రుద్రునికి..రుద్రాభిషేకము రుద్రాభిషేకంలో దోషాలు.. ఫలములు.. ~ దైవదర్శనం

రుద్రునికి..రుద్రాభిషేకము రుద్రాభిషేకంలో దోషాలు.. ఫలములు..



మన ప్రాచీన శాస్త్రముల ప్రకారము సూక్ష్మలోకమందలి జీవము భౌతికలోకములో నీరుగా వ్యక్తమయినది. నీరు ప్రాణశక్తిని సూచించును. అభిషేకము యొక్క ముఖ్య ఉద్దేశ్యము ఏమనగా అదృశ్య లోకములలో ఉన్న విద్యుచ్ఛక్తిని దృశ్య లోకములలోనికి వ్యక్తపరచుట. సూక్ష్మస్పందనలకు అధిపతి, దేవతలందరికంటే ప్రప్రధముడు అయిన రుద్రుడు, చీకటికి ఆవల ఉన్న వెలుగును స్థూలలోకములోనికి కనిపించే వెలుగుగా వ్యక్తపరచును. చీకట్లను పారద్రోలి, జీవుల అనుభవమునకు చీకటికి ఆవల ఉన్న వెలుగును స్థూలమునకు కొనివచ్చు దైవము రుద్రుడు. మర్త్యులైన జీవుల అజ్ఞానపు చీకట్లను నాశనము చేసి వారికి వెలుగు మార్గము చూపు దైవము రుద్రుడు. దైవమును, దివ్యప్రణాళికను అనుభూతి చెందుటకు రుద్రుడు సహాయము చేయును. రుద్రుడు అన్ని జీవుల యందునూ స్పందనగా ఉన్నాడు. ఇది రుద్రుని ఆరాధించు సాధకుడు తెలుసుకొనవలన విషయము..

.
ఈ రుద్రాభిషేకం చేసేటప్పుడు లింగముపై మారేడు దళములుంచి ఒక్కొక్క కలశంలోని నీళ్ళతో కలశపూజచేసి ప్రతి కలశమునందు శివపంచాక్షరితో అభిమంత్రించి ఆ విధముగా 108 కలశములూ మంత్ర పూరితము చేసి సిద్ధము చేసుకొని అప్పుడు రుద్రాభిషేకము ప్రారంభించాలి. అభిషేకము పూర్తి అయ్యేసరికి కలశములలో అభిమంత్రించిన తీర్థము సరిగ్గా సరిపోవునట్లు చేయవలె. అలా చేస్తేనే రుద్రాభిషేక ఫలితము పూర్తిగా కలుగుతుంది.

.
రుద్రాభిషేకంలో దోషాలు:..
.
అట్లుకాక చాలామంది బిందెలలో చెరువునీటిని గాని, నూతినీటినిగాని తెచ్చి, అట్లే అభిషేకంగా రుద్రమంత్రం చెపుతూ అభిషేకం చేస్తారు. దీనివల్ల ప్రయోజనము లేదు! ఈ విషయం చాలామంది పురోహితులకు, (వేదపండితులకు) సహితము తెలియదు.

.
చెరువునీటిని కాని, నూతినీటిని కాని, ఏ నీరైననూ, సరే తెచ్చినది తెచ్చినట్లు అభిషేకము చేయరాదు! ఇది శాస్త్ర విరుద్ధము. ఎందుకనగా నీటియందు విషమ ఉండును అని వేద ప్రమాణము. ఈ విషము అట్లేవుంచి అభిషేకం చేసిన నిష్ఫలము కాబట్టి కలశములలో నింపిన జలమును ముందుగా 'నిర్విషము' చేయవలె. అట్లు నిర్విషము చేయుటకు 'తార్యముద్ర' లేక గరుడ ముద్రను చేతితో వట్టి నీటిపై ఉంచి విషాహార మంత్రములతో లేక మృత్యుంజయ బీజాక్షరములతో అభిమంత్రించి ఆ పైన 'అమృత ముద్ర' పట్టి అమృత బీజాక్షరమునుచ్చరించి, ఆ జలమును అమృతీకరణము చేయాల్సి వుంది. అట్లు అమృతీకరణము చేయబడిన జలమునే శివాభిషేకము చేయుటకు ఉపయోగించవలె. పై విధముగా నూతి నీరు నిర్విషీకరణము చేయలేదు గనుక వీలుపడదు. ఇదియే శాస్త్ర విహితమైనది, చాలా మంచిది. ఇది రుద్రాభిషేకము యావజ్జీవం చేయుచుండువారికి కూడా తెలియదు! అందువల్ల రుద్రాభిషేక ఫలము వీరికి కలుగుట లేదు.
.
రుద్రాభిషేక ఫలము:...
.
పైన చెప్పిన విధంగా రుద్రాభిషేకము చేయువారి హస్తం అమృతీకరణం పొందుతుంది. అతడు ముట్టుకున్న ప్రతి వస్తువునకూ 'అమృతత్వము' కలుగుతుంది. అతడు ముట్టుకున్న ప్రతి వస్తువునకూ అమృతత్వము కలుగుతుంది. దీనికి నిదర్శనమేమనగా - అతని చేతితో తాకిన రోగములన్నీ ఎలాంటి మందు లేకుంటానే పోగలవు. దీనికి రుద్రాభిషేక మంత్రములలోనే 'శివా విశ్వాయ భేషజే'. (విశ్వములోని అన్ని రోగములకూ శివుడే వైద్యము అన్న మంత్రము) అప్పుడే సిద్ధించును. కాని ఇట్లు సిద్ధించుటలేదు. దీనికి కారణం జలము నిర్విషము చేయకయే అభిషేకిస్తూ వున్నారు. అమృతీకరణము చేయని జలముతో శివాభిషేకము ఫలితం ఇవ్వదు! ఈ రహస్యము తెలిసి, శివపూజలు చేసిన మృత్యువును సహితం జయించవచ్చు! ఇట్టి రహస్యములు యోగియైన సద్గురువునుండియే, తెలియవలె...

.
ఈ రుద్రాభిషేకమునకు 'నమక చమకము'లతోనే సామాన్యంగా అభిషేకం చేయడం ఉంది. అలాగాక 'మన్యుసూక్తం'తోను, మృత్యుంజయ మంత్రసహితంగా కాని పాశుపత బీజాక్షర సహితంకాని, రుద్రాభిషేకము చేయవచ్చును. దీనికి పాశుపత, మన్యుసూక్తమంత్రాలు ఉపదేశంగా పొందాలి. వీనికి అంగన్యాస, కరన్యాసములు, ధ్యాన, ఆవాహనములు, మూల మంత్రములు తెలియవలె. శివాభిషేక విధి ఇంత తెలిసిన చాలును!
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ప్రకృతితో రైతన్న బంధం: పుష్యమి కార్తెలో ఏం జరుగుతుంది?

పుష్యమి కార్తె: వర్షాల ఆశ, ఎదుగుదల.. సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలాన్ని వ్యవసాయ పంచాంగం ప్రకారం ఆ కార్తెగా పిలుస్తారు. మొత్తం 2...

Blog Archive

Recent Posts

Unordered List