నివారణా స్తోత్రాం.. ~ దైవదర్శనం

నివారణా స్తోత్రాం..

ఎటువంటి కష్టమైనా, ఇబ్బంది అయినా
ఈ స్తోత్ర పారాయణ వల్ల తొలగి ఆనందకరమైన జీవితాన్ని అనుభవించే యోగ్యత అమ్మ కలిగిస్తుంది...

ఈ స్తోత్రాన్ని ఎప్పుడు మొదలుపెట్టాలనుకున్నా...
అమావాస్య వెళ్ళిన తరువాత వచ్చే మొదటి బుధవారం మొదలు పెట్టాలి.(అన్నీ కలిసి వచ్చాయి ఈ దసరాకి)

కనుక అందరూ శ్రద్ధాభక్తులతో ఈ స్తోత్రాన్ని చదవగలరు... చిన్నది అవడం మూలాన పొద్దున్న, సాయంత్రం కూడా చక్కగా పారాయణ చేసుకోవచ్చును... రోజూ 32 సార్లు చదవగలిగితే..చాలా మంచి ఫలితం..

శ్రీ దుర్గా ద్వాత్రింశన్నామ  మాలా..💐
ఈ శ్లోకం చాలా..శక్తిమంతమయిన శ్లోకం.
దుర్గాదేవికి సంభందించిన 32 నామాలు ఇందులో  ఉన్నాయి . 
ఈ శ్లోకం దుర్గాసప్తసతి లో కనిపిస్తుంది .
ఈ  శ్లోకాన్ని ఎవరు రోజూ చదువుతారో వారు అన్ని భయాలనుంచీ..కష్ఠాలనుంచీ..విముక్తులవుతారు. అందరూ తప్పకుండా నమ్మకంతో చదవండి

దుర్గా దుర్గార్తి శమనీ దుర్గాపద్వినివారిణీ
దుర్గమచ్ఛేదినీ దుర్గసాధినీ  దుర్గనాశినీ
ఓం దుర్గతోద్ధారిణీ  దుర్గనిహంత్రీ  దుర్గమాపహా
ఓం దుర్గమజ్ఞానదా దుర్గ దైత్య లోక దవానలా
ఓం దుర్గ మాదుర్గమాలోకా దుర్గమాత్మ స్వరూపిణీ
ఓం దుర్గమార్గప్రదా దుర్గమవిద్యా దుర్గమాశ్రితా
ఓం దుర్గమ జ్ఞాన సంస్థానా దుర్గమ ధ్యాన భాసినీ
ఓం దుర్గ మోహాదుర్గ మాదుర్గమార్ధ స్వరూపిణీ
ఓం దుర్గ మాసుర సంహంర్త్రీ దుర్గమాయుధధారిణీ
ఓం దుర్గమాంగీ దుర్గమాతా దుర్గమాదుర్గమేశ్వరీ
ఓం దుర్గభీమా దుర్గభామా దుర్లభా దుర్గ దారిణీ
నామావళి మిమాం యస్తు దుర్గాయా మమ మానవః పఠేత్సర్వ భయాన్ముక్తో  భవిష్యతి నసంశయః  
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ప్రకృతితో రైతన్న బంధం: పుష్యమి కార్తెలో ఏం జరుగుతుంది?

పుష్యమి కార్తె: వర్షాల ఆశ, ఎదుగుదల.. సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలాన్ని వ్యవసాయ పంచాంగం ప్రకారం ఆ కార్తెగా పిలుస్తారు. మొత్తం 2...

Blog Archive

Recent Posts

Unordered List