‘’ కులాంగనా కులాంతస్థా కౌలినీ కులయోగినీ –ఆకులా సమయాంతస్థా సమయాచార తత్పరా ‘’
కులాన్ని పవిత్రం చేసే కులవధువు ,పుణ్య అంగనరూపం లో శరీరం లో పరమేశ్వరి ని భావించాలి .కులం లో ఉండి కులాంగన అవుతుంది .ఆమె కులం అంటే శరీరాన్ని వదిలి వెళ్ళదు.ఆమె ఎప్పుడూ శరీరాన్ని రక్షిస్తూ ,శరీరం లోనే ఉంటుంది .మన ప్రాణం ఉన్నంతవరకు మన శరీరం లోనే ఉంటుంది .శరీరం లోని గుణ ధర్మాలన్నిటికి ఆమె యజమానురాలు .కౌలినీ దేవి కులాంతస్థయై కులాంగన చేసే కర్తవ్య పాలన చేస్తుంది .అందుకే కులయోగిని అయింది .కులం లో వైషమ్యాలు స్పర్ధలు లేకుండా చేస్తుంది .శరీరం లోని అన్ని అవయవాలలోను గొప్ప తనం ఉంటుంది .ప్రాణ శక్తి అన్నిట్లోనూ సమానం గా ప్రవహిస్తుంది .సర్వ అవయవాల పరస్పర సహకారం ను పొందింప జేసి సాధ్వి అనిపించుకొంటుంది గృహిణి అయిన కుల యోగిని .
కులం లో ఉన్నా కులం పై ఆధార పడి ఉండక స్వతంత్రం గా వ్యవ హరిస్తుంది .అందుకే ‘’ఆకులా ‘’అయింది .అంటే నిరపేక్షం గా ఒక సంకేత స్థాన లో ఉంటుంది .ఈ స్థానానికే ‘’సమయం ‘’అని పేరు .కులం నుండి విడిపోయిన తర్వాత దేవి ఈ సమయ సీమలో ఉంటుంది .అందుకే ఆమెను ‘’సమయాంతస్థ ‘’అన్నారు .ఇక ఈశ్లోకం లో చివరినామం –‘’సమయాచార తత్పరా’’-కులమర్యాదలను ఎలా పాటిస్తుందో అలాగే సమయాచారాలను సంయమనం తో సాధించటం కూడా ఆమెకు ఇష్టం .దేవి భావన తో ఏది చేసినా శ్రేయస్సు ,ప్రేయస్సు సమానం గా సాధ్యమవుతుంది .జాగ్రత్త గా అనుభవించే భోగి కూడా యోగియే.యోగ భోగాల సమతుల్య సామంజస్యమే జీవన సాధన సాత్విక లక్ష్యం .ఇదే దేవి ఆరాధనకు పరమ ఫలం .అన్ని సాధనాలు ఈ సాధ్యాన్ని సిద్ధిన్చుకోవటం లో సార్ధకం అవుతాయి .వాగ్భవ కూట,మధ్య కూట ,శక్తి కూటాలను కోమల ,శాంత కళామయ శరీరం గా చేసుకొని ప్రతి ప్రనిలోపలా పరాశక్తి రూపం లో ఉన్న పరమేశ్వరి ఆభ్యంతర సౌందర్యాన్ని పద్నాలుగు నామాలు .ఇప్పుడు సాత్విక సౌందర్యం .
దేవి సౌందర్య తాత్విక సంచారం.మూలాదారైక నిలయం నుండి బిస తంతు తనీయసీ వరకు .మూలాధారం తో మొదలు పెట్టి సహస్రారం వరకు శక్తి యొక్క గతి శీలత ,దాని వలన ఉద్భవించే శక్తులను వర్ణిస్తారిక్కడ .
మొదటినామం మూలాధార నిలయ .’’మేరు దండం’’ లో అన్నిటికంటే కింద ఉండేది మూలాధారం .ఇక్కడే శక్తి కూటం .ఇక్కడే లలితాదేవి స్తిర నివాసం .నడుము పైభాగాన్నటికీ దృఢమైన ఆధారాన్నిచ్చేది ఇదే .అందుకే మూలాధారం అయింది .సర్జన, విసర్జనా ఇక్కడే జరగాలి .జగత్తు సృష్టి కూడా ఇక్కడే జరుగుతుంది .సృష్టి వెనక ఉన్న పరమ సత్తా ను సాక్షాత్కరించే ద్రుష్టి ఈ ఆధార, ఆరాధన వల్లనే లభిస్తుంది .శరీరం లోని సమస్త దర్గందాన్నిమాలిన్యాన్ని తొలగించి నిరాలం ఆనందం అయిన సుగంధాన్ని నింపే విచిత్ర కూటమి ఈ శక్తి కూటం .ఇక్కడే దేహ సంబంధమైన వాసన ,దైవిక ఉపాసన ల అద్భుత సంగమ స్థలం ఇదే .ఈ మార్మికఅంగం లౌకిక వాసనలున్న కాముకుడికి తాత్కాలిక తృప్తి ఆనందాన్ని కలిగిస్తుంది .అలౌకికానందాన్ని కోరేవారికి ఆత్మ ,మనస్సుల అభిన్నమైన కలయిక ,అనుభూతి కలుగుతుంది .కనుక మూలాధారం రెండుమార్గాల సంగమ స్థానం .ఒకమార్గం పై వైపుకు నడిచి పరమ శ్రేయస్సును నిచ్చే భవనం గా భాసిస్తుంది .రెండోది కింది వైపుకు దిగి ప్రేయస్సు అనే భౌతిక సుఖాన్ని తాత్కాలిక తృప్తిని ఇస్తుంది .సుఖ పంకిలం అయిన ఒక గుంట గా అగుపిస్తుంది .ప్రేయస్సుశ్రేయస్సుల మధ్య జరిగే ఈ ఘర్షణ వలన మేధావి అయిన సాధకుడు ప్రేయస్సును పరిచయం వరకు మాత్రమె గ్రహించి చివరికి శ్రేయస్సువైపుకు మొగ్గుతాడు .లౌకికానందం ప్రత్యక్షం .కాని అలౌకికానందం అప్రత్యక్షమైనది .దీనికి తీవ్ర సాధన చేయాలి అప్పుడుకూడా అతికోద్ది మందికే కే లభిస్తుంది .కనుక ఇంత బాధ ఎవడు పడడతారని ఎక్కువ మంది మూలా ధారాన్ని లౌకిక సుఖం కోసమే వాడుకొంటారు .ఇంద్రియ నిగ్రహం వలన లభించే ఆత్మానందం కోటి రెట్లు ఎక్కువే కాక స్తిరమైనది , ఆనంద ప్రదమైనదీ .శారీరక భోగం శరీర తేజస్సును నస్ట పరుస్తుంది ..మనసు ఆత్మల సంయోగం వలన జనించిన సుఖం , అంతరిక ఆనందాన్నిచ్చి సమస్త శరీర తేజస్సును ఓజస్సుగా మార్చి శారీరక ,మానసిక ,ఆధ్యాత్మిక వికాసమార్గాన్ని తెరుస్తుంది.
శ్రేయస్సు ,ప్రేయస్సు అని రెండు మార్గాలుంటే రెండో దానివైపే మనసు ఎందుకు పీకుతుంది ?మొదటి దాన్ని తెరచి రెండో దాన్ని మూసేయ్యవచ్చు అనిపిస్తుంది .బహుకాల సాధనం తర్వాత దొరికే ఆత్మానందాన్ని పరిచయటం చేయటానికే సర్వ సులభమైన మార్గాన్ని తెరచే ఉంచారు .మనిషి వివేకం తో తనమార్గాన్ని ఎంచుకోవాలి .ఎలా చూసినా మూలాధారం లౌకిక ,అలౌక యాత్రకు మూల మైన ఆధారమే .అందుకే ఇది దేవి నివాస స్థానం అయింది అంటారు.
దేవి ఈ మూలాధారం లో కాల సర్పం గా కుండలినిలో నిండుగా చుట్టుకొని ఉంటుంది .లౌకిక అలౌకిక సుఖాల అనుమానం తొలగిపోయినప్పుడు ఈ కుండలినీ నిద్ర తొలగి పోతుంది .ఒక సారి ఉండలిని మేలుకొంటే సాధకుడి కల చెదిరిపోతుంది .అప్పుడు తన నిజ స్వరూపాన్ని గుర్తిస్తాడు .దీన్ని యోగ శాస్త్రం లో ‘’ముడి విడిపోవటం ‘’అంటారు .సాధకుడి ధ్యానం మూలాధారం నుండి పైకి లేచినప్పుడు ఈ ముడి అంటే గ్రంధి విడిపోతుంది .సాధనా మార్గం లో అనేక గ్రంధులున్నాయి .మూలాధారానికి పైన ఉన్న గ్రంధులలో మొదటిది బ్రహ్మ గ్రంధి .బ్రహ్మ సమస్త ప్రపంచాన్ని సృష్టి చేస్తాడు .మూలా దారం చేసే పని కూడా ఇదే .దీని రహస్యం తెలుసుకొన్న సాధకుడు తనకు తెలిసినదంతా ఒక స్వప్నం గా తెలుసుకొంటాడు .దీనితో కల పగిలి పోతుంది .మరొకటి మొదలవుతుంది .ఇక్కడి నుండి చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది .దూర ప్రయానికి ఇది మొదటి మజిలీ మాత్రమె .ఈ గ్రంధి విప్పించే మాత ‘బ్రహ్మ గ్రంధి విభేదిని ‘’అయింది .
దీని తర్వాత రెండు నామాలలో ‘’మణిపూరాంత రుదితా ‘’,విష్ణు గ్రంధి విభేదినీ ‘’అని చెప్పారు .మూలా దారం నుండి మణి పూరకం వరకు చేరినప్పుడు రెండవ’’ గ్రంధి ‘’విష్ణు గ్రంధి’’ వస్తుంది .దేవి కృప వలన ఇదీ ఊడిపోతుంది .
బ్రహ్మ గ్రంధి విడిపోయినప్పుడు సాధకుడి క్షుద్రత్వం పూర్తిగా అర్ధమైపోతుంది .
విష్ణుగ్రంది విడిపోయినప్పుడు మనసుకు ఆవరించిన మాయ పోర తొలగిపోతుంది .అప్పుడు సాధకుడు ఆశరీరి ,అమనస్కుడు అవుతాడు .శరీరానికి ,,మనసుకు అతీతం గా సాధకుడిని తీసుకొని వెళ్ళే పరమేశ్వరి ఇక్కడే మణిపూరక చక్రం లో విరాజమానమై ఉంటుంది .ఈ గ్రంధి ,ఈ చక్రం భౌతికం గా కనిపించేవికావు .పరమాత్మ పావన భావం తో తనువూ పులకిస్తుంది .కన్నుల నుండి ఆనంద బాష్పాలు రాలుతాయి .శరీర మధ్య భాగం అంతా చెమట తో నిండిపోతుంది .మనస్సులో ఒక్క సారిగా ప్రసన్నత ,ప్రఫుల్లతా భావం వ్యాపిస్తుంది .ఇప్పుడు కుండలిని మేలుకోన్నదని తెలుసు .ఆధ్యాత్మిక సుఖం అతీం ద్రియం అని అవగతమవుతుంది .
కుండలిని మేల్కొన్న తర్వాత త్వరగా పై పైకికదులుతుంది .మూలాధారం పైన స్వాదిస్టానం ఉంది .ఇక్కడే సాధకుడు బోధ పొందుతాడు .మణి పూరకం తర్వాత తన వైశ్వానర స్వరూపాన్ని దాటి తేజో రూపం లోకి ప్రవేశిస్తాడు .
జాగ్రదవస్తలో ఉన్నప్పుడు లోకం ప్రత్యక సత్యం అని పిస్తుంది .దీన్ని ‘’వైశ్వానర రూపం ‘’అంటారు .మనిషి నిద్రలో స్వప్న జగత్తు తెరుచుకొంటుంది .
దానికి స్రష్టా ద్రస్టామన మనసు మాత్రమే .మనస్సు ఇక్కడ నివాసం ఉంటుంది .మనస్సు దీని ఆనందాన్ని అనుభవిస్తుంది .
ఇందులో శరీరం పాత్ర ఏమీ ఉండదు .బ్రహ్మ గ్రంధిని దాటిన తర్వాత శరీరం తో సాధకుడి సంబంధం తగ్గి మనసు సంబంధం పెరుగు తుంది .అంటే శరీర దారి ‘ఇప్పుడు ‘’మనస్వి ‘’అయ్యాడన్నమాట .ఇది జాగ్రదవస్తలోనే జరుగుతుంది .అప్పుడే అది ‘’యోగం ‘’అని పించుకొంటుంది.సాధకుడు తన బలమైన ఇచ్చ తో ధ్యాన ,సమాధి బలం తో అశరీరి ఐన వాడు మనస్వితను అనుభ విస్తాడు .స్వప్నావస్తను దాటిగాఢ సుషుప్తి అవస్థను పొందుతాడు .ఇక్కడ శరీరం ,మనసులు ఆత్మను ఏకాంతం లోకి వదిలి వెడతాయి .ఇక్కడ ఆత్మ సామ్రాజ్యం స్థాపితం అవుతుంది .విష్ణు గ్రంధి విభేదం అయిన తర్వాత ప్రాణి కొంత విశ్రాంతి తీసుకొంటాడు .సాధకుడికి అంతా తెలుస్తుందికాని ,ప్రాణికి ఏం జరుగుతోందో తెలియదు .
బ్రహ్మ గ్రంధి విష్ణు గ్రంధి దాటినా తర్వాత వచ్చేదే ‘’’రుద్ర గ్రంధి ‘’.ఇది రెండుకనుబోమల మధ్య ,ముక్కుకు పైన ఉంటుంది .ఇక్కడే ఆజ్ఞా చక్రం ఉంది .సమస్త ప్రాణుల మూడవ కన్ను ఇక్కడే ఉంటుంది .స్వప్నా వస్తలో తేజో రూపం తను వ్యాపింప జేసిన కాంతిలో తననే వ్యాపింప జేస్తుంది .గాఢ నిద్రలో మనిషి కేవలం బుద్ధి జీవిగానే ఉంటాడు .ఇదే అతని ప్రాజ్ఞా రూపం .ప్రజ్ఞ తప్ప ఇంకేమీ ఉండదిక్కడ .ఇక్కడే నిద్రించినవాడు చచ్చిన వాడుఒకటే అన్నమాట నిజమౌతుంది .తానేదో మరో ప్రపంచం లో విహరించి తిరిగి వచ్చిన అనుభూతి కలుగుతుంది .ప్రపంచం అంటే యోగి యోగ సాధనలో ముందుకు దూసుకు పోయినట్లనిపిస్తుంది .ఆజ్ఞా చక్రం లో ఉండే రుద్ర గ్రంధి తెరచుకొన్న తర్వాత ప్రత్యక్షమయ్యే భద్ర మైన వైభవం ఇదే .ఈ భద్ర భాండారాన్నే ‘’సహస్రారం ‘’అంటారు .రుద్ర గ్రంధి భేదనం తర్వాత సహస్రార కమలాన్ని సాక్షాత్కారించుకొంటాడు .ఈ కాలం లోనే కమలినీ కాంత లలితా దేవి ప్రతిష్టితమై ఉంటుంది .ఇక్కడ ఎనిమిది జాముల్లోను అమృతం కురుస్తూ ఉంటుంది .కనుక జరా ,మరణ భయం ఉండదు .ఇక్కడికి చేరుకొన్న తర్వాత తన ఆత్మ ,విశ్వాత్మా అభిన్నాలు .అని తెల్సుకొంటాడు.

No comments:
Post a Comment