గంగా మహిమ –దశహార స్తోత్రం .. కాశీ కి ఆనంద కాననం అనే పేరెలా వచ్చిందో కుమార స్వామి అగస్తునికి ఇలా వివ రించాడు .సాగర పుత్రులు అశ్వ మేదాశ్వం వెంట వెళ్లి కపిల మహర్షిని అవమానించి ఆయన క్రోధాగ్నికి దగ్దులైనారు .భగీరధుడు ఈ వృత్తాంతాన్ని విని ,వారికి ముక్తి కల్గించే ఉద్దేశ్యం తొ తపస్సు చేసి గంగను తీసుకు రావాలని నిశ్చయించుకొన్నాడు .హిమాలయాలకు వెళ్లి తపస్సు ప్రారంభించాడు .త్రిపద గామిని అయిన గంగ నుభూమికి తెచ్చి తన తన పితామహు లందర్నీ ఉత్తమ లోకాలకు పంపాలని ఆయన సంకల్పం గంగ సమస్త బ్రహ్మాం డాలకు ఆధారమైనది .శుద్ధ విద్యా స్వరూపిణి ,త్రిశక్తి .కరుణాంతరంగ .పరబ్రహ్మ స్వరూపిణి .చతుర్విధ పురుషార్ధాలు గంగా నదిలో ఉన్నాయి .గంగా దర్శనం చేతనే సకల పాపాలు నశిస్తాయి .గంగను స్మరిస్తే సంసార బంధ విముక్తి కలుగు తుంది .భక్తీ తొ తేనె ,నువ్వులు ,తొ కూడిన పిండాలను గంగోదకాల లో సమర్పించిన వాడి పితరులునూరేళ్ళు పరి తృప్తి పొందుతారు .
గంగా నది లో స్నానం సర్వ తీర్ధ ఫలదం .వ్రతాలలో సత్య వ్రతం ,దానాల్లో అభయ దానం ,పర్వతాలలో హిమవత్పర్వతం ఎంత గొప్పవో గంగ అంత గొప్పది .గంగా పానం ఎన్నో జన్మల పాపాన్ని హరిస్తుంది .గంగ లో అమా వాస్య నాడు స్నానం చేస్తే నూరు రెట్లు అధిక పుణ్యాన్నిస్తుంది .జ్యేష్ట శుద్ధ నవమి హస్తా నక్షత్రం లో స్నానం ,రాత్రి జాగరణ చేస్తే ,దీపాలను వెలిగించి హారతిస్తే ,దానం చేస్తే ఉత్తమ లోక ప్రాప్తి కలుగు తుంది .
గంగను పూజిస్తూ ‘’శుభకరీ అగు గంగ కు నమస్కారం .రుద్ర రూపిణి సకల దేవత స్వరూపిణి ,నమస్కారం .ప్రాణి కోటి విశాహారిణీ నమోస్తుతే ,ముక్తి భుక్తి ఇచ్చే నీకు నమో నమః .స్వర్గ లోక ప్రాప్తి కల్గించు నీ కిదే నమస్కారం .మంగళ స్వరూపిణివి .పరాపరాలకు ఆధారం నీవే .నిర్వాణ సుఖాన్నిచ్చే నీకు వందనం .మూల ప్రకృతివి ,పరబ్రహ్మ స్వరూపిణివి నీకు ప్రణామం ‘’అని గంగా స్తవం ఎవరు జ్యేష్ట శుక్ల దశమీ హస్తా నక్షత్రం లో ప ఠిస్తారో వారి జోలికి దరిద్రం రానే రాదు .శ్రీ మహా విష్ణువు ఎంతో శివుడు అంతే .ఉమకు గంగకు భేదం లేదు .శివ కేశవులకు లక్ష్మీ పార్వతులకు గంగా గౌరీ లకు భేదం ఉందని భావించే వాడు మూర్ఖుడు .

No comments:
Post a Comment