సాధారణంగా శనిని చూసి కష్టాలు కలిగిస్తాడని చాలా మంది భయపడుతుంటారు. శని పాపములకు తగిన దండన ఇస్తాడని జ్యోతిష శాస్త్రం వివరిస్తుంది.గోచారంలో జన్మ రాశికి వ్యయంలోను,జన్మ రాశిలోను,జన్మరాశికి ద్వితీయంలోను శని గ్రహ సంచారం జరుగుతుంటే దానిని ఎలినాటి శని కాలం అంటారు.ప్రతి రాశిలోను 2 సంవత్సరాల 6నెలల చొప్పున మొత్తం ఏడున్నర సంవత్సరమముల కాలం, శని మహర్దశా కాలంలో, చతుర్ధంలో శని సంచారాన్ని అర్ధాష్టమ శని అని,అష్టమంలో శని సంచారాన్ని అష్టమశని అని అంటారు.ఈ సంచార కాలంలో సమస్యలు సృష్టిస్తాడు. వీటికి ఆందోళన చెందవలసిన పని ఉండదు. పరిహారాలు ఉంటాయి.
శని ఆధిపత్యంలో ఉన్న రాశులు అయిన కుంభ, మకర రాశుల వారికి , మిత్ర స్థానాలు అయిన మిధున, కన్యా, వృషభ, తులా రాశుల వారికి శని నక్షత్రాలైన పుష్యమి, అనూరాధ, ఉత్తరాభద్ర నక్షత్రాలలో జన్మించిన వారికి, కొంత వెసులుబాటు ఉంటుంది. కష్టాలు మనిషి అహంకారం తగ్గించి జీవిత సత్యాలను తెలియ చేయడమే కాక సుఖానికి ఉన్న విలువను గుర్తించేలా చేస్తుంది. శని జీవిత గమనానికి కావలసిన స్థిరాస్థులను ఏర్పరుచుకోవడానికి కారకుడౌతాడు కనుక కొంత మంచి జరుగుతుంది. కష్టాలను ఓర్చుకునే శక్తిని, వాటిని అధిగమించే శక్తిని ఇచ్చి మనిషిని పుటం పెట్టిన బంగారంలా మెరిసేలా చేస్తుంది.
శని వైరాగ్యాన్ని, భక్తిని ప్రసాదిస్తాడు.భవిష్యత్ చెప్పువారికి శని అవసరం చాలా వుంది.కుటుంబ బంధాలపై తగువుపెట్టి వ్యక్తిని ఒంటరిని చేసి తపస్సుకు దారి తీస్తుంది.కర్మబలంచే శని మనల్ని భ్రష్టు పట్టించిన ఆత్మజ్ఞానాన్ని,స్వయంప్రకాశిక శక్తిని ఇచ్చి ఉన్నత ప్రమాణాలను,విలువలను ఇస్తాడు.శని కుజుల కలయిక వలన పూర్వజన్మలో అనేక నీచ దుష్కర్మలు చేసిన వాడై ప్రస్తుత జన్మలో ఘోరాలు చేస్తాడు.రాహువు శని కలయిక వలన ఉన్నత స్థితికి తీసుకొని వెళ్ళి పతనానికి దారితీస్తాడు.
శని దశా ప్రారంభ సమయం, అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలిననాటి శని కాలం శని సమస్యలను ఇచ్చే సమయం. శివారాధన,శివార్చన, శివాలయ దర్శనం చేయాలి. శని దశాకాలం పందొమ్మిది సంవత్సరాలు కనుక పంతొమ్మిదివేల సార్లు జపం చేయించాలి. నువ్వులు, మినుములు, నూనెలను దానం ఇవ్వాలి. నల్ల వస్త్రాలు ధరించి శని గాయత్రి, శని శ్లోకం లాంటివి పారాయణం చేయాలి. అయ్యప్ప జయంతి, శనీశ్వర వ్రతం, సత్యనారాయణ వ్రతం, అయ్యప్పస్వామి పూజ చేయాలి. కూర్మపురాణ పారాయణం, వేంఖటేశ్వర శతనామావళి, శని అష్టోత్తరం చేయాలి.ఆంజనేయుడిని పూజించి దర్శించుట. పూజకు ఇనుముతో చేసిన ప్రతిమను వాడాలి. నైవేద్యం నువ్వులతో కలిపిన అన్నం, నువ్వు చిమ్మిరి, నువ్వు ఉండలు, ద్రాక్షరసం వాడాలి. కపిల గోవు దానం చేయాలి. శనికి ప్రీతికరమైన జ్యేష్టశుద్ధ ద్వాదశి, మార్గశిర శుద్ధ అష్టమి నాడు పూజలు జపాలు నిర్వహించడం శ్రేష్టం. దోషనివారణకు నీలమణి, ఎర్రచందన మాల, చతుర్దశ ముఖ రుద్రాక్ష ధారణ చేయాలి.
హోమముకు వాడవలసిన సమిధ జమ్మి. ప్రీతికరమైన వారం శనివారం. ఉదయాన్నే ప్రాణాయామం,యోగా,మెడిటేషన్,తపస్సు,దేవాలయ ప్రధక్షణలు,వాకింగ్ చేయటం మంచిది.నల్ల కుక్కకు ఆహారం పెట్టటం,చీమలకు తేనె పెట్టటం,ముసలి వారికి సేవచేయటం,భిక్షకులకు దానం చేయటం.శని వారం రోజు ఒంటి నిండా నువ్వుల నూనె పట్టించి వేడి నీటితో స్నానం చేయటం మంచిది.నీలం రత్నాన్ని గాని ఉపరత్నాలు గాని వాడాలి.సప్తముఖి రుధ్రాక్ష గాని,చతుర్ధశ ముఖి రుద్రాక్షని గాని వాడాలి.పూర్వజన్మ పాపాలు పోవాలంటే శ్రీదక్షిణకాళికాదేవిని పూజించాలి. 19 శనివారాలు ఉపవాసం ఉండటం మంచిది.ఆవాలు కలిపిన పెరుగన్నం గేదెలకు పెట్టాలి.పిల్లలకు నువ్వుల ఉండలు పంచి పెట్టాలి.గోదుమపిండితో చేసిన చిన్న చిన్న ఉండలను చేపలకు ఆహారంగా వేయాలి.కాకులకు అన్నం తినేముందు ఆహారం పెట్టాలి. శని యంత్రానికి పూజ చేయాలి.గుర్రపు నాడాను ఇంటికి తగిలించాలి.గుర్రపు నాడా రింగ్‌ని గాని స్టీల్ రింగ్ గాని మద్య వ్రేలుకి ధరించాలి.ఎమితెస్ట్ పిరమిడ్‌ని రాత్రి పూట కాపర్ చెంబులో వేసుకొని ఉదయం పూట ఆ నీటిని త్రాగాలి.

No comments:
Post a Comment