విజయదశమి కథ. ~ దైవదర్శనం

విజయదశమి కథ.


మహిషాశురుడు అనే రాక్షసరాజు బ్రహ్మదేవుని ధ్యానిస్తూ ఘోరమయిన తపస్సుచేసాడు. చాలా కాలం ఆ రాక్షసుడు తపస్సు చేసిన పిదప బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ ఘోరమయిన తపస్సు చూసి బ్రహ్మదేవుడు మిక్కిలి సంతోషించి ఏదైనా వరం కోరుకోమని మహిషాశురుడిని అడిగాడు. కపట బుద్దితో ఉన్న మహిషాశురుడు ఎప్పటికి చావులేకుండా వరాన్ని ప్రసాదించమని బ్రహ్మదేవుని వేడుకొన్నాడు.

అప్పుడు బ్రహ్మదేవుడు, నాయనా పుట్టిన ప్రతి జీవికి మరణం తప్పదు, మరేదైనా వరం కొరుకో అని అనటంతో, మహిషాశురుడు ఇలా ఆలోచించసాగాడు, మరణాన్ని తప్పించే వరం ఎటూ పొందలేకపొయాను కాని మరణాన్ని పొందకుండా ఉండటానికి మరే విధమయిన మర్గాలున్నాయా అన్నట్లు ఆలోచించి, స్త్రీలు పురుషులతొ సమ ఉజ్జీలు కాదుకాబట్టి, వారు శాంతస్వరూపులు కాబట్టి వారితో ప్రాణహాని ఉండదు కాబట్టి వరాన్నీ ఈవిధముగా కోరుకొంటే బాగుంటుండి అని ఆలోచించి, ఓ బ్రహ్మదేవా స్త్రీ చేతులలోనే మరణం ఉండేటట్లు నాకు వరాన్ని ప్రసాదించు దేవా అని కొరుకొన్నాడు.

అప్పుడు బ్రహ్మదేవుడు, అటులనే తధాస్థు అని మహిషాశురుడు కోరుకొన్న వరాన్ని అతనికి ప్రసాదించి అక్కడినుంచి అద్రుశ్యమయ్యాడు.

దాదాపుగా మరణమే లేని వరం పొందామనే ఆనందతో మహిషాశురుడు తన రాజ్యానికి తిరిగి వెళ్ళిపోయాడు మహిషాశురుడు, కొంతకాలానికి ఆయనకు ఒక దుష్టమయిన ఆలోచన వచ్చింది, అది ఏమిటంటే తనకు పురుషులతో ఎటూ మరణం లేదు కాబట్టి దేవతల లోకమయిన అమరావతి మీద దండయాత్ర చెయ్యాలని.

సైనికులారా విజయకాంక్షతో పయనమవ్వండి, ఆ స్వర్గలోకాన్ని తుదముట్టిద్దాం అంటూ ఇంద్రలోకం పై దండెత్తాడు.

ఈవిషయం తెలుసుకొన్న ఇంద్రుడు చాల కోపంతో తన సైనికులని కూడా యుద్దానికి సమాయత్తం చేసి రణరంగానికి పయనమయ్యాడు.

చాలా సార్లు చాలామంది రాక్షసులు ఇంద్రలోకంపై దండెత్తినప్పటికి విజయం సాధించలేకపొయారు, కాని ఈసారి ఆ భయంకరమయిన యుద్దములో ఇంద్రుడు మహిషాసురుని చేతిలో పరాజయంపాలై ఇంద్రలోకాన్ని విడిచి పలాయానమయ్యాడు.

ఇక ఇంద్రలోకాన్ని అదిష్టించిన మహిషాశురుడు విజయ గర్వంతో ఇంకా చెలరేగసాగాడు, భూలొకంలో దేవాలయ్యాల్లో దేవతల విగ్రహాలన్నిటిని తొలగించి ఆ స్తానంలో తన విగ్రహారాధన జరగాలని, ఎవరూ యజ్ఞ యాగాదులు చేయరాదని, అందరూ తననే స్థుతించాలని ఆజ్ఞాపించాడు అలా చేయనివారిని నానా అగచాట్లు పెట్టటం ప్రారంబించాడు. మహిషాశురుని విపరీతక్రుత్యాలకి వేగలేని ఋషులు, మునులు, దేవతలు కలసి ఈ భాదలనుంచి విముక్తి పొందటానికి కైలాసానికేగి భోలాశంకరుడికి మహిషాశురుని అక్రుత్యాలు వివరించారు.

అప్పుడు భోలాశంకరుడు తన దివ్యద్రుష్టితో మహిషాశురుడి శక్తి ని పరీక్షించి, మహిషాశురుడు బ్రహదేవునితొ వరంపొందటం వల్లన, మరియు సహజంగానే అతను శక్తివతుండవ్వటం వల్ల మహిషాశురుడిని తుదముట్టించటానికి త్రిమూర్తుల అందరిశక్తి అవసరమని గ్రహించారు. అటుపిమ్మట బ్రహ్మదేవుని, విష్నుదేవుని కలసి త్రిమూర్థుల శక్తి తో అఖండ శక్తి వంతమయిన స్త్రీని సౄష్టించారు.

వేయిచేతులతో అత్యంత శక్తివంతురాలిగా సౄష్టించబడిన ఆమే కనకదుర్గాదేవి. శంకరుడు ఆయన శక్తితో మరో త్రిసూలం సౄష్టించి ఆమెకు ప్రసాదించగా, విష్నుభగవానుడు తన విష్నుచక్రాన్ని, ఇంద్రుడు తన వజ్రాయుదాన్ని, మిగతా దేవతలు వారి వారి ఆయుధాలిని కనకదుర్గాదేవికి ఇవ్వగా సర్వ శక్తివంతమయిన కనకదుర్గాదేవి ఉగ్రస్వరుపురాలై గర్జించే సిం హాన్నే వాహనముగా చేసుకొని రణరంగానికి పయనమయ్యింది. ఆ భీకరమయిన పోరులో మహిషాశురుడు దున్నపోతు రూపందాల్చి కనకదుర్గాదేవి పై దండెత్తగా ఆమె ఉగ్రరూపం దాల్చి మహిషాశురుడి శిరస్సు చేదించి లోకానికి ప్రశాంతత ప్రసాదించింది.

కథ సారాంశం: చెడు పై మంచి పొందిన విజయం కనుక దీనిని విజయదశముగా మనం ఈ పండుగ జరుపుకొంటాం. తొమ్మిది రోజులు ఘొరమయిన రణం తరువాత విజయం సిద్దించినది కాబట్టి ఈ పండుగనే మనం నవరాత్రులుగా కూడా పిలుచుకొంటాము.

చెడు తాత్కాలికంగా విజయం సాదించినప్పటికి అంతిమ విజయం మంచిదే, కాబట్టి శాశ్వతమయిన మంచిని పొందటానికే మన ప్రతి ప్రయత్నము సాగిద్దాం.

అమ్మలగన్నయమ్మ ; ముగ్గురమ్మలమూలపుటమ్మ; చాల పె
ద్దమ్మ; సురారులమ్మ కడుపారని బుచ్చినయమ్మ ; తన్నులో
నమ్మిన వేల్పుటమ్మల మనంబున నుండెడియమ్మ; దుర్గ;మా
యమ్మ ; కృపాబ్ధి  యిచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్!🌹


విజయదశమికి శమీ వృక్షానికి ఉన్న సంబంధం ఏంటి..?
   
 దసరా చివరిరోజు విజయదశమి.. ఈ రోజుకు ఎంతో విష్టత ఉంది. ఆరోజు శమీ వృక్షం అంటే జమ్మి చెట్టుకు పూజలు చేస్తారు చాలా మంది. ఇలా ఎందుకు చేస్తారు..? అసలు విజయదశమికి శమీ వృక్షానికి ఉన్న సంబంధం ఏంటి..?
శమీవృక్షం పాపాన్ని పరిహరిస్తుంది. శత్రువులను నాశనం చేస్తుంది. ఇది నాడు అర్జునుని ధనువును కాపాడింది. శ్రీరాముడికి ప్రియాన్ని కలిగించింది. జమ్మి చెట్టును పూజించడం లక్ష్మీప్రదమని పురాణాలు చెబుతున్నాయి. శమీ వృక్షం సువర్ణ వర్షం కురిపిస్తుందని శాస్త్రాల్లో ఉంది. విజయదశమి రోజున పూజలు అందుకున్న జమ్మి చెట్టు ఆకులను ఇంట్లోని పూజాస్థలంలో, ధన స్థానంలో ఉంచుతారు. దీనివల్ల ధనవృద్ధి జరుగుతుందని నమ్మకం. పరమ శివునికి, జగన్మాత దుర్గాదేవికి, సిద్ధి ప్రదాత వినాయకుడికి శమీ పత్రి సమర్పించే ఆచారం అనాదిగా వస్తోంది. అంతేకాదు, జమ్మి చెట్టు కాడల రాపిడి ద్వారా సృష్టించిన అగ్నితోనే పూర్వం యజ్ఞ యాగాదుల క్రతువులు నిర్వహించేవారట. ఇప్పటికీ దేశంలోని అనేక ప్రాంతాల్లో శమీ వృక్షంలో అగ్ని దాగి ఉంటుందనే నమ్మకం చాలా మందిలో ఉంది.

 విజయదశమి రోజే రోజే రాముడు రావణునిపై విజయం సాధించాడు. విజయదశమి రోజునే ఉత్తర గోగ్రహణానికి వెళ్లిన అర్జునుడు విజయంతో తిరిగొస్తాడు. అందుకే విజయదశమి రోజునే శమీ పూజ కుడా నిర్వహిస్తారు.

పాండవులు అజ్ఞాతవాసం చేయాలని సంకల్పించినపుడు తమ ఆయుధాలను ఈ జమ్మి చెట్టుమీద దాచి విరాటరాజు కొలువుకు చేరతారు. అజ్ఞాతవాసం ముగిసే సమయాన ఉత్తరుని సహాయముతో అర్జునుడు శమీ వృక్షాన్ని చేరి పూజించి, తాము దాచి ఉంచిన ధనస్సు, బాణాలనూ ధరించి శత్రువులతో యుద్ధం చేస్తాడు. విజయం సాధిస్తాడు. ఈ కారణంగానే శమీ వృక్షపూజ అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. సాధారణంగా విజయదశమి నాడు శ్రవణ నక్షత్రం ఉంటుంది. నక్షత్ర మండలంలో శ్రవణ నక్షత్రం చెవి ఆకారంలో ఉంటుంది. అందుకే ఏదైనా కొత్త విద్యలు నేర్చుకోవాలనుకొనేవారు విజయదశమి రోజున ప్రారంభిస్తే మంచిదని పెద్దలు చెబుతారు.🌹


ఈరోజు శ్రీ మాత రాజరాజేశ్వరిగా దర్శనమిస్తుంది.
 ఈ క్రింద రాజరాజేశ్వరీ అష్టకములు లోనుంచి కొన్ని శ్లోకాలు , వాటి అర్ధాలు ఇవ్వబడ్డాయి.

 అంబా శాంభవి చంద్రమౌళీ రబలా అవర్ణా ఉమా పార్వతీ
కాళీ హైమవతీ త్రినయని కాత్యాయని భైరవి
సావిత్రీ నవయౌవనీ శుభకరీ సామ్రాజ్యలక్ష్మీ ప్రదా చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరి

అర్థం
చంద్రవంకను నుదుటిపై ధరించిన ఓ శాంభవి ! జగజ్జనని ! ఉపవసించు కాలంలో కనీసం ఆకులు కూడా భుజించని నిన్ను పార్వతి , కాళీ , హైమవతీ , శివా నామములతో భక్తులందరూ కీర్తించెదరు.  త్రినేత్రములు కలిగి ఎల్లప్పుడు యవ్వనంగా ఉండే నిన్ను కాత్యాయని , భైరవి , సావిత్రి అని కూడా స్తుతిస్తారు. దేవతలను పాలించే నువ్వు సకల శుభములను , ఐశ్వర్యాన్ని ,సామ్రాజ్యాన్ని ,అవధులు లేని ఆనందాన్ని ప్రసాదించెదవు.

అంబా మోహిని దేవతా త్రిభువనీ ఆనందసంధాయినీ వాణీ పల్లవపాణి వేణు మురళీగాన ప్రియాలోలినీ కాత్యాయని ఉడురాజబింబవదనా ధూమ్రాక్షసంహారిణీ చిద్రూపి పరదేవతా భగవతి శ్రీ రాజరాజేశ్వరీ

అర్థం

 మోహిని ! ముల్లోకాలను పాలించే తల్లి ! భక్తులకు అంతులేని ఆనందాన్ని ప్రసాదించెదవు. వాక్ రూపమైనా నీవు సంగీతము మరియు శ్రీకృష్ణుని వేణుగాన మాధుర్యమును కలిగి ఉందువు. సకల శుభంకరి !చంద్రుని ప్రతిబింబమువలె ప్రకాశించు మోముగల తల్లి !ధూమ్రాక్ష అనే అసురుని సంహరించిన నీవు సకల దేవతలకు అధినేత్రిగా వెలుగుచున్నావు.

అంబా నూపుర రత్నకంకణధరీ కేయూరహారావళీ
జాజీ చంపక వైజయంతి లహరీ గ్రైవేయ గైరాజితా వీణావేణు వినోదమండితకరా వీరాసనే సంస్థితా
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరి

అర్థం 

సకల మణులు , రత్నాలతో పొదిగిన కంకణం ధరించిన ఓ అంబా !  కేయూరాలతో మరియు గాజుతో తయారుచేయబడిన మాల తో అలరారు నీ కంఠము సుగంధ ద్రవ్యాలు మరియు ముత్యాలు కలిగి ఉన్నది. నీ హస్తమందు వీణా మరియు వేణు ధరించిన నీవు వీరాసనా అనబడే యోగముద్రలో ఆసీనురాలివై ఆనందమయ స్వరూపిణివి. సకల దేవతలకు అధినేత్రిగా నీవు  వెలుగుతున్నావు.

అంబా రౌద్రిణి భద్రకాళి భగళా జ్వాలాముఖీ వైష్ణవీ
బ్రహ్మాణీ త్రిపురాంతకీ సురనుతా దేదీప్యమానోజ్వలా చాముండాశ్రిత రక్షపోషజననీ దాక్షాయణీ వల్లవీ
చిద్రూపి పరదేవతా భగవతి శ్రీ రాజరాజేశ్వరీ

 అర్థం

 భద్రకాళి,  అంబా , రుద్రాణి  , భగళా,  జ్వాలాముఖీ , వైష్ణవీ , బ్రహ్మణి అని స్తుతించినంతనే ముల్లోకాలలో ఉన్న క్లేశాన్నంతటినీ  తీసివేసే సమర్థత కలిగిన తల్లి ! దేవతలచే పూజించబడే నువ్వు జ్యోతిగా ప్రకాశించి , చాముండి అని పిలవబడుతున్నావు. రక్షించి, క్షమించి, పాలించే తల్లిగా నిన్ను, 'దాక్షాయని' అని కూడా స్తుతిస్తారు.
ఓం శ్రీ మాత్రే నమః.

https://www.facebook.com/rb.venkatareddy
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ప్రకృతితో రైతన్న బంధం: పుష్యమి కార్తెలో ఏం జరుగుతుంది?

పుష్యమి కార్తె: వర్షాల ఆశ, ఎదుగుదల.. సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలాన్ని వ్యవసాయ పంచాంగం ప్రకారం ఆ కార్తెగా పిలుస్తారు. మొత్తం 2...

Blog Archive

Recent Posts

Unordered List