శ్రీ కృష్ణుడు దేవకి, వసుదేవులకే ఎందుకు జన్మించాడు? ~ దైవదర్శనం

శ్రీ కృష్ణుడు దేవకి, వసుదేవులకే ఎందుకు జన్మించాడు?

దేవకి, వసుదేవుడు మూడు  జన్మలు ఆ శ్రీహరిని పుత్రుని గా పొందారు.

వారు పృశ్ని,సుతప ప్రజాపతి గా జన్మించినప్పుడు వారి వివాహం అయిన కొద్ది కాలానికే తపస్సు మొదలు పెట్టారు. 4 యుగాల పాటు తీక్షణమైన తపస్సు చేసారు. వారికి శ్రీహరి ప్రత్యక్షo ఐనప్పుడు వారు శ్రీహరి వంటి బిడ్డ తమకు కావాలని కోరారు. శ్రీహరి అలాగే అన్నారు. కాని తనవంటి వాడు ఇంకొకడు లేడు కనుక తానే స్వయంగా వారికి జన్మించాడు.

మొదటి జన్మలో శ్రీహరి వారి కి జన్మించారు. ఆ జన్మలో అతనిని పృశ్నిగర్భుడు అన్నారు.

రెండవ జన్మలో కశ్యప ప్రజాపతి, అదితి లకు ఉపేంద్రుని గా జన్మించాడు. అతనినే మనం వామనుని గా చెప్తున్నాం.
మూడవ జన్మ లో దేవకి, వసుదేవుడు లకు శ్రీ కృష్ణుడి గా జన్మించారు.

ఐతే జన్మించి నప్పుడు 3 జన్మలలో తను నిజరూపం తోనే జన్మించారు. పీతాంబరం, శంఖ, చక్ర , గధ, పద్మములతో జన్మించారు. వారు తమకు జన్మించమని కోరారు కనుక తానూ జన్మించారు. కానీ  తన బల్యోపచారాలను వారు కోరలేదు  కనుక వామన అవతారం లో వెంటనే వడుగు వయస్సు కలవానిగా మారిపోయారు. ఇక శ్రీ కృష్ణ అవతారం లో నందుని ఇంటికి చేరారు.
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ప్రకృతితో రైతన్న బంధం: పుష్యమి కార్తెలో ఏం జరుగుతుంది?

పుష్యమి కార్తె: వర్షాల ఆశ, ఎదుగుదల.. సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలాన్ని వ్యవసాయ పంచాంగం ప్రకారం ఆ కార్తెగా పిలుస్తారు. మొత్తం 2...

Blog Archive

Recent Posts

Unordered List