సర్ప సంస్కార, సర్ప దోష పూజలు. ~ దైవదర్శనం

సర్ప సంస్కార, సర్ప దోష పూజలు.

సర్ప దోషము నుంచి విముక్తి పొందటానికి భక్తులు ఈ పూజను చేస్తారు. పురాణనుసారం, ఒక వ్యక్తి ఈ జన్మలో కానీ లేక గత జన్మలో కానీ , తెలిసి కానీ, తెలియక కానీ పలు విధములలో ఈ సర్ప దోష భాధగ్రస్టుడు అయ్యే అవకాశం ఉంది. సర్ప దోష బాధితులకు పండితులు ఈ సర్పదోష నివారణ పూజను విముక్తి మార్గంగా సూచిస్తారు. ఈ పుజను ఒక వ్యక్తి కానీ, తన కుటుంభంతో కానీ, లేక పూజారి గారి ఆద్వర్యంలో కానీ చెయ్యవచ్చును. ఈ పూజా విధానం ఒక వ్యక్తి మరణానంతరం జరిగే శార్డం, తిథి, అంత్యక్రియ పూర్వ పూజలలా ఉంటుంది. సర్పసంస్కార పూజ చెయ్య దలిచిన భక్తులు రెండు రోజులు సుబ్రమణ్య సన్నిధిలో ఉండవలెను. ఈ పూజ సూర్యొధయమ్ చెయ్యబడుతుంది. ఆ రోజు వేరే ఎటువంటి పూజలు చెయ్యకూడదు. ఈ పూజా ప్రారంభం నుంచి ముగింపు వరకు దేవస్తానం వారు ఇచ్చే ఆహారాన్ని మాత్రమే భుజించాలి. పూజను ఎంచుకున్న భక్తుడిని కలుపుకొని నలుగురుకి దేవాస్తానం వారు భోజన సదుపాయం కలిపిస్తారు.

తులునాడు ప్రాంతం ఉన్న కర్నాటక , కేరళలో సర్ప దేవుడుకి ఉన్న బహుళ ప్రాముఖ్యం వల్ల ఈ ప్రాంతాల్లో అన్ని మతాలు, వర్గాల వారు ఈ పూజను జరిపిస్తారు. స్వామి వారికి జరిగే మడెస్నానం ఒక ముఖ్యమైన సేవ. స్వామి వారికి మడె స్నానం సేవ ఎంతో ఇష్టం. వీధి మడె స్నానం మరో ముఖ్యమైన సేవ.
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ప్రకృతితో రైతన్న బంధం: పుష్యమి కార్తెలో ఏం జరుగుతుంది?

పుష్యమి కార్తె: వర్షాల ఆశ, ఎదుగుదల.. సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలాన్ని వ్యవసాయ పంచాంగం ప్రకారం ఆ కార్తెగా పిలుస్తారు. మొత్తం 2...

Blog Archive

Recent Posts

Unordered List