సుమతి దేవి భిక్ష స్వీకరించి తల్లి అని సంభోదించి ఆమెకు,ఘoడికోట అప్పుల రాజు లకు పుట్టుకయే లేనివారు,లోక కళ్యాణార్ధం జనులకు ఇహ,పర శ్రేయస్సు చేకూర్చడానికి దత్తాత్రేయుడు నే 1320 సంవత్సరం లో గణేశ చతుర్ధి నాడు పుత్రునిగా జన్మించారు. వారి పాదం లో శ్రీ అని ఉంది కాబట్టి శ్రీ పాదులు అని పేరు పెట్టారు.ఉపనయనం తో 4 వేదాలు బోధించారు.16 వ సంవత్సరం లో తల్లి అనుమతి తో దేశాటన చేసి అన్ని పుణ్యక్షేత్రం లను పావనం చేశారు.ధర్మ పునరుద్ధరణ చేశారు.శ్రీ శైలం ఆడవి లో ఒకరోజు ఒక భిల్లుని కలవడానికి వెళ్లారు,అతను స్వామి ని ఇక జన్మ లేకుండా వరం ఇమ్మన్నాడు. నీకు ఇంకా 2 జన్మలు ఉన్నాయి,ఆ రొండు జన్మలు నాతోనే ఉంటావు అని ఆశీర్వదించారు. మారు జన్మలో నృసింహ సరస్వతి దగ్గర 7 గీతలు దాటిన మనిషి గా,ఆ తరువాత జన్మలో నానా సాహెబ్ చెంద్రోర్కర్.గా బాబా దగ్గర వున్నాడు. ఎన్నో జన్మలు తపస్సుతో కానీ దొరకని రూపం కేవలం భక్తులను ఉద్ధరణ కోసం శ్రీ శైలం,గోకర్ణం,మానస సరోవరం, కాశీ, కురుపురం లో కొన్ని రోజులు ఉండి,అక్కడ కృష్ణా నదిలో 1350 వ సంవత్సరం లో అంతర్ధానం అయ్యారు.అవధూత చింతన. శ్రీ గురుదేవ దత్త.






No comments:
Post a Comment