మగ వాళ్లకి ప్రవేశం లేని దేవాలయాల గురించి ఆశక్తికరమైన విషయాలు. ~ దైవదర్శనం

మగ వాళ్లకి ప్రవేశం లేని దేవాలయాల గురించి ఆశక్తికరమైన విషయాలు.


చెంగన్నూరు  భగవతి అమ్మవారు ...కేరళ..!!                                 

మగ వాళ్లకి ప్రవేశం లేని ఈదేవాలయాల గురించి ఆశక్తికరమైన విషయాలు...

మగవాళ్ళను అనుమతించని కొన్ని ఆలయాలు మన భారతదేశంలో ఉన్నాయి. ఈ దేవాలయంలో కేవలం ఆడవాళ్ళకు మాత్రమే అనుమతి  ఉండగా, మగవాళ్లకు ఎంట్రీ ఉండదు. గుడి లోకి మగవాళ్ళు రాకుండా ఉండేదుకై అక్కడ కాపలాదారులు కూడా ఉంటారు. ఆ ఆలయాలు ఎక్కడ ఉన్నాయి అనేది తెలుసుకుందాం…

రాజస్థాన్ లో

రాజస్థాన్ లోని పుష్కర్ లో బ్రహ్మ దేవుడు ఆలయం ఉంది.  బ్రహ్మ దేవునికి ఆలయాలు అరుదు అంతే కాకుండా ఆయన మగవాడు అయినప్పటికీ ఈ ఆలయంలో మగవాళ్లకు ప్రవేశం లేదు. కారణం… బ్రహ్మ యజ్ఞం చేయాలనుకుని నిశ్చయించుకున్నప్పుడు సరస్వతి దేవి అతని పక్కన ఉండదు. బ్రహ్మ, గాయత్రి అనే మహిళను పెళ్లి చేసుకొని యజ్ఞాన్ని పూర్తిచేస్తాడు. అందువలన సరస్వతి దేవికి ఆగ్రహం వచ్చి, ఈ ఆలయంలోకి పురుషులు ప్రవేశించకూడదని, ఒకవేళ వస్తే వారికి దాంపత్య సమస్యలు వస్తాయని శపిస్తుంది. అందుకే ఆ ఆలయానికి మగవాళ్ళు వెళ్లారు.

కన్యాకుమారి లో

దేశంలోని 51 శక్తీ పీఠాలలో ఒకటైన కన్యాకుమారి లో దేవీ ఆలయంలో ప్రధాన దేవత దుర్గా మాత అమ్మవారిని భాగతీ మాత గా పిలుస్తారు. ఈ ఆలయంలో కూడా పురుషులు వెళ్లరు. గుడి చుట్టూ మూడు సముద్రాలు (బంగాళాఖాతం, అరేబియా, హిందూ) ఉన్నాయి.

కేరళలో

చెంగన్నూర్ భగవతీ ఆలయం కేరళలో కలదు. ఇక్కడ అమ్మవారు ప్రతి నెల ఋతుస్రావాన్ని ఆచరిస్తుంది. శివ పార్వతులు కొత్తగా పెళ్ళైన సమయంలో చెంగన్నూర్ ను సందర్శించారట. ఇక్కడ మరో కథ కూడా ప్రచారంలో ఉంది. అమ్మవారికి గుడ్డ కప్పినప్పుడు అది ఎర్రగా మారుతుందట. అమ్మవారు రుతుస్రావం ఆచరించారని తెలుసుకొని గుడిని ప్రతి నెల మూడు రోజుల పాటు మూసేస్తారు. ఆ సమయంలో కేవలం ఆడవారిని మాత్రమే లోనికి అనుమతిస్తారు. నాలుగోరోజు ఆడవారు రహస్యంగా విగ్రహానికి పవిత్ర జలంతో శుద్ధి చేస్తారు. ఆ తర్వాత మగ పూజారులు వచ్చి అభిషేకం నిర్వహిస్తారు.

కేరళలో

కేరళ రాష్ట్రంలో అట్టుకల్ దేవాలయం గుడిలో పార్వతి దేవి కొలువై ఉంటుంది. ఒక్క మగాడూ కూడా వెళ్లరు... కాదని వెళితే  పాపాలు చుట్టుకుంటాయని వారి భావన. ప్రతి ఏటా నిర్వహించే ఉత్సవాలకు, ఊరేగింపులు కేవలం మహిళలు మాత్రమే వెళ్తారు.

కేరళలో

కేరళ రాష్ట్రంలో దుర్గా దేవి కొలువై ఉండే ఈ దేవాలయాన్ని చక్కులాతుకవు దేవాలయం అంటారు. ప్రతీ సంవత్సరం  వారం రోజులపాటు అమ్మవారికి నారీ పూజ చేస్తారు. మహిళలు వారం రోజులపాటు నిష్ఠతో ఉపవాసం ఉండి అమ్మవారిని పూజిస్తారు. అప్పుడు కేవలం మహిళలు మాత్రమే ఆలయం ఉండాలి. మగవాళ్ళు ఉండరాదు.

బీహార్ లో

మాతా ఆలయం బీహార్ రాష్ట్రంలోని ముజఫర్ పూర్ పట్టణంలో కలదు. అమ్మవారికి ఏటా కొన్ని ప్రత్యేక రోజులలో పూజలు నిర్వహిస్తారు. ఆ సమయంలో కేవలం ఆడవారిని మాత్రమే గుడి లోనికి అనుమతిస్తారు. మగవారిని అనుమతించరు.
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ప్రకృతితో రైతన్న బంధం: పుష్యమి కార్తెలో ఏం జరుగుతుంది?

పుష్యమి కార్తె: వర్షాల ఆశ, ఎదుగుదల.. సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలాన్ని వ్యవసాయ పంచాంగం ప్రకారం ఆ కార్తెగా పిలుస్తారు. మొత్తం 2...

Blog Archive

Recent Posts

Unordered List