జీవుడు అన్నా ఆత్మ అన్నా ఒకటే. తనకు ఏర్పడ్డ శరీరంలో వ్యాపించి ఉంటాడు కనుక ఆత్మ అంటాం. దాన్ని జీవింపజేస్తున్నాడు కనుక జీవుడు అంటాం. భగవంతుడు అంతటా వ్యాపించి ఉంటాడు కనుక పరమాత్మ అంటాం. ఈ జీవుడు వేరు పరమాత్మ వేరు. స్పష్టంగా తేడా చెప్పటానికి జీవున్ని జీవాత్మ అని చెబుతుంటాం. జీవాత్మ అంటే శరీరంలో ఉన్న వాణ్ణి చెబుతున్నాం. జీవాత్మకి *"న స్త్రీ న పుమాన్ న శండః"* పురుషుడు కాదు, స్త్రీ కాదు, నపుంసకుడు అంత కంటే కాదు. కర్మ అనుభవం కోసం ఏర్పడ్డ శరీరానికి స్త్రీ పురుష అనేతేడా ఏర్పడుతుంది తప్ప జీవుడు వీటన్నింటికీ అతీతుడు.
మరి ఎంత వాడు ఈ జీవుడు అంటే చూపించలేం. పరమాత్మను విభువు అంటారు కనుక ఆయన పరిమాణం అంతటా ఉంటుంది. అదే జీవుడి పరిమాణం అతి చిన్నది. కొలవడానికి కావల్సిన పరికరాలు ఉండవు. అలాంటి ఆత్మలు ఎన్నో లెక్క పెట్టలేము. ఈ జీవుల్లని ప్రధానంగా తీసుకొని సృష్టి చేస్తాడు పరమాత్మ. ఈ జీవుల్లంతా కర్మ చేత బంధించబడి ఉంటారు. కనుక బద్ధులు అంటారు. కొంత మంది భగవత్ అనుగ్రహం కలిగి భగవంతుడు దయ చూపిస్తే కర్మ బంధం తొలగి, ముక్తులు అయ్యారు. మరి కొందరు ఉన్నారు వారు ఎప్పటికీ ఈ కర్మ బంధంలోకి రాలేదు. వారు ఎప్పుడూ భగవంతునితోనే ఉన్నారు కనుక నిత్యులు అని పేరు. ఎప్పుడూ భగవంతునితో ఉంటూ కర్మ పట్టే తెలియని వారు నిత్యులైతే, ఒక నాడు కర్మ ఉండి అది తొలగిన వారు ముక్తులు. తొలగని వారిని బద్ధులు అంటారు. కానీ ఈ కర్మ పట్టు తొలగాలి అని అనుకునే వారిని ముముక్షువులు అంటారు. అది విడిపించే మార్గం తెలియాలి. ఆ మార్గమేమిటో వేదం చెప్పింది, *"నారాయణ కళాః శాంతాః భజంతి"*. కేవలం నారాయణుడు మాత్రమే కర్మ బంధాన్ని తొలగించగలిగిన వాడు తప్ప ఏ ఇతరమైన వ్యక్తి తొలగించజాలడు. ఆయన ధరించే అనేక రూపాల్లో సాత్త్విక రూపాలనే ఉపాసించాలి. కర్మ బంధం తొలగాలని అనుకునేవాళ్ళు సాత్త్విక రూపాలనే ఉపాసిస్తారు తప్ప రాజస తామసిక రూపాలను ఉపాసించరు. రాజస తామసిక రూపాలను చెడ్డవి అని అనటం లేదు. కర్మ బంధం తొలగాలని అనుకునే వాడికి అవి అవసరం కావు కానీ వాటిపై ద్వేషం కాదు. అంతే కాదు భగవంతుని సాత్విక రూపాలు అన్నింటినీ తీర్చగలవు కనుక ఉపాసించడంలో లోపమేమిటీ ఉండదు.
*🌹యథాహి అవహితో వహ్నిః దారుష్వేకః స్వయోనిషు |*
*నానేవ భాతి విశ్వాత్మా భూతేషుచ తథా పుమాన్ ||*
ఇన్నింటా తనే ఉంటాడు కాబట్టి ఇదంతా పరమాత్మ అనవచ్చు. తనే అంటే ఇదంతా తన శరీరముగా కలది అని అర్థం. ఈ శరీరంలో ఉన్నాం అన్ని దీన్ని నేను అని మనం వ్యవహరిస్తున్నామే అట్లానే. జీవుడు కూడా శరీరం వలే పరమాత్మ చేత నడపబడుతూ పరమాత్మ నిలిపితే తానుంటాడు. నిప్పు ఒక రకంగా ఉంటుంది, కర్రను వెలిగిస్తే అదొక రకంగా ఉంటుంది. ఆ లోన ఉన్నది అగ్ని ఒకటే. అగ్ని వివిధ వస్తువులలో ఉన్నప్పుడు ఆయా వస్తువులది ఆ లోన ఉన్న అగ్నికి ఎట్లా అయితే అంటుకోదో సమస్త ప్రాణులతో చేరి ఇన్నింటినీ ఆయా రూపాల్లోకి ప్రవర్తింపజేస్తున్నా ఆయా దోషాలు అంటుకోవు. ఆయన లక్ష్యం అందరికీ సుఖానుభవం చేయడం.

No comments:
Post a Comment