ఈ ప్రాచీన యోగము గురించి 1880వ దశకములో శ్రీ తల్లాప్రగడ సుబ్బారావు ప్రస్తావించే వరకు ఎవరికీ తెలియదు. దీని ప్రక్రియల గురించి ఎటువంటి గ్రంధములు లేవు. చూచాయగా అద్వయ తారకోపనిషత్తులోను, నృసింహ ఉత్తర తపనీయోపనిషత్తులోను, ఆధ్యాత్మ రామాయణమునందలి శ్రీ రామహృదయంలోను ఈ గుప్త యోగ భాగముల ప్రస్తావన కలదు. శ్రీ పరశురామపంతుల లింగమూర్తి రచించిన సీతారామాంజనేయ సంవాదము అనే ప్రామాణిక గ్రంధములో కొన్ని వివరణలు కలవు. అందలి పద్యము ఒకటి గమనించండి.
తారకంబు మనశ్శుద్దికారకంబు
సాంఖ్య మాత్మస్వరూప విచారకంబు
అనుభవజ్ఞాన మమనస్క మట్లుగాన
నాద్య మెరిగింతు మొదల నీ వవధరింపు
ఈ ప్రాచీన తారక రాజయోగ మార్గములో, భగవంతుని మానవ రూపముతో ఆరాధించుట ఉండదు. కేవలం సంకల్ప శక్తితో కూడిన ప్రక్రియలు మాత్రమే. అత్యంత ఉన్నతమైన అర్హతలు కలవారు మాత్రమే చేయదగిన ప్రమాదకరమైన యోగమిది.
తారక రాజయోగ వివరణలు లభ్యము కాకపోవుటకు కారణము, ఇది వేదకాలమునకు ముందటి కాలమునకు చెందిన మార్గమని పూర్వీకులు చెప్పుదురు. స్వయంభూ మను కాలములోని సభ్యయుగములో, తృప్తిమంతులు, తుషిమంతులు మరియు వ్రజకులులు అనే మానవ సమూహాలు అంతరించిన తరువాత, సాధ్యులు, మహారాజికలు, ఆభాస్వరులు మరియు తుశితులు అనే సమూహాలు ఏర్పడినవి. పురుష సూక్తములో చెప్పబడిన ఈ సాధ్యులచే ప్రతిపాదింపబడిన దశవాదముల ప్రస్తావన నాసదీయ సూక్తములో కనిపించును. బ్రహ్మం అనే సిద్ధాంత ప్రతిపాదన చేసిన మహోన్నతుడైన ఈ సాధ్యునినే పరమేశి బ్రహ్మగా నాసదీయ సూక్తములో చెప్పినారని పూర్వీకులు వ్రాసినారు. ముండకోపనిషత్తులో చెప్పబడిన బ్రహ్మ కూడా ఈయనే. వేదకాలమునకు ముందటి కాలములో ప్రతిపాదింపబడిన అట్టి గుప్త మార్గములలో తారక రాజయోగము ఒకటి.

No comments:
Post a Comment