శ్లోకము:
*కమలదలామల కోమలకాంతి కలాకలితాకుల భాల లతే*
*సకలకళా నిచయ క్రమకేళి చలత్కలహంస కులాలి కులే*
*అలికులసంకుల కువలయమండిత మౌలిమిలత్స కులాలికులే*
*జయ జయహే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే*
*భావము:*
కమలదళాలవలె అమలినమైన,కోమలమైన, కాంతియుతమైన కళాకేళిలో కదలాడే తుమ్మెదల, కలహంసల చిరుకదలికలు కలిగిన - తుమ్మెదలచే అలంకరించబడిన నల్లకలువవలె జులపాలతో ( ఉంగరాల జుట్టు)కూడిన శిరోజసంపద కలదానివి! రమణీయమైన కొప్పుకలదానివి!! మహిషుడను దానవున్ని సంహరించినదానవు!!! నీకు జయమగుగాక!!!!
🔱🌹 *ఆ తల్లి పాదపద్మములకు నమస్కరిస్తూ*🌹🔱
ఓ శైలసుతా! మృదువైన పద్మరేకులు వంటి కాంతిగల బాలాత్రిపురసుందరి రూపములో విలసిల్లుతుంటావు. *అరుణ కిరణ జాలైరంజితా శానకాసా! నివసతు హృది బాలా కల్యాణ శీలా* అని కొనియాడబడే నీవు, భక్తుల పాలిట కల్పలతవు. అందాలు చిందిస్తూ నీవు, రాజహంసలా వయ్యారంగా నడుస్తుంటే నీ సఖీగణములంతా నీ నడకను అనుకరిస్తూ నిన్ను అనుసరిస్తున్నారు.నీ తలలో తురుముకొనిన కలువపూలను ఆశ్రయించి తుమ్మెదలు నిన్ను అనుసరిస్తున్నాయి.నీవు పొగడ చెట్ల మధ్యనుండి నడుస్తుంటే పొగడపూలు నీ తలను తాకి సౌసలై మెరిశాయి. నీ అన్న బృందావనంలో సంచరించినట్లు నీవు వేడుకగా పొగడవనంలో సంచరిస్తున్నావు.కపర్ధినీ! నీకు జయమగుగాక!!
⚜️ *సర్వేజనా సుఃఖినోభవంతు*⚜️
🌸అమ్మా! చారు చరితా, సుశీలా, చక్కనైన చరిత నడవడి కలిగినదానా - నీవు నడచి వెల్తుంటే నీ పెంపుడు హంసలు నీ పదన్యాస క్రీడను (నీ అందమైన నడక పద్దతిని) అభ్యాసం చేయదలచి, ( నేర్చుకోదలచి) అవి మిగుల త్రోటుపాటు పడుతూ (తడబడుచూ) నీ విలాస గమనమును విడుచుటలేదు.( నీ వెనుక నడవడం మానుటలేదు) ఆ సమయంలో నీ పదముల పై ఉండు అతి రమ్యనైన మణులతో కూడిన నీ కలిఅందెల మువ్వల సవ్వడి, నీ వెనుక నడుస్తున్న ఆ పెంపుడు హంసలకు అడుగు తప్పకుండా తాళం వేస్తూ శిక్షణ ఇస్తున్నట్లు ఉన్నది.
{ లోకంలో హంస నడక గొప్పదు అని నానుడి.చక్కగా ఉన్న నడకను హంసనడకతో పోలుస్తూఉంటారు.కాని అమ్మ నడక అంతకన్నా గొప్పది అని శ్రీ శంకరుల అభిప్రాయం. ఆయన భావమేమనగా...ఒకసారి అమ్మ కైలాసమందు మానస సరోవరంలో స్నానం చేయడానికి విచ్చేసింది.ఆ సమయంలో అచటఉన్న అమ్మ పెంపుడు హంసలలో ఒక రాజహంస అమ్మ నడకను చూసింది.తన నడకను మించి అందంగా ఉన్న అమ్మ నడకను చూసి బెంగపడి తనతోటి హంసలను పిలిచి ఇలా పలికింది. ' ఇంతవరకూ లోకంలో మన నడకే అందమైనదని బ్రమలో మనం ఉన్నాం. ఇదిగో ఈ అమ్మ నడక మన నడకలను మించి శోయగంతో ఉంది.అందువలన మనం వెంటనే ఆ నడకను నేర్చుకోవాలి లేకపోతే లోకంలో మనఖ్యాతి నిలవదు ' అని పలికింది. ఆ మాట అంగీకరించిన హంసలన్నీ వెంటనే ఆ నడక నేర్చుకోవడానికి అమ్మ వెనుకబడి అది నేర్చుకోవడానికి కష్టమై, అడుగులు తడబడి పోతున్నా, పట్టువిడువకుండా వెంటపడి నడచుచున్నవి.ఆ సమయంలో అమ్మ నడచుచుండడం వలన మోగుచున్న అమ్న గజ్జెల శబ్ధం ఆ హంసలకు తాళం వేస్తూ శిక్షణ ఇస్తున్నట్లు ఉన్నది. అనగా అమ్మ నడక రాయంసల నడకను పరిహసించునట్టి శోభతో ఉన్నదని శ్రీ శంకరుల భావన. ఇందులో శ్రీ శంకరులు అమ్మ నడకను వర్ణించిరి. లలితాసహస్రంలో కూడా *మరాలీ మందగననా* అని ఒక నామం. అనగా ఆడహంస లాంటి నడకను కలిగినదానా అని అర్ధం. కాని శ్రీ శంకరులు హంస నడకను మించిన శోయగమైన నడక కలిగినది అమ్మ అని వర్ణించిరి.అంతేకాదు ఇక్కడ మరొక లోతైన అర్ధం కూడా కలదు. అది ఏమనగా ఇచట హంసలు అమ్మను అనుసరించడం అనగా జీవన్ముక్తులైన పరమహంసలు, యోగులు అమ్మ పాదములు విడువక సంచరించెదరని అంతరార్ధం.}







No comments:
Post a Comment