శ్రీ హనుమ కధామృతము 5 ~ దైవదర్శనం

శ్రీ హనుమ కధామృతము 5

ఒకప్పుడు శౌనకాది మహర్షులు సూత మహర్షిని శ్రీ హనుమ ఉద్భవాన్ని వివరించమని కోరారు . అప్పుడు ఆయన కధ చెప్పాడు .వ్యాస మహర్షి ఒక సారి ద్వైత వనం లో వున్న పాండవుల దగ్గరకు వచ్చాడు .ధర్మ రాజు సోదరులు ,భార్య ద్రౌపది తో సహా ఎదురు వెళ్లి స్వాగతం చెప్పి లోపలి ఆహ్వానించి అర్ఘ్య పాద్యాలు లిచ్చి భక్తీ శ్రద్ధలతో సేవించాడు .వ్యాసుడు సంతోషించి ద్రౌపది పాతివ్రత్యాన్ని మెచ్చాడు .అందరు భక్తీ శ్రద్ధలతో చేయ వలసిన వ్రతం వుందని దాన్ని వివరించాడు .అది కార్య సిద్ధిని కలిగిస్తుందనీ ,వెంటనే ఫలితం లభిస్తుందనీ చెప్పాడు .అదే శ్రీ హనుమద్ వ్రతం .దుష్ట గ్రహాల్ని వ్యాధుల్ని పోగొట్టి సకల శుభాలు ,శ్రేయస్సు ఇస్తుందని దాన్ని ఆచరించి మళ్ళీ రాజ్యాన్ని పొందమని ఉపదేశించాడు .పూర్వం ఈ వ్రతాన్ని శ్రీ కృష్ణుడు ద్రౌపదికి బోధించి ,దగ్గర వుండి వ్రతం చేయించాడని దాని ప్రభావం వల్లనే పాండవులకు అఖిల సంపదలు లభించాయని చెప్పాడు .అయితె ఒక సారి అర్జునుడు ద్రౌపది చేతికి వున్న హనుమత్ తోరణాన్ని చూసి దాని వివరం అడిగాడు .ఆమె అన్నీ వివరం గా చెప్పింది .అతడికి గర్వం కలగటం తో కోతిని గూర్చిన వ్రతం ఏమిటని ఈసడి౦చాడు. తన జెండా పై కట్టబడ్డ వాడు ,వానరుడు అయిన హనుమకు వ్రతం చేయతమేమితని దుర్భాష లాడాడు .ఆమె ఏడుస్తూ .తన అన్న శ్రీ కృష్ణుడు చెప్పి చేయించిన వ్రతం ఇది అని చెప్పింది .అయినా అర్జునుని కోపం తగ్గ లేదు .ఆమె చేతి కున్న తోరాన్ని బలవంతం గా లాగి పార వేశాడు .అప్పటినుంచి పాండవులకు కష్టాలు ప్రారంభామైనాయనీ  ఈ అరణ్య ,అజ్ఞాత వాసాలు దాని ఫలితమే నని వ్యాసుడు ధర్మ రాజుకు చెప్పాడు .పద మూడు ముడులు గల హనుమత్ తోరణాన్ని తీసి వేయటం వల్లే పదమూడు ఏళ్ళ అరణ్య,అజ్ఞాత వాసం అని వివరించాడు .కనుక వెంటనే హనుమద్వ్రతం చేయ మని హితవు చెప్పాడు .

ధర్మ రాజుకు సందేహం కలిగింది .పూర్వం ఎవరైనా ఈ వ్రతం చేసి ఫలితం పొందారా అని అడిగాడు .దానికి సమాధానం గా వ్యాసుడు ఒక కధ చెప్పాడు . పూర్వం శ్రీ రాముడు సీతను వెదుకుతూ ,తమ్ముడు లక్ష్మణునితో ఋష్య మూక పర్వతం చేరాడు .సుగ్రీవ ,హనుమలతో సఖ్యం చేశాడు అప్పుడు హనుమ రామునితో తన వృత్తాంతం అంతా చెబుతూ ,దేవతలంతా తనకు ఎలాంటి వరాలు ప్రదానం చేశారో వివరించాడు .బ్రహ్మాది దేవతలు హనుమతో ”హ్హనుమా !నువ్వు హనుమద్వ్రతానికి  నాయకుడి గా ఉంటావు .నిన్ను ఎవరు భక్తీ శ్రద్ధలతో పూజించి వ్రతం చేస్తారో వారి కోరికలన్నీ నువ్వు తీరుస్తావు .’ని బ్రహ్మ చెప్పిన మాటను రాముడికి చెప్పి నేను నీ బంటునని తేలిగ్గా చూడక నా వ్రతం చేసి ఫలితం పొందు .త్వరలో సీతా దర్శనం కలిగి రావణ సంహారం చేసి అయోధ్యా పతివి అవుతావు అని విన్నవించాడు హనుమ .అప్పుడు ఆకాశ వాణి ”హనుమ చెప్పినదంతా సత్యమైనదే ”అని పలికింది వ్రత విధానం చెప్పమని హనుమను రాముడు కోరాడు .మార్గశిర శుక్ల త్రయోదశి నాడు హనుమద్వ్రతం చేయాలని హనుమ చెప్పాడు .పంపా నదీ తీరం లో శ్రీరాముడు సుగ్రీవాదులతో వ్రతం చేశాడు .పదమూడు ముళ్ళ తోరం ను పూజించి కట్టుకొన్నాడు .తరు వాత కధ అందరికి తెలిసిందే .కనుక సందేహం లేకుండా ధర్మ రాజాదులను ఈ వ్రతం వెంటనే చేయమన్నాడు వ్యాసుడు .వ్యాస మహర్షి మాటలకు సంత్రుప్తులై ధర్మ రాజు బార్య సోదర్లతో వ్రతాన్ని విధి విధానం గా చేసి అంతా తోరణాలు భక్తీ శ్రద్ధలతో కట్టుకొన్నారు .తరువాత కురుక్షేత్ర యుద్ధం లో కౌరవులని సర్వ నాశనం చేసి రాజ్యాన్ని పాండవులు పొందిన విషయం మనకు తెలుసు .అని సూతుడు మహర్షులకు హనుమద్ వ్రత వైభవాన్ని పలితాన్ని తెలియ జేశాడు.
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List