పూర్ణా. ~ దైవదర్శనం

పూర్ణా.

పూర్ణమైనది శ్రీమాత అని అర్ధము.

పూర్ణము, శూన్యము అను రెండు పదములను గూర్చి అలోచించి నపుడు దృశ్యా దృశ్యములు భావనకు వచ్చును. పూర్ణము కంటికి అగుపడు పూర్ణము. శూన్యము కంటికి అగుపడనిది ఒకటి ఉన్నట్లుండును మఱియొకటి లేనట్లుండును ఉన్నట్లు అగుపడుట దృష్టిని బట్టి
ద్రష్టను బట్టి యుండును. కొందరు కనబడునదే చూడలేరు. కొందఱు కబడునది కనబడనది కూడా చూడగలరు. వీరికి సూక్ష్మ దృష్టి యుండును. సూక్ష్మ దృష్టి యున్నవారు కూడా తమలో నుండి చూచుచున్న చైతన్యమును చూడలేరు. చైతన్యమాధారముగా సూక్ష్మ దృష్టి స్థూల దృష్టి ఏర్పడు చున్నవి.

పూర్ణిమ చంద్రుని కన్నుల గల వారందరూ చూడ గలరు. అట్టివారు అష్టమి చంద్రుని చూచినపుడు చంద్రుడు సగమే కనపడును. కనబడని భాగము లేదనుట సత్యమా? కాదుకదా మనకు కనబడదు గానీ యున్నది శుక్లాష్టమి నాడు కనపడిన భాగము కృష్ణాష్టమి నాడు కనబడదు. రెండు భాగములు పూర్ణముగా కనిపించునపుడు పౌర్ణమి అందుము. రెండుభాగములు కను పించని నాడు అమావాస్య అందుము. పౌర్ణమి, అమావాస్య శుక్ల పక్ష తిధులు , కృష్ణపక్ష తిధులు భూమికి , భూమి జీవులకే గాని చంద్రునకు కావు. చంద్రునికి  హెచ్చు తగ్గులు లేవు.

చంద్రుని చూచు మనకుండును. కారణము మనలోని హెచ్చుతగ్గులే. ఇట్లే  సృష్టి ఆది, వృద్ధి, అంతము, ఇవి అన్నియూ జీవులకే గాని శ్రీమాతకు కాదు. ఆమె ఎప్పుడూ పూర్ణయే అట్టి పూర్ణత్వమును జీవులు కూడా పొంద వలెనని శ్రీమాత ఆకాంక్షఅట్టి పూర్ణత్వము పొందుట వలన పొందిన జీవులు శ్రీమాత భక్తులుగా ఇతరులకు ఆదర్శ పాయులుగా సృష్టి యున్నంత కాలము ఉందురు. సృష్టి శ్రీమాత యందు లయమైనపుడు ఆమెను చేరుదురు. మరల ఆరంభమున ఆమె నుండి పూర్ణులు గానే వెలువడి శ్రీమాత  అనుజ్ఞానుసారము సృష్టి నిర్వహణమున పాల్గొందురు.

ఈ నామము జీవుల గమ్యమును తెలుపు నామము మరల మరల సృష్టి నిర్మాణములు చేయుటకు. శ్రీమాత సంకల్పించుటకు కారణము కూడా జీవులు పూర్ణత్వము పొందుట కొఱకే ఇది శ్రీమాత సహజ స్థితి. 
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ప్రకృతితో రైతన్న బంధం: పుష్యమి కార్తెలో ఏం జరుగుతుంది?

పుష్యమి కార్తె: వర్షాల ఆశ, ఎదుగుదల.. సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలాన్ని వ్యవసాయ పంచాంగం ప్రకారం ఆ కార్తెగా పిలుస్తారు. మొత్తం 2...

Blog Archive

Recent Posts

Unordered List