శ్రీదేవీ తత్వం - 2 ~ దైవదర్శనం

శ్రీదేవీ తత్వం - 2

స్వగురువేనమః ! పరమ గురువేనమః !పరమేష్టి గురువేనమః !

సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్ధ సాధకే,
శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణీ నమోస్తుతే.

సత్వ, రజో,తమో గుణములైన గుణ త్రయమునకు మాయ అనబడును. అట్టి మాయ ఉపాధిగా గల భగవతి శ్రీదేవియే పరబ్రహ్మ తత్త్వము. అట్టి పర బ్రహ్మము నుండియే బ్రహ్మ విష్ణు మహేశ్వరులను గౌరీ లక్ష్మీ సరస్వతులు ఉత్పత్తి నొందిరి. శ్రీదేవియే త్రిమూర్తులకును ఈ దేవీ త్రయము నిచ్చెను. రాముడు, శ్రీకృష్ణుడు, గణపతి, సుబ్రహ్మణ్యుడు  నుంచి ముక్కోటి దేవతల వరకు సప్త ఋషులు వరకు, మహా మునులు, ఋషులు, యోగులు, సిద్దులు, బాబాలు, గురువులు, బ్రహ్మ నుంచి మన పిల్లలవరకు ఈ సృష్టిలోని సమస్త ప్రాణి కోటి ఆ మహా గర్భము నుంచి వచ్చినవే. సమస్త ప్రాణి కోటి ఆ సనాతనులైన మహా దంపతుల నుంచి ఉద్భవించినవే.

ఈ సమస్త చరా చర సృష్టికి మూలము ఆ ఆది దంపతులే కారణము. అన్ని యుగాలకు ముందు వున్న మూల దంపతులు వారే. ఆ పరబ్రహ్మం సృష్టి రచనకు మొదలిడదానికి కారణం ఆ మూల ప్రకృతియే. నా తల్లి ఆ జగన్మాతయే. మా అమ్మ ఎంత గొప్పదో చెప్పుకోవడము నా ధర్మము. 

దీనిలో అతిశయోక్తి ఏమీలేదు, అబద్దములు అస్సలు లేవు, శ్రీ దేవీ భాగవతములో చెప్పిన రహస్యములనే నే చెప్పు చుంటిని. వేదములు ఏ తల్లిని గురించి, భానా తండ్రిని గురించి చెప్పినాయో ఆ ఆది దంపతులను గురించి చెబుతున్నాను. ఉపాసన చేసి, అంతర్ముఖః ధ్యానముతో ఆ తల్లి ఇచ్చిన జ్ఞానముతో ఈ విషయములు మీకు చెప్పు చుంటిని. ఇవి అసత్యములు కావు, ఆ తల్లి పలికించిన మాటలు ఇవి.

 ఏ దేముడైన, దేవతయైన ఆ తల్లి బిడ్డలే, ఏ గురువైనా, మునియైనా, యోగియైనా ఆ తల్లి పాదములకు నమస్కరించవలసినదే. ఆ తల్లి తరువాతే ఈ సమస్త సృష్టి, బ్రహ్మాండములు, ప్రపంచములు. విష్ణు శక్తి, బ్రహ్మ శక్తి, రుద్రుని శక్తి, మహేశ్వరుని శక్తి అన్నీ ఆమె. ఆమెయే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయికి.
నవ దుర్గా స్తోత్రమ్
ఈ స్తోత్రము ను ప్రతివారు ఆశ్వయుజ శుద్ద పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ద దశమి వరకు శరన్నవరాత్రులలో సాయంకాల సమయమందు పఠించిన విశేష ఫలితములు సమకూరును .
గణేశః
హరిద్రాభంచతుర్వాదు హారిద్రవసనంవిభుమ్ |
పాశాంకుశధరం దైవంమోదకందంతమేవ చ ||
దేవీ శైలపుత్రీ
వందే వాఞ్ఛితలాభాయ చంద్రార్ధకృతశేఖరాం|
వృషారూఢాం శూలధరాం శైలపుత్రీ యశస్వినీమ్ ||
దేవీ బ్రహ్మచారిణీ
దధానా కరపద్మాభ్యామక్షమాలా కమండలూ |
దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా ||
దేవీ చంద్రఘంటేతి
పిండజప్రవరారూఢా చందకోపాస్త్రకైర్యుతా |
ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుతా ||
దేవీ కూష్మాండా
సురాసంపూర్ణకలశం రుధిరాప్లుతమేవ చ |
దధానా హస్తపద్మాభ్యాం కూష్మాండా శుభదాస్తు మే ||
దేవీస్కందమాతా
సింహాసనగతా నిత్యం పద్మాశ్రితకరద్వయా |
శుభదాస్తు సదా దేవీ స్కందమాతా యశస్వినీ ||
దేవీకాత్యాయణీ
చంద్రహాసోజ్జ్వలకరా శార్దూలవరవాహనా |
కాత్యాయనీ శుభం దద్యాదేవీ దానవఘాతినీ ||
దేవీకాలరాత్రి
ఏకవేణీ జపాకర్ణపూర నగ్నా ఖరాస్థితా |
లంబోష్ఠీ కర్ణికాకర్ణీ తైలాభ్యక్తశరీరిణీ || వామపాదోల్లసల్లోహలతాకంటకభూషణా |
వర్ధనమూర్ధ్వజా కృష్ణా కాలరాత్రిర్భయంకరీ ||
దేవీమహాగౌరీ
శ్వేతే వృషే సమారూఢా శ్వేతాంబరధరా శుచిః |
మహాగౌరీ శుభం దద్యాన్మహాదేవప్రమోదదా ||
దేవీసిద్ధిదాత్రి
సిద్ధగంధర్వయక్షాద్యైరసురైరమరైరపి |
సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయినీ ||
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ప్రకృతితో రైతన్న బంధం: పుష్యమి కార్తెలో ఏం జరుగుతుంది?

పుష్యమి కార్తె: వర్షాల ఆశ, ఎదుగుదల.. సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలాన్ని వ్యవసాయ పంచాంగం ప్రకారం ఆ కార్తెగా పిలుస్తారు. మొత్తం 2...

Blog Archive

Recent Posts

Unordered List