గోమాత ఉపయోగాలు. ~ దైవదర్శనం

గోమాత ఉపయోగాలు.

మన సనాతన ధర్మంలో గోవుకి ప్రత్యేకమైన స్థానం ఉంది. తల్లిపాల తరువాత అంతవిశేషమైన శక్తిని ఇచ్చునవి ఆవుపాలు మాత్రమే . గోవు శరీరంలో ముక్కోటిదేవతలు కొలువై ఉంటారని మన హిందూపురాణాలు తెలియచేస్తున్నాయి . గోవుయొక్క మూపురంలో సూర్యనాడి ఉంటుంది.అది అంతరిక్షం నుంచి వచ్చే కాస్మిక్ కిరణాలను సంగ్రహించి అది పాలద్వారా మనకి అందిస్తుంది. ఆయుర్వేదం నందు కొన్ని రోగములకు పథ్యంగా ఉండును. ఇప్పుడు మీకు గోవు ద్వారా మనకి లభించే ఆవుపాలు , వెన్న , నెయ్యి , మజ్జిగ ఉపయోగాలు మీకు తెలియచేస్తాను.

 ఆవుపాలులోని రకాలు మరియు వాటి ఉపయోగాలు -

 * ఆవుపాలు సమశీతోష్ణ స్థితిలో ఉండును. మధురంగా ఉండును.

 * శరీరముకు వీర్యపుష్టిని , దేహపుష్టిని , బలమును కలుగచేయును.

 * శ్వాసకాసలు, శ్రమ , భ్రమ , మదము, ఆకలిదప్పులు నివారించును.

 * మూత్రం బొట్లుబొట్లుగా పడుతూ నొప్పి తీవ్రంగా ఉండే మూత్రకృచ్ఛము , శరీరం ఉబ్బు , వాతము, క్షయ , రక్తపైత్యం , వాతపైత్యం,జీర్ణజ్వరము వంటి రోగాలపైన అద్భుతంగా పనిచేయును .

 * జఠరశక్తిని పెంచును . ప్రాణాధారం అయి ఉండును. దీర్గాయువుని ఇచ్చును.

 * ప్రమాదాలలో గాయాలపాలైనవారు ఆవుపాలు తాగుటవలన త్వరగా కోలుకొందురు.

 * శరీరం నందు ధాతువులు క్షీణించినవారు ఆవుపాలు సేవించుట వలన అద్బుతఫలితాలు పొందవచ్చు.

 * బుద్ధికి బలం పెంచును. చిన్నపిల్లలకు ఆవుపాలు ఇవ్వడం వలన మంచి తెలివితేటలు కలిగినవారుగా తయారు అగుదురు.

 * స్త్రీల పిండోత్పత్తి స్థానమునకు బలాన్ని ఇచ్చును. బాలింతలకు పాలు కలుగచేయును.

 * ఆవుపాలు రాత్రిపూట ముఖమునకు మర్దన చేయుచున్న యెడల ముఖం కాంతివంతంగా ప్రకాశించును.

 * రాత్రి నిద్రపోవుటకు ముందు ప్రతినిత్యం అరకప్పు ఆవుపాలను తాగుచున్న యెడల మంచి సుఖవంతమైన నిద్రపట్టును. రక్తం వృద్ది అగును. మలబద్ధకం పోవును .

 *  నాటు ఆవుపాలు పావు లీటరు తీసుకుని గిన్నెలో పోసి దానిలో మంచినీరు 1 1/4 లీటరు కలిపి చిన్న మంట పైన నీరంతా ఇగిరిపోయి పాలు మిగిలే వరకు మరగబెట్టి దించి చల్లారిన తరువాత ఆ పాలను ప్రతిరోజూ తాగుతూ ఉంటే దగ్గులో రక్తం పడే రక్త పిత్త వ్యాధి కొద్దిరోజులలోనే తగ్గిపోవును .

      ఇంత సులువైన మందు యే వైద్య విధానంలో లేదు .

 *  కాచిన ఆవుపాలు పావు లీటరు తీసుకుని దానిలో పటికబెల్లం పొడి 30 గ్రా , ఆవునెయ్యి 20 గ్రా , లక్కపొడి 2 గ్రా కలిపి ఒక మోతాదుగా రోజు రెండుపూటలా తాగిస్తూ ఉంటే ఒకటి లేక రెండు వారాలలో విరిగిపోయిన ఎముకలు తప్పకుండా అతుక్కుంటాయి.

 *  రోజు రెండు పూటలా పావు లీటరు ఆవుపాలలో ఒక గ్రాము మిరియాల పొడి , పటికబెల్లం పొడి 20 గ్రాములు కలిపి తాగుతూ ఉంటే ప్రకోపించిన అతి కఫం అదృశ్యం అవుతుంది.

 *  ఇనుప పాత్రలో కాచబడిన ఆవుపాలు పావు లీటరు తీసుకుని దానిలో తగినంత కండ చక్కర పొడి కలిపి రోజు పరగడపున సేవిస్తూ ఉంటే క్రమంగా పాండురోగం పారిపోయి రక్త వృద్ది కలుగుతుంది. క్షయవ్యాధి బహు త్వరగా పారిపోతుంది.

 *   కాచిన ఆవుపాలు పావు లీటరు మోతాదుగా పటికబెల్లం పొడి కలిపి గోరువెచ్చగా కొంచంకొంచం తాగుతూ ఉంటే అప్పటికప్పుడే ఎక్కిళ్లు తగ్గుతాయి

 *  అప్పటికప్పుడు చిలికిన మజ్జిగ నుంచి తీసిన ఆవువెన్న ని పసిపిల్లల అన్నప్రాసన రోజు నుంచి ఉదయం, మద్యాహ్నం, సాయంత్రం వేళ్ళల్లో వయసుని బట్టి పూటకు ఒక గ్రాము నుంచి పెంచుకుంటూ 10 గ్రాముల వరకు తినిపిస్తుంటే ఆ పిల్లల శరీరం ఉక్కులా బలంగా తయారు అయ్యి అవయవాలు అందంగా ఉంటాయి. తెలివి పెరుగును.

 *  గోరువెచ్చని ఆవుపాలు పావు లీటరు తీసుకుని దానిలో పటికబెల్లం పొడి 25 గ్రా కలిపి మొదటిసారి సంభోగం అయ్యాక వెంటనే సేవిస్తే ఆ సంభోగం తాలుకు నీరసం తగ్గిపోవడమే కాక తిరిగి త్వరగా మరలా సంభోగం చేయగల శక్తి లభించును.

 *  ఆవుపాలల్లో దూదిని తడిపి దానిపైన పటిక చూర్ణం చల్లి ఆ దూదిని కళ్ల పైన వేసి బట్టతో కొంచం వదులుగా కట్టుచున్న కళ్ళవాపులు , కళ్ల మంటలు నివారణ అగును.

 *  పావు లీటరు ఆవుపాలలో 5 నుంచి 10 చుక్కలు వరకు నల్లజీడిగింజల నుంచి తీసిన నూనె కలిపి ప్రతినిత్యం ప్రాతఃకాలం నందు తాగుచున్న రొమ్మునొప్పి , గుండెజబ్బులు హరించును .

          పైనచెప్పిన ఫలితాలు కేవలం దేశీ ఆవుపాలతో మాత్రమే సాధ్యపడును.

        ఇప్పుడు ఆవుపాలతో చేర్చి తీసుకొకూడని వస్తువుల గురించి వివరిస్తాను.

 కలిపివాడకూడని వస్తువులు  -

 * శ్లేష్మప్రధానం అగు జంతువుల మాంసం పాలతో చేర్చి తినకూడదు.

 * చేపలు పాలతో చేర్చి తినకూడదు. అందులో ముఖ్యంగా చిరుచేపలు అసలు తినకూడదు.

 * పండ్లు పాలతో చేర్చి తినకూడదు.

 * ఉలవలు, కొర్రలు పాలతో కలిపి తినరాదు.

 * ముల్లంగి దుంప , పిట్ట మాంసం తిని పాలు తాగరాదు.

 * చిమ్మిలి అనగా నువ్వుల బెల్లంతో చేసి ఒక పదార్థం . ఈ చిమ్మిలి మరియు ఆవుపాలు ఒకేసారి లొపలికి తీసుకోకూడదు.

  పాలతో కలిపి తీసుకోవలసినవి  -

  శొంఠి, మిరియాలు , పంచదార పాలతో కలిపి తీసుకొనవచ్చు.గలరు.
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ప్రకృతితో రైతన్న బంధం: పుష్యమి కార్తెలో ఏం జరుగుతుంది?

పుష్యమి కార్తె: వర్షాల ఆశ, ఎదుగుదల.. సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలాన్ని వ్యవసాయ పంచాంగం ప్రకారం ఆ కార్తెగా పిలుస్తారు. మొత్తం 2...

Blog Archive

Recent Posts

Unordered List