శివ స్తుతి. ~ దైవదర్శనం

శివ స్తుతి.

శ్రీశైల మల్లన్నను అచ్చులు,హల్లులతో ఎలా స్తుతించాడో
చూడండి. ఇలాగే పాల్కురికి సోమన్న కూడా అద్భుతంగా వ్రాశారు.

'అ'ఖిల లోకాధార
'ఆ'నంద పూర
'ఇ'న చంద్ర శిఖి నేత్ర 
'ఈ'డితామల గాత్ర
'ఉ'రు లింగ నిజరూప
'ఊ'ర్జితా జలచాప
'ఌ'లిత తాండవకాండ
'ౡ'నికృతా జాండ
'ఏ'కైక వర్యేశ
'ఐ'క్య సౌఖ్యా వేశ
'ఓం' కార దివ్యాంగ 
'ఔ'న్నత్య గుణ సంగ
'అం'బికా హృదయేశ
'అః'స్తోక కలనాశ

'క'నద హీనాభరణ
'ఖ'ల జలంధర హరణ
'గ'ల నాయక విధేయ
'ఘ'న భక్తి విజేయ
'జ'శ్చూల కాలధర
'చ'రిత త్రిశూల ధర
'ఛ'ర్మ యాధ్వస్త
'ఞ'న గుణ ధళ ధీర
'ట' త్రయాది విదూర
'ఠ' ప్రభావాకార
'డ'మరుకాది విహార
'ఢ' వ్రాత పరిహార
'ణ' ప్రవాగార
'త'త్త్వ జోనేత
'థ'వి దూర జవ పక్ష
'ద'వన పాలన దీక్ష
'ధ'రణీ థవోల్లీడ
'నంది కేశారూఢ
'ప'ర్వతీశ్వర లింగ
'బ'హుళ భూత విలాస
'భ'క్త్వ హృద్వ నహన
'మం'త్రస్తుతోధార
'య'క్ష రుద్రాకార
'ర'తిరాజ బిన హంస
'ల'లిత గంగోత్తంస
'ళ'మా విదవ్రంశ
'వ'రద శైల విహార
'శ'ర సంభ వాస్ఫార
'ష'ట్తింశ తత్త్వగత 
'స'కల సురముని వినుత
'హ'రి నేత్ర పదపద్మ- అంశిత భూధరపద్మ
'క్ష'ర రహిత చరిత్ర - అక్షరాంక స్తోత్ర
శ్రీ పర్వత లింగ
నమస్తే నమస్తే నమస్తే నమః.
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ప్రకృతితో రైతన్న బంధం: పుష్యమి కార్తెలో ఏం జరుగుతుంది?

పుష్యమి కార్తె: వర్షాల ఆశ, ఎదుగుదల.. సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలాన్ని వ్యవసాయ పంచాంగం ప్రకారం ఆ కార్తెగా పిలుస్తారు. మొత్తం 2...

Blog Archive

Recent Posts

Unordered List