మోక్షంపొందే అతి శీఘ్ర మార్గం. ~ దైవదర్శనం

మోక్షంపొందే అతి శీఘ్ర మార్గం.

పూర్వకాలంలో ఖట్వాంగుడు అనే చక్రవర్తి ఒకరు సప్త ద్వీపాలను పరిపాలించేవాడు; అప్పటి భీకర యుద్ధాలలో దానవుల ధాటికి దేవతలు ఆగలేక పోతున్నారు; ఇంద్రాది ప్రముఖులు ఖట్వాంగుడిని యుద్ధంలో సాయం రమ్మని దేవతలు పిలిచారు; ఖట్వాంగుడు గొప్ప పరాక్రమం కలవాడు.

         ఖట్వాంగుడు వెళ్ళి దానవులను అందరిని వధించాడు; అతని సాయానికి మెచ్చి దేవతలు ఏదైనా వరం కోరుకోమన్నారు. దానికి ఖట్వాంగుడు, మహాత్ములారా, నేను ఇంకెంతకాలం బతుకుతాను అని అడగగా, దానికి దేవతలు ఇంకో ముహూర్తం కాలం మాత్రమే నీ ఆయుష్షు అని వివరించారు. ఇంకో ముహూర్తం కాలం మాత్రమే జీవితం మిగిలి ఉందని తెలుసుకున్నఖట్వాంగుడు భూలోకం వచ్చి సంపదలు, పుత్ర మిత్రాది బంధాలు, భయం విడిచాడు; విష్ణుభక్తి పట్టాడు; అలా ఒక ముహూర్త కాలంలో శ్రీహరిని సేవిస్తూ పరమాత్ముడి అనుగ్రహం చేత మోక్షాన్ని సంపాదించాడు.

       అంతట శుక మహర్షి, పరిక్షిత్తుతో “రాజా నీకు ఒక గొప్ప రహస్యం చెప్తాను విను. ఎంతటి వారైనా, ఎంతటి సిద్ధులు పొందినవారైనా, దేవతలైనా సరే మోక్షాన్ని ఇవ్వలేరు; తనంతట తనే సంపాదించాల్సిందే. ఎంత గొప్ప కర్మలు చేసినా, ఎంత సమర్థతతో చేసినా ముక్తి దొరకదు. మోక్షం సాధించాలి అంటే సంసార బంధాలను, భయాన్ని వదలాలి; విష్ణు భక్తి పట్టాలి. నారాయణుని పరిపూర్ణ అనుగ్రహం పొందాలి. మోక్షం సంపాదించాలంటే స్వర్గంలో కాదు, భూలోకంలోనే సాధన చేయాలి. ప్రతిరోజూ హరినామ సంకీర్తన అనే సాధనతో ఎంత తక్కువ సమయంలో అయినా మోక్షం పొందవచ్చు.
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ప్రకృతితో రైతన్న బంధం: పుష్యమి కార్తెలో ఏం జరుగుతుంది?

పుష్యమి కార్తె: వర్షాల ఆశ, ఎదుగుదల.. సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలాన్ని వ్యవసాయ పంచాంగం ప్రకారం ఆ కార్తెగా పిలుస్తారు. మొత్తం 2...

Blog Archive

Recent Posts

Unordered List