మహిషాసురమర్ధిని స్తోత్రం. ~ దైవదర్శనం

మహిషాసురమర్ధిని స్తోత్రం.

అమ్మ‌ వైభవ స్తుతి, శక్తివంతమైన శ్రీ మహిషాసురమర్ధిని స్తోత్రం - భావము. శ్లోకము - 15


శ్లోకము:
*కరమురళీరవ వాజిత కూజిత కోకిల మంజుల మంజురతే*
*మిళిత మిళింద మనోహరగుంభిత రంజితశైలనికుంజరతే*
*మృగగణభూత మహాశబరీగణ రింఖన సంభృతకేళిభృతే*
*జయ జయహే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే*


*భావము:*
మువ్వలమురళీ రావాలకీ, వాటిని అనుసరిస్తూ పాడే కోకిల గానాలకీ ,మకరందపానముచే మత్తెక్కిన తమ ఝుంఝుం నాదాలతో అడవిపూల గుబుర్లను గుబాళింపచేసే తుమ్మెదల నాదాలకి,ఇంకా అడవులలోని,కొండలలోని మృగపశ్యాది భూతగణాల - బోయజంటల వివిద కేళీ వినోదనాదాలకీ సమానంగా సమాహ్లాదన పొందేదానా! మహిషాసురున్ని మర్ధించినదానా!! ఒప్పిదమైన గొప్ప కొప్పుకలదానా!! శీతగిరికూతురా!!! నీకు జయమగుగాక!!!
🔱🌹 *ఆ తల్లి పాదపద్మములకు నమస్కరిస్తూ*🌹🔱
ఓ హిమగిరిసుతా! నీవు వేడుకగా వేణుగానం చేస్తూఉంటే ఆ గానం విని కోకిలలు సిగ్గుపడి కూయడం మానేసాయి. ఆహా! ఏమి నీ గానమాధుర్యము. నీవు వేణువును ఊదుతూ కొండమీద పొదరిళ్ళ సమీపంలో సుగంధ కుసుమభరితమైన వృక్షాల నడుమ విలాసంగా విహరిస్తూ ఉంటావు. నీ పరివార గణాలు నిన్ను అనుసరిస్తూ నీకు వేడుక కలిగించడానికి రకరకాల జంతువుల రూపాలు ధరించి ఆడుతూఉంటారు.ఈశ్వరుడు కిరాత వేషము ధరించి అర్జునుని విలువిద్యా నైపుణ్యం పరీక్షించడానికి వెళ్ళినప్పుడు నీవు శబరీవేషం ధరించి నీ స్వామివెంట నడిచావు.శంభుని పరివారము చెంచులుగా వేషం ధరించి నీకు అనుయాయులైనారు.
నీ తండ్రి కొండలరాయుడు కదా! నీవు కొండలలో సంచరించుట పుట్టింటి మమకారంవల్లనే కదా! ఓ తల్లీ నీకు జయము జయము! ఓ నారాయణి నీవు నందుని కుమార్తెగా గోకులంలో అవతరించావు. నారాయణుడు నీ సోదరుడు. శ్రీ కృష్ణుడు మురళీ గానలోలుడు కదా! నీవు నీ అన్నవలె .మురళీగానము చేస్తూ భక్తుల‌ రంజింపచేస్తావు.ఓ తల్లీ నీకు జయమగుగాక!!

⚜️ *సర్వేజనా సుఃఖినోభవంతు*⚜️
*శరన్నవరాత్రులలో అమ్మవారి రెండవ అవతారము* -
🌸 *బాలా త్రిపురసుందరిదేవి*🌸

త్రిపుర సుందరి దేవి శ్రీచక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత.షోడశ విద్యకు ఈ దేవత అధిష్ఠాన దేవత కాబట్టి ఉపాసకులు త్రిపుర సుందరి దేవి అనుగ్రహం కోసం బాలర్చన చేస్తారు.అసలు బాల త్రిపుర అనే పేరే పరమ పవిత్రమైన పేరు.

ఈ తల్లి త్రిపుర సుందరి దేవి అయ్య వారు ఎమో త్రిపురాంతకుడు ఆది దంపతులు వారి తత్వము కుడా అటువంటిది.
త్రిపుర సుందరి అంటే మనలోని మూడు అవస్తలు జాగృత్, స్వప్న , సుషుప్తి.
ఈమూడు అవస్థలు లేదా పురములకు బాల అధిష్ఠాన దేవత.
ఈమూడు పురములను శరీరముగా చేసుకొని, ఈ జగత్తు అంతటిని అనుభవింపచేస్తూ బాలగా అమ్మవారు సంతోషిస్తుంది.

మనము ఎన్ని జన్మలు ఎత్తిన ఈ ముడు అవస్థలలోనే తిరుగుతూ ఉంటాము. కేవలం ఉపాధులు మాత్రమే మారుతాయి.అటువంటి తల్లి ఈ రూపములో మనలోనే ఉంది.ఆవిడ ఆత్మ స్వరూపురాలు ఆవిడను పూజిస్తే జ్ఞానము కలిగి తానే శివ స్వరూపముతో చైతన్యము ప్రసాదించి మోక్షమునకు అనగా పరబ్రహ్మతత్వం వైపు నడిపిస్తుంది.

బాలా త్రిపురసుందరి ఆవిర్భావం గురించి మనకు బ్రహ్మాండ పురాణంలో, లలితా సహస్రంలో కూడా మనకు కనిపిస్తుంది. భండాసురుడు అనే రాక్షసునకు ముప్ఫై మంది పిల్లలు. వీళ్ళందరు అవిద్యా వృత్తులకు సంకేతం.

అమ్మ హంసలచే లాగ బడుతున్న కన్యక అనబడే రథం పై వచ్చి ముప్ఫైమంది భండాసుర పుత్రులనూ సంహరించింది. ఆ అసురులు సామాన్యులు కారు. ఇంతకు పూర్వం యుద్ధాలలో ఇంద్రాది దేవతలను గడగడలాడించినవారు. అంత భయంకరమైన వారు, వారందరినీ ఒక్కతే కేవలం ఒక్క అర్థచంద్ర బాణంతో సంహరించిందిట.

బాలగా కనపడుతున్నా శక్తికి ఏమీ తక్కువ కాదు.బాల ఆరాధన ప్రాణశక్తి ఆరాధనగా చెప్పబడుతున్నది.హంసల రథం అమ్మది హంసలు అంటే శ్వాసకు సంకేతం.ఉచ్ఛ్వాస నిశ్వాసాత్మకమైన శ్వాసని, ప్రాణశక్తిని అక్కడ హంసగా పోలుస్తారు.ఆ విధంగా అమ్మవారి ఆరాధనలో ఈ ప్రాణశక్తిని మూల ప్రాణశక్తిని ఆరాధించడమే బాలారాధనగా పిలవబడుతున్నది.

శ్రీ బాలాత్రిపురసుందరీ ధ్యాన శ్లోకం:-

*బాలా త్రిపురసుందరి త్రిపురేశ్యైచ విద్మహే కామేశ్వర్యై చ ధీమహి తన్నోబాలా ప్రచోదయాత్.*

*పూజా ఫలితం:-* అమ్మను భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి శత్రువులను లేకుండా చేస్తుంది.ధనాధాయాన్ని పెంచుతుంది. ఆయుషును వృధి చేస్తుంది.ఆరోగ్య బలాన్ని ఇస్తుంది.🌹
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ప్రకృతితో రైతన్న బంధం: పుష్యమి కార్తెలో ఏం జరుగుతుంది?

పుష్యమి కార్తె: వర్షాల ఆశ, ఎదుగుదల.. సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలాన్ని వ్యవసాయ పంచాంగం ప్రకారం ఆ కార్తెగా పిలుస్తారు. మొత్తం 2...

Blog Archive

Recent Posts

Unordered List