కుబేరేశ్వర లింగం. ~ దైవదర్శనం

కుబేరేశ్వర లింగం.

లింగారాధన వలన సకల సిద్దులు ప్రాప్తిస్తాయట. శ్రీచక్రేశ్వరలింగం: అన్నపూర్ణాదేవి ఆలయంలోకి ప్రవేశించగానే కుడిచేతి పక్క ఒక లోతు ప్రదేశంలో శివలింగం మీద శ్రీచక్రం వేసి ఉంటుంది. అమ్మవారు తన చేత లలితా సహస్ర స్తోత్రమునకు భాష్యం వ్రాయించిందని కృతజ్ఞతతో భాస్కరాచార్యులవారు శ్రీచక్రంతో కూడిన శివలింగమును ప్రతిష్ఠ చేశారు.

ఈ దేవాలయం లోపలనే ఉచిత అన్నదానం అన్నపూర్ణా ట్రస్ట్ (I) వారిచే నిర్వహించబడుచున్నది. ఇక్కడ భోజన కార్యక్రమం ఉదయం 9 గంటల నుండి సాయంకాలం 4 గంటల వరకు ఉంటుంది. అన్నపూర్ణా ట్రస్ట్ (II) లో కూడా ఉచిత భోజన కార్యక్రమం ఉదయం 9 గంటల నుండి సాయంకాలం 4 గంటల వరకు ఉంటుంది. రాత్రి కూడా ఫలహారం 7 గంటల నుండి 9 గంటల వరకు ఉంటుంది. ఈ రెండు చోట్లా ఎంత మంది వస్తే అంతమందికి భోజనం పెడతారు. పేర్లు ముందుగా నమోదు చేయించుకోవాల్సిన అవసరం లేదు. నిత్యం ఎంతో మంది సిద్దులు, యోగులు, సన్యాసులు, యాత్రికులు ఇక్కడ భోజనం చేస్తుంటారు. కాశీ వెళ్లిన ప్రతీ ఒక్కరూ తప్పకుండా అన్నపూర్ణమ్మ పెట్టే భోజనం చేసి రావాలి.
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ప్రకృతితో రైతన్న బంధం: పుష్యమి కార్తెలో ఏం జరుగుతుంది?

పుష్యమి కార్తె: వర్షాల ఆశ, ఎదుగుదల.. సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలాన్ని వ్యవసాయ పంచాంగం ప్రకారం ఆ కార్తెగా పిలుస్తారు. మొత్తం 2...

Blog Archive

Recent Posts

Unordered List