కళరాత్రీ శుభంకరీ.! ~ దైవదర్శనం

కళరాత్రీ శుభంకరీ.!

ఏకవేణీ జపాకర్ణ పూరా నగ్నా ఖరాస్థితా*
*లంబోష్ఠీ కర్ణికాకర్ణీ తైతాభ్యక్త శరీరిణీ*
*వామ పాదోల్లసల్లోహ లతాకంటక భూషణా*
*వర్ధన మూర్ధ ఽధ్వజే కృష్ణా కాళరాత్రి ర్భయంకరీ*

శ్రీశక్తి పీఠాల్లో ఒకటైన శ్రీశైల క్షేత్రంలో జరుగుతున్న దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఏడో రోజున (మంగళవారం) శ్రీ భ్రమరాంబిక అమ్మవారు నవదుర్గలలో ఏడో అవతారమైన కాళరాత్రి రూపంలో పూజలందుకుంటారు. అమృతమయి అయిన ఆదిశక్తి అఖిల బ్రహ్మాండాన్ని రక్షించడానికి అపరకాళిగా అవతారం దాల్చింది. సప్తమి నాడు దుర్గాదేవిని కాళరాత్రీదేవి అవతారంలో ఆరాధించడం సంప్రదాయం. ఈ అమ్మవారి శరీరం నల్లగా ఉంటుంది. తలపై వెంట్రుకలు చెల్లాచెదురుగా ఉంటాయి. గార్దభం (గాడిద) వాహనంగా గల ఆమె తన నాలుగు చేతులలో వర, అభయముద్రలను, ఖడ్గాన్నీ, ఇనుప ముండ్ల ఆయుధాన్నీ ధరించి ఉంటుంది. ప్రాణికోటి జీవితాల్లోని గ్రహబాధల్ని తొలగించే కాళరాత్రి మృత్యువుకే భయం కలిగిస్తుంది. ఆమె భయంకర రూపంతో దుష్ట శిక్షణ చేసే శత్రునాశిని. నలుపు రంగులో శోభిల్లే కాళరాత్రిని ఆరాధిస్తే తెల్లని, చల్లని వెన్నలాంటి మనసుతో సుభిక్షతను ప్రసాదిస్తుంది. దుర్గుణాలనూ, దుష్టశక్తులనూ పారద్రోలి, సత్యకర్మలను ప్రేరేపిస్తూ, మంచి బుద్ధులను వృద్ధి చేస్తూ మానవాళికి ప్రేరణనిస్తుంది. ఆమె స్వరూపం భయంకరంగా కనిపించినా ఈమె ఎల్లప్పడూ శుభాలనే ప్రసాదిస్తుంది. అందుకే ఆమెకు ‘శుభంకరి’ అని కూడా పేరు. ఆమెను ఆరాధించడం వలన గ్రహబాధల నుండి ఉపశమనం లభిస్తుంది. అమ్మవారి దేవాలయాల ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై ఉదయం భ్రమరాంబదేవికి కాళరాత్రి అలంకార సేవ,విశేష అర్చనలు, హరతి పూజలు జరుపుతారు.

అనంతరం గజ వాహనాన్ని అధిష్ఠించిన భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామివారికి వాహనసేవలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. రాత్రి ఎనిమిది గంటలకు గజ వాహనుడైన స్వామివారినీ, కాళరాత్రి అమ్మవారినీ ఆలయ ప్రదక్షిణ చేయిస్తారు. ప్రధాన గోపురం మీదుగా పురవీధుల్లోకి తోడ్కొని వచ్చి గ్రామోత్సవం నిర్వహిస్తారు.
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ప్రకృతితో రైతన్న బంధం: పుష్యమి కార్తెలో ఏం జరుగుతుంది?

పుష్యమి కార్తె: వర్షాల ఆశ, ఎదుగుదల.. సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలాన్ని వ్యవసాయ పంచాంగం ప్రకారం ఆ కార్తెగా పిలుస్తారు. మొత్తం 2...

Blog Archive

Recent Posts

Unordered List