆ ఆరు చక్రాలు స్పందించి వికసించాలి. ఏ అవరోధాలు లేకుండా శక్తిని ఆవిష్కరించుకొనేలా ఆ చక్రాలు వికసించినప్పుడు, పద్మమువలె భాసిస్తాయి. ఆ ఆరు చక్రాలనే ఆరు పద్మాలుగా వర్ణిస్తారు. వాటిలో ప్రకాశించే ఆత్మచైతన్యమే దేవత. పరమపదంగా, బహు విధాలుగా బ్రహ్మ రంధ్రంలో ప్రకాశవంతమైన సహస్రార కమలంలో పరిపూర్ణ పరబ్రహ్మ తేజస్సు గోచరిస్తుంది. ఈ స్థితిని గ్రహించడానికి కమలంలో దైవాన్ని ఆరాధించడం.
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ప్రకృతితో రైతన్న బంధం: పుష్యమి కార్తెలో ఏం జరుగుతుంది?

పుష్యమి కార్తె: వర్షాల ఆశ, ఎదుగుదల.. సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలాన్ని వ్యవసాయ పంచాంగం ప్రకారం ఆ కార్తెగా పిలుస్తారు. మొత్తం 2...

Blog Archive

Recent Posts

Unordered List